సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ? | Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser | Sakshi
Sakshi News home page

Sridevi Shoban Babu Movie: మనం చెప్పుకోబోయే చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఆసక్తిగా టీజర్‌

Published Wed, Apr 6 2022 8:49 PM | Last Updated on Wed, Apr 6 2022 9:31 PM

Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser - Sakshi

Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్‌ హీరో సంతోశ్‌ శోభన్‌. పేపర్​ బాయ్, ఎక్​ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్​ ది బేకర్'​ వెబ్​ సిరీస్​లో అలరించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్​కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్​ శోభన్​ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'. ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను స్టార్‌ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 

'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్‌ శోభన్‌, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్‌ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తోంది. కమ్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement