
ప్రపంచ అంధుల క్రికెట్ జట్టుకు ప్రేమ్‌కుమార్ ఎంపిక
డోన్ టౌన్ : సీసంగుంతల గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ ప్రపంచ అంధుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది దేశాల జట్ల మధ్య జరిగే పోటీల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ క్రికెట్ జట్టుకు మన రాష్ట్రం నుంచి 4 ఎంపిక కాగా అందులో ప్రేమ్‌కుమార్ ఒకరు. ఆయన ప్రముఖ సీపీఐ నేత ఎల్లయ్య, సుంకులమ్మ దంపతుల కుమారుడు.