
యాదగిరిగుట్ట: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు సీఎం కేసీఆర్‌ను కోరారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం మోత్కుపల్లి నర్సింహులు అభిమానులు, అనుచరులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు 5 సార్లు ఆలేరు నుంచి, ఒక సారి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే గెలిచారన్నారు. రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్న మోత్కుపల్లి నర్సింహులును సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభ సమయంలో పిలిచి, బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వనించారని తెలిపారు. ఆ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
కానీ ఇప్పటి వరకు మోత్కుపల్లికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆవేద అభివాదం చేస్తున్న మోత్కుపల్లి అనుచరులున వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment