క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రంజీ సీజన్‌లో గోవాకు అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 120 పరుగులు చేశాడు.
ఇక తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన అర్జున్ టెండూల్కర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇక అర్జున్ ఇన్నింగ్స్‌పై అతడి తండ్రి సచిన్ టెండూల్కర్ తొలి సారి స్పందించాడు. ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు.
"క్రికెట్‌లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్‌కు కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. అర్జున్ ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్‌తో క్లోజ్‌గా ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్‌ను నైట్ వాచ్‌మెన్‌గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను.
ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్ అవుతుందని అర్జున్ అడిగాడు. వారు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. కనీసం 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్ స్కోర్ అవుతుందని నేను చెప్పాను. చివరికి అర్జున్ సెంచరీ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్జున్ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు.
అతడు ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉండేది. నేను రిటైర్ అయ్యాక ముంబైలో మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అతడిపై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్ క్రికెట్‌పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అదే విధంగా అతడొక మంచి క్రికెటర్‌గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను" అని సచిన్ పేర్కొన్నాడు.
చదవండి: FIFA WC Final: ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం!
Comments
Please login to add a commentAdd a comment