Prashant Kumar
-
కట్టల పాముపై కొరడా
కొరాపుట్: విజిలెన్స్ వలలో చిక్కిన నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ లక్ష్యంగా సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం సోదాలు జరిపిన ప్రాంతాలను అధికారులు పెంచారు. దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక బినామీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు పట్టుబడ్డాయి. అందులో భుబనేశ్వర్లోని చంద్రశేఖర్‌పూర్ యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ఉన్న నివేదిత జెన్న అనే మహిళని అధికారులు పిలిపించారు. అయితే పేరుతో అకౌంట్ ఉండడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2016లో రాజఖనికలో బీడీవోగా ఉన్న ప్రశాంత్ కుమార్ రౌత్‌ని తాను కలిసినట్లు తెలియజేశారు. తనకు బియ్యం కార్డు ఇప్పించమని ప్రాదేయపడ్డానని, అప్పుడే తన ఆధార్ వివరాలు అందజేశానని వెల్లడించారు. ఈమె పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి అనేక రూ.లక్షలు లావాదేవీలు జరిగాయి. ఆమెలాగే అనేక మంది పనివాళ్లు, డ్రైవర్లు పేరు మీద ఆస్తులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.5 కోట్ల నగదు, ఒక ఇల్లు, వాహనాలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండిపడిన బీజేపీ నబరంగ్‌పూర్ అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ వద్ద రూ.కోట్ల నగదు పట్టుబడడంపై బీజేపీ మండిపడింది. ఇది ప్రభుత్వంలోని అధికారులకు, పార్టీ నాయకులకు చెందిన నగదు అని ఆ పార్టీ మాజీ ఎంపీ బలభద్ర మజ్జి ఆరోపించారు. శనివారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చమిరియా గుడలో ఉన్న పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిని వాటాల పంపిణీలో వచ్చిన విభేదాల వలన వెలుగులోనికి వచ్చిన నల్లధనంగా అభివర్ణించారు. నగదు పట్టుకున్న అధికారులు, ఆ నగదు ఎలా వచ్చిందో, ఎవరెవరు ఇచ్చారో విచారణ చేయాలన్నారు. ఇంత నగదు లంచంగా ఇచ్చినవారు ఇంకెంత ప్రజాధనం దోపిడీ చేసి ఉంటారోనని అనుమానం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు జగదీష్ బిసాయి, గౌరి మజ్జి, షర్మిష్టా దేవ్, దేవదాస్ మహంకుడో తదితరులు పాల్గొన్నారు. భారతమాల నిర్వాసితుల హర్షం ప్రశాంత్ కుమార్ పట్టుబడడంపై భారతమాల నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.20 వేల కోట్ల వ్యయంతో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కి 6 అంచెల ఎకనామిక్ కారిడర్ని భారతమాల పేరిట రోడ్డు నిర్మిస్తుంది. దీనిలో నబరంగ్‌పూర్ జిల్లాలో అత్యధిక భాగం భూసేకరణ జరిగింది. భూసేకరణలో భాగంగా వేలాది మంది గిరిజనులు నిర్వాసితులయ్యారు. వారికి అందే పరిహారాల విషయంలో ప్రశాంత్ ఎంతో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ హోదాలో అనేక ప్రభుత్వ భూములకు నకిలీ యజమానులను సృష్టించి రూ.కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై రాయిఘర్ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కేంద్ర హోం శాఖ ఈ వ్యవహరంపై చర్యలకు ఉపక్రమించిందని రాయిఘర్ నేతలు ప్రకటించారు. అందులో భాగంగానే దాడులు జరిగాయని పేర్కొన్నారు. మరోవైపు కొద్దిరోజుల క్రితం ఒక ప్రైవేటు పరిశ్రమకి వెళ్లి ప్రశాంత్ తనికీలు చేపట్టడం సంచలనం కలిగించింది. దీంతో సదరు పరిశ్రమల యజమానుల సంఘం ప్రతినిధులు తమను వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. -
విజిలెన్స్ తనిఖీలు.. రూ.2కోట్లు పక్కింట్లో పడేసిన అధికారి
ఒడిశా: నవరంగ్‌పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్ రౌత్ నివాసంలో కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. శుక్రవారం తెల్లవారుజామునే 9వేర్వేరు ప్రాంతాల్లో ఆయనకు చెందిన ఆస్తులపై విజిలెన్స్ బృందాలు ఏకకాలంలో దాడులకు దిగారు. నవరంగ్‌పూర్ మెయిన్ రోడ్డులోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉన్న ఏడీఎంను నిద్ర లేపి, తనిఖీలు ప్రారంభించారు. అక్కడ రూ.12 లక్షల నగదు పట్టుబడింది. రెండు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండటంతో డీఆర్డీఏ కార్యాలయం పక్కన ఉన్న మరో ప్రభుత్వ క్వార్టర్లో రూ.77 లక్షల నగదు లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఖంగు తిన్నారు. వెంటనే దూకుడు పెంచారు. అధికారులను చూసి.. భువనేశ్వర్‌లోని కన్న విహార్‌లో ప్రశాంత్‌కుమార్‌కు మరో ఇల్లు ఉందని తెలిసి మెరుపు దాడికి దిగారు. అధికారులు రావడం దూరం నుంచి గమనించిన కొందరు వ్యక్తులు భవనం పైనుంచి కొన్ని పెట్టెలు మరో భవనం పైకి విసరడాన్ని గమనించారు. దీంతో తలుపులు విరగ్గొట్టి, అధికారులు ప్రవేశించే సరికే దుండుగులు పరారయ్యారు. అక్కడి పెట్టెలను స్వా«దీనం చేసుకోగా, ఇందులో రూ.2 కోట్ల 25 లక్షల నగదు బయటపడింది. దీంతో పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అతని స్వస్థలం భద్రక్, నవరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద తనిఖీలు చేపట్టారు. సాయంత్రం ఉమ్మర్‌కోట్ పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 24సెంట్ల వాణిజ్య స్థలాన్ని అతని సోదరుడి పేరుమీద, ఖరీదైన భవనాలు సైతం ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు బంగారం బిస్కెట్లు, లెక్కలేనన్ని డిపాజిట్లు, భూ పత్రాలు, వివిధ బ్యాంకుల్లో లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దాడుల్లో ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 8మంది ఇన్స్పెక్టర్లు పాల్గొన్నట్లు రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయం ప్రకటించింది. గతంలో కూడా.. ఏడీఎం ప్రశాంత్‌కుమార్ గతంలో సుందర్‌గడ్ జిల్లా బిశ్రా సమితి కేంద్రంలో సమితి అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న సమయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆ కేసులో జైలుకు వెళ్లి, తిరిగి వచ్చి మళ్లీ విధుల్లో చేరారు. నవరంగ్‌పూర్ జిల్లాలో ఇసుక మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహరంపై గతం లో ట్రాక్టర్ల యజమానులు ఆందోళనకు దిగడం గమనార్హం. ఏడీఎం నివాసంలో కోట్ల రూయాల నగదు లభ్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పేదరికంతో బాధపడే గిరిజన జిల్లా.. ఓ ఉన్నతాధికారి వద్ద భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఆందోళన కలిగించే అంశమని డీసీసీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్ర నవరంగపూర్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి అధికారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
జస్టిస్ మిశ్రా గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఆత్మీయ విందు (ఫొటోలు)
-
జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం
సాక్షి, విజయవాడ: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం ఆత్మీయ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి హాజరయ్యారు. విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సత్కరించిన సీఎం వైఎస్ జగన్.. మెమెంటో అందజేశారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఇటీవలే సుప్రీం జడ్జిగా పదోన్నతి పొందారు. ఆయన ఆగస్టు 29, 1964న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయగఢ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకుని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్పూర్లోని మధ్యప్రదేశ్ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో పేరుగాంచారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. అనంతరం సెప్టెంబర్ 1, 2007 నుంచి న్యాయమూర్తి అయ్యే వరకూ అడ్వొకేట్ జనరల్‌గా కొనసాగారు. డిసెంబరు 10, 2009న ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, 2021, జూన్ 1 వ తేదీ నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఏపీ హైకోర్టు సీజేగా పని చేసి ఇటీవలే సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. చదవండి: ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆరో తరగతిలో నాన్న మృతి.. అమ్మ కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్‌గా
తనను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టాన్ని ఆ యువకుడు మరువలేదు. ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివాడు. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలో సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. పట్టుదల ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదని చెబుతున్న ఆ యువకుడు మరెవరో కాదు.. అసిస్టెంట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్‌కుమార్. వృత్తి శిక్షణలో భాగంగా ఆత్మకూరు వచ్చిన ఆయన తన అంతరంగాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. మాది పార్వతీపురం. నాన్న బాబురావు ఆర్మీలో పని చేసి రిటైర్డయ్యారు. అమ్మ స్వర్ణలత ఏఎన్ఎం. అన్నయ్య ప్రదీప్. ప్రస్తుతం మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నేను ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు పార్వతీపురంలో, 8 నుంచి 10 వరకూ మహారాష్ట్రలోని నాసిక్‌లో చదివా. వైజాగ్‌లో డిప్లొమా చేశా. హైదరాబాదులోని వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి 2017లో ఇంజినీరింగ్ పూర్తి చేశా. అమ్మ కష్టమే చదివించింది.. నేను ఆరో తరగతి చదివేటప్పుడు రోడ్డు ప్రమాదంలో నాన్న బాబురావు మరణించారు. మా కోసం అమ్మ ఆ దుఃఖాన్ని దిగమింగి నన్ను, అన్నయ్యను కష్టపడి చదివించింది. తనకు వచ్చే జీతంతోనే మాకు ఏ లోటూ తెలియకుండా పెంచింది. అందుకే అమ్మ కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా కష్టపడి చదివా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అనుకున్నది సాధించి ఐఏఎస్‌గా ఎంపికై అమ్మకు కానుక అందించా. మార్కుల కోసం చదవొద్దు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మనపై ఉన్న నమ్మకమే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అనుకున్నది సాధించడానికి మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డా. నేను మార్కుల కోసం ఎప్పుడూ చదవలేదు, చదివింది అర్థం అయేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. చాలా మంది డబ్బు ఉంటేనే సివిల్స్‌కు చదవగలం, రాయగలం అనుకుంటారు. కానీ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడినే. కష్టపడి చదివా. మనం అనుకున్నది సాధించడానికి స్పష్టమైన లక్ష్యం ఉంటే చాలు. ఆయన ప్రేరణతోనే సివిల్స్‌కు.. పార్వతీపురం మన్యం జిల్లాలోని మన్యం ఐటీడీఏ పీఓగా కొంతకాలం క్రితం ఐఏఎస్ లక్ష్మీష పనిచేశారు. పార్వతీపురం సమీపంలోని ఓ కొండపై కొన్ని గ్రామాలు ఉండేవి. సరైన వైద్య సదుపాయాలు లేక అక్కడి ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. మహిళలు గర్భం ధరిస్తే ప్రసవం కోసం కొండ మీద నుంచి అవస్థలు పడుతూ కిందకు తీసుకురావాల్సి వచ్చేది. అలా తీసుకొచ్చాక చాలా సార్లు ఆ మహిళనో లేదా పుట్టిన బిడ్డో చనిపోయేవారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఐఏఎస్ లక్ష్మీష హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ప్రసవానికి మూడు నెలలు ఉందనగానే సదరు మహిళను తీసుకువచ్చి అక్కడ ఉంచి.. వారితో యోగా సాధన చేయించడంతో పాటు మంచి ఆహారం అందించేవారు. దీంతో ప్రసవం తర్వాత తల్లీ బిడ్డ క్షేమంగా ఉండేవారు. ఎందుకో తెలియదు ఒకసారి లక్ష్మీష గురించి మా అమ్మ నాకు చెప్పింది. ఒక ఐఏఎస్ తలచుకుంటే సమాజంలో ఎంతో మార్పు తీసుకురావొచ్చని వివరించింది. దీంతో నేనూ ఐఏఎస్ కావాలనిపించింది. నేను ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి దేశస్థాయిలో సివిల్స్‌లో 3వ ర్యాంక్ సాధించారు. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్న విషయం ఆయన విజయంతో నాకు బోధపడింది. నెగెటివ్‌గా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు.. చాలా మంది విద్యార్థులు పదో తరగతిలో తప్పామనో, ఇంటర్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా చేయడం చాలా తప్పు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. నెగెటివ్‌గా మాట్లాడే వారిని పట్టించుకోవద్దు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. నేను మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యా. మొదటి రెండు సార్లు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని సులువుగా గట్టెక్కా. జిల్లావాసులు చాలా మంచివారు.. అనంతపురంలో కొన్ని నెలలుగా పనిచేస్తున్నా. జిల్లా ప్రజలు చాలా మంచి వారు. ఎలాంటి కల్మషం లేని మనుషులు. ఆత్మీయంగా పలకరిస్తారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎటుచూసినా పండ్ల తోటలు ఉండటం. -
నీట్ కనీస వయో పరిమితిపై జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు హాజరయ్యేందుకు కనీస వయో పరిమితి 17 సంవత్సరాలుగా నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంది. కనీస వయస్సును 17 సంత్సరాలుగా నిర్ణయించడం సమానత్వపు హక్కును హరించినట్లు కాదని స్పష్టంచేసింది. ఇదే అంశంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉమ్మడి హైకోర్టు గతంలోనే తీర్పునిచ్చిందని, ఓసారి తేలిన అంశంలో మరోసారి జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.నీట్‌కు కనీస వయోపరిమితి నిబంధనను కొట్టేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఓ మైనర్ విద్యార్థిని తండ్రి నాగ మునుస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అనూప్ కౌషిక్ వాదనలు వినిపిస్తూ, ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ, వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. పిటిషనర్ కుమార్తెకు నీట్ అర్హత వయస్సుకు నాలుగు రోజులు తక్కువ ఉందన్నారు. పరీక్షకు అనుమతించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్, జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తరపున న్యాయవాది ఎస్.వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపిస్తూ.. ఇదే అంశంపై గతంలో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఉమ్మడి హైకోర్టు ధర్మాసనం ఇదే అంశంపై తీర్పునిచ్చినప్పుడు దానికి విరుద్ధంగా స్పందించలేమంది. పరీక్ష రాసేందుకు నాలుగు రోజులు తక్కువైనా, ఒక్క రోజు తగ్గినా కూడా తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. -
జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు ఘనంగా వీడ్కోలు
సాక్షి, అమరావతి: నేడు (శనివారం) పదవీ విరమణ చేయనున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. శనివారం హైకోర్టుకు పాలనాపరమైన సెలవు కావడంతో శుక్రవారమే ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ ప్రవీణ్‌కు వీడ్కోలు పలికేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ న్యాయవ్యవస్థకు ఎంతో సేవ చేశారన్నారు. న్యాయమూర్తిగా ఆయన 26 వేల కేసులను పరిష్కరించారని చెప్పారు. హైకోర్టు విభజన తరువాత హైకోర్టు విజయవాడకు వచ్చిన తరువాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో కష్టపడ్డారన్నారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ యువ న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని చెప్పారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ వంటి సంస్థలకు నేతృత్వం వహించి చక్కని సేవలు అందించారన్నారు. పాలనాపరమైన విషయాల్లో తనకు ఎంతో సహకరించారని జస్టిస్ మిశ్రా చెప్పారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి పద్మనాభరెడ్డి, చిన్నాన్న జస్టిస్ చిన్నపరెడ్డి తనకు మార్గదర్శకులన్నారు. అనిశ్చిత సమయాల్లో వారే తనకు మార్గదర్శనం చేశారని తెలిపారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన వృత్తి జీవితం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇన్నేళ్ల తన ప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ , బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత జస్టిస్ ప్రవీణ్‌కుమార్ న్యాయ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. జస్టిస్ ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించింది. -
హైకోర్టు తీర్పులను తెలుగులోకి అనువదిస్తాం
సాక్షి, అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ చేపడుతున్న సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర హైకోర్టు ఇచ్చే తీర్పులను తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా చెప్పారు. న్యాయవ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా అత్యంత కీలకమైన రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. కేసులను వర్గీకరించడం, ఒకే తరహా కేసులను గుర్తించడం, తాజాగా దాఖలైన వ్యాజ్యాల వంటివి గతంలో దాఖలై ఉంటే అందులో కోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తించడం వంటి వాటికోసం ఏఐను వాడుకుంటామని చెప్పారు. దీనివల్ల విచారణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని, కక్షిదారులకు సత్వర న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత అందరి భాగస్వామ్యంతో ఏపీ హైకోర్టును మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైకోర్టులో గురువారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ మిశ్రా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల హక్కులను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ ముందువరుసలో ఉందన్నారు. సత్వర న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ అసెంబ్లీ సభ్యులైన తన తాతకు సహాయకుడిగా సమరయోధులతో జరిగే ఇష్టాగోష్టులకు వెళ్లే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. అప్పుడే రాజ్యాంగం గొప్పతనం అర్థమైందన్నారు. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఖాళీలు భర్తీచేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామన్నారు. రాబోయే మూడునెలల్లో హైకోర్టులో 14 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయని, కొత్తగా నిర్మిస్తున్న భవనంలో పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, లక్ష పుస్తకాలతో పాటు విదేశీ జర్నల్స్ కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతకుముందు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు ప్రసంగించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి సతీమణులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
యస్ బ్యాంక్‌కు మొండి బాకీల భారం
ముంబై: గత మొండిపద్దులకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 79 శాతం క్షీణించింది. రూ. 55 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజనింగ్ రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు ఎగిసింది. భవిష్యత్తులోనూ పాత మొండి బాకీలకు సంబంధించి మరింతగా ప్రొవిజనింగ్ చేయాల్సి రావచ్చని బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. రుణ వృద్ధి ఊతంతో సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం సుమారు 12 శాతం పెరిగి రూ. 1,971 కోట్లకు చేరింది. సింహ భాగం మొండి బాకీలను జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదలాయించడంతో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి అంతక్రితం త్రైమాసికంలోని 13 శాతంతో పోలిస్తే 2 శాతానికి తగ్గింది. బ్యాంకు ఇప్పటివరకు రూ. 4,300 కోట్ల రుణాలు రాబట్టగా, చివరి క్వార్టర్లో మరో రూ. 1,000 కోట్ల రికవరీకి అవకాశం ఉందని కుమార్ వివరించారు. రూ. 8,400 కోట్ల ఏటీ–1 బాండ్ల రద్దు చెల్లదంటూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి, అమరావతి: అమరావతి రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు చేపట్టిన మహా పాదయాత్రలో 600 మంది మాత్రమే ఉండాలంటూ సెప్టెంబర్ 9న ఇచ్చిన ఉత్తర్వులను, ఇతరులెవరూ సంఘీభావం పేరుతో పాదయాత్రలో పాల్గొనరాదంటూ గత నెల 21న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసేందుకు అనుమతి కోరుతూ రాజధాని రైతు పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అప్పీళ్ల దాఖలుకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై వారు దాఖలు చేసిన ప్రధాన అప్పీళ్లను సైతం కొట్టేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రైతు సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ చర్యలకు నిరసనగా చేపట్టిన పాదయాత్రలో పాల్గొనే హక్కు తమకు ఉందన్నారు. కేవలం 600 మందే పాల్గొనాలన్న ఉత్తర్వులు తమకు అడ్డంకిగా ఉన్నాయన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. మేం కూడా మీ మద్దతుదారులమే అని నిరూపించుకునేందుకు ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేస్తుంటారని వ్యాఖ్యానించింది. కేఎస్ మూర్తి స్పందిస్తూ.. యాత్ర చేస్తున్న వారు రైతులని చెప్పగా, రాజకీయ నాయకులెవరో, రైతులెవరో తమకు తెలియదని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పీళ్ల దాఖలుకు అనుమతిని నిరాకరిస్తూ అనుబంధ పిటిషన్లతో పాటు ప్రధాన అప్పీళ్లను కూడా కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. తగిన కారణాలతో పూర్తిస్థాయి ఉత్తర్వులను తరువాత వెలువరిస్తామంది. -
నెలాఖరులోగా మొండి పద్దుల విక్రయం పూర్తి
ముంబై: దాదాపు రూ. 48,000 కోట్ల మొండి పద్దులను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) జేసీ ఫ్లవర్స్‌కు విక్రయించే ప్రక్రియ నవంబర్ నెలాఖరుకి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు యస్ బ్యాంక్ సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. దీనితో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) నిష్పత్తి 12.89 శాతం నుంచి 2 శాతం లోపునకు దిగి రానుంది. మొత్తం పద్దులకు గాను రూ. 11,183 కోట్లు యస్ బ్యాంక్‌కు జేసీ ఫ్లవర్స్ చెల్లించనుంది. ఇది సుమారు 23 శాతం రికవరీకి సమానం. మరోవైపు, డీల్ ప్రకారం ఏఆర్‌సీలో యస్ బ్యాంక్ 9.9 శాతం వాటాలు తీసుకోనున్నట్లు, ఆర్బీఐ అనుమతితో దీన్ని తదుపరి 20 శాతానికి పెంచుకోనున్నట్లు ఎఫ్‌ఐబీఏసీ 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కుమార్ వివరించారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కలిసి దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. -
కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.. పాల్గొన్న సీజే ఎన్వీ రమణ, సీఎం జగన్ (ఫొటోలు)
-
హైకోర్టు సీజేకు సీఎం దంపతుల పరామర్శ
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాను సీఎం వైఎస్ జగన్ దంపతులు పరామర్శించారు. ఇటీవల జస్టిస్ మిశ్రా తల్లి నళినీ మిశ్రా కన్ను మూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి ఆదివారం విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
లాభాల్లోకి యస్ బ్యాంక్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ గతేడాది(2021–22) రూ. 1,066 కోట్ల నికర లాభం ఆర్జించింది. మూడేళ్ల(2019) తదుపరి బ్యాంక్ లాభాల్లోకి ప్రవేశించినట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. కాగా.. గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో బ్యాంక్ రూ. 367 కోట్ల నికర లాభం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. ఈ క్యూ4(జనవరి–మార్చి)లో నికర వడ్డీ ఆదాయం 84 శాతం జంప్‌చేసి రూ. 1,819 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.5 శాతానికి బలపడగా.. వడ్డీ యేతర ఆదాయం 28 శాతం ఎగసి రూ. 882 కోట్లకు చేరింది. పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన బ్యాంకుల కన్సార్షియం ఆర్థిక సవాళ్లలో ఇరుక్కున్న యస్ బ్యాంకుకు మూడేళ్ల క్రితం బెయిలవుట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 15.7 శాతం నుంచి 13.9 శాతానికి తగ్గాయి. ప్రస్తుత ఏడాది(2022–23)లో రూ. 5,000 కోట్లకుపైగా రికవరీలు, అప్గ్రేడ్లను సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రశాంత్ వెల్లడించారు. ఈ బాటలో నికర వడ్డీ మార్జిన్లను 2.75 శాతానికి మెరుగుపరచుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. 2022 మార్చికల్లా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.4 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. -
సమంత పరిచయం చేసిన 'శ్రీదేవి శోభన్‌బాబు'.. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది ?
Samantha Launched Santosh Shoban Sridevi Shoban Babu Movie Teaser: ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో తనదైన నటనతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో సంతోశ్ శోభన్. పేపర్ బాయ్, ఎక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి సినిమాలతోపాటు 'బ్యూటీ అండ్ ది బేకర్' వెబ్ సిరీస్‌లో అలరించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. వరుస సినిమాలపై దృష్టి పెట్టి కెరీర్‌కు మంచి రోజులు వచ్చేలా మలుచుకుంటున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి శోభన్‌బాబు'. ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గౌరి జి. కిషన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను స్టార్ హీరోయిన్ సమంత బుధవారం (ఏప్రిల్ 6) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఈరోజు మనం చెప్పుకోబోయే చిత్రం..' అంటూ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. రేడియోలో స్టోరీ చెబుతున్నట్లుగా పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ శోభన్, గౌరి నటన బాగుంది. 'నా ఇల్లు పట్టుకుని నీ ఇల్లు అంటావేంటీ' అని హీరో చెప్పే డైలాగ్ నవ్వు తెప్పించేలా ఉంది. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా అనిపిస్తోంది. కమ్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉంది
సాక్షి,అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్, తదనుగుణ జీవోలు, ఇతర ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగానికి, రాష్ట్రపతి ఉత్తర్వులకు ముఖ్యంగా అధికరణ 371–డీకి విరుద్ధమని, అందువల్ల వాటిని రద్దు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సిద్ధార్థ, గుంటూరుకు చెందిన దొంతినేని విజయ్‌కుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన జాగర్లమూడి రామారావు తదితరులు హైకోర్టులో గతవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటు రాజ్యాంగంలోని అధికరణ 371–డీకి విరుద్ధమన్నారు. రాష్ట్రానికి విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయం చేసేందుకు ఆ అధికరణ తీసుకొచ్చారని, దీని ప్రకారం ఉద్యోగాల భర్తీ విషయంలో జిల్లాను ఓ యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ఆధారంగా లోకల్ కేడర్, ఏరియాను నిర్ణయించారన్నారు. పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల పిటిషనర్లకొచ్చిన ఇబ్బంది ఏమిటని, కొత్త జిల్లాల ఏర్పాటును అధికరణ 371–డీ నిషేధిస్తోందా? వాదనల సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. పరిపాలన పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనిదని, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి ఉందంది. ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అధికారం ప్రభుత్వానికి లేదని తాము చెప్పడం లేదని న్యాయవాది సుధాకరరావు బదులిచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జోనల్ వ్యవస్థ కూడా మారిపోతుందని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన 8 వేలకు పైగా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వాటి ఏర్పాటు తగదన్నారు. తెలంగాణలో ఏర్పాటయ్యాయి కదా? ధర్మాసనం తిరిగి జోక్యం చేసుకుంటూ, అధికరణ 371–డీ ఉండగానే తెలంగాణలో కొత్త జిలాలు ఏర్పాటయ్యాయి కదా? అని అని ప్రశ్నించింది. అసలు రాజ్యాంగంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిషేధం ఎక్కడుందో చూపాలంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అప్పుడు కొత్త జిల్లా కూడా ఓ లోకల్ ఏరియా, ఓ యూనిట్‌గా ఉంటుందని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్లు ఏం చేస్తుంటారంటూ ధర్మాసనం ఆరా తీయగా.. పిటిషనర్లలో ఇద్దరు నిరుద్యోగులని, వారు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదని న్యాయవాది సుధాకరరావు తెలిపారు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అందువల్ల జిల్లాల ఏర్పాటును నిలువరిస్తూ మ«ధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీ చేసింది కేవలం ముసాయిదా మాత్రమేనని, పిటిషనర్లు తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. తుది నోటిఫికేషన్‌పై అభ్యంతరం ఉంటే అప్పుడు దానిని సవాలు చేసుకోవచ్చునని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదంది. పాలనా వ్యవహారాలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివి. పాలనాపరమైన సౌలభ్యం నిమిత్తం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయరాదని రాజ్యాంగంలో నిషేధం ఎక్కడ ఉందో చూపండి. రాష్ట్రంలో ఎప్పటికీ 13 జిల్లాలు మాత్రమే ఉండాలని పిటిషనర్లు కోరుకుంటున్నారా? – ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.కె. మిశ్రా ధర్మాసనం -
విజయవాడ కోర్టు సముదాయం జూన్‌కు పూర్తి
సాక్షి, అమరావతి: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు సముదాయాన్ని ఈ ఏడాది జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని రహదారులు, భవనాలశాఖ న్యాయవాది కోనపల్లి నర్సిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. కోర్టు సముదాయాన్ని పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్ కొంత గడువు కోరారని, అందువల్ల జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రహదారులు, భవనాలశాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ బహుళ అంతస్తుల కోర్టు సముదాయం నిర్మాణంలో తీవ్రజాప్యం జరుగుతోందంటూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపిస్తూ.. కొత్త కోర్టు నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది జూన్‌కల్లా భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ సైతం ఆ గడువు లోపు పూర్తి చేసేందుకు అంగీకరించారన్నారు. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
న్యాయాధికారుల అరెస్ట్ సమాచారం ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారిని అరెస్ట్ చేసే ముందు లేదా అరెస్ట్ చేసినప్పుడు ఆ విషయాన్ని హైకోర్టుకు లేదా సంబంధిత జిల్లా జడ్జికి తెలపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందేనని చెప్పింది. ఇకపై న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా అన్ని జిల్లాల పోలీసులకు తగిన ఆదేశాలతో సర్క్యులర్ జారీచేస్తామన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. భవిష్యత్తులో పొరపాటుకు ఆస్కారం లేకుండా నడుచుకోవాలని సూచించింది. న్యాయాధికారి అరెస్ట్‌పై అతడి కుమారుడు రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ ఆ పిటిషన్‌ను మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి సంకు రామకృష్ణ ఒక న్యూస్ చానల్ చర్చాకార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తల ఎప్పుడు తెగనరకాలా అని ఎదురు చూస్తున్నానంటూ మాట్లాడారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి రామకృష్ణను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఈ–మెయిల్ ద్వారా పంపిన లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించిన హైకోర్టు దీనిపై గురువారం మరోసారి విచారించింది. ఈ కేసులో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ) అప్పారి సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. రామకృష్ణ అరెస్ట్ విషయాన్ని పోలీసులు హైకోర్టుకు తెలియజేయలేదన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయాధికారిగా ఉంటూ వివాదాల్లోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించింది. న్యాయాధికారి అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా అని అడిగింది. సత్యప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. న్యాయాధికారుల అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేలా ఆదేశిస్తూ పోలీసులందరికీ సర్క్యులర్ ఇస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ చెప్పారు. ఏజీ చాలా నిష్పక్షపాతంగా వాస్తవాలు చెప్పారని, ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
వారధిలా న్యాయ విద్యార్థులు
సాక్షి, అమరావతి: పేదలకు న్యాయం అందించే దిశగా ప్రారంభించిన ‘మిషన్ లీగల్ సర్వీసెస్’ను ఓ ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పేర్కొన్నారు. పేదలకు సాయం అందించడంలో న్యాయ విద్యార్థులే కీలకమని, మిషన్ లీగల్ సర్వీసెస్‌కు వారు వెన్నెముక లాంటి వారని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు చేపట్టిన మిషన్ లీగల్ సర్వీసెస్ కార్యక్రమాన్ని సీజే జస్టిస్ మిశ్రా మంగళవారం ఉదయం ప్రారంభించి మాట్లాడారు. దత్తత గ్రామాల పర్యటనకు ఉద్దేశించిన వాహనాలను ఆయన ప్రారంభించారు. దత్తత గ్రామాల్లో సేవలు... గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, తుళ్లూరు, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకుని మిషన్ లీగల్ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం న్యాయ విద్యార్థులపై ఆధారపడి ఉందన్నారు. వారు ప్రజలు, న్యాయవ్యవస్థకు మధ్య వారధిలా పని చేస్తారన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ ద్వారా గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు, రైతుల సమస్యలతో పాటు తాగునీటి ఇబ్బందులను గుర్తించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిక చేసిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటూ గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సి వస్తే సంబం«ధిత వ్యక్తులకు కోర్ కమిటీ ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందన్నారు. చట్టాలున్నా... అవగాహన లేక పేదల హక్కుల రక్షణ విషయంలో పలు చట్టాలున్నా అవగాహన లేకపోవడం వల్ల నిరర్థకం అవుతున్నాయని ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయ విద్యార్థులపై ఉందన్నారు. మిషన్ లీగల్ సర్వీసెస్ సమర్థంగా అమలయ్యేలా 6 కమిటీలు ఏర్పాటు చేశామని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి తెలిపారు. ఎనిమిది న్యాయ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, పలువురు న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. -
నగర పంచాయతీల ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన అప్పీళ్లను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను వీలైనంత త్వరగా విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. గుంటూరు జిల్లా గురజాల, జంగమేశ్వరపురం గ్రామ పంచాయతీలను విలీనం చేసి గురజాల నగర పంచాయతీగాను.. దాచేపల్లి, నడికుడి గ్రామ పంచాయతీలను విలీనం చేసి దాచేపల్లి నగర పంచాయతీగాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సమీప గ్రామాలను విలీనం చేసి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఏర్పాటు చేస్తూ మరో జీవో ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటికి ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్నికలను నిలువరించేందుకు నిరాకరించగా.. ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదన్న ధర్మాసనం అప్పీళ్లను కొట్టేసింది. -
హైకోర్టు నూతన సీజేగా నేడు జస్టిస్ మిశ్రా ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం/విశాఖ లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్.. జస్టిస్ పీకే మిశ్రాతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, న్యాయ మూర్తులు, తదితరులు పాల్గొననున్నారు. కాగా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం నుంచి ఇండిగో విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ డి.రమేష్, జస్టిస్ శేషసాయి, జస్టిస్ సురేష్‌రెడ్డి, జస్టిస్ బట్టు దేవానంద్, పలువురు న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ భానుమతి, హైకోర్టు ప్రొటోకాల్ రిజిస్ట్రార్ మురళీధర్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు. అంతకుముందు ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రాయపూర్ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథ శర్మ, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పలువురు అధికారులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. -
ఆంధ్ర 255 ఆలౌట్
సాక్షి, ఒంగోలు: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది. ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజి మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 255 పరుగులకు ఆలౌటైంది. డీబీ ప్రశాంత్ కుమార్ (237 బంతుల్లో 79; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ఉప్పర గిరినాథ్ (134 బంతుల్లో 41; 5 ఫోర్లు), కె. నితీశ్ కుమార్ రెడ్డి (60 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. కెపె్టన్ రికీ భుయ్ (0) తొలి బంతికే అవుటయ్యాడు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, జలజ్ సక్సేనా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కేరళ సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆంధ్రకు 93 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. -
కామెడీ మిఠాయి
‘మిఠాయి’ తియ్యగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ మా ‘మిఠాయి’ తినేది కాదు చూసేది’’ అంటున్నారు నిర్మాత డా. ప్రభాత్‌కుమార్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, కమల్ కామరాజ్, శ్వేతావర్మ, ఆర్ష ముఖ్య తారలుగా ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించారు. ‘‘చిత్రరంగంలో విశేష అనుభవం సంపాదించుకున్న నిర్మాత మామిడాల శ్రీనివాస్ ఫ్యాన్సీ ధరకు ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత తెలిపారు. రాజేశ్వరి ఫిలింస్, మూవీ మ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ డార్క్ కామెడీతో విభిన్నమైన పాత్రల మధ్య సాగే చిత్రమిది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి పాత్రలు పోటీపడి హాస్యాన్ని పంచుతాయి. అలాగే చిత్రంలో నవరసాలను దర్శకుడు ప్రశాంత్ చక్కగా తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే బాగా కుదిరింది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మంచి బాణీలను అందించారు. సంగీతంతో పాటు కెమెరా, కామెడీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: కిట్టు విస్సాప్రగడ, మాటలు: బి.నరేశ్ రెడ్డి. -
ఆంధ్ర తడబాటు
రాణించిన ప్రశాంత్, భరత్ కేరళతో రంజీ మ్యాచ్ గువాహటి: ముగ్గురు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్సలో 77 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎస్ భరత్ (54; 8 ఫోర్లు, ఒక సిక్సర్), ప్రశాంత్ కుమార్ (61; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/8తో తొలి ఇన్నింగ్స కొనసాగించిన కేరళ 219 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ 351 ఆలౌట్ వల్సాడ్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 351 పరుగులకు ఆలౌటైంది. బావనక సందీప్ (96; 14 ఫోర్లు) నాలుగు పరుగుల తేడాలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఆట ముగిసే సమయానికి చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్సలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది. బరోడా విజయం రోహతక్: బెంగాల్, బరోడా జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 23 వికెట్లు పడగా... రెండో రోజు 17 వికెట్లు నేలకూలారుు. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 63/3తో రెండో ఇన్నింగ్స కొనసాగించిన బరోడా 133 పరుగులకు ఆలౌటైంది. 155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 46 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. బరోడా బౌలర్లలో అతీత్, బాబాషఫీ పఠాన్ మూడేసి వికెట్లు తీశారు.