ఆంధ్ర తడబాటు
రాణించిన ప్రశాంత్, భరత్ కేరళతో రంజీ మ్యాచ్
గువాహటి: ముగ్గురు మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌సలో 77 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎస్ భరత్ (54; 8 ఫోర్లు, ఒక సిక్సర్), ప్రశాంత్ కుమార్ (61; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 188/8తో తొలి ఇన్నింగ్‌స కొనసాగించిన కేరళ 219 పరుగులకు ఆలౌటైంది.
హైదరాబాద్ 351 ఆలౌట్
వల్సాడ్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌సలో 351 పరుగులకు ఆలౌటైంది. బావనక సందీప్ (96; 14 ఫోర్లు) నాలుగు పరుగుల తేడాలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఆట ముగిసే సమయానికి చత్తీస్‌గఢ్ తొలి ఇన్నింగ్‌సలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.
బరోడా విజయం
రోహతక్: బెంగాల్, బరోడా జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 23 వికెట్లు పడగా... రెండో రోజు 17 వికెట్లు నేలకూలారుు. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 63/3తో రెండో ఇన్నింగ్‌స కొనసాగించిన బరోడా 133 పరుగులకు ఆలౌటైంది. 155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగాల్ 46 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. బరోడా బౌలర్లలో అతీత్, బాబాషఫీ పఠాన్ మూడేసి వికెట్లు తీశారు.