నందినీ రెడ్డి, మాళవిక, సంతోష్, దుల్కర్, నాని, గౌతమి, ప్రియాంక, స్వప్నా దత్
‘‘అన్నీ మంచి శకునములే..’ ట్రైలర్, టీజర్‌లో పాజటివ్ ఎనర్జీ కనిపించింది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే..’. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్ముతున్నా’’ అని అన్నారు నాని. సంతోష్ శోభన్ , మాళవికా నాయర్ జంటగా నందినీరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్రవిందా మూవీస్, స్వప్నా సినిమాస్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాని ఇంకా మాట్లాడుతూ– ‘‘మంచి ఈజ్, బ్రహ్మాండమైన కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ సంతోష్. అతన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది. నందినీకి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’కి విజువల్స్, సాంగ్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది.
ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాని. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘వైజయంతీ మూవీస్ నాకు ఓ ఫ్యామిలీలాంటిది. రాజేంద్రప్రసాద్‌గారికి నేను అభిమానిని. ‘మహానటి’కి ఆయనతో కలిసి వర్క్ చేశాను. ‘సీతారామం’ తర్వాత నాకు తొలి ఫోన్ కాల్ నందినీ రెడ్డిగారి నుంచి వచ్చింది. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నా లైఫ్‌లో నేను చేసిన పెద్ద సినిమా ఇది.
వీకే నరేశ్, రాజేంద్రప్రసాద్, గౌతమీ, వాసుకి, ‘షావుకారు’ జానకి, అంజు.. ఇలా వీరందరూ కలిసి నేను రాసుకున్న కథను పది రెట్లు పెంచారు. ఈ సినిమాకు లైఫ్ లైన్ సంగీత దర్శకులు మిక్కీ జే మేయర్. ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఫీలింగ్ ప్రియాంక, స్వప్నాల వల్ల కలిగింది’’ అన్నారు నందినీ రెడ్డి. ‘‘సమ్మర్‌కు మన అమ్మమ్మగారి ఇంటికి వెళ్లొచ్చిన జ్ఞాపకంలా ‘అన్నీ మంచి శకునములే’ ఉంటుంది’’ అన్నారు స్వప్నా దత్, ప్రియాంకా దత్.
‘‘చాలాకాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు సంతోష్ శోభన్.. ‘‘వైజయంతీ మూవీస్ సంస్థను మా పిల్లలు (స్వప్నా, ప్రియాంక) సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. వీరి ఆలోచనలు అప్పట్లో నాకు రాలేదని ఈర్ష్యగా ఉంది’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘అసలు మనం ఎందుకు పుట్టాం? హిందూ ధర్మంలో మనం సెంటిమెంట్‌కు ఎంత వేల్యూ ఇస్తాం.
ఆ సెంటిమెంట్ వల్ల మనం ఎలా ఉన్నాం? వంటి అంశాలు ‘అన్నీ మంచి శకునములే..’లో ఉన్నాయి. ఒక అద్భుత సినిమాను చూసిన అనుభూతిని ప్రేక్షకులకు ఇస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను’’ అన్నారు రాజేంద్రప్రసాద్. ‘‘పదహారు కూరల రుచుల సమ్మేళనం ఈ చిత్రం’’ అన్నారు వీకే నరేశ్. ఈ వేడుకలో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment