Ek Mini Katha Movie
-
తప్పతాగి అర్థరాత్రి రోడ్డుపై హల్చల్.. హీరోయిన్ అరెస్ట్
టాలీవుడ్ హీరోయిన్ కావ్యా థాపర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిన్న(గురువారం) అర్థరాత్రి తాగి కారు నడిపి యాక్సిడెంట్‌కు కారణమైన ఆమెను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ మాయ పేరేమిటో, ఏక్ మిని కథ చిత్రాలతో కావ్యా థాపర్ టాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబైలో ఉంటున్న ఆమె గురువారం రాత్రి ఓ పార్టీకి హజరైంది. ఈ నేపథ్యంలో బాగా తాగిన ఆమె అర్థరాత్రి కారు నడుపుతూ ముంబైలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ వద్ద యాక్సిడెంట్ చేసింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఆమె వారితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవ పడుతూ లేడీ కానిస్టేబుల్స్ పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించింది. చదవండి: భీమ్లా నాయక్ నిర్మాత నోటి దురద.. ఆపై సారీ! మహిళ పోలీసుల కాలర్ పట్టుకుని వారిని అసభ్యకర పదజాలంతో దూషణకు దిగింది. అర్థరాత్రి రోడ్డుపై కావ్యా గొడవ పడుతూ రచ్చ రచ్చ చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెను జూహు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంధేరి కోర్టులో శుక్రవారం ఆమెను హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అర్థరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో హీరోయిన్ హల్చల్ అంటూ సినీ ఇండస్ట్రీలో కావ్యా థాపర్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. -
ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్
హీరోయిన్ శ్రద్దా దాస్ రీసెంట్గా ఏక్ మిని కథ సక్సెస్‌తో జోరు మీదుంది. ఇప్పటివరకు శ్రద్దా పలు హిట్ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్ డోస్ పెంచినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ గ్లామరస్ ఫోటోలతో నెట్టింట హల్చల్ చేస్తుంది ఈ భామ. తాజాగా సిగరెట్ కాలుస్తున్న ఓ ఫోటోను షేర్ చేస్తూ..నాకు సిగరెట్ తాగడం నచ్చదు. కానీ నటిగా మారినప్పుడు అన్నీ చేయాల్సిందే నచ్చకపోయినా సరే అంటూ సినిమా సెట్లోని ఈ ఫోటోను షేర్ చేసింది. కాగా ఇది నిజం సిగరెట్ యేనా లేదా డమ్మీదా అని నెటిజన్లు ప్రశ్నించగా..లేదు లేదు. ఇది నిజం సిగరెటే అని సమాధానమిచ్చింది. ఇక పొగతాడం ఆరోగ్యానికి హానికారం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అర్ధం, నిరీక్షణ ,కన్నడలో కోటిగొబ్బ వంటి సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి గుండెపోటుతో నటి సురేఖ మృతి -
Kavya Thapar: ఆల్‌రౌండర్ అనిపించుకోవాలని ఉంది
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఈ మాయ పేరేమిటో’ తర్వాత మరో సినిమా చేయడానికి కొంత సమయం పట్టింది. దానికి కారణం తమిళంలో ‘మార్కెట్ రాజా ఎమ్‌బీబీఎస్’ అనే సినిమాతో పాటు హిందీలో ఒక సినిమా చేయడమే. ఇకపై తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు కావ్యా థాపర్. సంతోష్ శోభన్ హీరోగా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘ఏక్ మినీ కథ’లో ఆమె కథానాయికగా నటించారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా విడుదలైన సందర్భంగా కావ్యా థాపర్ మాట్లాడుతూ – ‘‘ఏక్ మినీ కథ’లో జీవితంలో సౌకర్యంగా ఉండాలనుకుంటూ నిజాయతీ గల అమ్మాయి అమృత పాత్రలో నటించాను. నా పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ చిత్రం బోల్డ్ కంటెంట్‌తో ఉంటుంది. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. ఎవర్నీ కించరపరచాలని కాదు.. అవగాహన కలిగించాలనే సంకల్పంతో తీసిన చిత్రం ఇది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఒక నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా చూడటం లేదు. యాక్టర్‌గా ఆల్ రౌండర్ అనిపించుకోవాలనుకుంటున్నాను. అందుకోసం కష్టపడతాను. ప్రస్తుతం నాకు తెలుగు అర్థం అవుతోంది. త్వరలో స్పష్టంగా మాట్లాడతాను’’ అన్నారు. -
స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా!
'ఏక్ మినీ కథ' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరో సంతోష్ శోభన్. ప్రస్తుతం ఈయనకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఓ బేబీతో హిట్ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా వైజయంతీ మూవీస్ బ్యానర్, గీతా అర్ట్స్ బ్యానర్‌లోనూ సినిమాలు చేసేందుకు నందినీరెడ్డి సైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్యూ’, లాల్ సింగ్ చద్దా సినిమాలతో సినిమాలతో బిజీగా ఉన్నారని, ఇవి పూర్తయ్యాకే నందినీ రెడ్డితో మూవీ ఉండనున్నట్లు సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో హీరో సంతోష్ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు సమాచారం. 'తను నేను' .. 'పేపర్ బాయ్' సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ రీసెంట్గా 'ఏక్ మినీ కథ'తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోతోనే నందినీ రెడ్డి తర్వాతి సినిమా ఉండనుందని, త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. చదవండి : ‘ఏక్ మినీ కథ’ హీరోకు లక్కీ ఛాన్స్.. అదే బ్యానర్లో మరో 3 సినిమాలు -
‘ఏక్ మినీ కథ’ హీరో దూకుడు.. మరో 3 సినిమాలకు సంతకం
యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్. ఇటీవల ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో యూవీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. దీని ద్వారా తొలి సినిమాగా ‘ఏక్ మినీ కథా’ నిర్మించింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. ఇక యూవీ కాన్సెప్ట్స్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది కూడా. ఈ మూవీలో హీరోగా నటించిన సంతోష్ శోభన్ ఈ బ్యానర్లో మరో మూడు చిత్రాలకు సంతకం చేశాడట. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న సంతోష్ శోభన్‌కు యూవీ కాన్సెప్ట్స్‌లో మరో 3 సినిమాలు చేసే అవకాశం రావడం లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. -
అలా 'ఏక్ మినీ కథ' పురుడు పోసుకుంది: మేర్లపాక గాంధీ
ఓ మ్యాగజైన్ చదువుతున్నప్పుడు అందులో ఓ పాఠకుడు పంపిన ప్రశ్న నుంచి ఏక్ మినీ కథ ఆలోచన వచ్చింది. నా ఆలోచనని మా నాన్న మేర్లపాక మురళి, మా అంకుల్ మహర్షికి చెప్పినప్పుడు భయపడ్డారు. పూర్తి కథ రాశాక హ్యాపీగా ఫీలయ్యారు అని డైరెక్టర్ మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ జంటగా కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించిన చిత్రం ఏక్ మినీ కథ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం అందించిన మేర్లపాక గాంధీ ఏక్ మినీ కథకు కథ అందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. నా గత చిత్రాలు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా వినోదాత్మకంగా ఉంటాయి. వినోదాత్మక చిత్రాలకు థియేటర్లలో అయితే ఆ అనుభూతే వేరు. ఏక్ మినీ కథలో ఫన్ బాగా వర్కవుట్ అవుతుందనుకున్నాం. అందుకే ముందు ఓటీటీ కోసం స్టార్ట్ చేసినా, థియేటర్స్ అయితే మంచి అనుభూతి ఉంటుందనిపించింది. అయితే సెకండ్ వేవ్ వల్ల ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది. నా దర్శకత్వంలోనే ఈ సినిమా చేయాలనుకున్నాం. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు నితిన్‌తో నా డైరెక్షన్లో మాస్ట్రో సినిమా స్టార్ట్ అయింది. ఈ లోపు లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ ముగియగానే మాస్ట్రో చేయాలి. ఒకే సమయంలో రెండు సినిమాలు చేయలేం కదా? అందుకే కార్తీక్‌తో దర్శకత్వం చేయించమని యూవీ క్రియేషన్స్ వారికి చెప్పా. వారికి కథ నచ్చి నిర్మించారు. నితిన్‌తో చేస్తున్న మాస్ట్రో షూటింగ్ వారం మాత్రమే మిగిలి ఉంది. అనుకున్నట్లు అయ్యుంటే జూన్ 11న సినిమాను విడుదల చేసేవాళ్లం. మాస్ట్రో తర్వాత గ్యాప్ లేకుండా సినిమాలు చేద్దామనుకుంటున్నాను. ప్రతిసారీ గ్యాప్ తీసుకోకూడదనుకుంటాను కానీ గ్యాప్ వస్తోంది(నవ్వుతూ) అన్నారు మేర్లపాక గాంధీ. చదవండి: సీఎం కొడుకుతో మూవీ ఛాన్స్ కొట్టేసిన శివానీ రాజశేఖర్ ‘ఏక్ మినీ కథ’ మూవీ రివ్యూ -
Santosh Shobhan: ‘ఇలాంటి సినిమాను చూస్తారా అన్నారు’
‘‘కథలే యాక్టర్స్‌ను హీరోలుగా చేస్తాయి. అందుకనే నేను కథలనే నమ్ముతాను. మంచి కథల్లో భాగమవ్వాలని కోరుకుంటాను. దర్శకుడి విజన్‌ను నమ్ముతాను’’ అన్నారు సంతోష్ శోభన్. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కావ్యా థాపర్, శ్రద్ధా దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 27 నుంచి అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ చిత్రం ప్రసారం అవుతోంది. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంతోష్. ఇంకా ‘సాక్షి’తో సంతోష్ శోభన్ మాట్లాడుతూ–‘‘ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన కొంత సమయం తర్వాత నుంచి నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సక్సెస్ అంటే ఇలా ఉంటుందా? అని నాకు తెలిసొచ్చింది. బోల్డ్ కంటెంట్ కదా! ఇలాంటి సినిమాను వ్యూయర్స్ చూస్తారా? అని కొందరు అన్నారు. కానీ మంచి కంటెంట్, కొత్త కథలను ప్రోత్సహించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధం గానే ఉంటారన్న మా నమ్మకం నిజమైంది. నేను చేసిన ‘పేపర్‌బాయ్’ సినిమా చూసి గత ఏడాది దర్శకుడు మేర్లపాక గాంధీ నన్ను పిలిచి ఈ కథ చెప్పారు. ఈ చిత్రదర్శకుడు కార్తీక్ రాపోలు భవిష్యత్‌లో మంచి దర్శకుడు అవుతాడు. జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. అయితే మాట్లాడి పరిష్కరించుకోదగిన సమస్యలు ఏవి? తెలుసుకోవడం ద్వారా తీరిపోయే సమస్యలు ఏవి? అనే ఓ అవగాహనకు వస్తే మన ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు వ్యక్తపరచడానికి ఇబ్బందిగా ఉందని, అసౌకర్యంగా ఉందని కొన్ని సమస్యలను జీవితాంతం భరించకూడదు. మా సినిమా పాయింట్ ఇదే. ప్రభాస్, రామ్‌చరణ్‌గార్లు మా సినిమాకు సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నాలో ప్రతిభ ఉందని నమ్మి, నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు వంశీ, విక్కీగార్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా పన్నెండేళ్ల వయసులో నాన్నగారు (‘వర్షం’ చిత్రదర్శకులు శోభన్) నాకు దూరమయ్యారు. అప్పుడు నాకు అంతగా మెచ్యూరిటీ లేదు. కానీ మా నాన్నగారిలో ఉన్న నిజాయతీ, ఒదిగి ఉండటం, ముక్కుసూటితనం వంటివన్నీ మనసులో నాటుకుపోయాయి. ఇతరులకు హాని చేయాలనుకోరు. ఆయనలోని ఈ లక్షణాలను నేను అలవరచుకుంటున్నాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చిరంజీవి, ప్రభాస్ గార్లంటే నాకు చాలా ఇష్టం. దర్శకత్వం అనేది ప్రత్యేక ప్రతిభ. అది నాలో లేదనుకుంటున్నాను. యాక్టర్‌గానే కెరీర్లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో సినిమాలు కమిటయ్యాను. నా స్నేహితుడు ప్రొడ్యూసర్‌గా ఉన్న ఓ సినిమాలో హీరోగా చేయనున్నాను. నేను నటించిన ఓ వెబ్‌సిరీస్ విడుదల కావాల్సి ఉంది’’ అని అన్నారు. -
ఏక్ మిని...సినీ సాహసం !
-
‘ఏక్ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్ కామెంట్స్..
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ మినీ కథా’. స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్‌లు ఈ మూవీని ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ(మే 27) డిజిటల్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైంలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘ఏక్ మినీ కథ’పై మరో హీరో శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. కామెడీ ట్రాక్‌తో నవ్వులు పూయిస్తుందంటు చెప్పుకొచ్చాడు. ‘ఏక్ మినీ కథ చూశాను. మేకర్స్ సరికొత్త సబ్జెక్ట్‌ను విభిన్నమైన కథను తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్రెష్ ఫీల్‌ను కలిగించింది’ అంటు శర్వానంద్ ట్వీట్ చేశాడు. కాగా మేర్లపాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోల్ దర్శకత్వం వహించాడు. ఇందులో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించాడు. అడల్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ , యూవీ క్రియేషన్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. Watched #EkMiniKatha. It has a fresh feel with a unique concept. Kudos to the makers for picking an unusual subject. It's a perfect laugh riot 😂 Watch #EkMiniKathaOnPrime here : https://t.co/5Ivb14jgXU — Sharwanand (@ImSharwanand) May 27, 2021 -
బ్రహ్మాజీపై హీరోయిన్ ప్రియాంక కామెంట్స్, పోస్ట్ షేర్ చేసిన నటుడు
టాక్సీవాలా మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. గ్లామర్ పరంగా, నటనా పరంగా ప్రియాంకకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఆమెకు పెద్దగా సినిమా అవకాశలు లభించలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. కాగా తాజాగా ప్రియాంక ఏక్ మినీ కథ మూవీ చూస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేగాక ఈ మూవీని బ్రహ్మాజీ కోసమే చూస్తున్నట్లు స్టోరీ పెట్టడంతో దానిని ఆయన తన షేర్ చేస్తూ మురిసిపోయారు. సంతోష్ శోభన్, కావ్యా థాపర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ‘ఏక్ మినీ కథ’ మూవీ ఈ రోజు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. తాజాగా ఈ మూవీని చూస్తున్న ప్రియాంక.. కేవలం బ్రహ్మాజీ కోసమే తాను ఈ చిత్రాన్ని చూస్తున్నానంటు చెప్పుకొచ్చింది. అది చూసిన బ్రహ్మాజీ థ్యాంక్యూ అంటు ఆమె పోస్టుపై కామెంట్ చేశాడు. ఇక ఈ మూవీలో బ్రహ్మాజీ నటన, ఆయన కామెడీకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. కామెడీ పండించడంలో బ్రహ్మాజీ స్టైలే వేరంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కాగా ప్రస్తుతం ప్రియాంక ‘తిమ్మరుసు’ అనే సినిమాతో బిజీగా ఉంది. సత్యదేవ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా బ్రహ్మాజీ కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీ సెట్స్‌లో బ్రహ్మజీ, హీరో సత్యదేవ్‌తో ఆమె అల్లరి చేస్తున్న ఫొటోలను కూడా ఆమె షేర్ చేస్తుండేది. అలా ఆ మూవీతోనే ప్రియాంకకు, బ్రహ్మాజీతో మంచి బంధం ఏర్పడింది. -
‘ఏక్ మినీ కథ’ మూవీ రివ్యూ
టైటిల్: ఏక్ మినీ కథ నటీటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, సుదర్శన్, పోసాని, శ్రద్ధాదాస్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా దర్శకత్వం: కార్తీక్ రాపోలు సంగీతం: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ : గోకుల్ భారతి విడుదల తేది : మే 27, 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) ‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్, కావ్యా తప్పర్ జంటగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెంచుతూ వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు అందర్ని విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచాయి. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు ప్రమోషన్స్ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఎన్నో అంచనాల మధ్య గురువారం (మే 27)న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మరి ఆ అంచనాలను ‘ఏక్ మినీ కథ’ ఏ మేరకు అందుకుంది? ‘పేపర్ బాయ్’తొ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంతోష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా? రివ్యూలో చూద్దాం. కథ సివిల్ ఇంజనీర్ సంతోష్(సంతోష్ శోభన్) చిన్నప్పటి నుంచి తన జననాంగంచిన్నదనే న్యూనతాభావంతో ఉంటాడు. ‘సైజ్’చిన్నగా ఉండడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయని భావించి, పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరకి ‘సైజ్’పెంచుకోవడం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి ఆపరేషన్‌కి కూడా సిద్దమౌతాడు. కానీ ఆయన సమస్యకు పరిష్కారం మాత్రం లభించదు. ఈక్రమంలోనే తనకు అమృత(కావ్య థాపర్)తో వివాహం జరుగుతుంది. కానీ శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. ‘సైజ్’పెంచుకున్నా తర్వాతే శోభనాన్ని జరుపుకోవాలని భావించిన శోభన్.. మళ్లీ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఈక్రమంలో సంతోష్ ఇంటికి స్వామిజీ(శ్రద్ధాదాస్) వస్తుంది. అసలు స్వామిజీ సంతోష్ ఇంటికి ఎందుకు వచ్చింది? సంతోష్ సమస్యకు పరిష్కారం లభించిందా లేదా? తన సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో సంతోష్‌ను తండ్రి రామ్మోహన్ (బ్రహ్మాజీ) ఎలా అపార్థం చేసుకొన్నాడు? ‘సైజ్’ప్రాబ్లం ఆ కొత్త కాపురంలో ఎలాంటి అపార్థాలు తీసుకొచ్చింది? అనేది ఓటీటీ తెరపై చూడాల్సిందే. నటీనటులు ‘పేపర్ బాయ్’సినిమాతో నటుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ‘సైజ్’చిన్నదనే ఆత్మ నూన్యతా భావంతో బాధపడే యువ సివిల్ ఇంజనీర్ సంతోష్ పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. తన అమాయకత్వపు పనులతో నవ్వించాడు. కొన్ని ఎమోషనల్ సీన్లను బాగా పండించాడు. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా సరిపోయాయి. సినిమా భారం మొత్తాన్ని తన మీద వేసుకొని కథని నడిపించాడు. హీరోయిన్ కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. కమెడియన్లు సుదర్శన్, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ ‘స్వాతి పుస్తకంలో సెక్సాలజీ కాలమ్ చదువుతున్నప్పుడు ఈ కథ రాయాలనే ఆలోచన వచ్చింది’ అని రచయిత మేర్లపాక గాంధీ చెప్పినప్పుడే ఇది అడల్ట్ సినిమా అని అర్థమైపోయింది. దానికి తోడు సినిమా కథ ఏమిటనేది ట్రైలర్లోనే క్లారీటీ ఇచ్చేశాడు దర్శకుడు. ‘సైజ్`చిన్నదని భయపడిపోయే ఓ యువకుడి కథ ఇది. నిజానికి చాలా సున్నితమైన అంశం ఇది. దీన్ని తెరపై చూపించడమనేది కత్తిమీద సాములాంటిదే. ఇలాంటి సెన్సిబుల్, సెన్సిటివ్ పాయింట్‌కి కామెడీ పూత పూసి కథనం నడిపాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. కథలో బోల్డ్ అంశం ఉన్నప్పటీ.. కథనంలో మాత్రం మరీ అంత అడల్ట్ అయితే కనిపించడు. అయినప్పటికీ కుటుంబం అంతా కలిసి ఈ మూవీ చూడడం కష్టమే. ఇది సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. ఈ సినిమాని బోల్డ్‌గా తెరకెక్కించినా ఒక వర్గం ఆడియన్స్‌ని ఆకర్షించేంది. పస్టాఫ్‌లో ఫన్ బాగున్నా.. కొన్ని సీన్లు కావాలని ఇరికించారనే ఫీలింగ్ కలుగుతోంది. ఇక సెకండాఫ్ మొత్తం శోభనాన్ని వాయిదా వేయడం అనే పాయింట్ పైనే సాగుతుంది. చెప్పడానికి కథ పెద్దగా లేకపోవడంతో కొన్ని సీన్లను అతికించి సినిమాను నడిపించారు. సప్తగిరి కామెడీ కాస్త నవ్వించినా... రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో శ్రద్ధదాస్ ఎంట్రీ తర్వాతో ఏదైన అద్భుతం జరుగుతందని భావించిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఎమోషన్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లు కలవడం తప్పదు కాబట్టి ఈ సన్నీవేశాలు పెట్టారనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం బాగుంది. గుర్తిండిపోయే పాటలు అయితే లేవు కానీ.. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. గోకుల్ భారతి సినిమాటోగ్రాఫి ఆకట్టుకుంటుంది. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ సంతోష్ శోభన్ నటన ఫస్టాఫ్ కొన్ని కామెడీ సీన్స్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్ సెకండాఫ్ రొటీన్ క్లైమాక్స్ -- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఒక చిన్న కథ
‘పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ సంతోష్ శోభన్, కావ్యా తప్పర్ జంటగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం. హీరో ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌ని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ చిత్రం నా కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలాంటి విజయాన్ని అందించిన శోభన్గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శోభన్ తనయుడు సంతోష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ విడుదలవుతున్న సందర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష¯Œ ్స నిర్మాతలకు, ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ ఈ నెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. మా సినిమా ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్లో కమెడియన్ సుదర్శన్ పంచ్ డైలాగ్‌లు, సంతోష్ శోభన్ పలికించిన హావభావాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి’’ అన్నారు. -
Ek Mini Katha: ఏక్ మినీ కథ ట్రైలర్ వచ్చేసింది..
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఏక్ మినీ కథ'. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో హీరో చిన్నప్పటి నుంచే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. దాన్నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నదే అసలు కథ. పోసాని, సంతోష్, సప్తగిరిల కామెడీ వినోదాత్మకంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. బోల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మే 27న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతోంది. శ్రద్ధాదాస్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఓటీటీలో జనాలను ఏమేరకు ఆకర్షిస్తుందో చూడాలి. చదవండి: Ek Mini Katha: ఓటీటీలోకి.. చిన్న సినిమాకి అన్ని కోట్ల లాభమా! -
Ek Mini Katha: ఓటీటీలో ఏక్ మినీ కథ, అప్పుడే రిలీజ్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లకు తాళం పడింది. దీంతో బోలెడన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. ఫలితంగా ప్రజలు మరోసారి ఓటీటీకి జై కొడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్న సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. A mini tale of love, comedy and everything in between! Watch #EkMiniKathaOnPrime on May 27. Trailer out tomorrow. @santoshshobhan @KavyaThapar @shraddhadas43 @actorbrahmaji @MerlapakaG @karthikrapol #NelloreSudarshan @SiriRaasi @Plakkaraju #MangoMassMedia @UV_Creations pic.twitter.com/kYwRtT9pIj — amazon prime video IN (@PrimeVideoIN) May 20, 2021 సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ'ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇందుకోసం నిర్మాతలకు రూ.9 కోట్లు ముట్టచెప్పినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్.. 'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. మే 27 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించింది. కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని యూవీ సంస్థ నిర్మించింది. కావ్య తాపర్ హీరోయిన్గా నటిస్తోంది. సప్తగిరి, శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, పోసాని కృష్ణమురళీ, కేశవ్ దీపక్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ అడల్ట్ టచ్ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి! చదవండి: డబ్బున్నోడిదే ప్రాణమా? అన్న నెటిజన్.. ఏకిపారేసిన రేణు ఓటీటీలో విడుదల కానున్న మరో టాలీవుడ్ మూవీ! -
Ek Mini Katha: ఓటీటీలోకి.. చిన్న సినిమాకి అన్ని కోట్ల లాభమా!
Ek Mini Katha: కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల షూటింగ్‌తో పాటు విడుదల ఆగిపోయాయి. ఇప్పటికే విడుదలకు సిద్దమైన పెద్ద చిత్రాలు టైమ్ కోసం నిరీక్షిస్తుంటే.. చిన్న సినిమాలు మాత్రం ఓటీటీ బాటపట్టాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే అవకాశాలు లేకపోవడంతో సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు కూడా తమ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగులో నాని లాంటి హీరోలు కూడా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్ యు బ్రదర్ ఓటీటీ ఆహాలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఏక్ మినీ కథ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కార్తిక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. యువీ సంస్థ నిర్మించిన ఈ చిన్న సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోందట. బోల్డ్ అడల్డ్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నించారు.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. డల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అడల్ట్ టచ్ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.