Preliminary Examination
-
దేశవ్యాప్తంగా ప్రారంభమైన సివిల్స్ ప్రాథమిక పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభానికి అర గంట ముందుగానే అన్ని కేంద్రాల గేట్లు మూసివేశారు. ప్రతి కేంద్రం వద్ద జామర్లు ఏర్పాటు చేశారు.కాగా, ప్రిలిమ్స్‌కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి 49,883 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 99 పరీక్ష కేంద్రాలను, వరంగల్‌లో 11 కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇటీవల నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ప్రతిష్టాత్మక యూపీఎస్సీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మొత్తం 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులు వికలాంగులకు మాత్రమే కేటాయించారు. వ్రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్‌తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది.దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్‌పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్‌ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్‌ను కమిషన్రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది. -
మూడోసారి గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆదివారం జరగనున్న ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని.. ఉదయం 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. గుర్తింపు కార్డు చూపిస్తేనే అభ్యర్థులను అనుమతించనుంది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్... గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పకడ్బందీగా నిర్వహించే చర్యల్లో భాగంగా ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారిని నోడల్ అధికారులుగా.. ప్రతి 20 కేంద్రాలకు ఒక రీజినల్ కోఆర్డినేటర్‌ను ప్రభుత్వం నియమించింది. బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక వ్యవస్థను కమిషన్ ఏర్పాటు చేసింది. 897 కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను ఇప్పటికే నియమించారు.ప్రతి కేంద్రానికి ఒక సిట్టింగ్ స్వా్కడ్ బృందం ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్వా్క డ్ బృందం ఉంటుంది. ప్రతి వంద మంది అభ్యర్థులకు ఒక చెకింగ్ అధికారిని నియమించారు. గ్రూప్–1 పరీక్షా కేంద్రం చుట్టూ బందోబస్తు ఏర్పాటుతోపాటు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కమిషన్ తెలిపింది.గ్రూప్–1 అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా కష్టపడి పరీక్షకు సిద్ధమైన అభ్య ర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. -
జిల్లాకో నోడల్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను కూడా నియమించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల ఏర్పాట్లతో పాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించారు. గ్రూప్– 1 పరీక్షల ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రానున్న మూడు వారాల పాటు నిఘా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్యాక్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థా యి గోడౌన్ల వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రతి విద్యారి్థకీ కనీసం జత యూనిఫాం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా? లేదా అనే విషయాన్ని నిర్ణిత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. నోటిఫికేషన్ నిబంధనలను సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమేనని పేర్కొంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారని, అందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జూన్ 11న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. బయోమెట్రిక్ సహా నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కి తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అప్పీల్లో ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు, నర్సింగ్, హసీనా సుల్తానా వాడీవేడిగా వాదనలు వినిపించారు. బయోమెట్రిక్‌పై వాదన ఆమోద యోగ్యం కాదు ‘గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు 2.83 లక్షల మంది వరకు హాజరయ్యారని కమిషన్ చెబుతోంది. అప్పుడు సమర్థవంతంగా బయోమెట్రిక్ నిర్వహించిన కమిషన్.. 2.33 లక్షల మంది పాల్గొన్న జూన్‌లో మాత్రం భారీ సంఖ్య కారణంగా తీసుకోలేదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. కానిస్టేబుల్ పోస్టులు సహా ఇతర పలు పోస్టుల నియామక పరీక్షలకు బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు గ్రూప్–1కు తీసుకోకపోవడాన్ని కమిషన్ సమర్ధించుకోలేదు. ఇంకోవైపు 50 వేల మంది పరీక్షకు దూరం కావడం చిన్న విషయమేమీ కాదు. అభ్యర్థుల్లో కమిషన్ విశ్వసనీయత కోల్పోవడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్లపై ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండాలి. కానీ కొన్ని షీట్లపై ఒక్కరి సంతకమే ఉంది. దీనికి కమిషన్ సమాధానం సమంజసనీయంగా లేదు. గ్రూప్–1 కంటే ఎక్కువ మంది హాజరైన గ్రూప్–4కు ఓఎంఆర్ షీట్లపై ఫొటో ఇచ్చినప్పుడు గ్రూప్–1కు ఇవ్వకపోవడం అక్రమాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది..’అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ 258 మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది.. ‘నోటిఫికేషన్ నిబంధనల్లో మార్పుచేర్పులు, సవరణలు చేసే అధికారం కమిషన్‌కు ఉంది. అయితే నోటిఫికేషన్ వెలువరించాక సవరణ చేయాలనుకుంటే ఆ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రూప్–4 పరీక్షలకు బయోమెట్రిక్ లేదంటూ అనుబంధ నోటిఫికేషన్ వెలువరించిన కమిషన్ గ్రూప్–1 విషయంలో అలా చేయకపోవడం సమర్థనీయం కాదు. జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తర్వాత 2,33,248 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పిన కమిషన్.. అనంతరం ఆ సంఖ్యను 2,33,506గా చెప్పింది. ఈ వ్యత్యాసం గ్రూప్–1 మొత్తం పోస్టుల్లో (503) సగం కంటే ఎక్కువ (258). ఒకవేళ నిజంగా అక్రమాలు చోటుచేసుకుని ఈ 258 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికైతే.. అంతమంది మెరిట్ అభ్యర్థులు అవకాశం కోల్పోతారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష అని, పట్టించుకోనవసరం లేదన్న కమిషన్ వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇరుపక్షాల వాదనలను లోతుగా పరిశీలించాక సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం కనబడటం లేదు..’అని బెంచ్ స్పష్టం చేసింది. ముగ్గురి వల్ల లక్షల మంది ఇబ్బందుల్లోకి.. ‘ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షను రద్దు చేయాలని కోరారు. ముగ్గురి కోసం లక్షల మంది భవిష్యత్ ఇబ్బందుల్లో నెట్టడం సరికాదు. 2.33 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పీల్‌ను ఆమోదించాలి..’అని ఏజీ కోరారు. కాగా.. ‘అభ్యర్థుల సంఖ్యలో తేడా అక్రమాలు తావిచ్చేదిగా ఉంది. పరీక్షల నిర్వహణలో కమిషన్‌కు చిత్తశుద్ధి లోపించింది. ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించాల్సిన కమిషన్.. రెండోసారి కూడా విఫలమయ్యింది. కాబట్టి పరీక్షను రద్దు చేసి నోటిఫికేషన్‌లోని నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలి..’అంటూ గిరిధర్‌రావు, నర్సింగ్ వాదించారు. -
ఎస్ఐ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు 1.51లక్షల మంది హాజరు
సాక్షి, అమరావతి: ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 411 ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లోని 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ‘ప్రాథమిక కీ’ని సోమవారం ఉదయం 11గంటలకు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని రాష్ట్ర పోలీసు నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఆ ప్రాథమిక ‘కీ’ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ’పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ ఉదయం 11గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. వెబ్సైట్లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్లోనే అభ్యంతరాలను తమకు మెయిల్ చేయాలని కూడా పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి వెల్లడించింది. ► ప్రాథమిక కీ డౌన్లోడ్ చేసుకోడానికి వెబ్సైట్: slprb.ap.gov.in ► ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్లో పంపాల్సిన మెయిల్ ఐడీ: CTSI& PWT @slprb.appolice.gov.in -
ప్రశ్నలు మధ్యస్థం... జవాబులు కఠినం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని కొందరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చి న ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు. 50 శాతం పైబడి మార్కులతో కటాఫ్...! ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ వెలువడే వరకు సమాధానాలను అంచనా వేయడం కష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జవాబుల సరళిని విశ్లేషిస్తే కనీసం 50% పైబడి మార్కులతో కటాఫ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పురుషుల కేటగిరీలో 85 మార్కులు, మహిళల కేటగిరీలో 80 మార్కులకు అటుఇటుగా కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 75% హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ పద్ధతిలో హాజరును స్వీకరించినట్లు తెలిపింది. స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న పరీక్ష కావడంతో ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా టీఎస్పీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించింది. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌తోపాటు సిట్టింగ్ స్క్వాడ్లు, 61 మంది లైజనింగ్ అధికారులు, జిల్లా అధికారుల ద్వారా పరీక్ష నిర్వహించింది. 8 పని దినాల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్... అభ్యర్థుల ఓఎంఆర్ జవాబుపత్రాలను స్కానింగ్ చేసి వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినందుకు టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, అధికారులను అభినందించారు. అభ్యర్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు మెదక్ జోన్: మెదక్ జిల్లా కేంద్రంలోని గీతా జూనియర్ కాలేజీలో కిషన్ అనే అభ్యర్థి పరీక్ష రాయాల్సి ఉండగా అతను పొరపాటున అక్కడికి 2 కి.మీ. దూరంలోని సాధన జూనియర్ కళాశాలకు వచ్చాడు. అప్పటికే సమయం ఉదయం 10:13 గంటలు కావడం.. అభ్యర్థులను 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు ఆందోళన చెందుతూ కనిపించాడు. దీంతో అక్కడే ఉన్న డీఎస్పీ సైదులు, సీఐ మధు తమ ఎస్కార్ట్ వాహనంలో కిషన్‌ను సకాలంలో గీతా కాలేజీకి పంపారు. ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సైరన్ మోగిస్తూ 2 కి.మీ. దూరంలోని గీత కాలేజీకి ఒకటిన్నర నిమిషంలోనే తీసుకెళ్లాడు. గ్రూప్–1 పరీక్ష రాసిన ఖైదీ ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేశ్ అనే యువకుడు నిర్మల్ జిల్లా కోర్టు అనుమతితో ఆదివారం గ్రూప్–1 ప్రిలిమ్స్ రాశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో అరెస్టయిన రమేశ్ 45 రోజులుగా జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. ఆదిలాబాద్‌లో.. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఖైదీ జాదవ్ రమేశ్‌తో పోలీసులు చిన్నారికి ఏసీపీ లాలింపు.. ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్‌లోని ఏఎస్ఎం మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 2 నెలల పసిబిడ్డతో వచ్చి ఓ తల్లి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే పరీక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్‌తో కలసి వచ్చిన వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరికుమార్ ఆ చిన్నారిని ఎత్తుకొని∙కాసేపు లాలించారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని... బిడ్డను క్షేమంగా చూసుకుంటామని పాప తల్లికి చెప్పారు. అక్కడే ఉన్న ఏఎస్సై స్వరూపరాణికి బిడ్డను అప్పగించారు. వరంగల్‌లో.. చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఏసీపీ గిరికుమార్ ఆభరణాలు తొలగిస్తేనే ప్రవేశం.. అభ్యర్థులు ఆభరణాలు ధరించి రాకూడదని టీఎస్పీఎస్సీ నిబంధన విధించినా కొన్నిచోట్ల మహిళలు గాజులు, కమ్మలు, చైన్లు, కాళ్ల పట్టీలతో కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకు ఎగ్జామ్ సెంటర్ల నిర్వాహకులు అభ్యంతరం తెలపడంతో వారు ఆభరణాలను తొలగించడం కనిపించింది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి పరీక్ష కేంద్రంలో ఒంటి గంటకు ముగించాల్సిన పరీక్షకు.. పది నిమిషాలు ఆలస్యంగా పేపర్లు తీసుకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. -
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్...రాత పరీక్షపై కీలక అప్డేట్..!
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కానిస్టేబుల్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 21న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు గురువారం ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు. ఆ ఐదు జిల్లాలు టాప్... భారీగా దరఖాస్తులు దాఖలు చేసిన జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట నిలిచాయి. ఈ జిల్లాల నుంచే 33 శాతం దరఖాస్తులు వచ్చాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల నుంచి అతి తక్కువగా 7 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి. పోస్టులవారీగా దరఖాస్తులిలా... ఎస్ఐ సివిల్, తదితర సమాన పోస్టులు: 2,47,630 సివిల్ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు: 9,54,064 ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు: 14,500 ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు: 22,033 కానిస్టేబుల్ డ్రైవర్ (పోలీస్), ఫైర్ పోస్టులు: 38,060 మెకానిక్ కేటగిరీ పోస్టులు: 5,228 పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ ఎస్ఐ: 3,533 ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ: 6,010 -
సివిల్స్ అభ్యర్థులకు మరో అవకాశం లేనట్లే
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అక్టోబర్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయలేక చివరి ప్రయత్నం(లాస్ట్ అటెంప్ట్) సైతం కోల్పోయిన వారికి మరో అవకాశం కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల 2020లో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతూ సివిల్ సర్వీసెస్‌లో ‘చివరి ప్రయత్నం’ దాటిపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఎ.ఖన్వీల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తోసిపుచ్చింది. ఈ మేరకు 40 పేజీల తీర్పును వెలువరించింది. ఇలా లాస్ట్ అటెంప్ట్‌లో పరీక్ష రాయలేకపోయినవారికి మరో అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని, సివిల్స్ అభ్యర్థుల వయో పరిమితిలోనూ ఎలాంటి సడలింపులు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సడలింపులు ఇవ్వడం ఇతర అభ్యర్థులపై వివక్ష చూపినట్లే అవుతుందని స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 6 సార్లు సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 32 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు సివిల్స్ రాయొచ్చు. వయో పరిమితి 35 సంవత్సరాలు. ఇక ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు. వయో పరిమితి 37 ఏళ్లు. గత ఏడాది కరోనా ప్రభావం ఉన్నప్పటికీ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా తీర్పు వల్ల 10,000 మందికిపైగా అభ్యర్థులు నష్టపోతారని అంచనా. -
యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. 2020 సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. అక్టోబర్ 4వ తేదీన రెండు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఇప్పట్లో నిర్వహించటం కుదరదని యూపీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు సివిల్స్‌తో సహా వివిధ పరీక్షల సవరించిన షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. కాగా, మే 31న జరగాల్సిన ప్రిలిమినరీ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరీక్షల షెడ్యూల్ : -
జూన్ 5న యూపీఎస్సీ పరీక్ష తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం సమాచారమిచ్చింది. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు బుధవారం యూపీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న చెప్పిన సంగతి తెలిసిందే. -
డిసెంబర్ 17 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం విడుదల చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మొత్తం 40 రోజుల పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ(పీఈటీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పార్ట్–2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చైర్మన్ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, కులధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా సర్టిఫికెట్, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేయాలని పేర్కొన్నారు. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని తెలిపారు. మొత్తం 3,77,770 మంది ...: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణు లు అయ్యా రని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
న్యూశాయంపేట : పోలీస్‌శాఖలో ఎస్సై పోస్టులకు చేపట్టిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నాలుగో రోజు గురువారం హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మంది అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరణతోపాటు శారీరక కొలతల పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉదయం వర్షం లేకపోవడంతో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. మధ్యాహ్నం వర్షం కురవడంతో 540 మంది అభ్యర్థుల ఎత్తు, చాతి కొలతలను మాత్రమే పరీక్షించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు 4వ తేదీన నిర్వహించే క్రీడాంశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మ హేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేష్‌కుమార్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ అధికారులు, ఎస్సై, ఆర్ఎస్సై, ఐటీకోర్ టీం సభ్యులు పాల్గొన్నారు. కేయూ మైదానంలో 977 మందికి.. వరంగల్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మైదానంలో గురువారం 977 మంది అభ్యర్థులకు శారీరక కొలతలు, 582 మందికి అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు పందెంతోపాటు షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ, ఏఆర్ అదనపు ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, పరకాల, నర్సంపేట ఏఆర్, టీఎస్ఎస్పీ డీఎస్పీలు సుధీంద్ర, మురళీధర్, రాంచందర్‌రావు, కుమారస్వామి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం తన కార్యాలయంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల సమక్షంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 4,93,197 అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, 1,92,588 మంది అర్హత పొందారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్(పీఈటీ)లను నిర్వహిస్తారు. ఈ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ పరీక్షలకు రె ండువారాల ముందుగా వెబ్సైట్ నుంచి అనుమతి లేఖలను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గత నెల 24న జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఆదిలాబాద్ జిల్లా నుంచి 14,437 మంది, హైదరాబాద్ నుంచి 19,312, కరీంనగర్ నుంచి 22,054, ఖమ్మం నుంచి 22,806, మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి 20,421,మెదక్‌జిల్లా నుంచి 10,481, నల్లగొండ నుంచి 23,595, నిజామాబాద్ నుంచి 11,271, రంగారెడ్డిజిల్లా నుంచి 22,861, వరంగల్ నుంచి 25,270 మంది అర్హత సాధించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ 292 మంది హాజరుకాగా 138 మంది అర్హత సాధించారు. కాగా, ఓఎంఆర్ షీట్ల వాల్యుయేషన్‌కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు దానిని సవాల్ చేయవచ్చు. గురువారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www.tslprb.in వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకుని తమ వినతులను సమర్పించవచ్చు. రీవాల్యుయేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు (ఎస్సీ, ఎస్టీలకు రూ.2 వేలు) చెల్లించాల్సి ఉంటుందని టీఎస్పీఎల్ఆర్బీ చైర్మన్ జె.పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎస్బీఐ ‘పీవో’ను అందుకోండిలా...
ఖాళీల వివరాలు వర్గం ఖాళీలు ఎస్సీ 308 ఎస్టీ 339 ఓబీసీ 541 జనరల్ 812 మొత్తం 2,000 అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2015, సెప్టెంబర్ 1లోగా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్వ్యూ సమయంలో ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. వయసు: 2015, ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు, జనరల్ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. దీన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. అభ్యర్థులు సెక్షన్ల వారీగా కటాఫ్ మార్కులు సాధించాలి. ఇలా అర్హత మార్కులు సాధించిన వారి నుంచి కేటగిరీల వారీగా దాదాపు 1:20 నిష్పత్తిలో అభ్యర్థులను రెండో దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందు లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు పరీక్షలను ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తవగానే డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ ద్వారా డిస్క్రిప్టివ్ పరీక్ష సమాధానాలు రాయాలి. రెండు పరీక్షల్లోనూ సెక్షన్ల వారీగా నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. ఆబ్జెక్టివ్ పరీక్షలో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.మెయిన్‌లో బ్యాంకు నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన వారిని మూడో దశ (గ్రూప్ డిస్కషన్ 20 మార్కులకు, 30 మార్కులకు ఇంటర్వ్యూ) పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్‌కు సంబంధించి 250 మార్కులను 75 మార్కులుగా పరిగణించి, అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. అదే విధంగా జీడీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన 50 మార్కులను 25 మార్కులుగా పరిగణిస్తారు. మొత్తంమీద 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసి, తుది జాబితా రూపొందిస్తారు. పరీక్ష విధానం ప్రిలిమ్స్ (గంట): విభాగం ప్రశ్నలు మార్కులు ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 రీజనింగ్ ఎబిలిటీ 35 35 మొత్తం 100 100 మెయిన్ 1.ఆబ్జెక్టివ్ టెస్ట్ (రెండు గంటలు): విభాగం మార్కులు ఇంగ్లిష్ 50 జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్స్ 50 డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్ 50 రీజనింగ్ (హై లెవెల్) 50 మొత్తం 200 2. డిస్క్రిప్టివ్ టెస్ట్ (గంట, 50 మార్కులు): ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్, ఎస్సే. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2015. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ: రూ.100 జనరల్, ఇతరులు: రూ.600 ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 2, 2015 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్, 2015 పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్:చీరాల, చిత్తూరు, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకులం, తిరుపతి, పుత్తూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణ:హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వెబ్సైట్లు:www.statebankofindia.com www.sbi.co.in వేతనాలు పీవో జీతభత్యాలు వారు పనిచేసే ప్రాంతం ఆధారంగా ఉంటాయి. నోటిఫికేషన్ ప్రకారం ప్రారంభంలో బేసిక్ పే రూ.16,900 (నాలుగు ఇంక్రిమెంట్లతో) ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ వంటివి అదనంగా ఉంటాయి. ముంబై లో పనిచేసే వారికి వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.8,55,000 ఉంటుంది. ఇక్కడ హెచ్ఆర్ఏ నెలకు రూ.29,500 ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో హెచ్ఆర్ఏలో వ్యత్యాసం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంచుతారు. ఈ సమయంలో శిక్షణ ఇస్తారు. ప్రొబేషన్/ శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. పూర్తిస్థాయి ప్రమాణాలను అందుకున్న వారిని మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 ఆఫీసర్‌గా పూర్తిస్థాయిలో నియమిస్తారు. నిర్దేశ పరీక్షలో ఉత్తీర్ణులైనా, ప్రమాణాలను సరిగా అందుకోలేని వారిని జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్-1 ఆఫీసర్‌గా నియమిస్తారు. ఈ ప్రక్రియలో విఫలమైన వారిని సర్వీసు నుంచి తొలగిస్తారు. జనరల్ అవేర్నెస్, మార్కెటింగ్, కంప్యూటర్స్ బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకోవాలి. బడ్జెట్, జీ 20, జీ 8 వంటి సదస్సులు, ముఖ్యమైన కమిటీలు, పుస్తకాలు-రచయితలు, క్రీడాంశాలు వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. కరెంట్ అఫైర్స్‌పై పట్టుసాధించాలంటే నిరంతర అధ్యయనం అవసరం. కంప్యూటర్స్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇంటర్నెట్ ఆధారంగా (ఉదా: గిజ్చ్టి జీట ఆఇఇ?) మరికొన్ని నాన్ ఇంటర్నెట్ ఆధారంగా వస్తున్నాయి. ఇన్పుట్, అవుట్‌పుట్ డివెసైస్, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ వంటి వాటిపై అవగాహన అవసరం. మార్కెటింగ్: ఇది కొత్త సబ్జెక్టు కాబట్టి మార్కెటింగ్ పదజాలం, వాటి అర్థాలు తెలుసుకోవాలి. Selling, Marketing మధ్య ™ólyé, Product Life Cycle, Branding and Co Branding, Tag lines, 7 P's of Marketing, CRM conceఞ్టట వంటి వాటిపై అవగాహన అవసరం.రీజనింగ్ (హై లెవెల్): గత ప్రశ్నపత్రాలను బట్టి చూస్తే ఇన్పుట్-అవుట్‌పుట్ నుంచి 5 ప్రశ్నలు, కోడింగ్-డీకోడింగ్ నుంచి 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, పజిల్/సీటింగ్ అరేంజ్మెంట్స్ నుంచి 10, డేటా సఫీషియెన్సీ నుంచి 5, డెరైక్షన్, ఇతర అంశాల నుంచి 5 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.ఎస్సే రైటింగ్‌కు సంబంధించి సరైన ఎస్సే రాయాలంటే మంచి పదాలు, చిన్న వాక్యాలు రాస్తూ రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ముఖ్యమైన అంశాలను ఎంపిక చేసుకొని, ఎస్సేలు రాస్తూ ఫ్యాకల్టీతో దిద్దించుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న మార్పులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రాధాన్యత, రోల్ ఆఫ్ ఐఆర్డీఏ వంటి వాటిపై దృష్టిసారించాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పర్సనల్, అఫీసియల్ లెటర్స్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. రోజువారీ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లెటర్స్ ద్వారా కమ్యూనికేషన్ అవసరమవుతుంది. అందువల్ల లెటర్ రైటింగ్‌ను సిలబస్‌లో చేర్చారు. సబ్జెక్టులపై పట్టు సాధించండి... ప్రిలిమ్స్‌లో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రిలిమ్స్, మెయిన్ భిన్నంగా ఉంటాయి): ప్రిలిమ్స్‌లో సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్,యావరేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రస్ట్, కాంపౌండ్ ఇంట్రస్ట్,టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.క్లిష్టత: ఓ మోస్తరు నుంచి అధిక కాఠిన్యత ప్రశ్నలు ఉండొచ్చు. పీవో స్థాయి ప్రశ్నల సాధనను ప్రాక్టీస్ చేయాలి. మెయిన్‌లో డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలుంటాయి. ఇవి అధిక క్లిష్టంగా ఉంటాయి. అందువల్ల కటాఫ్ తక్కువగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించేందుకు ప్రయత్నించకూడదు. సమయం వృథా అయ్యే ప్రశ్నలను విడిచిపెట్టాలి. తొలుత తేలికైన ప్రశ్నలను, తర్వాత ఓ మోస్తరు కష్టంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇంకా సమయం ఉంటే బాగా కష్టమైన ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి. ప్రతిసారీ సూత్రాలు ఉపయోగించేందుకు ప్రయత్నించకూడదు. మైండ్ కాలిక్యులేషన్ టిప్స్‌ను ఉపయోగించుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో వీటి సహాయంతో సమాధానాలు గుర్తించడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్: ప్రిలిమ్స్, మెయిన్‌కు ఒకే సిలబస్ ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ కంటే మెయిన్‌లో ఇచ్చిన ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నప్పుడే కష్టమైన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేస్తే, ఇది మెయిన్‌కు ఉపయోగపడుతుంది. ఇందులో కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ అండ్ సిరీస్, డెరైక్షన్స్, డెసిషన్ మేకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డౌజజీటఝట, క్రిటికల్ రీజనింగ్ అండ్ డేటా సఫీషియెన్సీ. సీటింగ్ అరేంజ్మెంట్, డౌజజీటఝట నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి కూడా క్లిష్టంగానే ఉంటున్నాయి కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఇంగ్లిష్: ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లోని ఇంగ్లిష్‌కు ఒకే సిలబస్ ఉంటుంది. గ్రామర్, వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్‌లో క్లోజ్ టెస్ట్ నుంచి 5-10, కాంప్రెహెన్షన్ నుంచి 5-10, స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 5, సెంటెన్స్ రీఎరేంజ్‌మెంట్, కంప్లీషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ నుంచి 5-10, ఫిల్ ఇన్‌ది బ్లాంక్స్ 5 ప్రశ్నలు ఉండొచ్చు. మెయిన్‌లో క్లోజ్ టెస్టు నుంచి 10 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 20 ప్రశ్నలు రావొచ్చు. స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 5నుంచి 10 ప్రశ్నలు; సెంటెన్స్ అరేంజ్మెంట్, కంప్లీషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ నుంచి 5 నుంచి 10 ప్రశ్నలు రావొచ్చు. ఇతర అంశాల నుంచి 5-10 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు క్లోజ్‌టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కంప్లీషన్, ఇంప్రూవ్మెంట్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రామర్, వొకాబ్యులరీ అంశాలపై పట్టు సాధిస్తే ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. డిక్షనరీ ఉపయోగించి, రోజూ ఇంగ్లిష్ పత్రిక చదవాలి. కొత్త పదాలను, వాటిని ప్రయోగిస్తున్న తీరును నేర్చుకోవాలి. మెయిన్ పరీక్షలో డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో కంప్యూటర్ కీ బోర్డతో సమాధానాలను టైపు చేయాలి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. - ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి, డెరైక్టర్ ఐఏసీఈ, హైదరాబాద్. నచ్చిన సబ్జెక్టులో మరింత పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని, ఉద్యోగ మార్కెట్లో సమున్నత అవకాశాలను అందుకునేందుకు పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. పరిశోధనల దిశగా వెళ్లాలన్నా పీజీ పూర్తిచేయాల్సిందే. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ చేయాలనుకుంటే వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చూపాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు యూనివర్సిటీలు వచ్చే విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిపై స్పెషల్ ఫోకస్.. సంప్రదాయ సబ్జెక్టులకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ డిమాండ్, పారిశ్రామిక అవసరాలకు తగినట్లు ఎన్నో కొత్త స్పెషలైజేషన్లను విశ్వవిద్యాలయాలు పీజీ స్థాయిలో అందిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ (బీఎస్సీ+ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ కోర్సులకు గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్-2015) భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు: హర్యానా, జమ్మూ, జార్ఖండ్, కాశ్మీర్, కేరళ, పం జాబ్, రాజస్థాన్, తమిళనాడు సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు సీయూ సెట్-2015 నిర్వహిస్తారు. కోర్సులు: ఎంఎస్సీలో జీనోమిక్ సైన్స్, యానిమల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, స్పోర్ట్స్ సైన్స్ వంటి స్పెషలైజేషన్లతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఎంఏలో ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ, హ్యూమన్ రైట్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్, ఫైన్ఆర్ట్స్ తదితర కోర్సులున్నాయి. ఎంకామ్, ఎంఫార్మ్, ఇంటెగ్రేటెడ్ ఎంఎస్సీ, బీఈడీ వంటి కోర్సులను విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి.ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2015.పరీక్ష తేదీలు: జూన్ 6, జూన్ 7, 2015. హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.వెబ్సైట్: cucet2015.co.in శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) ఎస్పీఎంవీవీ పీజీ సెట్ ద్వారా విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆఫర్ చేస్తున్న కోర్సులు:ఎంఎస్సీ: అప్లయిడ్ మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.ఎంఏ: ఎకనామిక్స్; ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్; తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ట్రాన్స్లేషన్, మ్యూజిక్ వంటి సబ్జెక్టులున్నాయి.ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఈడీ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: మే 11, 2015. పరీక్షలు ప్రారంభం: మే 23, 2015. వెబ్సైట్: www.spmvv.ac.in