'కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి'.. బేబీ డైరెక్టర్‌ మరో సంచలన కథ! | Baby Movie Director Sai Rajesh latest Movie First Look Poster Released | Sakshi
Sakshi News home page

బేబీ తరహాలో మరో ప్రేమ కథ.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌ బాస్ బ్యూటీ!

Oct 30 2023 4:40 PM | Updated on Oct 30 2023 5:17 PM

Baby Movie Director Sai Rajesh latest Movie First Look Poster Released - Sakshi

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సాయి రాజేశ్. తాజాగా మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో యువ నటుడు సంతోశ్ శోభన్, బిగ్‌ బాస్ బ్యూటీ అలేఖ్య హారిక జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్, సాయిరాజేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగ చైతన్య ముఖ్య ‍అతిథిగా హాజరై హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. కాగా.. ఈ చిత్రం ద్వారా హారిక హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను సాయి రాజేశ్ రిలీజ్ చేశారు. హీరో, హీరోయిన్ లిప్‌లాక్‌తో ఉన్న ఫోటో చూస్తే ఫుల్ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కథకు మరో సూపర్ హిట్‌ ఖాయంగా కనిపిస్తోంది. బేబీ తరహాలోనే మరో ప్రేమకథా చిత్రంతో టాలీవుడ్‌ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement