యూపీఎస్సీ సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన ఉమాహారతి తల్లిదండ్రులు
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు.
ఉమా హారతి
జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది.
చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది.
పవన్ దత్త (తిరుపతి)
ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల)
ర్యాంకర్ల వివరాలు:
హెచ్ఎస్ భావన -55
అరుణవ్ మిశ్రా-56
సాయి ప్రణవ్-60
నిధి పాయ్- 110
రుహాని- 159
మహేశ్‌కుమార్- 200
రావుల జయసింహారెడ్ది- 217
అంకుర్ కుమార్-257
బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270
చల్లా కల్యాణి- 285
పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292
గ్రంధె సాయికృష్ణ-293
హర్షిత-315
వీరంగంధం లక్ష్మీ సుజిత-311
ఎన్.చేతనారెడ్డి-346
శృతి యారగట్టి- 362
సోనియా కటారియా -376
యప్పలపల్లి సుష్మిత-384
రేవయ్య-410
సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426
బొల్లిపల్లి వినూత్న- 462
కమల్ చౌదరి -656
రెడ్డి భార్గవ్-772
నాగుల కృపాకర్ 866
Comments
Please login to add a commentAdd a comment