ఈ శుక్రవారం చిన్నాపెద్దా కలిపి 10 వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన 'MAD' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. జూ.ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయమైన ఈ సినిమాలో ఓ కుర్రాడు.. తన యాక్టింగ్, కామెడీతో ఇచ్చిపడేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఎవరతడు? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?
ఈ కుర్రాడి పేరు సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడే ఇతడు. ప్రభాస్‌తో 'వర్షం' లాంటి హిట్ సినిమా తీసిన శోభన్.. సంగీత్ నాన్న. ఇలా ఇండస్ట్రీతో చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా 2011లోనే 'గోల్కోండ హైస్కూల్' సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో బొద్దుగా ఉండేది ఇతడే. అప్పుడు బ్రేక్ తీసుకుని పదేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)
వెండితెరపై 'మ్యాడ్' ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. మూడేళ్ల క్రితమే 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సిరీస్‌లో సహాయ పాత్ర చేశాడు. దీనితోపాటు త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ భాగమయ్యాడు. అలా ఓటీటీల్లో అదరగొట్టిన సంగీత్.. 'మ్యాడ్'లో అవకాశం దక్కించుకున్నాడు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ చదివే కుర్రాడి పాత్రలో ఇరగ్గొట్టేశాడని చెప్పొచ్చు. త్వరలో 'ప్రేమ విమానం' అనే డైరెక్ట్ ఓటీటీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.
తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మాత్రం మరో జాతిరత్నం కావడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా కామెడీతో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త కష్టపడితే సంగీత్.. ఆ లిస్టులోకి చేరడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు!
(ఇదీ చదవండి: ‘మ్యాడ్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment