బోయినపల్లిలో వ్యక్తి దారుణహత్య
Published Fri, Feb 19 2016 11:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
హైదరాబాద్: నగరంలోని బోయినపల్లిలో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది చంపారు. మృతుడు బేగంపేటలోని ఇంద్రానగర్‌కు చెందిన నర్సింహులుగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement