Bigg Boss Telugu 6: Faria Abdullah, Santosh Shoban Fun With Housemates | Bigg Boss 6 Telugu Episode 57 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: శ్రీహాన్‌ కన్నింగ్‌, అపరిచితుడు, గీతూ ఇడియట్‌

Published Sun, Oct 30 2022 10:56 PM | Last Updated on Mon, Oct 31 2022 10:01 AM

Bigg Boss 6 Telugu: Faria Abdhulla, Santosh Shoban Fun With Housemates - Sakshi

Bigg Boss Telugu 6, Episode 57: చిట్టి ఫరియా అబ్దుల్లా డ్యాన్స్‌తో నేడు బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ పండగలా ప్రారంభమైంది. వాసి వాడి తస్సాదియ్యా అంటూ హీరోయిన్‌తో స్టెప్పులేశాడు మన్మథుడు నాగార్జున. లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియాతో పాటు సంతోష్‌ శోభన్‌ కూడా స్టేజీపైకి వచ్చి సందడి చేశాడు. నిన్న ఒకరు ఎలిమినేట్‌ అయ్యారు. మరి నేడు ఇంకెవరైనా ఎలిమినేట్‌ అయ్యారా? అసలేం జరిగిందనేది నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూద్దాం..

ఆర్జే సూర్యను శనివారమే డైరెక్ట్‌ ఎలిమినేట్‌ చేశాడు నాగ్‌. ఈరోజు అతడిని స్టేజీపైకి పిలిచాడు. హౌస్‌లో ఐదు ఫ్లవర్స్‌ ఎవరు?, ఐదు ఫైర్‌ బ్రాండ్స్‌ ఎవరు? అనేది చెప్పమన్నాడు. రేవంత్‌ ఫ్లవర్‌ అని.. ఓటమిని స్పోర్టివ్‌గా తీసుకోవాలని సూచించాడు. గీతూ కూడా ఫ్లవర్‌ అని.. నీ గేమ్‌ నువ్వు ఆడితే నీకు తిరుగే లేదన్నాడు. శ్రీహాన్‌కు గేమ్‌ మీద క్లారిటీ ఉందని, బాలాదిత్య మంచితనం అతడి గేమ్‌ను ఆపేస్తోందంటూ వారిద్దరినీ ఫ్లవర్‌ కేటగిరీలో చేర్చాడు.

ఫైర్‌ కేటగిరీలో ఫైమా, ఇనయ, రాజ్‌, కీర్తిలను చేర్చాడు సూర్య. మొదట్లో ఇనయతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్‌ కూడా నువ్వే ఆడి టాప్‌ 5లో ఉండాలని ఇనయకు చెప్పాడు. ఇక ఇనయ అందుకుంటూ నీకోసం మ్యాచింగ్‌ డ్రెస్‌ వేసుకున్నానంటూ కొరియన్‌ లవ్‌ సింబల్‌ చూపించింది. వీళ్ల సైన్‌ లాంగ్వేజ్‌ అర్థం కాక నాగార్జున నెత్తి పీక్కున్నాడు. కొంచెం కూడా నెగెటివిటీ లేని పర్సన్‌ రాజ్‌ అని కితాబిచ్చాడు సూర్య. నువ్వెలా ఆడుతున్నావో అలాగే ఆడంటూ కీర్తికి సలహా ఇచ్చాడు. తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పాడు.

సూర్య వెళ్లిపోగానే లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ హీరోహీరోయిన్లు సంతోశ్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. హౌస్‌మేట్స్‌తో ఒక ఫన్‌ గేమ్‌ ఆడించారు. ఎప్పటిలాగే గెస్ట్‌గా వచ్చిన హీరోయిన్‌ కోసం పాట పాడాడు సింగర్‌ రేవంత్‌. ఆ పాటతో ఫిదా అయిన ఫరియా, సంతోశ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మరో టాస్క్‌ ఇచ్చారు. అందులో భాగంగా కొన్ని నేమ్‌ప్లేట్‌లను ఇంటిసభ్యులకు అంకితమివ్వాలన్నాడు నాగ్‌. గీతూకు రచ్చ ట్యాగ్‌ ఇచ్చింది మెరీనా. శ్రీహాన్‌ అపరిచితుడు అని కీర్తి ట్యాగ్‌ ఇచ్చింది. ఇనయ మహానటి అని శ్రీహాన్‌.. శ్రీహాన్‌ కన్నింగ్‌ అని ఇనయ చెప్పుకొచ్చారు. కీర్తి శ్వేతనాగు అంది శ్రీసత్య. బాలాదిత్య వకీల్‌ సాబ్‌ అన్నాడు రేవంత్‌. ఆదిరెడ్డి దొంగ అని చెప్పింది గీతూ. ఇనయకు బలుపు అని వాసంతి, రాజ్‌ టైంపాస్‌ అని ఫైమా అంది. గీతూ.. ఆడంతే అదో టైపు అన్నాడు ఆది రెడ్డి. ఫైమాకు బలుపెక్కువ అన్నాడు రాజ్‌. గీతూ ఇడియట్‌ అన్నాడు బాలాదిత్య.

ఇకపోతే నామినేసన్‌లో ఉన్న అందరూ సేఫ్‌ అయిపోగా చివరగా ఆది, మెరీనా మాత్రమే మిగిలారు. ఎక్కడ ఆది ఎలిమినేట్‌ అవుతాడోనని గుక్కపెట్టి ఏడ్చింది గీతూ. నన్ను అర్థం చేసుకునేవాళ్లే ఉండరంటూ శోకం అందుకోగా ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. మరోవైపు మెరీనా వెళ్లిపోతే తనకు మంచిమంచి బట్టలు పంపు అని భార్యను ఆదేశించాడు రోహిత్‌. అయితే నాగ్‌ మాత్రం... నో ఎలిమినేషన్‌, ఇద్దరూ సేఫ్‌ అని ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ సర్‌ప్రైజ్‌తో హౌస్‌మేట్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు.

చదవండి: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ ఫెమినిస్ట్‌.. ఫ్రీ హగ్స్‌
అమ్మ కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement