
‘‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ కథ హిలేరియస్‌గా ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్స్ అయిన హీరో, హీరోయిన్ ట్రావెల్ వీడియోల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘ఒక యూట్యూబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన నుంచే ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఐడియా వచ్చింది.
ట్రావెల్ బ్లాగర్ కష్టాలు, ప్రమాదాలు, సవాళ్లను ఈ సినిమాలో చూపించాం. ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చేంజ్ ఓవర్, మలుపు ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోయారు. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్‌లో చిరంజీవిగారు చెప్పిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ డైలాగ్ మా సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు మేర్లపాక మురళిగారి కథతో ఓ సినిమా చేయాలనుంది. ‘జవాన్’ నిర్మాత కృష్ణగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్ మెంట్‌లో నా తర్వాతి చిత్రాలు ఉంటాయి’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment