‘‘గోల్కొండ హైస్కూల్’ (2011) చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాను. ఈ సినిమాలోని నా పెర్ఫార్మెన్స్ నాకు చాలా అవకాశాలు తెచ్చిపెడుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసినా దాదాపు నాలుగేళ్లు నాకు అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు, కొన్ని కథలు కరెక్ట్ అని భావించి కొన్ని సినిమాలు చేశాను. అవి వర్కౌట్ కాలేదు. ఇక నా కెరీర్ పరంగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం మంచి బిగ్‌స్క్రీన్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను’’ అని అన్నారు సంతోష్ శోభన్.
నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్నామూవీస్, మిత్రవిందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో రిషి పాత్రలో కనిపిస్తాను. ‘అలా..మొదలైంది’ చూసి నందినీరెడ్డిగారితో ఓ సినిమా చేయాలనుకున్నాను.
అలాగే ఓ యాక్టర్‌గా నాకు తొలి అడ్వాన్స్ చెక్ ఇచ్చింది ప్రియాంకా దత్‌గారు. ఇలా.. వీరి కాంబినేషన్స్‌తో నా కెరీర్‌కు కావాల్సిన టైమ్‌లో ‘అన్నీ మంచి..’ లాంటి సినిమా వస్తుండటం లక్‌గా భావిస్తున్నాను. ఇక ఈ సినిమా అవుట్‌పుట్ బాగా రావడం నాకు బోనస్’’ అన్నారు. నేడు మదర్స్ డేని పురస్కరించుకుని శోభన్ మాట్లాడుతూ – ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లవుతోంది. నటుడిగా నాకు అవకాశాలు తగ్గినప్పుడు అమ్మ నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే నేను సినిమాలు చేస్తున్నాను. మాకు సొంత ఇల్లు లేదు. త్వరలోనే మా అమ్మకు సొంత ఇంటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment