
నారాయణపేట రూరల్/జడ్చర్ల టౌన్ : వలసలు.. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న నారాయణపేట జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన యూపీఎస్‌సీ ఫలితాల్లో పేటకు చెందిన రాహుల్ ఆలిండియాలో 272వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ పీఈటీ నర్సింహులు, హిందీ టీచర్ శశికళ దంపతుల కుమారుడైన రాహుల్ పదో తరగతి వరకు నారాయణపేటలోనే విద్యాభ్యాసం చేశారు. 2016లో ఏఈగా ఎంపికైనా ఆయన సివిల్స్ సాధించేందుకు రెండేళ్లు లాంగ్‌లీవ్ పెట్టి అనుకున్నది సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలం చాకలిగడ్డతండా వాసి శశికాంత్‌కు 764వ ర్యాంక్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment