ఎస్‌బీఐ ‘పీవో’ను అందుకోండిలా... | SBI PO Recruitment for 2000 posts: Know the selection procedure | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ‘పీవో’ను అందుకోండిలా...

Published Thu, Apr 16 2015 4:41 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM

ఎస్‌బీఐ ‘పీవో’ను అందుకోండిలా... - Sakshi

ఎస్‌బీఐ ‘పీవో’ను అందుకోండిలా...

 ఖాళీల వివరాలు
 వర్గం    ఖాళీలు
 ఎస్సీ    308
 ఎస్టీ    339
 ఓబీసీ    541
 జనరల్    812
 మొత్తం    2,000
 
 అర్హతలు
 ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2015, సెప్టెంబర్ 1లోగా గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్వ్యూ సమయంలో ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. వయసు: 2015, ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు, ఓబీసీలకు 13 ఏళ్లు, జనరల్ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
 
 ఎంపిక విధానం
 ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లు ఉంటాయి. అభ్యర్థులు సెక్షన్ల వారీగా కటాఫ్ మార్కులు సాధించాలి. ఇలా అర్హత మార్కులు సాధించిన వారి నుంచి కేటగిరీల వారీగా దాదాపు 1:20 నిష్పత్తిలో అభ్యర్థులను రెండో దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
 
 రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందు లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండు పరీక్షలను ఆన్‌లైన్లోనే నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ పూర్తవగానే డిస్క్రిప్టివ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్ టైపింగ్ ద్వారా డిస్క్రిప్టివ్ పరీక్ష సమాధానాలు రాయాలి. రెండు పరీక్షల్లోనూ సెక్షన్ల వారీగా నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. ఆబ్జెక్టివ్ పరీక్షలో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్ పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.మెయిన్‌లో బ్యాంకు నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన వారిని మూడో దశ (గ్రూప్ డిస్కషన్ 20 మార్కులకు, 30 మార్కులకు ఇంటర్వ్యూ) పరీక్షలకు ఎంపిక చేస్తారు. మెయిన్‌కు సంబంధించి 250 మార్కులను 75 మార్కులుగా పరిగణించి, అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. అదే విధంగా జీడీ, ఇంటర్వ్యూలకు సంబంధించిన 50 మార్కులను 25 మార్కులుగా పరిగణిస్తారు. మొత్తంమీద 100 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చాయో చూసి, తుది జాబితా రూపొందిస్తారు.
 
 పరీక్ష విధానం
 ప్రిలిమ్స్ (గంట):
 విభాగం    ప్రశ్నలు    మార్కులు
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    30    30
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    35    35
 రీజనింగ్ ఎబిలిటీ    35    35
 మొత్తం    100    100
 
 మెయిన్
 1.ఆబ్జెక్టివ్ టెస్ట్ (రెండు గంటలు):
 విభాగం    మార్కులు
 ఇంగ్లిష్    50
 జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్,
 కంప్యూటర్స్    50
 డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రిటేషన్    50
 రీజనింగ్ (హై లెవెల్)    50
 మొత్తం    200
 2.    డిస్క్రిప్టివ్ టెస్ట్ (గంట, 50 మార్కులు):
     ఇంగ్లిష్ లాంగ్వేజ్- లెటర్ రైటింగ్, ఎస్సే.
 
 ముఖ్య తేదీలు
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 2, 2015.
 దరఖాస్తు ఫీజు
 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ: రూ.100
 జనరల్, ఇతరులు: రూ.600
 ఆన్‌లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 2, 2015
 ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్, 2015
 
 పరీక్ష కేంద్రాలు
 ఆంధ్రప్రదేశ్:చీరాల, చిత్తూరు, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకులం, తిరుపతి, పుత్తూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
 తెలంగాణ:హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
 వెబ్‌సైట్లు:www.statebankofindia.com
     www.sbi.co.in
 
 వేతనాలు
 పీవో జీతభత్యాలు వారు పనిచేసే ప్రాంతం ఆధారంగా ఉంటాయి. నోటిఫికేషన్ ప్రకారం ప్రారంభంలో బేసిక్ పే రూ.16,900 (నాలుగు ఇంక్రిమెంట్లతో) ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ వంటివి అదనంగా ఉంటాయి. ముంబై లో పనిచేసే వారికి వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.8,55,000 ఉంటుంది. ఇక్కడ హెచ్‌ఆర్‌ఏ నెలకు రూ.29,500 ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏలో వ్యత్యాసం ఉంటుంది.
 
 ఎంపికైన అభ్యర్థులను రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంచుతారు. ఈ సమయంలో శిక్షణ ఇస్తారు. ప్రొబేషన్/ శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థుల సామర్థ్యాలను పరిశీలిస్తారు. పూర్తిస్థాయి ప్రమాణాలను అందుకున్న వారిని మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 ఆఫీసర్‌గా పూర్తిస్థాయిలో నియమిస్తారు. నిర్దేశ పరీక్షలో ఉత్తీర్ణులైనా, ప్రమాణాలను సరిగా అందుకోలేని వారిని జూనియర్ మేనేజ్‌మెంట్ స్కేల్-1 ఆఫీసర్‌గా నియమిస్తారు. ఈ ప్రక్రియలో విఫలమైన వారిని సర్వీసు నుంచి తొలగిస్తారు.
 
 జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్, కంప్యూటర్స్
 బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకోవాలి. బడ్జెట్, జీ 20, జీ 8 వంటి సదస్సులు, ముఖ్యమైన కమిటీలు, పుస్తకాలు-రచయితలు, క్రీడాంశాలు వంటి వాటిపై అవగాహన తప్పనిసరి. కరెంట్ అఫైర్స్‌పై పట్టుసాధించాలంటే నిరంతర అధ్యయనం అవసరం. కంప్యూటర్స్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇంటర్నెట్ ఆధారంగా (ఉదా: గిజ్చ్టి జీట ఆఇఇ?) మరికొన్ని నాన్ ఇంటర్నెట్ ఆధారంగా వస్తున్నాయి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివెసైస్, ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్, ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ వంటి వాటిపై అవగాహన అవసరం.
 
 మార్కెటింగ్: ఇది కొత్త సబ్జెక్టు కాబట్టి మార్కెటింగ్ పదజాలం, వాటి అర్థాలు తెలుసుకోవాలి. Selling, Marketing మధ్య ™ólyé, Product Life Cycle, Branding and Co Branding, Tag lines, 7 P's of Marketing, CRM conceఞ్టట వంటి వాటిపై అవగాహన అవసరం.రీజనింగ్ (హై లెవెల్): గత ప్రశ్నపత్రాలను బట్టి చూస్తే ఇన్‌పుట్-అవుట్‌పుట్ నుంచి 5 ప్రశ్నలు, కోడింగ్-డీకోడింగ్ నుంచి 5 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, పజిల్/సీటింగ్ అరేంజ్‌మెంట్స్ నుంచి 10, డేటా సఫీషియెన్సీ నుంచి 5, డెరైక్షన్, ఇతర అంశాల నుంచి 5 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.ఎస్సే రైటింగ్‌కు సంబంధించి సరైన ఎస్సే రాయాలంటే మంచి పదాలు, చిన్న వాక్యాలు రాస్తూ రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ముఖ్యమైన అంశాలను ఎంపిక చేసుకొని, ఎస్సేలు రాస్తూ ఫ్యాకల్టీతో దిద్దించుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న మార్పులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రాధాన్యత, రోల్ ఆఫ్ ఐఆర్‌డీఏ వంటి వాటిపై దృష్టిసారించాలి. లెటర్ రైటింగ్‌కు సంబంధించి పర్సనల్, అఫీసియల్ లెటర్స్ రాయడం ప్రాక్టీస్ చేయాలి. రోజువారీ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లెటర్స్ ద్వారా కమ్యూనికేషన్ అవసరమవుతుంది. అందువల్ల లెటర్ రైటింగ్‌ను సిలబస్‌లో చేర్చారు.
 
 సబ్జెక్టులపై పట్టు సాధించండి...
 ప్రిలిమ్స్‌లో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ప్రిలిమ్స్, మెయిన్ భిన్నంగా ఉంటాయి): ప్రిలిమ్స్‌లో సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్,యావరేజెస్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రస్ట్, కాంపౌండ్ ఇంట్రస్ట్,టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.క్లిష్టత: ఓ మోస్తరు నుంచి అధిక కాఠిన్యత ప్రశ్నలు ఉండొచ్చు. పీవో స్థాయి ప్రశ్నల సాధనను ప్రాక్టీస్ చేయాలి.
 
 మెయిన్‌లో డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలుంటాయి. ఇవి అధిక క్లిష్టంగా ఉంటాయి. అందువల్ల కటాఫ్ తక్కువగా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించేందుకు ప్రయత్నించకూడదు. సమయం వృథా అయ్యే ప్రశ్నలను విడిచిపెట్టాలి. తొలుత తేలికైన ప్రశ్నలను, తర్వాత ఓ మోస్తరు కష్టంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇంకా సమయం ఉంటే బాగా కష్టమైన ప్రశ్నలను అటెంప్ట్ చేయాలి. ప్రతిసారీ సూత్రాలు ఉపయోగించేందుకు ప్రయత్నించకూడదు. మైండ్ కాలిక్యులేషన్ టిప్స్‌ను ఉపయోగించుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో వీటి సహాయంతో సమాధానాలు గుర్తించడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి.
 
 రీజనింగ్:
 ప్రిలిమ్స్, మెయిన్‌కు ఒకే సిలబస్ ఉంటుంది. అయితే ప్రిలిమ్స్ కంటే మెయిన్‌లో ఇచ్చిన ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నప్పుడే కష్టమైన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్ చేస్తే, ఇది మెయిన్‌కు ఉపయోగపడుతుంది.
 
 ఇందులో కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ అండ్ సిరీస్, డెరైక్షన్స్, డెసిషన్ మేకింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, డౌజజీటఝట, క్రిటికల్ రీజనింగ్ అండ్ డేటా సఫీషియెన్సీ. సీటింగ్ అరేంజ్‌మెంట్, డౌజజీటఝట నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇవి కూడా క్లిష్టంగానే ఉంటున్నాయి కాబట్టి వీటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
 
 ఇంగ్లిష్:
 ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లోని ఇంగ్లిష్‌కు ఒకే సిలబస్ ఉంటుంది. గ్రామర్, వొకాబ్యులరీ, కాంప్రెహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్‌లో క్లోజ్ టెస్ట్ నుంచి 5-10, కాంప్రెహెన్షన్ నుంచి 5-10, స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 5, సెంటెన్స్ రీఎరేంజ్‌మెంట్, కంప్లీషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ నుంచి 5-10, ఫిల్ ఇన్‌ది బ్లాంక్స్ 5 ప్రశ్నలు ఉండొచ్చు. మెయిన్‌లో క్లోజ్ టెస్టు నుంచి 10 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ నుంచి 20 ప్రశ్నలు రావొచ్చు.
 
 స్పాటింగ్ ఎర్రర్స్ నుంచి 5నుంచి 10 ప్రశ్నలు; సెంటెన్స్ అరేంజ్‌మెంట్, కంప్లీషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ నుంచి 5 నుంచి 10 ప్రశ్నలు రావొచ్చు. ఇతర అంశాల నుంచి 5-10 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు క్లోజ్‌టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ కంప్లీషన్, ఇంప్రూవ్‌మెంట్ అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. గ్రామర్, వొకాబ్యులరీ అంశాలపై పట్టు సాధిస్తే ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. డిక్షనరీ ఉపయోగించి, రోజూ ఇంగ్లిష్ పత్రిక చదవాలి. కొత్త పదాలను, వాటిని ప్రయోగిస్తున్న తీరును నేర్చుకోవాలి. మెయిన్ పరీక్షలో డిస్క్రిప్టివ్ టెస్ట్‌లో కంప్యూటర్ కీ బోర్‌‌డతో సమాధానాలను టైపు చేయాలి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి.
 - ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి,
 డెరైక్టర్ ఐఏసీఈ, హైదరాబాద్.
 
 నచ్చిన సబ్జెక్టులో మరింత పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని, ఉద్యోగ మార్కెట్లో సమున్నత అవకాశాలను అందుకునేందుకు పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. పరిశోధనల దిశగా వెళ్లాలన్నా పీజీ పూర్తిచేయాల్సిందే. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ చేయాలనుకుంటే వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో ప్రతిభ చూపాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు యూనివర్సిటీలు వచ్చే విద్యా సంవత్సరానికి  పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. వీటిపై స్పెషల్ ఫోకస్..
 
 సంప్రదాయ సబ్జెక్టులకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ డిమాండ్, పారిశ్రామిక అవసరాలకు తగినట్లు ఎన్నో కొత్త స్పెషలైజేషన్లను విశ్వవిద్యాలయాలు పీజీ స్థాయిలో అందిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ (బీఎస్సీ+ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీజీ కోర్సులకు గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూ సెట్-2015)
 
 భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు:
 హర్యానా, జమ్మూ, జార్ఖండ్, కాశ్మీర్, కేరళ, పం జాబ్, రాజస్థాన్, తమిళనాడు సెంట్రల్ వర్సిటీల్లో ప్రవేశాలకు సీయూ సెట్-2015 నిర్వహిస్తారు.
 
 కోర్సులు:

 ఎంఎస్సీలో జీనోమిక్ సైన్స్, యానిమల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్, ఫిజికల్ కెమిస్ట్రీ, స్పోర్ట్స్ సైన్స్ వంటి స్పెషలైజేషన్లతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.ఎంఏలో ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టెక్నాలజీ, హ్యూమన్ రైట్స్ అండ్ కన్‌ఫ్లిక్ట్స్ మేనేజ్‌మెంట్, ఫైన్‌ఆర్ట్స్ తదితర కోర్సులున్నాయి. ఎంకామ్, ఎంఫార్మ్, ఇంటెగ్రేటెడ్ ఎంఎస్సీ, బీఈడీ వంటి కోర్సులను విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేస్తున్నాయి.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 5, 2015.పరీక్ష తేదీలు: జూన్ 6, జూన్ 7, 2015.
 హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.వెబ్‌సైట్: cucet2015.co.in
 
 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
 (తిరుపతి)
 
 ఎస్‌పీఎంవీవీ పీజీ సెట్ ద్వారా విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల్లోకి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆఫర్ చేస్తున్న కోర్సులు:ఎంఎస్సీ: అప్లయిడ్ మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.ఎంఏ: ఎకనామిక్స్; ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్; తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ట్రాన్స్‌లేషన్, మ్యూజిక్ వంటి సబ్జెక్టులున్నాయి.ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఈడీ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి.దరఖాస్తుకు చివరి తేదీ: మే 11, 2015. పరీక్షలు ప్రారంభం: మే 23, 2015.
 వెబ్‌సైట్: www.spmvv.ac.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement