‘సీఎం పెళ్లాం’.. మంచి సందేశం ఇచ్చే చిత్రం
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం వెంకట రమణారెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సీఎం భార్యగా నటించాను. సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు ఇంద్రజ. (చదవండి: వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్ అయిన యష్మి)‘సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు నటుడు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. ఓ సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశాం’’ అని వెల్లడించారు గడ్డం వెంకట రమణారెడ్డి. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారకత అంశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ.