సాక్షి, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.
కాగా, ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment