Santosh Shoban
-
'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్ మరో సంచలన కథ!
బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్గా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్‌లాక్‌తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
ప్రేమ్‌కుమార్..కడుపుబ్బా నవ్విస్తాడు: సంతోష్ శోభన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ప్రేమ్‌కుమార్ అని, దీనిలో కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవిస్తుందని ఆ సినిమా హీరో సంతోష్‌శోభన్ అన్నారు. ఈ నెల 18న విడుదల కానున్న ప్రేమ్‌కుమార్ చిత్రయూనిట్ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంతోష్‌శోభన్ మాట్లాడుతూ పెళ్లి కోసం పాట్లు పడే క్యారెక్టర్లో తాను కొత్తగా కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాశీసింగ్, రుచిత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని తెలిపారు. వారిలో ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. ఈ చిత్రంలో నటించిన వారందరూ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారన్నారు. విజయవాడ నుంచి తమ చిత్రం ప్రమోషన్ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్గా నిర్మించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్ రాశీసింగ్ మాట్లాడుతూ తన మొదటి చిత్రం సంతోష్ శోభన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహనటుడు కృష్ణచైతన్య, అనిరుద్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘అన్నీ మంచి శకునములే’మూవీ రివ్యూ
టైటిల్: అన్నీ మంచి శకునములే నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి, గౌతమి, వాసుకి, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ నిర్మాతలు: స్వప్నాదత్, ప్రియాంకా దత్ దర్శకత్వం: నందినీ రెడ్డి సంగీతం: మిక్కీ జే.మేయర్ సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ ఎడిటర్: జునైద్ విడుదల తేది: మే 18, 2023 టాలీవుడ్లో మంచి గుర్తింపు కలిగిన యంగ్ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన కళ్యాణం కమనీయం చిత్రం కూడా సంతోష్‌కి సూపర్ హిట్‌ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’అనే చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందల లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాడ్గా నిర్వహించడంలో ‘అన్నీ మంచి శకునములే’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమాతో అయినా సంతోష్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రసాద్( రాజేంద్ర ప్రసాద్), దివాకర్(రావు రమేశ్) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్ బాగా ఫేమస్ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది. మరోవైపు దివాకర్ తమ్ముడు సుధాకర్ (నరేశ్)కు కొడుకు రిషి(సంతోష్ శోభన్) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్) జన్మిస్తుంది. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్ ఇంట్లో రిషి, సుధాకర్ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా? ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక అటు ప్రసాద్, ఇటు సుధాకర్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు పెట్టింది పేరు నందినీ రెడ్డి. ఈమె సినిమాల్లో అందరూ మంచి వాళ్లే ఉంటారు. ఓ పెళ్లి సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ని ఎమోషనల్ చేసేందుకు కొన్ని సన్నివేశాలు పక్కా ఉంటాయి. అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రతీ సీన్ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. పైగా స్లో నెరేషన్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో నందినీ రెడ్డి..‘ఈ సినిమాలో అవసరం లేని సీన్స్ ఒక్కటి కూడా ఉండదు’అని చెప్పారు. కానీ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓల్డ్ మూవీస్ పాటలకు పెళ్లిలో ఫ్యామిలీ మెంబర్స్ స్టెప్పులేయడం.. షావుకారు జానకీకి చెందిన సీన్స్.. డాక్టర్ మద్యం సేవించే సీన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రాజేంద్రప్రసాద్ సీరియస్‌గా చేసే కామెడీ, వెన్నెల కిశోర్ ఫన్ సీన్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం రోటీన్‌గా సాగడమే కాదు.. చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా సరిగా పండలేదు. సినిమా చివరి 25 నిమిషాల్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. ఆరిస్టుల నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు వందశాతం సఫలం అయింది. కానీ కథ,కథనం విషయంలో జాగ్రత్తగా తీసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రిషి పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయాడు. ఎలాంటి గోల్స్ లేకుండా.. తండ్రి చేతిలో తిట్లు తింటూ.. ఫ్యామిలీ కోసం మంచి చేసే క్యారెక్టర్ తనది. ఇక అనుకున్నది సాధించే అమ్మాయి ఆర్య పాత్రకు మాళవిక నాయర్ న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నరేశ్ తమ అనుభవాన్ని తెరపై మరోసారి నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్ పెద్దమ్మగా షావుకారు జానకి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో సోదరిగా నటించిన వాసుకికి గుర్తిండిపోయే సన్నివేశాలేవి లేవు. గౌతమి, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే.మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్ మినహా మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
హీరోయిన్ తో డాన్స్ చేసిన సీతారామం హీరో
-
నటి గౌతమి తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
నా లైఫ్ లో ఇంత పెద్ద సినిమా చేయలేదు
-
హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాని
-
అన్నీ మంచి శకునములే హాయినిస్తుంది
‘‘రాఘవేంద్రరావు, అశ్వినీదత్గార్లతో నాది 30 ఏళ్లు పైబడిన స్నేహం. స్వప్న, ప్రియాంక నా కూతుళ్లులాంటివారు. నేను, దత్‌గారు యాభై ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నప్పటికీ ఇవాళ మా పిల్లల వల్ల ఇంకా ఎక్కువ షైన్ అవుతున్నాం. ‘అన్నీ మంచి శకునములే’ మనందరికీ హాయి ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్. అన్నారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చెయ్యి చెయ్యి కలిపేద్దాం..’ అంటూ సాగే నాలుగో పాటను డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను శ్రీ కృష్ణ, వేణు శ్రీరంగం, సందీప్, చైత్ర అంబడిపూడి పాడగా, బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘అన్నీ మంచి శకునములే’ మూవీ ‘పెళ్లి సందడి’ అంత పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు ‘‘రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్గార్లు నాకు మంచి శకునం’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘చిన్నప్పటినుంచి ఈ ముగ్గుర్ని (రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, అశ్వినీదత్) చూస్తూ పెరిగాం.. వీరిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు ప్రియాంకా దత్, స్వ΄్నా దత్. -
యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె విడాకుల గురించి సోషల్ మీడియా అంతా వార్తలు చక్కర్లు కొడుతున్నా నిహారిక మాత్రం అవేం పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పి కేవలం నిర్మాతగా మారిపోయిన నిహారిక ఇప్పుడు మళ్లీ స్క్రీన్‌పై కనిపించేందుకు రెడీ అయిపోయింది. చదవండి: వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా ఓవైపు సొంతంగా ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ని స్థాపించి సినిమాలు, వెబ్‌సీరీస్‌లు నిర్మిస్తూనే, మరోవైపు సందర్భం వచ్చినప్పుడు తెరపై కనిపించేందుకు యాక్టివ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మెరిసే మెరిసే సాంగ్‌కు నిహారికతో కలిసి సంతోష్ శోభన్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా -
ఆ సినిమా విలువ నాకు తర్వాత తెలిసొచ్చింది: హీరోయిన్
‘‘ఓ నటిగా నేను ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటుంటాను. రొటీన్ రోల్స్ అయితే కొత్తగా నేను నిరూపించుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే క్యారెక్టర్స్ ఎంపిక విషయంలో జాగ్రత్తపడుతుంటాను’’ అని అన్నారు హీరోయిన్ మాళవికా నాయర్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాళవికా నాయర్ మాట్లాడుతూ– ‘‘నా గత సినిమాలతో పోల్చితే ‘అన్నీ మంచి..’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రలు చేశాను. కానీ ఈ చిత్రంలో కాస్త కోపంగా, ధైర్యంగా ఉండే అమ్మాయి పాత్ర చేశాను. అన్నీ తన కంట్రోల్లోనే ఉండాలనుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్ర చేశాను. కాస్త హ్యూమర్ కూడా ఉంటుంది. నందినీ రెడ్డిగారు నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. నటీనటుల నుంచి ఆమెకు కావాల్సింది రాబట్టుకుంటారు. ‘కల్యాణ వైభోగమే’ తర్వాత నందినీ గారితో మళ్ళీ సినిమా చేయాలని వుండేది. అది వైజయంతీ ఫిల్మ్స్‌తో నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్, గౌతమి, వీకే నరేశ్, వాసుకీగార్ల వంటి అనుభవజ్ఞులైన వారితో నటించడం కొత్త ఎక్స్పీరియన్స్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు అన్నీ మంచి శకునములే అనిపించాయి. ఈ పాత్ బ్రేకింగ్ సినిమా విలువ ఏంటో నాకు తర్వాత తెలిసొచ్చింది. ప్రియాంక, స్వప్నగార్లు నాకు పరిచయం అయ్యింది కూడా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నుంచే. ఇండస్ట్రీలో వారు నాకు మెంటర్స్లా ఉంటున్నారు. ఓ నటిగా నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది. ప్రస్తుతం డెవిల్ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నాను’’ అన్నారు. -
Anni Manchi Sakunamule: రిషి– ఆర్యని ఏప్రిల్ 20న ఇటలీలో కలవండి
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది. కాగా ‘ఏప్రిల్ 20న మీట్ రిషి– ఆర్య ఇన్ ఇటలీ’ అంటూ ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది యూనిట్. ‘‘ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’. విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన బంధం ఎలా ఏర్పడింది? వారి జర్నీ ఎలా సాగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. రిలీజ్ చేసిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్. Get ready for summer vacation, Meet Rishi & Arya in Italy on this Thursday 🍃💚 Our summer song #MeriseMabbullo on April 20th.https://t.co/W4L5PBmGP0#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms@SonyMusicSouth pic.twitter.com/Vbro2PTlDT — Swapna Cinema (@SwapnaCinema) April 17, 2023 -
Anni Manchi Sakunamule: అందమైన బంధాలు, భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న టీజర్
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్‌తో కలిసి బీవీ నందినీ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రియాంకా దత్ నిర్మించారు. మే 18న ఈ చిత్రం విడుదల కానుంది. మార్చి 4న నందినీ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘‘కొండ ప్రాంతం నేపథ్యంలో జరిగే కథ ఇది. అందమైన బంధాలు, భావోద్వేగాలతో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్గా నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఈ సినిమాకు మొదటి ఛాయిస్ నేను కాదట!: సంతోష్ శోభన్
యంగ్ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో చిత్రయూనిట్ సినీ విశేషాలు పంచుకుంది. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యూవీ క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్‌కే దక్కాలి. శివ పాత్రకి మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్‌ను అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియానే మొదటి ఆప్షన్" అన్నాడు. హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. సినిమాలో శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే" అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్‌గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యూవీ వరకు వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు" అన్నారు. చదవండి: తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు: చిరంజీవి వీరసింహారెడ్డి: థియేటర్లో పూజారి మాస్ డ్యాన్స్ -
ప్రభాస్‌కు ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్: యంగ్ హీరో
యంగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. నిహారిక ఎంటర్ టైన్మెంట్, ఆముక్త క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరో సంతోష్ శోభన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా నచ్చింది. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీ గారు అంటే ఇష్టం. ఆయన ఇచ్చిన కథతో ఏక్ మినీ కథ చేశాను. ఈ సినిమా తర్వాత మళ్ళీ వర్క్ చేయాలనుకున్నాం. లక్కీగా తొందరగా అయిపొయింది. కథ చెప్పిన నెల రోజుల తర్వాతే షూటింగ్ కి వెళ్ళిపోయాం. ఆయన కూడా నన్ను నమ్మారు. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. ► ఈ సినిమాకు నేనే ఫస్ట్ ఛాయిస్ అని మేర్లపాక గాంధీ గారు చెప్పారు. ఆయన మాట నమ్ముతున్నాను(నవ్వుతూ). ఇందులో యూట్యూబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. ఎక్స్ ప్రెస్ రాజాలా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. దర్శకుడు గాంధీ డైలాగ్‌ను పర్ఫెక్ట్ గా రాస్తారు. ఆయన రాసింది ఆయనలా చెబితేనే కుదురుతుంది. ► నిజానికి సోషల్ మీడియాలో నేను కొంచెం వెనకబడి వున్నాను. యూట్యూబ్ అందరికీ తెలుసు. మారేడుమిల్లి ఫారెస్ట్ లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ యూట్యూబ్ వ్లాగ్ చేసే కుర్రాళ్ళు వున్నారు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మాకంటే బాగా చెప్తున్నారు. మనం ఎక్కడో వెదుకుతాం కానీ మన చుట్టూనే బోలెడు ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ► నటుడు బ్రహ్మజీ గారితో చాలా ఫన్ ఉంటుంది. అదే సమయంలో ఒక సీన్ చేస్తున్నపుడు ఎలా చేయాలో చర్చిస్తుంటారు. సిందూరం నుండి ఇప్పటివరకూ ఆయనలో అదే ఫైర్, ప్యాషన్ ఉన్నాయి. ఆయన నుంచి కొత్త నటులు చాలా నేర్చుకోవాలి. ఫరియా చాలా ఎనర్జిటిక్. తను ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత చేసిన సినిమా ఇది. కథని నమ్మి చేసింది. ఫరియా నుంచి చాలా నేర్చుకున్నాను. ► ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించాలన్నదే నా డ్రీమ్. ► డిసెంబర్ 21న నందిని రెడ్డి గారి సినిమా 'అన్ని మంచి శకునములే' వస్తోంది. అలాగే యూవీ క్రియేషన్స్‌లో 'కళ్యాణం కమనీయం' ఉంది. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని ఉంది. నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం. చదవండి: బిగ్‌బాస్: ఆర్జే సూర్యపై ఇనయ ప్రేమ సక్సెస్ అయ్యేనా? జిన్నా హిందీ డబ్బింగ్‌కు అన్ని కోట్లా? -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
" లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
శ్రీదేవి శోభన్‌బాబు ట్రైలర్: హీరోకు నోటివాటం, హీరోయిన్‌కు చేతివాటం!
యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ జి. కిషన్ హీరోయిన్గా నటించింది. ఆ మధ్య సమంత టీజర్ రిలీజ్ చేయగా తాజాగా చిరంజీవి ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. 'నమస్కారం, మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాం, కథలో ముఖ్యాంశాలు.. హీరోకు నోటివాటం ఎక్కువ, హీరోయిన్‌కు చేతివాటం ఎక్కువ, వీరి మధ్య ఒక చాలెంజ్..' అంటూ ట్రైలర్ మొదలైంది. 'ఇక్కడ మాటలతో నెగ్గం బాబాయ్, మూటలుంటేనే నెగ్గుతాం' వంటి డైలాగులు బాగున్నాయి. ఇక తిట్ల దండకం అందుకునే హీరోకు, తిక్క లేపితే ఒక్కటిచ్చాకే మాట్లాడే హీరోయిన్‌కు మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అది కడదాకా నిలబడిందా? ఇంతకీ ఆ చాలెంజ్‌లో ఎవరు గెలిచారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ట్రైలర్ వినోదాత్మకంగా ఉందని, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించమని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. పోలకి విజయ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చదవండి: బాడీ షేమింగ్ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్ -
సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?
Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో సంతోశ్ శోభన్. పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ శోభన్, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచి రోజులు వచ్చాయి నటీనటులు : సంతోష్ శోభన్, మెహరీన్, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ నిర్మాత : ఎస్కేఎన్ దర్శకత్వం : మారుతి సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ విడుదల తేది : నవంబర్ 4, 2021 Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అతి భయస్తుడైన తిరుమలశెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్(అజయ్ ఘోష్)కి కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్ పద్దు(మెహ్రీన్ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్(సంతోష్ శోభన్)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్ ఘోష్ పాత్రే. గుండు గోపాల్‌గా అజయ్ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్‌తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్, సంతోష్‌గా సంతోష్ శోభన్ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి, రజిత తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. ఎలా ఉందంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్ అంతా మారుతి మార్క్ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్‌గా వెన్నెల కిశోర్ ఫ్రస్ట్రేషన్, సప్తగిరి అంబులెన్స్ సీన్స్, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్ కాల్ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఊహకందే విధంగా ఉంటుంది. క్లైమాక్స్‌లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.