
Santosh Shoban Prem Kumar Movie First Lyrical Song Out: పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించిన యంగ్ హీరో సంతోష్ శోభన్. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్, కృష్ణ చైతన్య, రుచిత కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత కాగా ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించిన ఈ మూవీ యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. 'నీలాంబరం చూసి నీ కళ్లలో మేఘామృతం.. జారే నా గుండెలో' అంటూ సాగే సాంగ్‌ను శనివారం (ఫిబ్రవరి 5)న రిలీజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. మెలోడీ సాంగ్ అయిన 'నీలాంబరం' సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని నిర్మాత శివ ప్రసాద్ పన్నీరు తెలిపారు. టైటిల్ రోల్లో సంతోష్ శోభన్ కనిపిస్తాడని, పీటల మీద పెళ్లి ఆగితే ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడన్నదే సినిమా కథ అని డైరెక్టర్ అభిషేక్ మహర్షి పేర్కొన్నారు.