Ek Mini Katha Trailer:ఏక్‌ మినీ కథ ట్రైలర్‌ వచ్చేసింది..| Ek Mini Katha Telugu Movie Trailer Released - Sakshi
Sakshi News home page

Ek Mini Katha: ఏక్‌ మినీ కథ ట్రైలర్‌ వచ్చేసింది..

Published Fri, May 21 2021 2:40 PM | Last Updated on Fri, May 21 2021 4:45 PM

Ek Mini Katha Trailer Released - Sakshi

సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఏక్‌ మినీ కథ'. మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్‌ రాపోలు దర్శకత్వం వహించాడు. యూవీ కాన్సెప్ట్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. ఇందులో హీరో చిన్నప్పటి నుంచే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు.

దాన్నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నదే అసలు కథ. పోసాని, సంతోష్‌, సప్తగిరిల కామెడీ వినోదాత్మకంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది. బోల్డ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 27న అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అవుతోంది. శ్రద్ధాదాస్‌ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించాడు. మరి ఈ 
సినిమా ఓటీటీలో జనాలను ఏమేరకు ఆకర్షిస్తుందో చూడాలి.

చదవండి: Ek Mini Katha: ఓటీటీలోకి.. చిన్న సినిమాకి అన్ని కోట్ల లాభమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement