UPSC results
-
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: అఖిల భారత సరీ్వసులకు ఉద్యోగుల ఎంపిక నిమిత్తం నిర్వహించిన యూపీఎస్సీ–2023 మెయిన్స్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మెయిన్స్ పరీక్షలను గత సెపె్టంబర్లో నిర్వహించడం తెలిసిందే. గత మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలను దాదాపు 13 లక్షల మంది రాశారు. 15 వేల మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో దాదాపు 2,500 మంది తాజాగా ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్టు సమాచారం. ఇంటర్వ్యూ తేదీలతో త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి మొత్తం 1,105 మందిని సివిల్ సరీ్వసులకు యూపీఎస్సీ ఎంపిక చేయనుంది. -
ఇంటర్వ్యూలో యూపీఎస్సీ ర్యాంకర్‌కు వింతైన ప్రశ్న.. మీరైతే ఏం చెబుతారు?
ప్రతి ఏడాది యూపీఎస్సీ పరీక్షలకు వేలల్లో పోటీ పడుతారు. ఏ కొందరో దాన్ని సాధిస్తారు. కొద్దిమందే గమ్యాన్ని చేరుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలుంటాయో. రాత పరీక్ష దాటిన తర్వాత అసలైన పరీక్ష ఇంటర్వూ. ఇందులో నిర్వహకులు చాలా వింతైన ప్రశ్నలను అడుగుతారు. అభ్యర్థి స్థితిప్రజ్ఞతను పరీక్షిస్తారు. విభిన్న పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారో గమనిస్తారు. ఇలానే ఈ సారి ఓ ర్యాంకర్‌కు ఇంటర్వూలో ఎదురైన ప్రశ్నను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. మరి.. ఆ ప్రశ్నకు మీరైతే ఏం జవాబు చెబుతారో? ప్రవీణ్ కశ్వాన్ అనే అభ్యర్థి ఈ సారి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. తనకు ఎదురైన ప్రశ్నను పంచుక్నున్నారు. ' దేశంలో ఇంత పేదరికం ఉన్నప్పటికీ స్పేస్ మిషన్ల పేరిట ఎందుకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి.? మీరు దీన్ని ఎలా భావిస్తారు' అనే ప్రశ్నను ఇంటర్వూ బోర్డులోని మూడో వ్యక్తి ప్రవీణ్‌ను అడిగారట. అందుకు ప్రవీణ్...' రెండు అంశాలకు పోల్చాల్సినవి కావు. 1928లో సీవీ రామన్.. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్నారు. కానీ రామన్ ప్రభావం నేడు పరిశోధనల్లో ముఖ్యంగా మెడికల్ సైన్స్‌లో ఎంతో ఉపయోగపడుతోంది. సమయం పడుతుంది కానీ కచ్చితంగా ఫలాలు ఉంటాయి. కొత్తవాటిని కనుగొనడానికి తగ్గిస్తే.. పేదరికాన్ని దూరం చేయలేము. ప్రజల వద్ద నైపుణ్యం లేని కారణంగా సంపాదించడం లేదు. అందుకు మన విద్యా వ్యవస్థలో లోపాలున్నాయి. మనం వాటిపై పనిచేయాలి.'అని ప్రవీణ్ సమాధానమిచ్చారట. ఈ ట్వీట్‌పై నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇదీ చదవండి:రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మంత్రి అమర్నాథ్ భేటీ -
లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. ఇషితా కిషోర్ ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సైనిక కుటుంబ నేపథ్యం 26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్‌లో చేరాను’ అని ఇషితా తెలిపారు.. కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకొని సివిల్స్‌కు అర్హత సాధించారు. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే దేశానికి సేవ చేయాలని.. తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది. యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz — ANI (@ANI) May 23, 2023 మెరిసిన తెలుగు తేజం 2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. -
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
Ayushi: చీకటిని చీల్చి సివిల్ ర్యాంకర్‌గా..
నిమిషంపాటు కళ్లుమూసుకుని నడవాలంటేనే కష్టం. అటువంటిది పుట్టినప్పటినుంచే కారు చీకటి కమ్మేసిన కళ్లు అవి. జీవితంమొత్తం అంధకారమే అని తెలిసినప్పటికీ, బ్రెయిలీ లిపి సాయంతో అరకొర చదువుకాకుండా ఉన్నత చదువు చదివింది. అక్కడితో అగకుండా ప్రభుత్వ స్కూలు టీచర్ అయ్యింది. ఇక చాలు అనుకోకుండా .. దేశవ్యాప్తంగా పోటీపడే యూపీఎస్సీ పరీక్ష రాసి 48వ ర్యాంకు సాధించి, చరిత్ర సృష్టించింది.. చరిత్ర చెప్పే టీచర్ ఆయుషి. ఢిల్లీలోని రాణిఖేడా గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం లో పుట్టింది ఆయుషి. పుట్టుకలోనే విధికన్నెర్ర చేసి తన రెండు కళ్లనూ చీకటిమయం చేసింది. రెండు కళ్లకు చీకటి తప్ప మరేం కనిపించదు. అయినా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుకుంది. ఆ తరువాత శ్యాంప్రసాద్ ముఖర్జీ కాలేజీలో బి.ఏ, ఇగ్నో యూనివర్శిటీలో చరిత్ర ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ (హిస్టరీ), జామియా మిల్లియా ఇస్లామియా నుంచి బి.ఈడీ. చేసింది. ఆ తరువాత 2012లో మున్సిపల్ కార్పొరేషన్∙స్కూల్లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. 2016లో ప్రైమరీ టీచర్ అయ్యింది. 2019లో ‘ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు’ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్ అయ్యింది. పదేళ్లుగా టీచర్‌గా సేవలందిస్తోన్న ఆయుషి ప్రస్తుతం ముబారఖ్‌పూర్ దబాస్ గవర్నమెంట్ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో.. పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థులకు హిస్టరీని బోధిస్తోంది. సివిల్స్‌కు ఎందుకంటే.. ‘‘స్కూల్లో పాఠాలు చెబుతూ ఎంతోమంది భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దగలుగుతున్నాను. యూపీఎస్సీలో సెలక్ట్ అయితే మరెంతోమంది జీవితాలను తీర్చిదిద్దే అపారమైన అవకాశం లభిస్తుంది. తనలాంటి వైకల్యం కలవారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు’’ అని ఆయుషికి అనిపించింది. దీంతో 2016 నుంచి సివిల్స్ రాయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. టీచర్‌గా బిజీగా ఉన్నప్పటికీ తన ప్రిపరేషన్‌ను మాత్రం వదల్లేదు. వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని... ఆయుషి పుట్టుకతోనే అంధురాలైనప్పటికీ సివిల్స్ దాక రాణించడానికి కారణం కుటుంబం వెన్నుతట్టి ప్రోత్సహించడమే. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఆయుషి తల్లి... ప్రిపరేషన్‌కు చాలా బాగా సాయం చేశారు. సీనియర్ నర్సింగ్ అధికారిగా పనిచేస్తోన్న ఆయుషి తల్లి ఆశా రాణి 2020లో వలంటరీగా పదవి విరమణ చేసి ఆయుషి ప్రిపరేషన్‌కు పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆయుషికి కావాల్సిన స్టడీ మెటిరీయల్‌ను ఆయుషి భర్తతో కలిసి ఆడియో రూపంలో రికార్డు చేసి ఇచ్చేవారు. ఇవి ఆమె ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడ్డాయి. వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం మెయిన్స్ కూడా క్లియర్ చేయని 29 ఏళ్ల ఆయుషి.. తాజాగా ఐదో ప్రయత్నంలో దేశంలోనే 48వ సివిల్ ర్యాంకర్‌గా నిలిచింది. రాతపరీక్షకు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా, మాక్ టెస్ట్‌కు మాత్రమే కోచింగ్ తీసుకుని ర్యాంక్ సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాలు (డ్యానిక్స్) లేదా హర్యాణా క్యాడర్లో బాలికలు, వికలాంగుల విద్యారంగంలో సేవలందించడానికి ఆయుషి ఆసక్తి చూపుతోంది. వైకల్యం కళంకం కాకూడదు అంధురాలిగా విద్యార్థులకు పాఠాలు బోధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే టీచింగ్‌ను నేను ఎప్పుడు ఒక ఉద్యోగంగా చూడలేదు. అభిరుచిగా భావించాను. అందుకే విద్యార్థులు నా టీచింగ్‌ను ఇష్టపడేంతగా వారిని ఆకట్టుకోగలిగాను. ఆసక్తిగా పాఠాలు చెబుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఈసారి కచ్చితంగా సివిల్స్ క్లియర్ చేస్తానని నమ్మకం ఉంది. కానీ యాభైలోపు ర్యాంకు రావడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇన్నాళ్లకు నా కల నిజమైంది. టాప్–50 జాబితాలో నా పేరు ఉందని తెలియడం మాటల్లో్ల వర్ణించలేని ఆనందాన్ని కలిగించింది. పుట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ పెరిగాను. కుటుంబ సభ్యులు ముఖ్యంగా అమ్మ సాయంతో అన్నింటిని జయిస్తూ నేడు ఈ స్థాయికి చేరుకోగలిగాను. విద్య అనేది సాధికారతా సాధనం. బాలికలు, వికలాంగుల విద్యా రంగంలో పనిచేస్తూ వారికి రోల్‌మోడల్‌గా నిలవాలనుకుంటున్నాను. వికలాంగుల జీవితాల్లో వైకల్యం ఒక కళంకంగా ఉండకూడదు. వైకల్యంపట్ల సమాజ దృక్పథాన్ని మార్చుకోవాలి. వికలాంగులు కూడా అన్ని లక్ష్యాలను సాధించగలరు. – ఆయుషి దేవుడు ఆయుషి రెండు కళ్లు తీసుకున్నప్పటికీ, ఆమె బంగారు భవిష్యత్‌కు చక్కని దారి చూపాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది. స్కూలుకెళ్లడానికి నలభై నిమిషాలు పడుతుంది. ఆ సమయాన్ని కూడా తన ప్రిపరేషన్‌కు కేటాయించి, ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆయుషి తల్లిగా ఎంతో గర్వపడుతున్నాను. – ఆశారాణి (ఆయుషి తల్లి) -
క్రేన్ ఆపరేటర్ కూతురికి 323వ ర్యాంక్.. స్మార్ట్‌ఫోన్‌తో ప్రిపరేషన్!
రాంఘర్(రాంచి): పేద కుటుంబం..కోచింగ్ తీసుకునే స్తోమత లేదు..అయినప్పటికీ వెనుకాడలేదు. రోజుకు 18 గంటలపాటు చదువుకుని, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకుని యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరైంది. రెండు రోజుల క్రితం వెలువడిన యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా 323వ ర్యాంక్ సాధించింది. జార్ఖండ్‌కు చెందిన దివ్యా పాండే(24) ఘనత ఇది. రాంచీ యూనివర్సిటీ నుంచి దివ్య 2017లో డిగ్రీ పొందారు. ఈమె తండ్రి జగదీష్ ప్రసాద్ పాండే సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(సీసీఎల్)లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసి 2016లో రిటైరయ్యారు. ‘ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ సివిల్స్ సాధించేందుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇంటర్నెట్లోని అపార సమాచారాన్ని వాడుకున్నా. రోజుకు 18 గంటలపాటు సొంతంగా చదువుకున్నా. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. యూపీఎస్సీ కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఏడాది కష్టానికి తొలి ప్రయత్నంలోనే ఫలితం దక్కింది’ అని దివ్యా పాండే తెలిపారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తానన్నారు. కుమార్తె సాధించిన ఘనతతో జగదీష్ ప్రసాద్ ఆనందానికి అవధుల్లేవు. ‘నాకు చాలా గర్వంగా ఉంది. దివ్య ఎంతో కష్టపడింది. అందుకు తగిన ఫలితం దక్కింది’ అని అన్నారు. దివ్య చెల్లెలు ప్రియదర్శిని పాండే కూడా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణురాలైంది. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్‌వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్‌పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్‌లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
సివిల్స్‌లో తెలుగు మెరుపులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్–2021 తుది ఫలితాలను సోమవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి సివిల్స్‌కు హాజరైనవారే ఉన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా టాప్–100 ర్యాంకర్లలో 11 మంది ఇక్కడి వారే నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కొందరు అభ్యర్థులు కూడా రాష్ట్రం తరఫున ఎంపికైనవారి జాబితాలో ఉన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువగా.. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని.. ఇక్కడి నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరైనవారు కూడా పెద్ద సంఖ్యలోనే ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సా«ధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులూ మంచి ర్యాంకులు సాధించారు. వ్యవసాయం చేసేవారు, హౌజ్ కీపింగ్ వంటి చిన్న ఉద్యోగం చేసే వారి పిల్లలకు ఉత్తమ ర్యాంకులు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ర్యాంకర్ల మనోగతం అసలు ఊహించలేదు.. సివిల్స్‌లో ఇంటర్వ్యూ పూర్తయ్యాక మంచి ర్యాంక్ వస్తుందనుకున్నా.. కానీ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు.’’అని సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగోట్లపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్ తండ్రి పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి, కర్నూలులో సీటీవోగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2020 సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దానికి శిక్షణ తీసుకుంటూనే.. మరోసారి సివిల్స్ రాసి 15వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు కదిలించాయి హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన వి.సంజన సింహ సివిల్స్ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్‌లో 207వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికైన ఆమె.. ఆదాయపన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాశారు. అఫీషియల్ ట్రిప్‌లో భాగంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె.. ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ‘‘దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు టాప్–5లో ఉండటం కదిలించింది. ఐఏఎస్ అధికారిగా రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటా’’ అని చెప్పారు. రెండేళ్లు పాపకు దూరంగా ఉండి.. ‘‘ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్ కోసం సిద్ధమయ్యాను. అప్పటికే ఉద్యోగం ఉండి, స్థిరపడ్డ జీవితంలో.. చిన్న పాపకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఏమిటన్న ప్రశ్నలు అనేక మంది నుంచి ఎదురయ్యాయి. ఎంతో బాధ అనిపించింది. కానీ నా భర్త ఎంతగానో ప్రోత్సహించారు’’ అని సివిల్స్ 56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి చెప్పారు. ఆమె భర్త విజయ్‌కుమార్ చౌహాన్ హైదరాబాద్‌లో సీటీఓగా పనిచేస్తున్నారు. 2019లో సివిల్స్ 613వ ర్యాంకు రాగా డానిక్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా చేరిన ఆమె.. మరోసారి సివిల్స్ రాసి 56వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ కావాలని ఉంది ‘‘నాకు ఐపీఎస్ కావాలని కోరిక. ర్యాంకును బట్టి ఐఏఎస్ వచ్చినా స్వీకరిస్తా. అటు ఉద్యోగం చేస్తూనే.. రోజూ ఎనిమిది గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేరై మంచి ర్యాంకు సాధించా’’ అని 161వ ర్యాంకర్ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన ఆమె తండ్రి సంజీవరెడ్డి వరంగల్ జిల్లా సహకార అధికారిగా, తల్లి వినోద సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన చైతన్య.. 2016లో రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ఏఈగా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే ఆరోసారి సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. మంచి పోస్టింగ్ కోసం పట్టుదలతో.. ‘‘2017 నుంచి వరుసగా సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2019లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గుజరాత్‌లోని వదోదరలో శిక్షణలో ఉన్నాను. మంచి పోస్టింగ్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ ప్రిపేర్ అయి 488 ర్యాంక్ సాధించాను. ఈ దిశగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు’’ అని నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. స్వీపర్ బిడ్డ కాబోయే కలెక్టర్ తండ్రి ఐలయ్య వ్యవసాయకూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు సరిగా గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలగా చదివి సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించాడు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్. ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజీలోనే చదివిన నరేశ్ మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. చెన్నైలోనే మూడేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి.. తర్వాత సివిల్స్‌కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. 2019లో 782వ ర్యాంకుతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. గుజరాత్‌లోని వదోదరాలో ట్రైనింగ్ పొందుతూ.. మళ్లీ సివిల్స్ రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. నరేశ్ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడంతో సంబురంలో మునిగిన తండ్రి ఐలయ్య.. కుమారుడిని తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఎక్కించుకొని కాలనీ అంతా తిరుగుతూ తన కుమారుడు ఐఏఎస్ సాధించాడంటూ మురిసిపోయాడు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. మాది నిజామాబాద్ జిల్లా. నిర్దేశించుకున్న లక్ష్యంపై పట్టువదలకుండా కృషి చేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించా. అమ్మ పద్మ కామారెడ్డి కలెక్టరేట్లో పేఅండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమె ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తా.. – అరుగుల స్నేహ, 136వ ర్యాంకర్ తల్లిదండ్రుల స్ఫూర్తితో.. మాది జగిత్యాల బీర్పూర్ మండలం చర్లపల్లి. తండ్రి బాషానాయక్ వ్యవసాయం చేస్తూ.. కష్టపడి నన్ను చదివించారు. తల్లి యమున మినీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో కçష్టపడి చదివాను. – గుగ్లావత్ శరత్‌నాయక్, 374వ ర్యాంకు ప్రణాళిక బద్ధంగా చదివి.. నేను బీటెక్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో ప్రణాళికాబద్ధంగా చదివి.. నాలుగో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. – ఉప్పులూరి చైతన్య, 470వ ర్యాంకర్ పరిశోధనలు కావాలి దేశానికి శాస్త్రవేత్తలు కూడా అవసరం. చాలా మంది సివిల్స్, ఇతర ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తాను. – గడ్డం సుధీర్‌కుమార్, 69వ ర్యాంకర్ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. ‘‘పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. మా ఇంట్లో అందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో నేను సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించాను. – అనన్యప్రియ, 544వ ర్యాంకర్, హైదరాబాద్ ఎంతో సంతోషంగా ఉంది.. ఐఏఎస్ లక్ష్యంగా గట్టిగా కృషి చేశా. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశముంది. ఏదొచ్చినా పేద ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఐపీఎస్ వస్తే నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ర్యాంకు సాధించా. – ముత్యపు పవిత్ర, 608 ర్యాంకర్ -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్‌రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
యూపీఎస్సీ సివిల్స్ 2021 ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. 2021 సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్, మూడో ర్యాంకర్ గామిని సింగ్లా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. పూర్తి ఫలితాల కోసం క్లిక్ చేయండి -
పేరు కారణంగా ట్రోల్ అవుతున్న యూపీఎస్సీ ర్యాంకర్
సివిల్ సర్వీసెస్ పరీక్ష పాస్ కావాలంటే ఎంతో కృషి, పట్టుదల అవసరం. అది దేశంలోనే ఎంతో కష్టతరమైన పరీక్ష. అయితే ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాలలో 420 వ ర్యాంకు సాధించిన ఒక వ్యక్తి మాత్రం ప్రస్తుతం విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దానికి కారణం అతని పేరు. అంతలా ట్రోల్ అయ్యేపేరు ఏముంది అని అనుకుంటున్నారా? ఆ ర్యాంకర్ పేరు రాహుల్ మోదీ. ఒకరు కాంగ్రెస్ నాయకుడు కాగా మరొకరు ప్రధాని. రెండు విభిన్న, వ్యతిరేక పార్టీల నాయకుల పేరు కలిసేలా అతని పేరు ఉండటమే. ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమవుతోంది. శతాబ్ధాల కలయిక #RahulModi పేరుతో ఇప్పుడు ఒక మీమ్ ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. దీనికి కొంత మంది రాహుల్, మోదీ ఇద్దరు యూపీఎస్సీ పరీక్షను పాసయ్యారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరి కొందరు మీరు బీజేపీ మద్దతుదారా? కాంగ్రెస్ మద్దతుదారా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేరు కారణంగా అతని కృషిని, కష్టాన్ని గుర్తించకుండా ఇలా చేయకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి రాహుల్ మోదీ పేరు కారణంగా ఒక ఆఫీసర్ ఉద్యోగాన్ని చేపట్టే వ్యక్తి ట్రోల్స్‌కు గురవుతున్నాడు. యూపీఎస్సీ టాపర్ గురించి కూడా ఇలా మాట్లాడుకోలేదని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక 2019 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. చదవండి: దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..! -
మెరిసిన ‘పేట’ తేజం
నారాయణపేట రూరల్/జడ్చర్ల టౌన్ : వలసలు.. వెనుకబాటుకు మారుపేరుగా ఉన్న నారాయణపేట జిల్లాకు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో పేటకు చెందిన రాహుల్ ఆలిండియాలో 272వ ర్యాంకు సాధించారు. రిటైర్డ్ పీఈటీ నర్సింహులు, హిందీ టీచర్ శశికళ దంపతుల కుమారుడైన రాహుల్ పదో తరగతి వరకు నారాయణపేటలోనే విద్యాభ్యాసం చేశారు. 2016లో ఏఈగా ఎంపికైనా ఆయన సివిల్స్ సాధించేందుకు రెండేళ్లు లాంగ్‌లీవ్ పెట్టి అనుకున్నది సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలం చాకలిగడ్డతండా వాసి శశికాంత్‌కు 764వ ర్యాంక్ వచ్చింది. -
మాజీ సర్పంచ్ కొడుకు.. సివిల్స్ టాపర్
న్యూఢిల్లీ: ప్రదీప్ సింగ్ పేరు ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. నేడు ప్రకటించిన యూపీఎస్సీ-2019 ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వీరందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘సివిల్ సర్వీసెస్ పరీక్ష, 2019ని విజయవంతంగా క్లియర్ చేసిన వారందరికీ నా అభినందనలు! ప్రజా సేవకు సంబంధించి ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన వృత్తి మీ కోసం వేచి ఉంది. నా శుభాకాంక్షలు!’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో పాటు ఇతర నాయకులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. నేడు ప్రకటించిన ఫలితాల్లో ప్రదీప్ సింగ్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. తరువాతి స్థానాల్లో జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ ఉన్నారు. Congratulations to all the bright youngsters who have successfully cleared the Civil Services Examination, 2019! An exciting and satisfying career of public service awaits you. My best wishes! — Narendra Modi (@narendramodi) August 4, 2020 ఇక ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రదీప్ సింగ్ హరియాణా సోనిపట్ జిల్లాకు చెందినవారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘కల నిజమైతే ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇది నాకు ఆనందకరమైన ఆశ్చర్యం. నేను ఐఏఎస్ కావాలని ప్రతిక్షణం పరితపించాను. సమాజంలోని అణగారిన వర్గాల కోసం పని చేస్తాను’ అని తెలిపారు. గత ఏడాది కూడా ప్రదీప్ సివిల్స్ క్లియర్ చేశారు. ప్రస్తుతం అతను హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇండియన్ రెవన్యూ సర్వీస్ ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నారు. సోనిపాట్ జిల్లాలోని తేవ్రీ గ్రామంలో నివసిస్తున్న ప్రదీప్ తండ్రి సుఖ్బీర్ సింగ్.. గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. -
సివిల్స్ టాపర్‌కు 55.35 శాతం మార్కులే
న్యూఢిల్లీ: యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన కనిష్క్ కటారియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 55.35 శాతం మార్కులు సాధించారు. దీన్నిబట్టి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన కటారియా సివిల్స్ పరీక్షలో మొత్తం 2,025 మార్కులకు గాను 1,121 (55.35 శాతం) మార్కులు సాధించగా.. అందులో రాత పరీక్షలో 942, ఇంటర్వ్యూలో 179 మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది. 2వ ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ 1,080 మార్కులు (53.3 శాతం) సాధించగా, రాత పరీక్షలో 882, ఇంటర్వ్యూలో 198 మార్కులు సాధించారు. ఈనెల 5న యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ 2018 పరీక్ష ఫలితాల్లో మొత్తం 759 మంది అభ్యర్థులు ఎంపికవగా అందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలున్నారు. -
చరిత్ర సృష్టించిన వయనాడ్ యువతి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీచేస్తున్న వయనాడ్‌కు చెందిన గిరిజన యువతి శ్రీధన్య సురేశ్ సివిల్స్‌లో ర్యాంకు తెచ్చుకున్నారు. కేరళ నుంచి ఈ ప్రతిష్టాత్మక సర్వీసుకు ఎంపికైన తొలి గిరిజన యువతిగా ఆమె గుర్తింపు పొందారు. శుక్రవారం యూపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 22 ఏళ్ల శ్రీధన్యకు 410వ ర్యాంక్ దక్కింది. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ‘ శ్రీధన్య కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్ ర్యాంకు తెచ్చిపెట్టాయి. ఆమె ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ ఆమెతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌లో ‘ తన సామాజిక వెనకబాటుతో పోరాడి శ్రీధన్య సివిల్స్‌లో మెరిశారు. ఆమె విజయం భవిష్యత్తులో ఇతరులకు స్ఫూర్తినిస్తుంది’ అని పేర్కొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం వద్దనుకుని.. వయనాడ్‌లోని పోజుతానాకు చెందిన శ్రీధన్య మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. గతంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వదిలేసింది. కేరళ గిరిజన విభాగంలో ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ‘అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ గిరిజన జనాభా చాలా ఉన్నా మా నుంచి ఒక్కరూ ఐఏఎస్‌కు ఎంపిక కాలేదు. నా విజయం భావి తరాలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. నా పీజీ పూర్తయిన తరువాత తొలిసారి ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యక్షంగా చూశా. ఆయన కోసం ప్రజలు ఎదురుచూడటం, సిబ్బందితో ఆయన అక్కడికి రావడం సివిల్స్ సాధించాలన్న నా చిన్న నాటి కలను తట్టిలేపాయి’ అని శ్రీధన్య గుర్తుకుచేసుకున్నారు. ఆమె కాలికట్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ జువాలజీలో పీజీ చదివారు. -
సివిల్స్ టాపర్ ప్రేమకథ
న్యూఢిల్లీ: తన విజయంలో గర్ల్‌ఫ్రెండ్ పాత్ర కూడా ఉందని సివిల్స్ టాపర్ కనిషక్ కటారియా చేసిన ప్రకటనతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఆయన అభ్యుదయభావంతో స్పందించారని నెటిజెన్లు పొడిగారు. కెరీర్లో విజయం సాధించేందుకు ప్రేయసి అడ్డుకాదని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఈ క్షణం ఎంతో ఆశ్చర్యకరం. సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధిస్తానని అనుకోలేదు. ఈ విషయంలో మద్దతుగా నిలిచి నైతిక స్థైర్యాన్నిచ్చిన నా తల్లిదండ్రులు, సోదరి, గర్ల్‌ఫ్రెండ్‌కు కృతజ్ఞతలు’ అని కటారియా శనివారం విలేకర్లతో అన్నారు. తన విజయం పట్ల గర్ల్‌ఫ్రెండ్‌కు బహిరంగంగా ధన్యవాదాలు చెప్పిన తొలి సివిల్స్ టాపర్ కటారియానే అని భావిస్తున్నారు. ‘మన దేశంలో చదువుకునే పిల్లలు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చదువుపైనే దృష్టిపెట్టాలి. కానీ ఆలిండియా సివిల్స్ టాపర్ కటారియా తన ప్రేయసికి ధన్యవాదాలు చెప్పారు’ అని ఒకరు అనగా..యూపీఎస్సీ పరీక్ష పాసవ్వడానికి ప్రేయసి అడ్డుకాదని మరోసారి నిరూపితమైందని మరొకరు ట్వీట్ చేశారు. ఇలా గర్ల్‌ఫ్రెండ్‌కు ధన్యవాదాలు చెప్పే ధైర్యం ఎందరికి ఉంటుందని మరొకరు ప్రశ్నించారు. ‘ప్రేయసి, సంబంధాలు కెరీర్ లక్ష్యాల నుంచి దృష్టి మరలుస్తాయని అన్నవారెక్కడ?’ అని మరొకరు ప్రశ్నించారు. జైపూర్‌కు చెందిన కటారియా తండ్రి సాన్వర్ వర్మ, అంకుల్ కేసీ వర్మ ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం. -
సివిల్స్ టాప్ 10 ర్యాంకర్లు వీరే
న్యూఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ -2014 పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు మెరిశారు. తొలి ఐదు ర్యాంకుల్లో నాలుగు ర్యాంకులను అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు ఢిల్లీకి చెందిన విద్యార్థునులే ఉండటం మరో విశేషం. 2014 ఆగస్టు 24 న జరిగిన సివిల్స్ పరీక్షల్లో సంబంధించిన ఫలితాలు శనివారం విడుదల చేశారు. (సివిల్స్ సర్వీసెస్ లో తెలుగు తేజాలు) టాప్ 10 ర్యాంకులు సాధించిన వారు.. మొదటి ర్యాంకు- ఇరా సింఘాల్ రెండో ర్యాంక్ రేణురాజ్ మూడో ర్యాంక్-నిధి గుప్తా నాల్గో ర్యాంకు-వందన ఐదో ర్యాంకు- సుహర్షభగత్ ఆరో ర్యాంకు-టి చారుశ్రీ ఏడో ర్యాంకు లోక్ బంధు ఎనిమిదో ర్యాంకు-కె.నితిష్ తొమ్మిదో ర్యాంకు అశిష్ కుమార్ పదో ర్యాంకు -అరవింద్ సింగ్ (సివిల్స్ లోనూ అమ్మాయిలు టాప్ లేపారు) -
అగర్తల అసిస్టెంట్ కలెక్టర్‌గా నిజామాబాద్‌వాసి
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన బోగ నిత్యానంద్, అరుణ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ త్రిపురలోని అగర్తలా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2014 జూన్ 12న వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో విశ్వశ్రీ సివిల్స్‌కు ఎంపికయ్యూరు. ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) శిక్షణలో ఉండగానే సివిల్స్ రాసి 346 ర్యాంక్ సాధించారు. భర్త నక్క భానుశ్యాం ఉద్యోగ రీత్యా డిల్లీ లో స్థిరపడడంతో అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచే సివిల్స్ పరీక్ష రాసి ఎంపికయ్యూరు. -
సివిల్స్‌లో విశ్వశ్రీ
కమ్మర్పల్లి : చౌట్పల్లి గ్రామానికి చెందిన బోగ అరుణ నిత్యానంద్ దంపతుల పెద్ద కూతురు విశ్వశ్రీ మళ్లీ సివిల్స్‌కు ఎంపికయ్యారు. గురువారం వెలువడిన యూపీఎస్సీ ఫలితాల్లో విశ్వశ్రీ ఈ ఘనత సాధించారు. ఆమె ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్(ఐఆర్టీఎస్) శిక్షణలో ఉండగానే సివిల్స్ రాసి 346వ ర్యాంక్ సాధించడం విశేషం. గతేడాది తొలి ప్రయత్నంలోనే 787వ ర్యాంకు సాధించిన విశ్వశ్రీ ఐఆర్‌టీఎస్‌కు ఎంపికై శిక్షణ పొందుతూ, సివిల్స్ రాసి 346 ర్యాంకు సాధించారు. చదువు నేపథ్యం.. విశ్వశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని నిర్మల హృదయ పాఠశాలలో చదివారు. గుంటూరులోని వికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదారాబాద్‌లోని ఎంజేసీటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం గుజరాత్‌లోని ఆనంద్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ సెంటర్లో ఎంబీఏ చదివారు. కొద్ది రోజుల పాటు సెర్ఫ్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన ఆమె.. భర్త నక్క భానుశ్యాం ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడికి వెళ్లారు. ఢిల్లీలోనే ఉంటూ భర్త, అత్తమ్మ కోటాలమ్మ ప్రోత్సాహంతో సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యారు. పోయినేడాది మొదటి ప్రయత్నంలోనే 787వ ర్యాంకు సాధించి, ఇండియన్ రైల్వే ట్రాక్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ పొందుతూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయి 346వ ర్యాంకు సాధించారు. విశ్వశ్రీ భర్త ప్రస్తుతం ఢిల్లీలో ప్రపంచ బ్యాంక్ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 346వ ర్యాంకు సాధించిన విశ్వశ్రీకి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లోని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం లభించే అవకాశముంది. -
సివిల్స్‌లో కర్నూలు తేజం
యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంక్ సాధించిన సందీప్ చక్రవర్తి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు నగరానికి చెందిన వైద్య విద్యార్థి సివిల్స్‌లో మెరిశాడు. గురువారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 786వ ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటరిగీలో ఇతనికి ఐపీఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు నగరం సి.క్యాంపు సెంటర్లో ప్రభుత్వ క్వార్టర్లో నివాసముంటున్న డాక్టర్ జీవీ రాంగోపాల్ కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన భార్య పీసీ రంగమ్మ ప్రస్తుతం ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించారు. కన్నవారి ఆశయాల మేరకు పెద్ద కుమారుడు జీవీ ప్రమోద్ చక్రవర్తి ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ప్రస్తుతం ఎంఏ ఇంగ్లీష్ చదువుతున్నాడు. కుమార్తె జీవీ సౌజన్య ఏజీ ఎంఎస్సీ పూర్తి చేశారు. చిన్నకుమారుడు సందీప్ చక్రవర్తి ప్రస్తుతం సివిల్స్‌లో 786వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు మార్గం సుగమం చేసుకున్నాడు. పాఠశాల నుంచే ప్రతిభ చాటిన సందీప్ చక్రవర్తి గజ్జల వెంకట సందీప్ చక్రవర్తి స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు అభ్యసించాడు. 2003లో ఎస్ఎస్సీ ఫలితాల్లో 555 మార్కులు సాధించి ఆ యేడాది రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిభ అవార్డు కైవసం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ బైపీసీలో చేరి 940 మార్కులు సాధించాడు. అదే సంవత్సరం ఎంసెట్‌లో మెడికల్ విభాగంలో 1600 ర్యాంకుతో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్(2005 బ్యాచ్) సీటు దక్కించుకున్నాడు. డాక్టర్‌గా కేవలం కొద్ది మందికే సేవ చేయగలుగుతావని, సివిల్స్ సాధిస్తే నీ సేవలను విస్తృతం చేయవచ్చని కుమారునికి తండ్రి సూచించాడు. దీంతో సందీప్ చక్రవర్తి తండ్రి కోరికను నెరవేర్చేందుకు హౌస్‌సర్జన్ దశ నుంచే కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లి సివిల్స్‌కు కోచింగ్ తీసుకున్నాడు. గత యేడాది ఇంటర్వ్యూ దాకా వెళ్లి 20 మార్కుల తేడాతో విఫలమయ్యాడు. అయినా మొక్కవోని పట్టుదలతో చదివి ప్రస్తుతం ఎస్సీ కేటగిరిలో 786వ ర్యాంకు సాధించాడు. అమ్మా నాన్నల ప్రోత్సాహంతోనే.. పాఠశాల విద్య నుంచే అమ్మా నాన్నలు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వైద్య విద్యను చదువుతున్నప్పుడు నాన్న సివిల్స్‌పై దృష్టి పెట్టాలని చెప్పారు. ఆయన సూచన మేరకు అహర్నిశలు కష్టపడ్డాను. హైదరాబాద్‌లో ఓ రూంలో ఉంటూ ప్రతి రోజూ 10 నుంచి 12 గంటల పాటు చదివాను. రోజూ నాలుగు ఇంగ్లిష్ పేపర్లతో పాటు తెలుగు పేపర్లనూ పూర్తిగా చదివే వాన్ని. మొదటిసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఫెయిలైన తర్వాత నాలో ఇంకా కసి పెరిగింది. మొదటిసారి లోపం ఎక్కడుందో తెలుసుకుని రెండోసారి మరింత పట్టుదలతో కష్టపడి ఫలితం సాధించాను. ఈ విజయం పూర్తిగా నా కుటుంబ సభ్యులకే అంకితం.