ఆంధ్ర 255 ఆలౌట్‌ | Andhra Took A Huge Lead In The First Innings Of The Ranji Trophy Match | Sakshi
Sakshi News home page

ఆంధ్ర 255 ఆలౌట్‌

Published Wed, Jan 29 2020 2:32 AM | Last Updated on Wed, Jan 29 2020 2:32 AM

Andhra Took A Huge Lead In The First Innings Of The Ranji Trophy Match - Sakshi

సాక్షి, ఒంగోలు: కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించింది. ఇక్కడి సీఎస్‌ఆర్‌ శర్మ కాలేజి మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 255 పరుగులకు ఆలౌటైంది. డీబీ ప్రశాంత్‌ కుమార్‌ (237 బంతుల్లో 79; 11 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, తొలి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న ఉప్పర గిరినాథ్‌ (134 బంతుల్లో 41; 5 ఫోర్లు), కె. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (60 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించారు. కెపె్టన్‌ రికీ భుయ్‌ (0) తొలి బంతికే అవుటయ్యాడు. కేరళ బౌలర్లలో బాసిల్‌ థంపి, జలజ్‌ సక్సేనా చెరో 3 వికెట్లు పడగొట్టారు. కేరళ సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఆంధ్రకు 93 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement