విజయ్ విజృంభణ
కేరళతో ఆంధ్ర రంజీ మ్యాచ్
గువాహటి: ఆంధ్ర బౌలర్ విజయ్ కుమార్ (6/37) మరోసారి విజృంభించాడు. ఫలితంగా సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ తొలి ఇన్నింగ్‌సలో 89.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆరంభంలో విజయ్ ధాటికి 36 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడిన కేరళను మహ్మద్ అజారుద్దీన్ (82) ఆదుకున్నాడు. రోహన్ ప్రేమ్ (42) రాణించాడు. అయ్యప్ప, డీబీ రవితేజ చెరో వికెట్ తీశారు.
బద్రీనాథ్ సెంచరీ: హైదరాబాద్ 267/4
వల్సాడ్: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ కెప్టెన్ బద్రీనాథ్ (254 బంతుల్లో 134; 20 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌సలో 88 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. సందీప్ (135 బంతుల్లో 73 బ్యాటింగ్) రాణించాడు. అభిమన్యు చౌహాన్‌కు 2 వికెట్లు దక్కారుు.
ఒకే రోజు 23 వికెట్లు...
రోహ్‌తక్: బరోడా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో వికెట్ల వర్షం కురిసింది. తొలి రోజు 73.2 ఓవర్లలోనే ఏకంగా 23 వికెట్లు నేలకూలారుు. మొదట బరోడా తొలి ఇన్నింగ్‌సలో 30.4 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదిత్య (17)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... బెంగాల్ బౌలర్ అశోక్ దిండా (6/45) చెలరేగాడు. తర్వాత బెంగాల్‌ది అదే తీరుగా సాగింది. 27.4 ఓవర్లలో 76 పరుగులకే తొలి ఇన్నింగ్‌స ముగిసింది. అతీత్ సేథ్ 36 పరుగులే ఇచ్చి 7 వికెట్లు తీశాడు. 21 పరుగుల ఆధిక్యం పొందిన బరోడా అనంతరం రెండో ఇన్నింగ్‌సలో ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.