Ek Mini Katha: కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాల షూటింగ్‌తో పాటు విడుదల ఆగిపోయాయి. ఇప్పటికే విడుదలకు సిద్దమైన పెద్ద చిత్రాలు టైమ్ కోసం నిరీక్షిస్తుంటే.. చిన్న సినిమాలు మాత్రం ఓటీటీ బాటపట్టాయి. ఇక ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ చేసే అవకాశాలు లేకపోవడంతో సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు కూడా తమ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. తెలుగులో నాని లాంటి హీరోలు కూడా ఓటీటీవైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన థ్యాంక్ యు బ్రదర్ ఓటీటీ ఆహాలో విడుదలైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఇప్పుడు ఏక్ మినీ కథ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కార్తిక్ రాపోలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. యువీ సంస్థ నిర్మించిన ఈ చిన్న సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోందట.
బోల్డ్ అడల్డ్ పాయింట్‌తో వస్తున్న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు చాలా ప్రయత్నించారు.కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని భావించారు. డల్ట్ టచ్ కామెడీ మూవీ కావడంతో అమెజాన్ కూడా మంచి రేటుకే కొనేందుకు ముందుకు వచ్చిందట. రూ.9 కోట్లకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు ఏకంగా 9 కోట్లకు బేరం కుదరడంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ అడల్ట్ టచ్ కామెడీ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment