నాగచైతన్య, అలేఖ్య హారిక, సంతోష్ శోభన్
సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా కొత్త సినిమా షురూ అయింది. సుమన్ పాతూరి దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ్రపారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నాగచైతన్య క్లాప్ కొట్టగా, డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత రవిశంకర్ యూనిట్‌కి స్క్రిప్ట్ అందించగా, హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సంకృత్యాన్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లా డుతూ– ‘‘ఈ సినిమాలో మంచి ప్రేమకథ ఉంటుంది’’ అన్నారు.
‘‘నా మనసుకు దగ్గరైన కథ ఇది. నేను, ఎస్‌కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య.. మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా వారితో కలిసి చేస్తుండటంతో మరింత బాధ్యతగా భావిస్తున్నా’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘ఈ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్‌కు థ్యాంక్స్’’ అన్నారు సుమన్ పాతూరి. ‘‘హీరోయిన్‌గా చేయాలనే నా కల ఈ చిత్రంతో నెరవేరుతోంది’’ అన్నారు అలేఖ్య హారిక. ‘‘తెలుగు అమ్మాయిలను ్ర΄ోత్సహించాలనే నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలనే హీరోయిన్‌గా తీసుకుంటున్నాను’’ అన్నారు ఎస్‌కేఎన్. ఈ చిత్రానికి కెమెరా: అస్కర్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, రమేశ్ పెద్దింటి.
Comments
Please login to add a commentAdd a comment