34 పరుగులతో గోవా గెలుపు
ధన్‌బాద్: రంజీ ట్రోఫీలో మరో విజయం నమోదు చేసే అవకాశాన్ని ఆంధ్ర చేతులారా కోల్పోరుుంది. గురువారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో గోవా 34 పరుగుల తేడాతో ఆంధ్రను ఓడించింది. 233 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 99/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర 198 పరుగులకే ఆలౌటైంది. రికీ భుయ్ (131 బంతుల్లో 71; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా లాభం లేకపోరుుంది. వరుస ఓవర్లలో రవితేజ (49), ప్రదీప్ (1)లను అవుట్ చేసి జకాతి, ఆంధ్ర పతనానికి శ్రీకారం చుట్టగా... చివర్లో రితూరాజ్ సింగ్ (4/24) చెలరేగాడు.
గెలుపు బాటలో హైదరాబాద్...
వడోదర: జమ్ము కశ్మీర్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంపై కన్నేసింది. 404 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్‌స ఆరంభించిన కశ్మీర్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోరుు 42 పరుగులు చేసింది. చివరి రోజు ఆ జట్టు మిగిలిన 6 వికెట్లతో 362 పరుగులు చేయడం దాదాపు అసాధ్యం. అంతకు ముందు జమ్ము కశ్మీర్‌ను తొలి ఇన్నింగ్‌సలో 169 పరుగులకు ఆలౌట్ చేసి 159 పరుగుల ఆధిక్యం సాధించిన హైదరాబాద్... అనంతరం తమ రెండో ఇన్నింగ్‌సను 2 వికెట్లకు 244 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తన్మయ్ అగర్వాల్ (103 నాటౌట్) మ్యాచ్‌లో మరో సెంచరీ సాధించగా, బద్రీనాథ్ (66), అక్షత్ రెడ్డి (53) రాణించారు.