‘ఏక్‌ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్‌ కామెంట్స్‌.. | Hero Sharwanand Praises Ek Mini Katha Movie | Sakshi
Sakshi News home page

‘ఏక్‌ మినీ కథ’ మూవీపై హీరో శర్వానంద్‌ కామెంట్స్‌..

Published Thu, May 27 2021 9:32 PM | Last Updated on Thu, May 27 2021 9:37 PM

Hero Sharwanand Praises Ek Mini Katha Movie - Sakshi

సంతోష్ శోభ‌న్, కావ్య థాప‌ర్ హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ‘ఏక్ మినీ క‌థా’. స్టార్ హీరోలు ప్ర‌భాస్‌, రాంచ‌ర‌ణ్‌లు ఈ మూవీని ప్ర‌మోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ(మే 27) డిజిట‌ల్ ప్లాట్ ఫాం అమెజాన్‌ ప్రైంలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. తాజాగా ‘ఏక్ మినీ క‌థ‌’పై మ‌రో హీరో శ‌ర్వానంద్ ప్ర‌శంస‌లు కురిపించాడు. కామెడీ ట్రాక్‌తో న‌వ్వులు పూయిస్తుంద‌ంటు చెప్పుకొచ్చాడు. 

‘ఏక్ మినీ క‌థ చూశాను. మేక‌ర్స్ స‌రికొత్త స‌బ్జెక్ట్‌ను విభిన్నమైన కథను తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫ్రెష్‌ ఫీల్‌ను క‌లిగించింది’ అంటు శ‌ర్వానంద్ ట్వీట్‌ చేశాడు. కాగా మేర్ల‌పాక గాంధీ కథ అందించగా.. కార్తీక్ రాపోల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించాడు. అడ‌ల్ట్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ , యూవీ క్రియేష‌న్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement