సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ (LikeShareSubscribe).మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదికగా ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఈనెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment