ఆంధ్రకు భారీ ఆధిక్యం
వల్సాడ్: త్రిపురతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర బ్యాట్స్‌మెన్ చెలరేగారు. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్‌సలో 3 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. హనుమ విహారి (336 బంతుల్లో 144 బ్యాటింగ్; 14 ఫోర్లు), డీబీ ప్రశాంత్ (235 బంతుల్లో 129; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 240 పరుగులు జోడించారు. ఇప్పటికే ఆంధ్ర 206 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
సందీప్ డబుల్ సెంచరీ...
ముంబై: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ బావనక సందీప్ (332 బంతుల్లో 203 నాటౌట్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడుగా సీవీ మిలింద్ (208 బంతుల్లో 136; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా కెరీర్‌లో మొదటి శతకం సాధించడంతో సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్‌సను హైదరాబాద్ 9 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సందీప్, మిలింద్ ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 267 పరుగులు జత చేయడం విశేషం. అనంతరం సర్వీసెస్ ఆట ముగిసే సమయా నికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.