
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం సమాచారమిచ్చింది. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు బుధవారం యూపీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment