
‘డోన్ట్ నో వై... ఇంకా ఉన్నా... నేనే ఇష్టం లేనిప్రాణాలేమో పోనే పోవే..’ అంటూ మొదలవుతుంది ‘మ్యాజిక్’ సినిమాలోని ‘డోన్ట్ నో వై...’ పాట. సారా అర్జున్, అన్మోల్ కజాని, ఆకాశ్ శ్రీనివాస్, సిద్ధార్థ్ తణుకు ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు, తమిళ చిత్రం ‘మ్యాజిక్’.
ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డోన్ట్ నో వై..’ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఐశ్వర్యా సురేష్ బింద్రాతో కలిసి ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించారు. ‘‘కాలేజ్ ఫెస్ట్ కోసం పాట చేయడానికి ఓ నలుగురు యువతీ యువకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా’’ అని యూనిట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment