UPSC Civils Exam
-
లక్ష్య సాధకులు.. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన అన్నదమ్ములు!
వరంగల్: ఆ అన్నదమ్ములు.. ఉన్నత ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నారు. దీనికి ఓ లక్ష్యం విధించుకున్నారు. ఈ మార్గంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తట్టుకుని ప్రణాళిక ప్రకారం చదివి గమ్యం చేరుకున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ గిరిపుత్రులు. వారే నర్సంపేట పట్టణానికి చెందిన ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతుల కుమారులు సంతోశ్, ఆనంద్. ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాల్లో సంతోశ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్, ఆనంద్ కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఒక ఉద్యోగం సాధించడమే కష్టంగా మారిన ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం చేసూ్తనే మరో ఉద్యోగానికి అదీ జాతీయ స్థాయి ఉద్యోగాలకు సన్నద్ధమై సాధించడం గొప్ప విశేషం.విద్యాభ్యాసం..సంతోశ్, ఆనంద్ ఇద్దరూ ప్రాథమిక విద్యను నర్సంపేటలో పూర్తి చేశారు. సంతోశ్ పదో తరగతి హనుమకొండ, ఇంటర్ హైదరాబాద్, కర్ణాటక ఎన్ఐటీలో ఇంజనీరింగ్, జైపూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం అల్ట్రాటెక్ సిమెట్స్ (ఆదిత్య బిర్లా)లో ఇంజనీర్‌గా, కొంత కాలం పేటీఎం సంస్థలో, జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థలో రెండు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. ఒక పక్క ఉద్యోగం చేసూ్తనే.. మరోపక్క ఖాళీ సమయంలో పోటీ పరీక్షకు సన్నద్ధమై ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో ఇంజనీర్ కొలువు సాధించారు. ఆనంద్ పదో తరగతి బిట్స్ స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్, వరంగల్ ఎన్ఐటీలో ఎంబీఏ పూర్తి చేశారు. టీసీఎస్‌లో స్టాఫ్‌వేర్, ఆ తర్వాత చెన్నై పెట్రోలియం సంస్థలో హెచ్ఆర్ అధికారిగా పని చేసూ్తనే యూపీఎస్సీ ద్వారా కార్మిక శాఖలో ఉద్యోగం సాధించాడు.తల్లిదండ్రులు భద్రయ్య–అరుణతో ఆనంద్, సంతోశ్ (ఫైల్)ప్రణాళిక ప్రకారం చదివి.. లక్ష్యం చేరుకుని..ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడిన తమ బాబాయ్‌లు, తల్లిదండ్రులను సంతోశ్, ఆనంద్ ఆదర్శంగా తీసుకున్నారు. యూపీఎస్సీలో ఉన్నత ఉద్యోగం సాధించాలని లక్ష్యం విధించుకున్నారు. ఈ నేపథ్యంలో సంతోశ్ రెండు దఫాలు( గ్రూప్–ఏ) ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు వెళ్లారు. అయితే ఆ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మూడో ప్రయత్నంలో (గ్రూప్–బీ) గమ్యం చేరుకున్నాడు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌లో మైనింగ్ ఇంజనీర్ కొలువు సాధించాడు. ఇక ఆనంద్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కేంద్ర కార్మిక శాఖలో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఉద్యోగం సాధించారు. ఈ అన్నదమ్ములు సుమారు సంవత్సరం కాలం పుస్తకాలతో దోస్తీ పట్టారు. ఎప్పుడూ చదువు ధ్యాసే. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యం చేరుకున్నారు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.కుటుంబ నేపథ్యం..సంతోశ్, ఆనంద్ తల్లిదండ్రులు ఆంగోత్ భద్రయ్య–అరుణ దంపతులది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం భోజెర్వు గ్రామం జగ్గుతండా. భద్రయ్య తల్లిదండ్రులు ఆంగోత్ చీమా–మల్కమ్మ. ఈ దంపతులకు నలుగురు కుమారులు భద్రయ్య, తారాసింగ్, మోహన్, విజేందర్ ఉన్నారు. భద్రయ్య టీచర్‌గా, తారాసింగ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా, మోహన్ పిల్లల వైద్య నిపుణుడిగా, విజేందర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తమ తండ్రి తప్ప అందరూ డాక్టరేట్‌లుగా ఉన్న తమ బాబాయ్‌లను స్ఫూర్తిగా తీసుకున్న సంతోశ్, ఆనంద్.. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. ఉద్యోగ రీత్యా వీరి కుటుంబం నర్సంపేటలో స్థిరపడింది. సంతోశ్, ఆనంద్ తల్లి అరుణ వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్–1 అధికారి, తండ్రి భద్రయ్య చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.కాగా, ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. -
UPSC Result 2023: కోచింగ్ నచ్చలేదు.. ఇంటిలోనే.. ఇంటర్నెట్లో శోధిస్తూ..
నారాయణపేట/హుజూర్నగర్: ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు యూపీఎస్సీ రాసినా ర్యాంకు రాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఐదోసారి సైతం పట్టుదలతో ప్రయత్నించి ఏకంగా ఆలిండియా 3వ ర్యాంకు సాధించింది. ఆమెనే నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవిల కుమార్తె నూకల ఉమాహారతి. హైదరాబాద్‌లో 2010లో 9.8 జీపీఏతో టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించిన ఉమాహారతి... 2012లో ఇంటర్ ఎంపీసీలో 955 మార్కులు సాధించారు. ఆపై 2017లో ఐఐటీ హైదరాబాద్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లుది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందినవారు. యూపీఎస్సీ 2020లో నిర్వహించిన ఐఈఎస్‌లో ఆమె తమ్ముడు సాయి వికాస్ 12వ ర్యాంకు సాధించారు. రెండేళ్ల శిక్షణ అనంతరం సోమవారమే ముంబైలోని సీపీడబ్ల్యూడీలో ఐఈఎస్‌గా విధుల్లో చేరగా ఆ మర్నాడే అక్క ఉమాహారతి సివిల్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కానుండటం విశేషం. సివిల్స్‌లో ర్యాంకు సందర్భంగా ఉమాహారతితో ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూ ఆమె మాటల్లోనే.. గత సివిల్స్ పేపర్లూ చదివా... సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగం బదులు సివిల్స్‌వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఢిల్లీలోని వాజీరావు కోచింగ్ సెంటర్లో 2018–19లో శిక్షణ పొందినప్పటికీ అక్కడి కోచింగ్ నచ్చలేదు. ఇంటికొచ్చి ఆప్షనల్ సబ్జెక్టు అంథ్రోపాలజీతోపాటు కామన్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో స్టడీ మెటీరియల్ సెర్చ్ చేశా. గత సివిల్ పేపర్లనూ చదివా. దేశ, అంతర్జాతీయ ఆంశాలు, సంఘటనలపై నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదివేదాన్ని ఈ ఏడాదంతా నాన్న, అమ్మతో నారాయణపేటలో ఉండి చదివా. సివిల్స్ సాధించా. ఈసారి 2,500 ర్యాంకుల్లో ఏదో ఒకటి వస్తుందనుకున్నా. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. విఫలమైనా తమ్ముడు వెన్నుతట్టాడు... ఐపీఎస్ అధికారి అయిన మా నాన్న వెంకటేశ్వర్లు నుంచే స్ఫూర్తి పొందా. తమ్ముడు సాయి వికాస్‌ను ఆదర్శంగా తీసుకున్నా. గత ప్రయత్నాల్లో నాలుగుసార్లు విఫలమైనా బాధపడొద్దని తమ్ముడు అండగా నిలిచాడు. స్నేహితులు నిఖిల్, అంకితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. -
సివిల్స్ గురుగా మహేశ్ భగవత్ మార్కు.. ఆలిండియా టాపర్లుగా 125 నుంచి 150 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్ ‘సివిల్స్ గురూ’గా మరోసారి తన మార్కు చాటారు. సివిల్స్–2022 తుది ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ఆయన వద్దే ఇంటర్వ్యూ శిక్షణ పొందారు. తన వద్ద ఇంటర్వ్యూ శిక్షణ పొందిన వారిలో ఆల్ ఇండియా టాపర్లుగా దాదాపు 125 నుంచి 150 మంది నిలిచారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేశ్ భగవత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆలిండియా టాపర్, యూపీ యువతి ఇషితా కిశోర్‌కు తాను మెంటార్‌గా ఉండటం సంతృప్తినిచ్చిందన్నారు. తనతోపాటు మరికొందరు గత పదేళ్లుగా సివిల్స్ అభ్యర్థులకు మెంటార్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది టాప్–100 ర్యాంకుల్లో 14వ ర్యాంకర్ కృతికా గోయల్, 22వ ర్యాంకర్, తిరుపతివాసి పవన్ దత్తా, 25వ ర్యాంకర్ కశ్మిరా సంకే, 27వ ర్యాంకు సాధించిన యాదవ్ సూర్యభాన్, 35వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన అజ్మీర సంకేత్ కుమార్, 38వ ర్యాంకర్ అనూప్‌దాస్, 54వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన రిచా కులకర్ణి, 74వ ర్యాంకర్ ఐషి జైన్, 76వ ర్యాంకు సాధించిన దబోల్కర్ వసంత్, 78వ ర్యాంకర్, తెలంగాణకు చెందిన ఉత్కర్ష కుమార్‌లు తన వద్ద ఇంటర్వ్యూ పొందినవారేనని మహేశ్ భగవత్ తెలిపారు. గత ఐదు నెలలుగా తాను ఇంటర్వూలకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. విజేతలు గర్వం పెరగకుండా చూసుకోవాలని, ర్యాంకులు రాని వారు నిరుత్సాహపడకుండా మరోసారి ప్రయత్నించాలని ఆయన సూచించారు. -
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల
ఢిల్లీ: సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది UPSC. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. జనరల్ కేటగిరీ కింద 345 మందిని, ఆర్థికంగా వెనకబడిన వర్గాల నుంచి 99 మందిని, OBC కేటగిరీ కింద 263 మందిని, SC కేటగిరీ కింద 154 మందిని, ST వర్గం నుంచి 72 మందిని ఎంపిక చేసింది. ఫలితాల్లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలవగా.. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇషితా కిషోర్ సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి IAS/IPS వంటి అత్యున్నత సర్వీసులలో అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపించినట్లు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తోట శరత్ చంద్ర తెలిపారు. తమ అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి దాదాపు 45 మంది అభ్యర్థులు ఈ ఏడాది ర్యాంకులు సాధించారని ఇందులో చాలామందికి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వంటి మెరుగైన సర్వీసులు వస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అత్యున్నత సర్వీసులకు ఎంపికవడం పట్ల శరత్ చంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ర్యాంకర్ల వివరాలు : పవన్ దత్త All India Rank 22 హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 గత ఏడాది కంటే.. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఖాళీల సంఖ్య పెరిగింది. 1011 ఖాళీలకు యూపీఎస్సీ.. సివిల్స్ పరీక్ష నిర్వహించింది. జనవరి 30వ తేదీ నుంచి మే 18 వరకు ఇంటర్వ్యూలు జరగగా, మూడు ఫేజ్‌ల వారీగా 2529 అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. సివిల్స్-2022లో 11లక్షల పై చిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు ఎప్పుడంటే..?
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఇంటర్వ్యూలు ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలను మే 22వ తేదీలోపు ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి యూపీఎస్సీ 861 సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేయగా, ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫైనల్ ఫలితాలు విడుదలైన తర్వాత టాప్ ర్యాంకర్ల ఇంటర్వ్యూలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
సివిల్స్ క్లియర్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
యూపీఎస్సీ(UPSC).. షార్ట్‌కట్‌లో సివిల్స్ ఎగ్జామ్. దేశంలో అత్యంత కఠిన పరీక్షగా సివిల్స్ ఎగ్జామ్‌కు పేరు ఉంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా యమా క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్న సరే సివిల్స్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్ రూపంలో ఉండడంతో యువత అడుగులు సివిల్స్ వైపే ఉంటాయి. ప్రతీ ఏటా లక్షల మంది సివిల్స్ రాస్తున్నప్పటికి క్లియర్ చేసే వారి సంఖ్య వందల్లో మాత్రమే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్‌ను ఒక టీమిండియా క్రికెటర్ క్లియర్ చేశాడన్న సంగతి మీకు తెలుసా. ఆటల్లో ఎక్కువగా ఆసక్తి కనబరిస్తే చదువులో వెనుకబడిపోతారనేది సహజంగా అందరూ అంటుంటారు. కానీ అది తప్పని.. ఆటతో సమానంగా చదువులోనూ రాణించగలనని ఒక టీమిండియా క్రికెటర్ నిరూపించాడు. అతనెవరో కాదు.. మాజీ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఖురేషియా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టకముందే సివిల్స్ క్లియర్ చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అమే ఖురేషియా. 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అమే ఖురేషియా చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. క్రికెటర్‌గా మారకపోయుంటే కచ్చితంగా ఐఏఎస్ అవ్వడానికి ప్రయత్నించేవాడినని ఖురేషియా పలు సందర్భాల్లో పేర్కొనేవాడు. అయితే చదువును ఎప్పడు నిర్లక్ష్యం చేయని ఖురేషియా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతూనే మధ్యప్రదేశ్ నుంచి సివిల్స్ ఎగ్జామ్‌ను క్లియర్ చేశాడు. అయితే అతను సివిల్స్ క్లియర్ చేసిన కొన్ని రోజులకే జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. దేశం కోసం ఆడాలన్న కల నిజం కావడంతో అమే ఖురేషియా చాలా సంతోషపడిపోయాడు. అలా 1999లో పెప్సీ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ఖురేషియా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో(45 బంతుల్లో 57 పరుగులు) రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేయడంలో విఫలమైన ఖురేషియా మెల్లగా కనుమరుగయ్యాడు. అయితే అప్పటికే సివిల్స్ క్లియర్ చేయడంతో ఆటకు దూరమైన తన రెండో కల(సివిల్స్)తో దేశానికి సేవ చేస్తున్నాడు అమే ఖురేషియా. ఓవరాల్‌గా టీమిండియా తరపున 12 వన్డేలాడిన ఖురేషియా 149 పరుగులు చేశాడు. ఇక ఖురేషియా తన చివరి మ్యాచ్‌ను కూడా శ్రీలంకపైనే ఆడాడు. ఇక మధ్యప్రదేశ్ తరపున 119 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన ఖురేషియా 7వేలకు పైగా పరుగులు చేశాడు. 22 ఏప్రిల్ 2007న ఫస్ల్‌క్లాస్ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి? -
చరిత మీది... భవిత మీది..!
‘లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్న కవి వాక్కు ఫలిస్తోంది. క్రాంతదర్శిగా అరవై ఏళ్ళ క్రితం కవి చెప్పినమాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన 2021వ సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులనూ కైవసం చేసుకొని, అమ్మాయిలు తమ సత్తా చాటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శ్రుతీ శర్మ, కోల్‌కతా వనిత అంకిత, చండీగఢ్ అమ్మాయి గామిని తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోమవారం నాటి ఈ స్ఫూర్తిదాయక ఫలితాలు మారుతున్న పరిస్థితులకు అద్దం. గతంలోనూ అనేకసార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఆడపిల్లలు అగ్రస్థానంలో నిలిచారు. గణాంకాలు చూస్తే, గడచిన పదేళ్ళలో ఇప్పటికి అయిదుసార్లు అమ్మాయిలే ఫస్ట్ ర్యాంకర్లు. మునుపు 2015 నుంచి 2017 దాకా వరుసగా మూడేళ్ళూ టాప్ ర్యాంకర్లు అమ్మాయిలే. 2018లో సైతం యూపీఎస్సీ పరీక్షల్లో విజేతలైన టాప్ 25లో 8 మంది ఆడవాళ్ళే అన్నది చరిత్ర. కానీ, మొదటి మూడు స్థానాలనూ ఆడపిల్లలే ఒంటిచేతితో సాధించడమనేది గడచిన ఏడేళ్ళలో ఇదే తొలిసారి. 2014 సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ అమ్మాయిలే సాధించారు. ఆ తర్వాత అలాంటి ఫలితాలు రావడం మళ్ళీ ఇప్పుడే! ఈసారి మొత్తం 5 లక్షల మంది ప్రిలిమ్స్‌కు హాజరవగా, చివరి వరకు వడపోతల్లో నిలిచి సివిల్స్ పాసైంది 685 మంది. వారిలో 177 మంది ఆడపిల్లలే! అంటే దాదాపు 25.8 శాతం మంది అమ్మాయిలే! దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన పరీక్షగా పేరున్న సివిల్స్ పాసైనవారిలో నాలుగో వంతు మంది అమ్మాయిలే కావడం విశేషం. అందులోనూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వనితలు కష్టపడి చదువుకుంటూ, పట్టుదలతో, పరిశ్రమించి ర్యాంకులు సాధిస్తుండడం కచ్చితంగా మరీ విశేషం. గమ్మత్తేమిటంటే, ఈసారి మొదటి రెండు ర్యాంకుల విజేతలూ ఒకే కాలేజీ (ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్)లో చదువుకున్నవారే! ఫస్ట్ ర్యాంక్ సాధించిన శ్రుతీ శర్మ ‘జామియా మిలియా ఇస్లామియా’కు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడెమీలో శిక్షణ పొందడం విశేషం. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, స్త్రీలకు ఉచిత శిక్షణనిచ్చే ఈ అకాడెమీపై రెండేళ్ళ క్రితం 2020లో వివాదం చెలరేగింది. సివిల్ సర్వీసుల్లో ముస్లిమ్‌లకు వీలైనంత ఎక్కువగా ప్రవేశం లభించేలా ‘యూపీఎస్సీ జిహాద్’ నడుస్తోందనీ, అందుకు ఈ అకాడెమీ కేంద్రబిందువనీ అప్పట్లో ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. కానీ, రెండేళ్ళుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతూ, ఇప్పుడీ రెండో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచిన శ్రుతీశర్మ ఈ అగ్రస్థానానికి కారణం జామియాలో శిక్షణే అన్నారు. గడచిన పదేళ్ళలో జామియా 500 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణనివ్వగా, 266 పైచిలుకు మంది సివిల్స్‌కు ఎంపికవడం విశేషం. ఈసారి కూడా ఎంపికైనవారిలో 23 మంది అక్కడ శిక్షణ పొందినవారే! ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తరువాత ఇంటర్వ్యూ – ఇలా మూడు విడతలుగా సాగే కఠినమైన వడ పోతలో ఆడపిల్లలు అగ్రభాగంలోకి దూసుకురావడం ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. దీని వెనుక తరతరాల పోరాటం ఉంది. ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే శిశువును చంపే భయానక భ్రూణ హత్యల రోజుల నుంచి నేటి ‘బేటీ బచావో... బేటీ పఢావో’ నినాదాల దాకా సుదీర్ఘ పయనం ఉంది. పితృస్వామ్య, పురుషాహంకార సమాజంలో సైతం శతాంశమైనా మార్పు సాధించడం వెనుక ఎంతోమంది కృషీ ఉంది. ఆడవారిని ఒంటింటి కుందేళ్ళుగా భావించే సమాజంలో – విద్య, ఉద్యోగ అవకాశాల్లో అమ్మాయిలకు మెరుగైన భాగస్వామ్యం కల్పించడానికి ఏళ్ళ తరబడి అనేక ప్రభుత్వాలిస్తున్న చేయూతా ఉంది. అవన్నీ ఇప్పుడు ఫలిస్తున్నాయి. తాజా విజయాలన్నీ సమాజంలోని లింగ దుర్విచక్షణను రూపుమాపే సుదీర్ఘ క్రమంలో సోపానాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! నిజానికి, భారత రాజ్యాంగంలోని 14 నుంచి 16వ అధికరణం దాకా అన్నీ స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రవచించినవే. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళవుతున్నా ఇప్పటికీ సమానత్వం, స్వేచ్ఛ కోసం స్త్రీలు వివిధ స్థాయుల్లో పోరాటాలు చేయాల్సి వస్తూనే ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకూ, 1020 మంది స్త్రీలున్నారని తాజా లెక్కలు చెబుతున్న దేశంలో లైంగిక సమానత్వం ఇంకా మాటల్లోనే ఉంది. అధికారుల సంఖ్యలో సరే, అధికారంలో స్త్రీల వాటా మాటేమిటి? ప్రపంచ లైంగిక అంతరాల సూచికలో 153 దేశాల్లో మనమెక్కడో 140వ ర్యాంకులో ఉన్నాం. మహిళా శ్రామికశక్తి మునుపటి కన్నా తగ్గుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ నిరాశల మధ్య కూడా కుటుంబ సభ్యుల అండ ఉంటే, అన్ని రంగాల్లో స్త్రీల పురోగమనం సాధ్యమే. చదివించే విషయంలో ఆడా, మగా ఒకటేననే మార్పు దక్షిణాది మధ్యతరగతిలో కనిపి స్తోందని ఓ విశ్లేషణ. కానీ దిగువ తరగతిలో, ఉత్తరాదిలో ఆ చైతన్యం తగినంత రాలేదన్నదీ నిజమే! నిదానంగానైనా ఐఏఎస్ లాంటి సర్వీసుల్లోనే కాదు... విద్యుత్ స్తంభాలను ఎక్కే లైన్ ఉమన్లుగా, రైలింజన్లను నడిపే డ్రైవర్లుగానూ నేడు మహిళలు కనిపిస్తున్నారు. కానీ, ఇది సరిపోదు. చదువులు, ఉద్యోగాలు, అవకాశాలు అన్నింటిలోనూ ఆడవారి పట్ల దుర్విచక్షణ మరింత తగ్గాలి. ఆ మార్పు వస్తే అబ్బాయిలకు ఏ విధంగానూ తీసిపోమని నిరూపించడానికి నవతరం అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఓ నిదర్శనమే తాజా సివిల్స్ ఫలితాలు. ఇదే ధోరణి కొనసాగితే, భవిష్యత్తు ఆడవారిదే అంటున్న అంచనా వాస్తవరూపం ధరించడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్‌వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్‌పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్‌లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
సివిల్స్‌లో తెలుగు మెరుపులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్–2021 తుది ఫలితాలను సోమవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి సివిల్స్‌కు హాజరైనవారే ఉన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా టాప్–100 ర్యాంకర్లలో 11 మంది ఇక్కడి వారే నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కొందరు అభ్యర్థులు కూడా రాష్ట్రం తరఫున ఎంపికైనవారి జాబితాలో ఉన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువగా.. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని.. ఇక్కడి నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరైనవారు కూడా పెద్ద సంఖ్యలోనే ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సా«ధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులూ మంచి ర్యాంకులు సాధించారు. వ్యవసాయం చేసేవారు, హౌజ్ కీపింగ్ వంటి చిన్న ఉద్యోగం చేసే వారి పిల్లలకు ఉత్తమ ర్యాంకులు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ర్యాంకర్ల మనోగతం అసలు ఊహించలేదు.. సివిల్స్‌లో ఇంటర్వ్యూ పూర్తయ్యాక మంచి ర్యాంక్ వస్తుందనుకున్నా.. కానీ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు.’’అని సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగోట్లపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్ తండ్రి పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి, కర్నూలులో సీటీవోగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2020 సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దానికి శిక్షణ తీసుకుంటూనే.. మరోసారి సివిల్స్ రాసి 15వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు కదిలించాయి హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన వి.సంజన సింహ సివిల్స్ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్‌లో 207వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికైన ఆమె.. ఆదాయపన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాశారు. అఫీషియల్ ట్రిప్‌లో భాగంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె.. ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ‘‘దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు టాప్–5లో ఉండటం కదిలించింది. ఐఏఎస్ అధికారిగా రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటా’’ అని చెప్పారు. రెండేళ్లు పాపకు దూరంగా ఉండి.. ‘‘ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్ కోసం సిద్ధమయ్యాను. అప్పటికే ఉద్యోగం ఉండి, స్థిరపడ్డ జీవితంలో.. చిన్న పాపకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఏమిటన్న ప్రశ్నలు అనేక మంది నుంచి ఎదురయ్యాయి. ఎంతో బాధ అనిపించింది. కానీ నా భర్త ఎంతగానో ప్రోత్సహించారు’’ అని సివిల్స్ 56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి చెప్పారు. ఆమె భర్త విజయ్‌కుమార్ చౌహాన్ హైదరాబాద్‌లో సీటీఓగా పనిచేస్తున్నారు. 2019లో సివిల్స్ 613వ ర్యాంకు రాగా డానిక్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా చేరిన ఆమె.. మరోసారి సివిల్స్ రాసి 56వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ కావాలని ఉంది ‘‘నాకు ఐపీఎస్ కావాలని కోరిక. ర్యాంకును బట్టి ఐఏఎస్ వచ్చినా స్వీకరిస్తా. అటు ఉద్యోగం చేస్తూనే.. రోజూ ఎనిమిది గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేరై మంచి ర్యాంకు సాధించా’’ అని 161వ ర్యాంకర్ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన ఆమె తండ్రి సంజీవరెడ్డి వరంగల్ జిల్లా సహకార అధికారిగా, తల్లి వినోద సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన చైతన్య.. 2016లో రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ఏఈగా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే ఆరోసారి సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. మంచి పోస్టింగ్ కోసం పట్టుదలతో.. ‘‘2017 నుంచి వరుసగా సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2019లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గుజరాత్‌లోని వదోదరలో శిక్షణలో ఉన్నాను. మంచి పోస్టింగ్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ ప్రిపేర్ అయి 488 ర్యాంక్ సాధించాను. ఈ దిశగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు’’ అని నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. స్వీపర్ బిడ్డ కాబోయే కలెక్టర్ తండ్రి ఐలయ్య వ్యవసాయకూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు సరిగా గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలగా చదివి సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించాడు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్. ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజీలోనే చదివిన నరేశ్ మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. చెన్నైలోనే మూడేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి.. తర్వాత సివిల్స్‌కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. 2019లో 782వ ర్యాంకుతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. గుజరాత్‌లోని వదోదరాలో ట్రైనింగ్ పొందుతూ.. మళ్లీ సివిల్స్ రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. నరేశ్ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడంతో సంబురంలో మునిగిన తండ్రి ఐలయ్య.. కుమారుడిని తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఎక్కించుకొని కాలనీ అంతా తిరుగుతూ తన కుమారుడు ఐఏఎస్ సాధించాడంటూ మురిసిపోయాడు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. మాది నిజామాబాద్ జిల్లా. నిర్దేశించుకున్న లక్ష్యంపై పట్టువదలకుండా కృషి చేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించా. అమ్మ పద్మ కామారెడ్డి కలెక్టరేట్లో పేఅండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమె ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తా.. – అరుగుల స్నేహ, 136వ ర్యాంకర్ తల్లిదండ్రుల స్ఫూర్తితో.. మాది జగిత్యాల బీర్పూర్ మండలం చర్లపల్లి. తండ్రి బాషానాయక్ వ్యవసాయం చేస్తూ.. కష్టపడి నన్ను చదివించారు. తల్లి యమున మినీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో కçష్టపడి చదివాను. – గుగ్లావత్ శరత్‌నాయక్, 374వ ర్యాంకు ప్రణాళిక బద్ధంగా చదివి.. నేను బీటెక్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో ప్రణాళికాబద్ధంగా చదివి.. నాలుగో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. – ఉప్పులూరి చైతన్య, 470వ ర్యాంకర్ పరిశోధనలు కావాలి దేశానికి శాస్త్రవేత్తలు కూడా అవసరం. చాలా మంది సివిల్స్, ఇతర ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తాను. – గడ్డం సుధీర్‌కుమార్, 69వ ర్యాంకర్ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. ‘‘పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. మా ఇంట్లో అందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో నేను సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించాను. – అనన్యప్రియ, 544వ ర్యాంకర్, హైదరాబాద్ ఎంతో సంతోషంగా ఉంది.. ఐఏఎస్ లక్ష్యంగా గట్టిగా కృషి చేశా. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశముంది. ఏదొచ్చినా పేద ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఐపీఎస్ వస్తే నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ర్యాంకు సాధించా. – ముత్యపు పవిత్ర, 608 ర్యాంకర్ -
సివిల్స్ విజేతలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కుమార్‌రెడ్డితో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శ్రుతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కె.కిరణ్మయి, పాణి గ్రాహికార్తీక్, జి.సుధీర్ కుమార్‌రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం జగన్ అభినందించారు. చదవండి: జగనన్న మూడేళ్ల పాలన: పేదలకు ‘చేయూత’.. సంక్షేమ ‘బావుటా’ సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ బోర్డు 685 మందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. -
యూపీఎస్సీ సివిల్స్ 2021 ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్స్ సర్వీసెస్-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. 2021 సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్, మూడో ర్యాంకర్ గామిని సింగ్లా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్ రెడ్డికి 15వ ర్యాంక్ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్, రవికుమార్‌కు 38వ ర్యాంక్, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్, శైలజ 83వ ర్యాంక్, శివానందం 87వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్, గడిగె వినయ్‌కుమార్ 151 ర్యాంక్, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్, దొంతుల జీనత్ చంద్రకు 201వ ర్యాంక్, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్ దక్కాయి. పూర్తి ఫలితాల కోసం క్లిక్ చేయండి -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్‌బాబు చెప్పారు. టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్‌పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
1993లో ఇంటర్వ్యూలో ఫెయిల్.. నాలాగా ఇబ్బంది పడొద్దనే..
సాక్షి, హైదరాబాద్: వృత్తిరీత్యా ఆయన పోలీస్ కమిషనర్. నిత్యం పనులతో బిజీనే. అయినా సమయం చిక్కించుకుని.. సివిల్స్ రాసే అభ్యర్థులకు శిక్షణ.. గైడెన్స్‌తో అండగా నిలుస్తున్నారు. ఇలా ఇప్పటివరకు వెయ్యికి పైగా అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. తాజాగా 2020 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మొదటి 20 ర్యాంకుల్లో ఆరు మంది (3, 8, 14, 18, 19, 20), వంద ర్యాంక్స్లో 19 మందికి ఈయనే మెంటార్షిప్ వహించారు. ఆయనే రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.భగవత్. మంగళవారం తెలంగాణ టాపర్ పీ శ్రీజ (20వ ర్యాంక్), కనక్నాల రాహుల్ (218వ ర్యాంక్), పీ గౌతమి (317వ ర్యాంక్)లు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... చదవండి: సివిల్స్ టాప్ 20 ర్యాంక్: ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా ► 1993లో యూపీఎస్సీ మెయిన్స్‌లో పాసయ్యా. కానీ సరైన గైడెన్స్ లేకపోవటంతో ఇంటర్వ్యూలో ఫెయిలయ్యా. లోలోపల ఏదో తెలియని భయం. మానసికంగా కృంగదీసింది. స్థానికంగా ఉన్న సీనియర్ ఆఫీసర్ల మార్గనిర్దేశంతో రెండో ప్రయత్నంలో 1994లో విజయం సాధించా. సివిల్స్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేందుకు నాకు ఎదురైన ఇబ్బందులు నేటి యువతకు ఎదురుకావొద్దనే ఉద్దేశంతో 2014 నుంచి శిక్షణ ఇవ్వటం ప్రారంభించా. చదవండి: సివిల్స్‌లో తెలుగువారి సత్తా ► హోదా వచ్చాక ఎవరైనా గౌరవిస్తారు. సాయం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గనిర్ధేశం చేసేవాళ్లే చాలా అవసరం. సివిల్స్‌లో ప్రతి ఒక్క మార్కు కూడా కీలకమే. దేశంలో ఏటా 10 లక్షల మంది పోటీపడితే ఉత్తీర్ణలయ్యేది 800 మంది లోపే ఉంటుంది. టాప్ 10 ర్యాంకర్ల మధ్య ఒక్క మార్కు తేడానే ఉంటుంది. మౌఖిక పరీక్షే ముఖ్యం ► సివిల్స్‌లో 275 మార్కులతో ఉండే మౌఖిక పరీక్ష చాలా కీలకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. లేకపోతే విజయం సాధించలేం. అందుకే ఇంటర్వ్యూకు ప్రిపేర్ చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించా. అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం, మనోధైర్యాన్ని నింపేందుకు మెయిన్స్ పూర్తవగానే 3 నుంచి 4 నెలల పాటు ఉచితంగా ఇంటర్వ్యూపై కోచింగ్ ఇస్తున్నాం. మరికొందరి సాయం.. భద్రాద్రి–కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఆర్ఎస్లు (ఏపీ) సాధు నరసింహా రెడ్డి, నితేష్ పాథోడ్, ముకుల్ కులకర్ణి, ఐఆర్ఎస్ రిటైర్డ్ రాజీవ్ రణాదే, ఐఏఎస్‌లు నీల్కాంత్ అవద్, ఆనంద్ పాటిల్, డాక్టర్ శ్రీకర్ పరదేశి, అభిషేక్ సరాఫ్, ఎంయూఏడీ జాయింట్ కమిషనర్ సమీర్ ఉన్హాలే, ఐసీఏఎస్ సుప్రియ దేవస్థలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ శైలేంద్ర డియోలాంకర్, జేపీసీ డైరెక్టర్ డాక్టర్ వివేక్ కులకరి్ణలు కూడా నాతోపాటు సివిల్స్ అభ్యర్థులకు సహకరిస్తున్నారు. రెండు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా, జూమ్, వీడియో కాల్స్ ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకు భౌతికంగా శిక్షణ ఇస్తున్నాం. ఫారెస్ట్ సర్వీసెస్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల పరీక్షలకు కూడా ట్రెయినింగ్ ఉంటుంది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బీహార్, అసోం, ఒడిశా, జమ్మూ అండ్ కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన సివిల్స్ అభ్యర్థులు మా వద్ద శిక్షణ పొందుతున్నారు. నా వద్ద శిక్షణ పొందిన సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (హైదరాబాద్ మాజీ సీపీ ఏకే ఖాన్ కుమారుడు), భైంసా ఏఎస్పీ కిరణ్ ఖరేలు ప్రస్తుతం మన రాష్ట్రంలో విధుల్లో ఉన్నారు. https://t.co/zb1mcIV0OA — Rachakonda Police (@RachakondaCop) September 28, 2021 -
ఆక్సిజన్ సిలిండర్‌తోనే సివిల్స్: రియల్ ఫైటర్ మూగబోయింది!
తిరువనంతపురం: కేరళలో ఆక్సిజన్ సిలిండర్‌తో 2019లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసిన లతీషా అన్సారీ మృతి చెందారు. కాగా జూన్ 16 ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అరుదైన జన్యు పర వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించడంతో పాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఒక పక్క తీవ్రమైన వ్యాధి బాధిస్తున్నా..లెక్క చేయకుండా సివిల్స్ పరీక్షను రాసి, వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ధైర్యం మూగబోయింది. అమృతావర్షిణి అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మృతిపై అమృత వర్షిణి ఫౌండర్ లతా నాయర్ రియల్ ఫైటర్ అంటూ నివాళులర్పించారు., కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(27) పుట్టినప్పటి నుంచి టైప్–2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. వీటితో పాటు పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినాసివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరు కావడం విశేషంగా నిలిచింది. లతీషాకు ఇతర ఆసక్తులు కూడా ఉన్నాయి. అందులో కీబోర్డ్ ప్లే చేయడం. టెలివిజన్‌లో సంగీత ప్రదర్శనతో పాటుగా ఆమె యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహించేది. లతీషా కొన్ని నెలలు తాత్కాలికంగా ఒక బ్యాంకులో పనిచేసింది, కానీ ఆమె పల్మనరీ హైపర్‌టెన్షన్‌ను తీవ్రతరం కావడంతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వైకల్యం ఉన్న పిల్లల కోసం ఆమె ఇంటి నుంచే ఆమె ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్పేది. చదవండి: Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్: సీరం కీలక ప్రకటన -
సివిల్స్ అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు
న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తి, వరదల కారణంగా దేశవ్యాప్తంగా చాలామంది అభ్యర్థులు సివిల్ సర్వీస్ పరీక్షకు(సీఎస్ఈ) హాజరు కాలేకపోయారు. వీరిలో చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) అభ్యర్థులు కూడా ఉన్నారు. వీరికి కేంద్రం తీపి కబురు చెప్పింది. వీరికి 2021లో మరో అవకాశం ఇవ్వడానికి అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అవకాశం నిర్దేశిత వయసులోపు ఉన్నవారికే వర్తిస్తుంది. వయసు మీరిన ‘చివరి ప్రయత్నం’ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే. 2020లో పరీక్ష రాయలేకపోయిన వారు మరో అవకాశం కింద 2022లో రాసేందుకు మాత్రం వీల్లేదు. కరోనా వల్ల 2020లో సివిల్స్‌కు హాజరుకాలేకపోయిన అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది. చదవండి: శభాష్ పోలీస్: క్షణం ఆలస్యమైతే ఘోరం జరిగేది! సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్! -
'పురాణ సుంతారీ.. మీ పట్టుదలకు హ్యాట్సాఫ్'
మధురై : తమిళనాడుకు చెందిన పురాణా సుంతారీ(25) చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయింది. అయినప్పటికి బెదరకుండా సివిల్స్ సాధించాలన్న తన లక్ష్యం నెరవేర్చుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 2019 సివిల్స్ పరీక్ష తుది ఫలితాల్లో సుంతారీ 286వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. తన అద్భుత ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా పురాణా సుంతారీపై ప్రశంసలు కురిపించారు. ఆమె విజయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. 'పురాణ సుంతారీ... మీ కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్. ఆడియో స్టడీ మెటీరియల్‌తో పరీక్షలు రాయడం చాలా కష్టం. ఈ విషయంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. మీ కలలను సాకారం చేసుకోవడం ఇక మీదట కూడా ఎప్పుడూ ఆపొద్దు. మీలాంటి మహిళలు ఈ దేశానికి ఎంతో అవసరం.' అంటూ కైఫ్ చెప్పుకొచ్చాడు. 25yr old visually impaired Purana Sunthari from TN beat the odds and cracked the UPSC exam. Since audio study material was hard to find, her parents and friends helped her in reading & converting books to audio so she could become an IAS officer. Never stop chasing your dreams. pic.twitter.com/3icQ6nPJPo — Mohammad Kaif (@MohammadKaif) August 12, 2020 మధురైకి చెందిన పురాణా సుంతారీ తన ఐదేళ్ల వయసులో కంటి చూపు మందగించింది. ఒకటో తరగతికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో కష్టపడి చదివింది. ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అందుకు తగ్గట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించింది. మొదటి మూడుసార్లు సివిల్స్ లో విజయం సాధించలేకపోయింది. నాలుగోసారి 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది. -
సివిల్స్ పరీక్షలో సత్తా చాటిన సూర్యాపేట వాసి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ వర్మ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటారు. పినాన్ని కోటేశ్వరరావు, ప్రభావతిల రెండో కుమారుడైన ఆయన సివిల్ పరీక్షల్లో 244వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎన్నిక కానున్నారు. అయితే 2016లో అతను 732వ ర్యాంక్‌తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఐఆర్ఎస్కు సెలవు పెట్టి ఐఏఎస్ సాధించారు. ఇతని తండ్రి కోటేశ్వరరావు విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా(జేఏఓ)గా పని చేస్తున్నారు. తల్లి అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన తండ్రి చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. కోటేశ్వరరావు చిన్నతనంలో సోడా అమ్మి చదువుకొని పదవ తరగతిలో మంచి ర్యాంకు సాధించారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ బహుమతి ఇచ్చారు. (వాళ్ల తర్వాత ఆ క్రెడిట్ నాగబాబుకే) ఆయన కొడుకు సందీప్ వర్మ చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఖాన్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐనా మహేష్ భగవత్‌ను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో చదివేవారు. ఈ క్రమంలో మహేష్ భగవత్ అనేక సలహాలు ఇస్తూ, వెన్ను తట్టి నడిపించారని సందీప్ తెలిపారు. సందీప్ పేద ప్రజలకు సేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కోటేశ్వరరావు మొదటి కుమారుడు సంపత్ ఇప్పటికి రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లి సివిల్స్ సాధించలేకపోయారు. అయితే అక్టోబర్‌లో జరిగే సివిల్స్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల) -
ఆత్మవిశ్వాసంతో అందలం
చిలకలూరిపేట: పుట్టింది పేద కుటుంబం..తండ్రి సా«ధారణ ఫొటోగ్రాఫర్..ఎన్నో ఆర్థిక ఇబ్బందులు..ఎడ్యుకేషన్ లోన్‌పై ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కృషీ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఎందరో సామాన్య విద్యార్థులు యువకులకు ఆదర్శంగా నిలిచాడు చిలకలూరిపేట పట్టణానికి చెందిన చందోలు విజయనాగమణికంఠ. ఇటీవల యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 206 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. ఆదివారం ఒక అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆయన సాక్షితో అనుభవాలను పంచుకున్నారు. 2017లో ఇండియన్ ఫారెస్టు సర్వీసుకు ఎంపిక 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరై ప్రిలిమ్స్‌లో అవలీలగా విజయం సాధించాను. మేము సిద్ధమైన తీరుకు భిన్నంగా అప్పటి వరకు కొనసాగుతున్న ప్యాట్రన్‌ను మార్చడంతో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయా. దీంతో నిరాశ అలుముకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. సివిల్స్‌కు సిద్ధమైన అనుభవంతో ఎస్బీఐ పీవో, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, సెంట్రల్ పారామిలటరీ ఫోర్సు పరీక్షల్లో విజయం సాధించా. సెంట్రల్ పారా మిలటరీ ఫోర్సులో డీఎస్పీ కేడర్ ఉద్యోగం లభించినా, చదువుకునే అవకాశం ఉండదని సర్కిల్ ఇన్స్పెక్టర్ కేడర్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి శిక్షణలో చేరా. ఈ శిక్షణ కారణంగా 2014లో సివిల్స్‌కు హాజరు కాలేకపోయాను. 2015లో ప్రిలిమ్స్‌లో విజయం సాధించినా ఎఫ్ఆర్వో ఉద్యోగ శిక్షణ కారణంగా మెయిన్స్‌కు హాజరు కాలేదు. మూడో ప్రయత్నంగా 2017లో ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను. డెహ్రడూన్‌లో శిక్షణ పొందుతున్నాను. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్ శిక్షణకు ముందు కొంత సమయం ఖాళీ ఉండటంతో తిరిగి సివిల్స్ పరీక్ష రాసి 2018 ఏప్రిల్ 27న ప్రకటించిన ఫలితాల్లో నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. నాకు ఐపీఎస్, ఐఏఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తే చాలనుకున్నాను. ఏది సాధించినా ఎలా ప్రజలకు సేవ చేయాలి అనే విషయంలో పూర్తి స్పష్టత ఉంది. సివిల్స్‌కు మరో రెండు అవకాశాలు ఉన్నా ఐపీఎస్ పట్ల సంతృప్తి ఉండటంతో మరోసారి రాయదల్చుకోలేదు. ఐపీఎస్ అధికారిగా ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందించడమే లక్ష్యం. ఆత్మవిశ్వాసంతో మెలగాలి సాధారణ, నిరుపేద కుటుంబాలకు చెందినవారు తాము సివిల్స్‌లో విజయం సాధించలేమని నిరాశ పడుతుంటారు. ఆ భావన సరికాదు. ఎవరికైనా పట్టుదల, కృషి ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకున్నా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు మంగాచారి, శారదదేవితో పాటు నన్ను నిరంతరం ప్రోత్సహించి ఐఏఎస్ అకాడమీలో శిక్షణకు సహకరించిన చిలకలూరిపేట డీఆర్ఎన్ఎస్సీవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఆర్యవైశ్య విద్యానిధి సంఘ కన్వీనర్ పొట్టి శ్రీరాములుకు జీవితాంతం రుణపడి ఉంటాను. రైల్వే ఉద్యోగం చేస్తూనే సన్నద్ధం నాన్న మంగాచారి సాధారణ ఫోటోగ్రాఫర్. అమ్మ శారదాదేవి గృహిణి. అన్న మధుబాబు డిగ్రీ చదివి ఉద్యోగం లభించక పోవడంతో ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. ఇంటర్ వరకు ప్రకాశం జిల్లా మార్టూరులో చదువుకున్నాను. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్(కంప్యూటర్ సైన్సు) 2010లో పూర్తి చేశాను. ఎంటెక్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం లభించినా ఏడాది తర్వాత చేరమన్నారు. బీటెక్ చదివే రోజుల్లో కొందరు సీనియర్లు కళాశాల లైబ్రరీలోని ప్రత్యేక విభాగంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండేవాళ్లు. అప్పుడే నేనూ అవ్వాలన్న ఆకాంక్ష మొదలైంది. మనసులో సివిల్స్‌పై బలమైన కోరిక ఉన్నా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉండటం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా 2011లో రైల్వే మెయిల్ సర్వీసులో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగం లభించడంతో అందులో చేరాను. పోస్టింగ్ ఏలూరులో లభించింది. డ్యూటీ సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు తెల్లవారు 5 గంటల వరకు రోజుమార్చి రోజు ఉండేది. చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకున్నా రోజుమార్చి రోజు డ్యూటీ కావడంతో చదువుకునేందుకు సమయం దొరికేది. గ్రంథాలయమే తొలిగురువు ఏలూరులోని జిల్లా గ్రంథాలయానికి వెళ్లేవాణ్ని. అక్కడ పోటీ పరీక్షలకు ప్రిపేర్అయ్యే కొందరు నిరుద్యోగులు క్యారేజీలలో అన్నం కట్టుకొని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పుస్తకాలు, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లు చదువుతుండేవారు. వారిని చూసి నేను ఎక్కువ సమయం చదివేందుకు కేటాయించడం ప్రారంభించాను. అక్కడ ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నాను. నేను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. సివిల్స్ పరీక్షలు తెలుగులో రాసే అవకాశం ఉన్నా మెటీరియల్ లభ్యత ఇతర అవకాశాలు ఆంగ్లంలో ఎక్కువగా ఉండటంతో అందులోనే ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా రూంలో టీవీ కూడా లేకపోవడంతో చిన్న ట్రాన్సిస్టర్‌ను తెచ్చుకుని ఆల్ఇండియా రేడియోలో ఇంగ్లిష్ వార్తలు వినేవాణ్ని. అర్థం కాకపోయినా డిక్షనరీ తెచ్చుకుని పదేపదే ఇంగ్లిష్ మ్యాగజైన్లు చదివి ఆంగ్లంపై పట్టు సాధించా. 2012లో డాక్టర్ కొణిజేటి రోశయ్య ఐఏఎస్ అకాడమీలో చేరాను. వారు 10 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చారు. -
సివిల్స్.. ‘ఆంగ్లం’పై ఆందోళన!
టాప్ స్టోరీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2ను రద్దు చేయాలంటూ.. కొద్దిరోజులుగా సివిల్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తుండటంతో ప్రభుత్వం సోమవారం స్పందించింది. ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోబోమని ప్రకటించింది. అయితే అభ్యర్థులు సీశాట్‌ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు సీశాట్ వివాదం ఏమిటి? దీనిపట్ల అభ్యర్థుల్లో అంత వ్యతిరేకత ఎందుకు? సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేస్తూనే.. సమాజ సేవకు ధీటైన మార్గంగా నిలుస్తోంది.. సివిల్ సర్వీసెస్ పరీక్ష! ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టే సదవకాశాన్ని కల్పిస్తోంది. దీన్ని సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లో ‘ఇంగ్లిష్’ తమకు అందనీయకుండా చేస్తోందని సివిల్స్ ఔత్సాహి కులు ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల వారు ఆందోళన చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆప్టిట్యూడ్‌పై ఆందోళన సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.. ఇలా మూడు దశలుంటాయి. 2010 వరకు ప్రిలిమినరీ పరీక్ష విధానం కొఠారి కమిషన్ సిఫార్సులపై ఆధారపడి ఉండేది. గతంలో ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్(150 మార్కులు) పేపర్, ఒక ఆప్షనల్ పేపర్(300 మార్కులు) ఉండేవి. యూపీఎస్సీ ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ ఎస్కే ఖన్నా ఏక సభ్య కమిటీ సిఫార్సుల మేరకు 2011 నుంచి ప్రిలిమ్స్ స్థానంలో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్)ను ప్రవేశపెట్టారు. అభ్యర్థుల్లో ఎనలిటికల్, రీజనింగ్, ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. ఇందులో రెండు పేపర్లు ఒక్కోదానికి 200 మార్కులు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ వరకు ఫర్వాలేదుకానీ, రెండో పేపర్ మాత్రం ఇంగ్లిష్ బాగా వచ్చిన వారికి అనుకూలంగా ఉందని హిందీ రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల హిందీ, ప్రాంతీయ భాషల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటున్నారు. ‘సివిల్స్-2013 తుది ఫలితాలు గత జూన్‌లో విడుదలయ్యాయి. టాప్ 24 ర్యాంకర్లలో ఏ ఒక్కరూ భారతీయ భాషను ఎంపిక చేసుకోని వారే! హిందీ మాధ్యమం టాపర్‌కు 107 ర్యాంకు వచ్చింది. హిందీ మాధ్యమం అభ్యర్థుల సక్సెస్ రేటు ఇప్పుడు మూడు కంటే దిగువకు చేరుకుంది. సీశాట్ ప్రవేశపెట్టడానికి ముందు ఇది 15 శాతం ఉండేది. దీన్నిబట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు’’ అంటూ అభ్యర్థులు చెబుతున్నారు. ‘2008లో ఐఏఎస్‌లో చేరిన వారిలో ఇంజనీర్లు 30 శాతం మంది ఉంటే, హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు 30 శాతం ఉన్నారు. సీశాట్ ప్రవేశపెట్టిన తర్వాత ఐఏఎస్‌లో ప్రవేశించిన ఇంజరింగ్ గ్రాడ్యుయేట్లు 50 శాతానికి చేరగా.. హ్యుమానిటీస్ చదివినవారి వాటా 15 శాతానికి పడిపోయింది’ అంటూ తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ప్రతికూలం - ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి 8 ప్రశ్నలు (20 మార్కులు) ఉన్నాయి! దీనివల్ల ఇంగ్లిష్ బాగా వచ్చినవారు లాభపడుతున్నారు. తమకు నష్టం వాటిల్లుతోంది. - ప్రశ్నపత్రం (ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రశ్నలు మినహా మిగిలినవి) హిందీ అనువాదం ఇస్తున్నా, అది సరిగా ఉండటం లేదు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ ద్వారా అనువ దిస్తున్నారని, ఇది అభ్యర్థుల ను గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్; అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు అర్థం కావడం లేదు. ఈ విభాగాల్లోనూ ఇంగ్లిష్ అభ్యర్థులతోపాటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు లాభపడుతున్నారు. హ్యుమానిటీస్ నేపథ్యం ఉన్నవారు నష్టపోతున్నారు. - అందరికీ అవకాశాలుండేలా సివిల్స్ ప్రిలిమ్స్‌ను మార్చాలి. ‘ప్రస్తుత వివాదం మాట అటుంచి ప్రిలిమ్స్ పేపర్-2.. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నిరాశాజనకంగా ఉందనే వాదన మొదట్నుంచీ ఉంది’ అంటున్నారు సివిల్స్ శిక్షణలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బి.జె.బి.కృపాదానం. అనుకూలం ఉన్నతాధికారులుగా సమాజానికి సేవ చేయబోయే వ్యక్తులకు బుద్ధికుశలత, నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ సామర్థ్యం అవసరం. ‘క్లిష్ట పరిస్థితుల్లో అభ్యర్థి ఎంత త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలడన్నదాన్ని అంచనా వేసేందుకు సీశాట్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ తదితర విభాగాలకు చెందిన ప్రశ్నలూ ఈ కోవకు చెందుతాయి. ఇలా ఇవ్వడం సబబే. ఇవి ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటున్నాయన్నది నిజం కాదు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థి అకడమిక్ నేపథ్యం ప్రభావం ఉంటుందనుకోవడం లేదు’ అని కొందరు సబ్జెక్టు నిపుణులు, సివిల్స్ ఔత్సాహికులు చెబుతున్నారు. ఇందులోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంక్ పీవో, క్యాట్ తదితర పరీక్షలతో పోలిస్తే సీశాట్‌లో ఇస్తున్న ప్రశ్నలు మరీ అంత కష్టంగా లేవంటున్నారు. పార్లమెంటులోనూ సెగలు అభ్యర్థుల ఆందోళనతోపాటు ఎంపీలు కూడా గళమెత్తడంతో సీశాట్ వివాదంపై గతంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మాజీ కార్యదర్శి అరవింద్ వర్మ నేతృత్వంలో ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలై 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత నిర్ణయం వెలువడింది. కాబట్టి అభ్యర్థులు అనవసర ఆందోళనలకు తావివ్వకుండా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలని బ్రెయిన్ ట్రీ అకాడెమీ డెరైక్టర్ వి.గోపాలకృష్ణ సూచిస్తున్నారు. ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే కదా? ‘ప్రిలిమ్స్ పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌పై ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి కాబట్టి ఎవరికీ ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఆ మాత్రం ఇంగ్లిష్ నైపుణ్యాలు అవసరమే! దైనందిన విధులకు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకపోవడం అనేది అడ్డంకిగా మారుతుంది. ఇక అనలిటికల్, రీజనింగ్ నైపుణ్యాలు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చాలా ముఖ్యం. వీటిని పరీక్షించేలా ప్రశ్నలు ఇవ్వడం సబబే. కష్టపడి, విశ్లేషణాత్మకంగా ప్రాక్టీస్ చేస్తే ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్.. ఇలా ఏ నేపథ్యమున్న వారైనా వీటికి సమాధానాలు గుర్తించగలరన్నది నా అభిప్రాయం. జాతీయస్థాయిలో నిర్వహించే ఇతర పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఎవరైనా అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడమంటే అసలు ఇంగ్లిష్ నైపుణ్యాలు లేకుండా చేయాలని కాదు కదా! ప్రపంచీకరణ నేపథ్యంలో సివిల్స్‌లో వచ్చిన మార్పులు ఆవశ్యకం.. అభిలషణీయం. - గురజాల శ్రీనివాసరావు, సివిల్స్ పరీక్ష నిపుణులు -
విచిత్రనామ రచయిత ఎవరు?
13, 14 శతాబ్దాల్లో భారతదేశం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఈ చాప్టర్ నుంచి 2 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా చెప్పవచ్చు. వీరి రాజకీయ, పరిపాలన, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సాహిత్యంలో సియాసత్ నామా- నిజాముల్క్ తుసీ, ఖజాయిస్ ఉల్ పితుహా - అమీర్‌ఖుస్రూ, ఖైర్ ఇ మాజల్స్ - హమీద్ కలందర్, తారీఖ్ ఇ ముబారక్ - షాయయ్యార్ రచించినవి, అమీర్‌ఖుస్రూ, బరాని రచనలు, శిల్పకళలో సాంకేతిక ఆర్చి, డోం, ఢిల్లీ 3వ, 4వ నగరాలు, ఉద్యానవనాలు, లాల్ దర్వాజా, అలై - ఇ- దర్వాజాలు ఎవరు నిర్మించారు? లాంటి అంశాలను చదవాలి. 2001లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: కిందివాటిలో తప్పుగా జతచేసింది ఏది? ఎ) జాలువారే గోడలు - బాల్బన్ బి) సాంకేతిక పద్ధతిలో వచ్చిన డోం- ఖిల్జీలు సి) డబుల్ డోం పద్ధతిలో సమాధులు- లోఢీలు డి) ఢిల్లీకి మొదటి పట్టణం - ఐబక్ సమాధానం: (ఎ) జాలువారే గోడలు ఘియాజుద్దీన్ తుగ్లక్ తన సమాధిలో ప్రవేశపెట్టాడు. ఆర్థిక విధానంలో.. హకియా-ఇ-షాబ్, కిస్మత్, తకావి, ఉస్లుబ్ అంటే ఏమిటి? పరసియా, మైదాన్, ఉర్దు-ఇ-మౌల్ల లాంటి పారిభాషిక పదాల గురించి తెలుసుకోవాలి. హాజిమౌల్లా తిరుగుబాటు (1320), జఫార్‌ఖాన్ తిరుగుబాటు (1391), తైమూర్ దాడి (1398), అహ్మదాబాద్ రాజ్యస్థాపన(1411) లాంటి అంశాలతో పాటు, పగోడా (విజయనగరం) మహ్మది (గుజరాత్), ముజఫరి (మాళ్వా), సికిందరీ (ఢిల్లీ సుల్తాన్) బంగారు నాణేలు ముఖ్యమైనవి. 15,16 శతాబ్దాల్లో భారతదేశం 15, 16 శతాబ్దాల్లో దక్షిణ భారత విజయనగరం, బహ్మనీ రాజ్యాల సాంస్కృతిక వికాసం, ఢిల్లీ సామ్రాజ్య పతనం, మొగల్ రాజ్య స్థాపనాంశాలు, విజయనగరాన్ని సందర్శించిన యాత్రికులు, బహ్మనీ రాజ్య విచ్ఛిన్నం లాంటివి ప్రధానాంశాలు. ఉదా: షేర్షాకు సంబంధించి అవాస్తవమైన అంశం ఏది? (సివిల్స్ 1996) 1) 1/3 వంతు పన్ను వసూలు 2) రైతులకు కబూఅయత్ పట్టా ఇచ్చాడు 3) 1/4 వంతు భూమిపన్ను ముల్తాన్‌లో వసూలు 4) రూపాయి (వెండి) నాణెం ముద్రించాడు ఎ) 1, 2, 4 మాత్రమే బి) 1, 4, మాత్రమే సి) 1, 3,4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) మొగల్ సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ సామ్రాజ్య స్థాపన, హుమాయూన్ షేర్షాతో చేసిన యుద్ధాలు, హుమాయూన్ శిల్పకళ, షేర్షా సంస్కరణలు, అక్బర్ కాలంనాటి మత విధానం, రాజపుత్ర విధానాలు, దక్కన్, మున్సబ్‌దారీ విధానాలు, జహంగీర్ కాలంలో బ్రిటిషర్ల స్థావరాలు, నూర్జహాన్ పాలన, షాజహాన్ స్వర్ణయుగం, ఔరంగజేబు దక్కన్ విధానాలు, చివరి మొగల్ పాలకులు లాంటి అంశాలు ముఖ్యమైనవి. మొగలుల సాంస్కృతిక, ఆర్థిక విధానాలు, సాహిత్య రంగం, చిత్రకళ, సంగీతం మొదలైన అంశాలు కీలకం. ‘తారీఖ్ ఇ అక్బరీ’- కాందహారీ, ‘తబాకత్ ఇ అక్బరీ’ - నిజాముద్దీన్, ‘ముంతకాబ్ జల్ తవారిక్’-బదాయని, ‘ఇక్బాల్‌నామా’- ముత్మద్ఖాన్ లాంటి గ్రంథాల పేర్లు గుర్తుంచుకోవాలి. మన్సూర్ అలీ పక్షి చిత్రకారుడు, అబ్దుల్సమద్-దస్తక్-ఇ- హమీరంజా, తాన్సేన్, మిత్ర సింహా, తులసీదాస్ లాంటి వారు సంగీత విద్వాంసులు. శివాజీ పరిపాలన, సాహిత్యం, బక్నర్ మరాఠా సాహిత్యం, కాయత్ రాజస్థాన్ సాహిత్యం, బురుంజీ అస్సాం సాహిత్యం లాంటి అంశాలపై పట్టు అవసరం. 2011లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో మొగల్ సాహిత్యానికి సంబంధించి ఎంత లోతైన ప్రశ్న అడిగారో గమనించండి. ప్రశ్న: గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 1) జాఫర్‌నామా - ఔరంగజేబు లేఖలు 2) విచిత్రనామ - హిందూ హీరోల ఆత్మకథలు 3) ‘నక్ష ఇ దిల్ కుష్’ - బీమ్సేన్ 4) ‘తారీఖ్ ఇ షేర్షా’ - అబ్బాస్‌ఖాన్ ఎ) 1, 2 మాత్రమే బి) 1, 2, 3 మాత్రమే సి) 3, 4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) వివరణ: జాఫర్ నామా (ఔరంగజేబు లేఖలు) బహదుర్షా-2 రచించారు. హిందూ హీరోల చరిత్రలను (ఆత్మ కథలు) విచిత్రనామా పేరుతో దారాషికో రచించాడు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ బ్రిటిషర్ల ఆర్థిక, విద్యా విధానాల్లో వచ్చిన సంస్కరణలు, రాజ్యాంగ మార్పులు, పరిపాలనకు చెందిన వివిధ అంశాలు (సివిల్ సర్వీసెస్, పోలీస్, సైనిక, న్యాయవ్యవస్థ) కూలంకషంగా చర్చించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌లు- వారి విధానాలు, బ్రిటిషర్ల నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు చేసిన ఉద్యమాలు చాలా ముఖ్యం. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, బ్రిటిష్ పాలనలో భారతదేశ సాంస్కృతిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులపై అవగాహన అవసరం. శంభుమిత్ర నాటక రంగంలో, రాంకిరణ్ శిల్పకళలో, రవివర్మ చిత్రకళలో, ప్రమతీష్ బౌర చిత్ర రంగంలో ప్రసిద్ధి. రుక్మిణీ దేవి క్లాసికల్ డ్యాన్సులో, అల్లావుద్దీన్ ఖాన్ హిందూస్తానీ రాగంలో పేరు పొందారు. బ్రిటిషర్ల నిర్మాణ రంగంలో విక్టోరియా మహల్, సెంట్రల్ సెక్రటేరియట్ (పార్లమెంట్), గేట్‌వే ఆఫ్ ఇండియా, మద్రాస్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ముస్లింల సామాజిక ఉద్యమాలు వాహాబీ, మహ్మదీయ, అహ్మదీయ మొదలైన వాటిపై దృష్టి సారించాలి. ప్రశ్న: ఎం.జి.రనడే ‘విధవ వివాహ మండలి’ని ఎవరితో కలిసి ప్రారంభించారు? (2002) ఎ) దారోగా పాండురంగ బి) విష్ణుశాస్త్రి సి) కె. నటరాజన్ డి) పండిత రమాబాయి సమాధానం: (బి) వివరణ: మహారాష్ర్టలో వితంతు వివాహాల కోసం రనడే, విష్ణుశాస్త్రి కలిసి దీన్ని ప్రారంభించారు. పుణేలో వితంతు గృహాలను పండిత రమాబాయి ‘శారదాసేవాసదన్’ పేరుతో ప్రారంభించారు. ముల్క్సదన్ అనేది వితంతువుల కోసం ప్రారంభించిన పాఠశాల. కామాక్షి నటరాజన్ ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ (1890)ను ప్రారంభించారు.బిటిషర్లకు వ్యతిరేకంగా వచ్చిన సైనిక తిరుగుబాటును స్వాతంత్య్రోద్యమంలో నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. కున్వర్సింగ్ (బీహార్), అహ్మదుల్లా (ఫైజాబాద్), మంగళ్‌పాండే (బారక్పూర్), జినాత్ మహల్ (ఢిల్లీ)ల తిరుగుబాటును జేమ్స్ ఓరం, నికల్సన్, కాంప్‌బెల్, రోస్‌లు అణచివేయడం లాంటి అంశాలపై దృష్టిసారించాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్ర దీంట్లో మితవాదయుగం (1885-1905), అతివాదయుగం (1905-1920), గాంధీయుగం (1920-1947), విప్లవ వీరుల యుగం (1913-1931) ముఖ్యమైనవి. మితవాదుల ఆలోచనలు, పోరాట పద్ధతులు, వారి విజయాలు, వారి వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేయాలి.ఈస్టిండియా అసోసియేషన్ (లండన్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సంస్థల స్థాపకులు ఎవరు? వాటి ఆశయాలు ఏమిటి? లాంటివి ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన పత్రికల పాత్ర కూడా శ్లాఘనీయం. వీటిలో చెప్పుకోదగినవి.. మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్, హిందూ పెట్రియాట్(1853), అక్బర్-ఓ-సౌదాగర్ (1852), ఇండియన్ మిర్రర్ (1862), స్టేట్స్‌మెన్ (1875), ట్రైబ్యూన్ (1862). కొన్ని సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషించి భారతీయుల్లో రాజకీయ చైతన్యం, జాతీయవాదం, హేతువాదం, సామ్యవాదాన్ని ప్రేరేపించడానికి తోడ్పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని.. బ్రిటిష్ ఇండియా సమాజం (1867) -విలియం ఆడమ్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1839)-మేరి కార్పెంటర్, ఇండియన్ సొసైటీ (1872) - ఆనందమోహన్ బోస్ స్థాపించారు. ఈ కాలంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. అలాంటి వారిలో సరళాదేవి తన ఆత్మకథ- జిబ్నర్ జరా పఠా, లైఫ్ ఫాలెన్ లీవ్స; పండిత రమాబాయి-ఆర్య మహిళా సమాజం, రామేశ్వరి నె్రహూ (బ్రిజ్‌లాల్ నె్రహూ భార్య)- స్త్రీల సమస్యలపై స్త్రీ దర్పణ్ అనే మాస పత్రిక ద్వారా (1909-1924) పోరాడారు. ఈ దశలో ముస్లింల పాత్రకు సంబంధించి సయ్యద్ అహ్మద్- తారీఖ్-ఇ-మహ్మదీయ, మహ్మద్ కాశీమ్ నేనతవిదారుల్-ఉల్-బెరైల్వి దియోబంద్, మిర్జా గులాం-అహ్మద్-బరాహిం, జకాఉలా ్ల-జిల్లి ఉర్దూ రినైసాన్స సంస్థలు జాతీయవాదంలో ప్రముఖ పాత్ర పోషించాయి. బ్రిటిషర్లు పత్రికలపై ఉక్కుపాదం మోపడానికి కింది చట్టాలను చేశారు. * వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 * న్యూస్‌పేపర్ (ఇన్సిట్మెంట్ టు ఆఫెన్స) యాక్ట్ (1905) * ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910 * ఇండియన్ ప్రెస్(ఎమర్జెన్సీ పవర్స్) యాక్ట్ 1931 మరోవైపు సామాజిక సంస్కరణల్లో భాగంగా రనడే-వితంతు గృహాలు (పుణేలో), జ్యోతిబాపూలే-ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స, పండిత రమాబాయి-శారదాసేవా సదన్, డి.కె. కార్వే-బాలికల పాఠశాలలను స్థాపించి తమ వంతు కృషి చేశారు. అతివాదుల కాలంలో వచ్చిన జాతీయోద్యమం, రాజకీయ పండుగ లాంటిదని చెప్పొచ్చు. దీనికి కారకుడు లార్డ కర్జన్. ఇతను రైల్వేలపై (రాబర్‌టసన్), వ్యవసాయంపై (మెక్ డొనాల్డ్), విశ్వవిద్యాలయాలపై (ర్యాలీ) కమిటీలు వేశాడు. చివరకు 1905 అక్టోబరు 16న బెంగాల్ రాష్ర్ట విభజన చేశాడు. ఇతడు తన గ్రంథం ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా’లో భారతదేశంలో ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రను వివరించాడు. బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన పత్రికలు అక్కడి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటిలో కొన్ని.. జీ) న్యూ ఇండియా - బిపిన్ చంద్రపాల్ (అనిబిసెంట్ పత్రిక పేరు కూడా ఇదే) జీజీ) బందేమాతరం - అరబిందో ఘోష్ జీజీజీ) సంధ్య - బ్రహ్మోపాధ్యాయ జీఠి) డాన్ - సతీష్ చంద్ర ముఖర్జీ వీటితో పాటు పంజాబీ- లాలాలజపతిరాయ్, భారత్‌మాత-అజిత్‌సింగ్, కామ్రేడ్-మౌలానా మహ్మద్ ఆలీ, ఆల్ హిలాల్-మౌలానా అబుల్ కలాం ఆజాద్ పత్రికలు కూడా చెప్పుకోదగినవి. ఈ ఉద్యమం ఆంధ్ర రాష్ర్టంపై ప్రభావాన్ని చూపింది. గాంధీజీ రాకతో (1915 జనవరి 9న) స్వాతంత్య్రోద్యమ దశలో నూతన శకం ఆరంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. దక్షిణా ఫ్రికాలో గాంధీజీ చేసిన తొలి సత్యాగ్రహం ఏది? అక్కడ స్థాపించిన గాంధీ, టాల్‌స్టాయ్, ఫ్యూనిక్స్ ఆశ్రమాల ఉద్దేశాలు ఏమిటి? ఆఫ్రికా అధ్యక్షుడు జనరల్ స్మట్స్, గాంధీ, గోఖలే మధ్య 1914లో జరిగిన ఒప్పందంలోని నిర్ణయాలు? ‘అన్ టు ది లాస్ట్’గ్రంథాన్ని గాంధీజీ ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీలోకి అనువదించడంలోని ఉద్దేశం? 1909లో ‘హిందూ స్వరాజ్’ గ్రంథంలో న్యాయవాదులను, డాక్టర్లను, రైల్వేలను ఎందుకు విమర్శించారు? లాంటి ప్రశ్నలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ముఖ్యం. భారత్‌లో గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహాలు 1. చంపారన్ (1917)- నీలిమందు రైతుల కోసం (శాసనోల్లంఘనోద్యమం). 2. ఖేడా (1918)- గుజరాత్‌లోని గిరిజనుల కోసం (సహాయనిరాకరణోద్యమం). 3. అహ్మదాబాద్ (1918)-గుజరాత్‌లోని కార్మికుల కోసం (నిరాహార దీక్ష). 4. రౌలత్ చట్టం (1919) - దేశవ్యాప్తంగా ‘గాంధీజీ జన బాహుళ్య ఉద్యమం చేసి అన్ని విజయాలు సాధించారు. కానీ జాతీయ నాయకుడిగా చేసిన ఉద్యమాల్లో ఎందుకు విఫలం చెందారు? 1928-22 సహాయనిరాకరణోద్యమం: దీంతో గాంధీజీ దేశంలో తిరుగులేని నాయకునిగా నిల్చిపోయారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణాలు? చౌరీచౌరా సంఘటన (1922 ఫిబ్రవరి 5న)తో ఎందుకు నిల్పివేశారు? స్వరాజ్య పార్టీ (1923), అఖిల భారత రాష్ర్ట ప్రజల సంస్థ (1927), కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934), ఫార్వర్డ బ్లాక్ (1939), భారత కమ్యూనిస్ట్ పార్టీ (1925) ఎందుకు ఆవిర్భవించాయి? వాటి ముఖ్యాంశాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి. మాదిరి ప్రశ్నలు 1. ‘మహ్మదరన్ సాహిత్య సమాజం(1863)’ స్థాపకులు ఎవరు? (2001 సివిల్స్) 1) నవాబ్ అబ్దుల్ లతీఫ్ 2) సయ్యద్ అమీన్ ఆలీ 3) షరియతుల్లా 4) డాక్టర్ ముత్కార్ అహ్మద్ అన్సారీ 2. కింది వాటిలో సరైంది? (2002 సివిల్స్) 1) దీనమిత్ర - రామన్ పిళ్లై 2) మార్తాండ వర్మ-ముకుంద్‌రావు పాటిల్ 3) న్యూ ఇండియా- విష్ణు కృష్ణ చిప్లూంకర్ 4) నిబంధన మాల - బిపిన్ చంద్రపాల్ 5) మహానిర్వాణ్ తంత్ర - రాయ్ వివరణ: దీనమిత్ర: నీలిమందు రైతుల గురించి ముకుంద్‌రావు పాటిల్ వివరించాడు. మార్తాండ వర్మ: ట్రావెన్కోర్ రాజు వివరాలు సి.వి.రామన్ పిళ్లై రచించాడు. న్యూ ఇండియా: బిపిన్‌చంద్రపాల్ పత్రిక నిబంధన మాల- విష్ణుకృష్ణ చింప్లూకర్ రచన 3. కింది వాటిలో తీవ్రవాద సంస్థ - వాటి స్థాపకుల్లో సరికానిది? 1) యంగ్ ఇండియా - దామోదర్ సావర్కర్ 2) హిందూస్తాన్ ప్రజా తాంత్రిక్ సంఘ్ - సూర్యసేన్ 3) ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ - భగత్‌సింగ్ 4) భారతమాత - అజిత్‌సింగ్ వివరణ: ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని సచీంద్ర సన్యాల్ స్థాపించారు. భగత్‌సింగ్ ‘నవభారత జవాన్’ను స్థాపించారు. 4. గాంధీజీకి సంబంధించి సరికానిది? 1) తొలి శాసనోల్లంఘన ఉద్యమం - 1930 ఏప్రిల్ 6న 2) తొలి సహాయనిరాకరణోద్యమం - 1918 ఖేడా ఉద్యమం 3) తొలి నిరాహార దీక్ష 1918- గుజరాత్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం 4) తొలి ఆశ్రమం- సత్యాగ్రహ ఆశ్రమం 1915లో స్థాపించారు. వివరణ: తొలి శాసనోల్లంఘన ఉద్యమం గాంధీజీ 1917 చంపారన్ జిల్లా మోతీహారి గ్రామంలో (బీహార్ రాష్ర్టం) చేశారు. సమాధానాలు: 1) 1 2) 5 3) 3 4) 1