ధన్‌బాద్: ఆంధ్ర, గోవా జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆసక్తికర స్థితిలో నిలిచింది. 233 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన ఆంధ్ర రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 99 పరుగులు చేసింది. ప్రశాంత్ (13), భరత్ (19), విహారి (0) విఫలం కాగా... రవితేజ (35 బ్యాటింగ్), రికీ భుయ్ (32 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. విజయానికి ఆంధ్ర చేతిలో ఉన్న 7 వికెట్లతో మరో 134 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు గోవా తమ రెండో ఇన్నింగ్‌సలో 276 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ బందేకర్ (75), స్నేహల్ కౌతాంకర్ (61) అర్ధ సెంచరీలు చేయగా, విహారి 3 వికెట్లు పడగొట్టాడు.
ఆధిక్యం దిశగా హైదరాబాద్...
వడోదర: హైదరాబాద్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో జమ్ము కశ్మీర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌సలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పర్వేజ్ రసూల్ (70) మినహా అంతా విఫలమయ్యారు. రవికిరణ్ 4 వికెట్లతో కశ్మీర్‌ను దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 234/3తో ఆట కొనసాగించిన హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్‌సలో 328 పరుగులకు ఆలౌటైంది. పర్వేజ్ రసూల్‌కు 4 వికెట్లు దక్కారుు.