ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు | SI candidates Dehadarudhya tests | Sakshi
Sakshi News home page

ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

Published Fri, Jul 1 2016 2:21 AM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు - Sakshi

ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

న్యూశాయంపేట : పోలీస్‌శాఖలో ఎస్సై పోస్టులకు చేపట్టిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నాలుగో రోజు గురువారం హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సీపీ సుధీర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా  600 మంది అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరణతోపాటు శారీరక కొలతల పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉదయం వర్షం లేకపోవడంతో 100, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు.

మధ్యాహ్నం వర్షం కురవడంతో 540 మంది అభ్యర్థుల ఎత్తు, చాతి కొలతలను మాత్రమే పరీక్షించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు 4వ తేదీన నిర్వహించే క్రీడాంశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మ హేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేష్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, సెక్షన్ అధికారులు, ఎస్సై, ఆర్‌ఎస్సై, ఐటీకోర్ టీం సభ్యులు పాల్గొన్నారు.
 
కేయూ మైదానంలో 977 మందికి..
వరంగల్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మైదానంలో గురువారం 977 మంది అభ్యర్థులకు శారీరక కొలతలు, 582 మందికి అభ్యర్థులకు 100, 800 మీటర్ల పరుగు పందెంతోపాటు షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ ఈవెంట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా దేహదారుఢ్య పరీక్షలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ, ఏఆర్ అదనపు ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి, పరకాల, నర్సంపేట ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ డీఎస్పీలు సుధీంద్ర, మురళీధర్, రాంచందర్‌రావు, కుమారస్వామి,  సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement