
అజయ్, ఇంద్రజ
ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఇంద్రజ మాట్లాడుతూ– ‘‘మీ రియల్ లైఫ్‌లో చూసినవి, విన్నవి, జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే చిత్రం ఇది’’ అన్నారు.
‘‘ఈ సినిమాలో నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ నటించారు. ఈ ప్రమోషనల్ సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యాను’’ అని తెలిపారు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. ‘‘మన నగరం ఎలా ఉంది? అనేది ఈ పాటలో చూపించాను. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెబుతున్నాను. సామాజిక నేపథ్యం ఉన్న చిత్రం ‘సీఎం పెళ్లాం’’ అని అన్నారు గడ్డం రమణారెడ్డి.