Anni Manchi Sakunamule Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Anni Manchi Sakunamule: రిషి– ఆర్యని ఏప్రిల్‌ 20న ఇటలీలో కలవండి

Apr 18 2023 11:32 AM | Updated on Apr 18 2023 11:55 AM

Anni Manchi Sakunamule Latest Updates - Sakshi

సంతోష్‌ శోభన్, మాళవికా నాయర్‌ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’.  ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా మే 18న రిలీజ్‌ కానుంది. కాగా ‘ఏప్రిల్‌ 20న మీట్‌ రిషి– ఆర్య ఇన్‌ ఇటలీ’ అంటూ ఓ వీడియో ద్వారా అనౌన్స్‌ చేసింది యూనిట్‌.

‘‘ఫీల్‌ గుడ్‌ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే...’. విభిన్న మనస్తత్వాలు కలిగిన రిషి, ఆర్యల మధ్య అందమైన బంధం ఎలా ఏర్పడింది? వారి జర్నీ ఎలా సాగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. రిలీజ్‌ చేసిన రెండు పాటలు బ్లాక్‌ బస్టర్‌ అయ్యాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దివ్య విజయ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement