Kavya Thapar: ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలని ఉంది | Actress Kavya Thapar talks about Ek Mini Katha | Sakshi
Sakshi News home page

Kavya Thapar: ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలని ఉంది

Published Mon, Jun 7 2021 12:25 AM | Last Updated on Mon, Jun 7 2021 10:26 AM

Actress Kavya Thapar talks about Ek Mini Katha - Sakshi

‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ తర్వాత మరో సినిమా చేయడానికి కొంత సమయం పట్టింది. దానికి కారణం తమిళంలో ‘మార్కెట్‌ రాజా ఎమ్‌బీబీఎస్‌’ అనే సినిమాతో పాటు హిందీలో ఒక సినిమా చేయడమే. ఇకపై తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు కావ్యా థాపర్‌. సంతోష్‌ శోభన్‌ హీరోగా కార్తీక్‌ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ‘ఏక్‌ మినీ కథ’లో ఆమె కథానాయికగా నటించారు.

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమా విడుదలైన సందర్భంగా కావ్యా థాపర్‌ మాట్లాడుతూ – ‘‘ఏక్‌ మినీ కథ’లో జీవితంలో సౌకర్యంగా ఉండాలనుకుంటూ నిజాయతీ గల అమ్మాయి అమృత పాత్రలో నటించాను. నా పాత్రకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రం బోల్డ్‌ కంటెంట్‌తో ఉంటుంది. కానీ సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి మనం మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. ఎవర్నీ కించరపరచాలని కాదు.. అవగాహన కలిగించాలనే సంకల్పంతో తీసిన చిత్రం ఇది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. సినిమా, వెబ్‌ సిరీస్‌ అనే తేడా చూడటం లేదు. యాక్టర్‌గా ఆల్‌ రౌండర్‌ అనిపించుకోవాలనుకుంటున్నాను. అందుకోసం కష్టపడతాను. ప్రస్తుతం నాకు తెలుగు అర్థం అవుతోంది. త్వరలో స్పష్టంగా మాట్లాడతాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement