‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా.. అనే తేడాలు చూడను.. నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలనే భావించి నటిస్తాను’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్‌వేర్ పద్దు పాత్రలో కనిపిస్తాను.
ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్‌లో నటించడం ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి, కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు విన్నాను.. త్వరలో వివరాలు వెల్లడిస్తాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment