గోవాపై ఆంధ్రకు ఆధిక్యం
ధన్‌బాద్: ఆంధ్ర, గోవా జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఇరు జట్ల లెఫ్టార్మ్ స్పిన్నర్లు భార్గవ్ భట్ (6/36), షాదాబ్ జకాతి (8/53) వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు. ఫలితంగా తొలి రోజు 20 వికెట్లు నేలకూలారుు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గోవా, భార్గవ్ ధాటికి తొలి ఇన్నింగ్‌సలో 115 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం ఆంధ్ర 159 పరుగులకు ఆలౌటై 44 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. బౌలింగ్‌లో జకాతి చెలరేగినా... కేఎస్ భరత్ (67 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన ఇన్నింగ్‌సతో ఆంధ్రను ముందంజలో నిలిపాడు.
హైదరాబాద్ 234/3
వడోదర: తన్మయ్ అగర్వాల్ (275 బంతుల్లో 106 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించడంతో జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోరుు 234 పరుగులు చేసింది. బద్రీనాథ్ (47), అనిరుధ్ (46) ఫర్వాలేదనిపించారు.