Union Public Service Commission
-
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్–2 ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పరీక్షలను యథావిధిగా నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తారు. ► దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ► ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. ► అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ► వీటిని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ► అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఈ–అడ్మిట్ కార్డుతో పాటు అధికారికి ఫొటో గుర్తింపుకార్డును చూపించాలి. రెండింటిలోని ఫొటోలు ఒకేమాదిరిగా ఉండాలి. ► పరీక్ష ప్రారంభానికి పది నిముషాల ముందే ప్రవేశద్వారాలను మూసివేస్తారు. ► పరీక్ష కేంద్రాల్లోకి బాల్‌పాయింట్ పెన్నును అనుమతిస్తారు. చేతి గడియారాలు, స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ పరికరాలను నిషేధించారు. ► మాస్కులు లేకుంటే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పారదర్శక సీసాల్లో శానిటైజర్‌ను అనుమతిస్తారు. -
జూన్ 5న యూపీఎస్సీ పరీక్ష తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలకు సంబంధించి వివరాలు వచ్చే నెల 5న ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం సమాచారమిచ్చింది. పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు బుధవారం యూపీఎస్సీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతమున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం లేదని, అందుకే వాయిదా వేస్తున్నట్లు మే 4న చెప్పిన సంగతి తెలిసిందే. -
సివిల్స్ వయోపరిమితి 27 ఏళ్లు ఎందుకు?
సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్ష వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 32 ఏళ్ల నుంచి 27 ఏళ్లకు తగ్గించాలని నీతి ఆయోగ్ సూచించిన విషయం చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీఎస్ స్వాన్ కమిటీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు 2016 ఆగస్టు 9న సమర్పించిన నివేదికలో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షలకు వయోపరిమితిని 26 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ.. సివిల్స్ పరీక్ష పద్ధతిలో కొన్ని మార్పులను సూచించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం ఇప్పుడున్న 37 సంవత్సరాల వయోపరిమితిని కొనసాగించాలని పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్స్కూల్ ఆఫ్ బిజినెస్, యూసీ బెర్క్లీ హౌస్ స్కూల్ ఆఫ్ బిజినెస్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సివిల్ సర్వీసెస్‌పై తాజా అధ్యయనం చేశాయి. అర్హత ప్రవేశ పరీక్షకు వయోపరిమితి తగ్గించడం వల్ల అధికారుల సేవలను ఎక్కువగా వినియోగించుకునే అవకాశాన్ని నొక్కి చెప్పాయి. ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్‌లోకి అడుగు పెట్టిన వారికి పదోన్నతిలో అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత పదవి అయిన చీఫ్ సెక్రటరీ, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా చేరుకునేందుకు కనీసం పాతిక నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్ల లోపే ఇదంతా జరగాల్సి ఉంటుంది. కానీ 30 ఏళ్లకో, 32 ఏళ్లకో ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తికి ఆ పదవి చేరుకునే అవకాశమే ఉండదు. సివిల్ సర్వీసెస్‌లో చేరే నాటికి వారి వయసును బట్టి వారి పనితీరు సామర్థ్యంలోనూ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ వయసులో సివిల్ సర్వీసెస్ ఉద్యోగంలో చేరిన వారు ఆ రంగంలో అత్యున్నత వేతనాన్ని అందుకుంటున్న పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. 22 ఏళ్లకే సివిల్స్ రంగంలోకి అడుగిడిన వారిలో దాదాపు 80 శాతం మంది చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవుతున్నారు. అయితే 29–30 ఏళ్ల మధ్య సర్వీస్‌లోకి ప్రవేశించిన వారికి మాత్రం ఈ అవకాశమే లేదని తెలుస్తోంది. ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ఏ వయసులో విధుల్లో చేరుతున్నారనేదానిపై కూడా ఆధారపడి ఉంటుందని తేల్చారు. దీంతో సివిల్ సర్వీసెస్ అర్హత పరీక్షకు అంతిమ వయ సు 27 ఏళ్లకు తగ్గించాలన్న అభిప్రాయానికి కారణమయ్యాయి. ఈ మార్పుల వల్ల ఎక్కువ మందికి అత్యున్నత హోదాకు చేరుకునే అవకాశం ఉంటుందన్నది పలువురి వాదన. అలాగే ఈ మార్పులో దళితులకు, ఆదివాసీలకు ఐదేళ్ల మినహాయింపు కొనసాగుతుంది. -
సివిల్స్ టాపర్ మార్కులు 55.6 శాతం
న్యూఢిల్లీ: 2017లో సివిల్స్‌కు ఎంపికైన వారి మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం విడుదల చేసింది. అత్యంత కఠినంగా ఉండే సివిల్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ తెలుగు విద్యార్థి దురిశెట్టి అనుదీప్ 55.60 శాతం మార్కులు సాధించాడు. సివిల్స్ మెయిన్స్ 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 కలిపి మొత్తం 2,025 మార్కులకు.. అనుదీప్ రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులతో మొత్తం 1,126 మార్కులు సాధించాడు. రెండో ర్యాంకు సాధించిన అను కుమారి 1,124 (రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులతో 55.50%, మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం (946 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 176) మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో 750 మంది పురుష, 240 మహిళా అభ్యర్థులు మొత్తం 990 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ 830 మార్కుల (687 రాతపరీక్ష, 143 ఇంటర్వ్యూ)తో 40.98శాతం సాధించాడు. -
ఇకపై అభ్యర్థుల మార్కులు బహిర్గతం
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కుల వివరాలను ఇకపై ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఈ మార్కుల ఆధారంగా ప్రైవేటు సంస్థలు కూడా నియామకాలు చేపట్టడానికి తోడ్పడుతుందని పేర్కొంది. ఇందులో భాగంగా యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో తుది ఇంటర్వూ్య వరకు వెళ్లిన అభ్యర్థుల విద్యార్హతతోపాటు ఈ పోటీ పరీక్షలో సాధించిన మార్కులను ఆన్లైన్లో పొందుపరచనున్నారు. తద్వారా అభ్యర్థుల ప్రతిభ, సామర్థ్యాన్ని ప్రైవేటు సంస్థలు గుర్తించి వారికి ఉపాధి కల్పిస్తాయని యూపీఎస్సీ పేర్కొంది. ఇందుకోసం పబ్లిక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు వీరి సమాచారాన్ని అనుసంధానం చేసేలా అంతర్గత సమాచార వ్యవస్థతో కూడిన వెబ్‌సైట్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అభివృద్ధి చేస్తోంది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేపుడు అభ్యర్థులు తమ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని తెలపాల్సి ఉంటుంది. -
జూన్ 18న సివిల్స్ ప్రిలిమ్స్
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 18కి మార్చుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల తర్వాత యూపీఎస్సీ జూన్ నెలలో ప్రిలిమ్స్‌ను నిర్వహించనుంది. 2014, 2015, 2016 ల్లో ఆగస్టు నెలలో ప్రిలిమ్స్‌ను నిర్వహించారు. మొత్తం 980 ఖాళీలకు నిర్వహించనున్న ఈ పరీక్షలో 27 ఖాళీలను దివ్యాంగులకు కేటాయించారు. ప్రిలిమ్స్–2017కు మార్చి 17 సాయంత్రం ఆరుగంటల వరకే దరఖాస్తులు స్వీకరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. -
యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా డేవిడ్
కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా విద్యావేత్త డేవిడ్ ఆర్ సిమ్లిహ్ నియామకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డేవిడ్ 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యునిగా ఉన్నారు. షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన డేవిడ్.. అదే వర్సిటీలో పలు హోదాల్లో పనిచేశారు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. మరోవైపు కస్టమ్స్ అంశాలకు సంబంధించి భారత్ – ఉరుగ్వే మధ్య ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ ఒప్పందం జరిగితే ఇరు దేశాల కస్టమ్స్ అధికారులు సమాచార మార్పిడి.. నిఘా విషయాలను బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ఉన్నత హోదా, గౌరవం @ ఐఏఎస్
ఎర్ర బుగ్గ కారు.. వ్యక్తిగత సిబ్బంది.. పోలీసు భద్రత.. విస్తృత అధికారాలు.. ప్రజలకు సేవ చేసే అవకాశాలు.. సమాజంలో గౌరవ మర్యాదలు.. అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయం.. సకల సౌకర్యాలున్న విశాలమైన బంగ్లాలో వసతి.. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అనగానే గుర్తుకొచ్చే కొన్ని ప్రత్యేకతలు. సమాజంలో గౌరవం, ఉన్నత హోదాతోపాటు ఎంతో సంతృప్తినిచ్చే ఐఏఎస్ కొలువు కోరుకోని వారుండరు. సివిల్స్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఐఏఎస్ అధికారి ఎంపిక విధానం, రోజువారీ కార్యకలాపాలు క్లుప్తంగా.. ఎంపిక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా ఒకసారి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో 3 దశలు ఉంటాయి. ఒకటి.. ప్రిలిమ్స్. రెండు.. మెయిన్స్. మూడు.. ఇంటర్వ్యూ. వీటిలో వర్తమాన అంశాలు మొదలుకొని తార్కిక పరిజ్ఞానం వరకు దాదాపు అన్ని విషయాలపైన అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స, ఇంటర్వ్యూల మార్కులతో రిజర్వేషన్లు, ఇతర నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్‌కు ఎంపిక చేస్తారు. కనీసం బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణులైనవారు పరీక్ష రాయొచ్చు. విధులు ఐఏఎస్ శిక్షణ పూర్తయినవారు జాతీయ స్థాయిలో అండర్ సెక్రెటరీగా, రాష్ట్ర స్థాయిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్/సబ్ కలెక్టర్/జాయింట్ కలెక్టర్/డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తారు. తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, సాధారణ పరిపాలనకు బాధ్యత వహించాలి. రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలి. సంబంధిత శాఖ మంత్రిని సంప్రదిస్తూ సర్కారు విధానాలను రూపొందించాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడంతోపాటు నిరంతరం నిఘా పెట్టాలి. ప్రభుత్వ పథకాలను ఏవిధంగా అమలుచేయాలో తన కింది స్థాయి అధికారులకు వివరించాలి. ఉన్నత స్థాయిలో పనిచేసే ఐఏఎస్‌లు ప్రభుత్వ విధానాల ఖరారులో, తుది నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఐఏఎస్‌లు విధి నిర్వహణలో వివిధ స్థాయి వ్యక్తులను కలుస్తారు. సాధారణ ప్రజల నుంచి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులతో సైతం భేటీ అవుతారు. అంతర్జాతీయ సదస్సులకు హాజరవుతారు. నిరుపేదలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, కర్షకులు, కార్మికులు తదితర అన్ని వర్గాల వారు ఐఏఎస్ అధికారిని కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తెస్తారు. వీటి తీవ్రతను బట్టి ఐఏఎస్‌లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తారు. క్రమశిక్షణ తప్పిన ఉద్యోగులను హెచ్చరిస్తారు. ఒక్కోసారి సస్పెండ్ చేసేందుకూ వెనుకాడరు. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులను ‘ఉత్తమ’ పురస్కారంతో సత్కరిస్తారు. కావాల్సిన నైపుణ్యాలు ఉన్నతంగా ఆలోచించాలి. సమస్యలను సానుకూలంగా విశ్లేషించాలి. అభివృద్ధి విషయంలో గణాంకాలకే పరిమితం కాకుండా గుణాత్మకంగా వ్యవహరించాలి. ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్ ప్రయోజనాలనూ బేరీజు వేసుకోవాలి. పక్కా ప్రణాళికతో పథకాల అమలును చక్కబెట్టాలి. కష్టపడి పని చేయాలి. ప్రజల మనిషిగా వ్యవహరించగలగాలి. పనివేళలు రోజువారీ కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఉదయం 9, 10 గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది. వివిధ విభాగాల నుంచి వచ్చే ఫైల్స్‌ను పరిశీలించి సంతకాలు చేస్తారు. ప్రజల నుంచి అందే విజ్ఞప్తులను పరిశీలిస్తారు. రోజుకు రెండు, మూడు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇ-మెయిల్స్/లెటర్స్/ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని సమాధానమిస్తారు అత్యవసర కార్యక్రమాలు లేకపోతే రాత్రి ఏడెనిమిది గంటలకే విధులు ముగించుకొని అధికారిక నివాసానికి చేరుకుంటారు. సానుకూలతలు జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఎక్కడైనా పనిచేసే వెసులుబాటు ఉంటుంది. విస్తృత స్థాయిలో అధికారాలు ఉంటాయి. పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్క సంతకంతో వందల మందికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పాలుపంచుకోవచ్చు ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించే వీలు కలుగుతుంది. పనివేళలు రోజువారీ కార్యక్రమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతారు. ఉదయం 9, 10 గంటలకు దినచర్య ప్రారంభమవుతుంది. వివిధ విభాగాల నుంచి వచ్చే ఫైల్స్‌ను పరిశీలించి సంతకాలు చేస్తారు. ప్రజల నుంచి అందే విజ్ఞప్తులను పరిశీలిస్తారు. రోజుకు రెండు, మూడు శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇ-మెయిల్స్/లెటర్స్/ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకొని సమాధానమిస్తారు అత్యవసర కార్యక్రమాలు లేకపోతే రాత్రి ఏడెనిమిది గంటలకే విధులు ముగించుకొని అధికారిక నివాసానికి చేరుకుంటారు. ప్రతికూలతలు నాణేనికి మరోవైపు అన్నట్లు.. ఎంత బాధ్యతాయుతమైన ఉద్యోగమో అంతే బాధాకరమైన ఉద్వేగాలకూ అలవాటుపడాల్సి వస్తుంది. తరచుగా ఇతర ప్రాంతాలకు బదిలీ అవుతుంటారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల రాజీపడుతూ అసంతృప్తికి గురౌతారు. విధి నిర్వహణలో ఒక్కోసారి విభిన్న అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలుచేయలేకపోతే పాలకులకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సేవ చేయాలని మనసులో ఎంత తపన ఉన్నా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. సెలవులు చాలా తక్కువ ఉంటాయి. -
ఉద్యోగ సమాచారం
యూపీఎస్సీలో 457 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి కంబైన్డ డిఫెన్స సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ)ను నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 457 (ఇండియన్ మిలటరీ అకాడెమీ-200, ఇండియన్ నావెల్ అకాడెమీ-45, ఎయిర్ఫోర్స అకాడెమీ-32, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (మెన్)-175, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (ఉమెన్)-5). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 4. పూర్తి వివరాలకు www.upsc.gov.in, ఎంప్లాయ్మెంట్ న్యూస్ (నవంబర్ 7-13 సంచిక) చూడొచ్చు. అంబేడ్కర్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్లు న్యూఢిల్లీలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 126 (ఓపెన్-67, ఓబీసీ-39, ఎస్సీ-13, ఎస్టీ-7). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 24, 26, 27. పూర్తి వివరాలకు http://delhi.gov.inచూడొచ్చు. అణు ఇంధన విభాగం పరిధిలో సిబ్బంది అణు ఇంధన విభాగం పరిధిలోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీ.. సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 74 (అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-12, సెక్యూరిటీ గార్డ-58). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.cat.ernet.inచూడొచ్చు. ‘శ్రీచిత్ర తిరునాళ్’లో అప్రెంటిస్‌లు తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.. లైబ్రరీ సైన్సలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు ఏడు ప్లస్ ప్యానెల్. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 25. పూర్తి వివరాలకు www.sctimst.ac.inచూడొచ్చు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో స్టోర్ కీపర్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.. అసిస్టెంట్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (ఓపెన్-4, ఎస్సీ-2). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.cgwb.gov.inచూడొచ్చు. కృషి విద్యాపీఠ్‌లో వివిధ పోస్టులు అకోలా(మహారాష్ట్ర)లోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (అసిస్టెంట్ బయోకెమిస్ట్-1, సీనియర్ మెకానిక్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, వెల్డర్-1, ఫిట్టర్-1, లాబ్ అసిస్టెంట్-1). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.pdkv.ac.inచూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఐసీఏఆర్ అనుబంధ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్‌డ రీసెర్చ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (మాలిక్యులర్ బ్రీడింగ్-2, హైబ్రిడ్ మస్టర్‌డ కంపొనెంట్-3). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 19. పూర్తి వివరాలకు www.drmr.res.inచూడొచ్చు. ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వివిధ పోస్టులు ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (రీసెర్చ అసోసియేట్-1, జేఆర్ఎఫ్-2, ఫీల్డ్ అసిస్టెంట్-2). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.icfre.orgచూడొచ్చు. బిహార్ వర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు సౌత్ బిహార్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 35. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 30. వివరాలకు www.cub.ac.inచూడొచ్చు. టూరిజం కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్‌లు ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 23. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 20. వివరాలకు www.theashokgroup.comచూడొచ్చు. గాంధీనగర్ ఐఐటీలో స్టాఫ్ గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఖాళీలు-7), సీనియర్ సిస్టం ఎనలిస్ట్ (ఖాళీలు-1), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్ అండ్ సివిల్) (ఖాళీలు-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 5. వివరాలకు www.iitgn.ac.inచూడొచ్చు. ఐఐసీటీలో వివిధ పోస్టులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఎస్ఆర్ఎఫ్, జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 36. ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 20. వివరాలకు www.iictindia.orgచూడొచ్చు. ఉత్తరాఖండ్ ఎయిమ్స్‌లో స్టాఫ్‌నర్స్ పోస్టులు ఉత్తరాఖండ్‌లోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. స్టాఫ్ నర్స గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 200. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27. వివరాలకు www. aiimsrishikesh.edu. in చూడొచ్చు. గోవా నిట్‌లో నాన్ టీచింగ్ పోస్టులు గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. రెగ్యులర్/ డిప్యుటేషన్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 11. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 25. వివరాలకు www.nitgoa.ac.inచూడొచ్చు. ‘మెడికల్ ఎడ్యుకేషన్’లో రిక్రూట్మెంట్ చంఢీగడ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ (పీజీఐఎంఈఆర్).. వికలాంగుల కోటాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 56. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 7. వివరాలకు www.pgimer.edu.inచూడొచ్చు. ఆర్‌జీసీబీలో సైంటిస్ట్ పోస్టులు రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్జీసీబీ).. వివిధ విభాగాల్లో సైంటిస్ట్ (ఈ-1, ఈ-2, ఎఫ్, జీ) పోస్టుల భర్తీకి ద రఖాస్తులు ఆహ్వానిస్తోంది. దర ఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31. వివరాలకు www.rgcb.res.inచూడొచ్చు. -
ఉద్యోగ సమాచారం
యూపీఎస్సీలో 457 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ పోస్టుల భర్తీకి కంబైన్డ డిఫెన్స సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ)ను నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 457 ((ఇండియన్ మిలటరీ అకాడెమీ-200, ఇండియన్ నావెల్ అకాడెమీ-45, ఎయిర్ఫోర్స అకాడెమీ-32, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (మెన్)-175, ఆఫీసర్స ట్రైనింగ్ అకాడెమీ (ఉమెన్)-5)). ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 4. పూర్తి వివరాలకు www.upsc.gov.inగానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ (నవంబర్ 7-13 సంచిక) గానీ చూడొచ్చు. అంబేడ్కర్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్లు న్యూఢిల్లీలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్.. సీనియర్ రెసిడెంట్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 126 (ఓపెన్-67, ఓబీసీ-39, ఎస్సీ-13, ఎస్టీ-7). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 24, 26, 27. పూర్తి వివరాలకు http://delhi.gov.in/wps/wcm/connect/ doit_ dbsah /DBSAH/Homeచూడొచ్చు. అణు ఇంధన విభాగం పరిధిలో సెక్యూరిటీ సిబ్బంది అణు ఇంధన విభాగం పరిధిలోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ టెక్నాలజీ.. సెక్యూరిటీ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 70 (అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-12, సెక్యూరిటీ గార్డ-58). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. పూర్తి వివరాలకు www.cat.ernet.inచూడొచ్చు. శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్లో అప్రెంటిస్‌లు తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునాళ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ.. లైబ్రరీ సైన్సలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 7 ప్లస్ ప్యానెల్. ఇంటర్వ్యూ తేది నవంబర్ 25. పూర్తి వివరాలకు www.sctimst.ac.inచూడొచ్చు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో స్టోర్ కీపర్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు.. అసిస్టెంట్ స్టోర్ కీపర్ (గ్రూప్-సీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6 (ఓపెన్-4, ఎస్సీ-2). దరఖాస్తులకు చివరి తేది నవంబర్ 30. పూర్తి వివరాలకు www.cgwb.gov.in/Vacancies/ASK-CR0615.ఞఛీజ చూడొచ్చు. కృషి విద్యాపీఠ్‌లో వివిధ పోస్టులు అకోలా(మహారాష్ట్ర)లోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 6 (అసిస్టెంట్ బయోకెమిస్ట్-1, సీనియర్ మెకానిక్-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-1, వెల్డర్-1, ఫిట్టర్-1, లాబ్ అసిస్టెంట్-1). ఇంటర్వ్యూ తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు www.pdkv.ac.inచూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో ఎస్‌ఆర్‌ఎఫ్‌లు ఐసీఏఆర్ అనుబంధ సంస్థ డెరైక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్‌డ రీసెర్చ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రీసెర్చ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (మాలిక్యులర్ బ్రీడింగ్-2, హైబ్రిడ్ మస్టర్‌డ కంపొనెంట్-3). ఇంటర్వ్యూ తేది నవంబర్ 19. పూర్తి వివరాలకు www.drmr.res.inచూడొచ్చు. ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో వివిధ పోస్టులు ఫారెస్ట్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 5 (రీసెర్చ అసోసియేట్-1, జేఆర్ఎఫ్-2, ఫీల్డ్ అసిస్టెంట్-2). ఇంటర్వ్యూ తేది నవంబర్ 18. పూర్తి వివరాలకు www.icfre.orgచూడొచ్చు. -
ఉద్యోగ సమాచారం
యూపీఎస్సీలో 169 పోస్టులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఆపరేషన్స (ఖాళీలు-11), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ ప్రొఫెసర్ - కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ అండ్ థొరాసిక్ సర్జరీ (ఖాళీలు-8), అసిస్టెంట్ కెమిస్ట్ (ఖాళీలు-4), అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఖాళీలు-139), డిప్యూటీ డెరైక్టర్ (ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఖాళీలు-1). ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.upsconline.nic.in చూడొచ్చు. ఢిల్లీ మెట్రోలో 1,509 పోస్టులు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-2), నాన్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-1,507) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.delhimetrorail.com చూడొచ్చు. ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో వివిధ పోస్టులు ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్).. రె గ్యులర్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. మైనింగ్ సిర్దార్ (ఖాళీలు-631), డిప్యూటీ సర్వేయర్ (ఖాళీలు-43), ఓవర్సీర్ (ఖాళీలు-48). వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.easterncoal.gov.in చూడొచ్చు. యూకో బ్యాంక్‌లో 100 చార్టర్‌డ అకౌంటెంట్ పోస్టులు యూకో బ్యాంక్.. వివిధ విభాగాల్లో చార్టర్‌డ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దర ఖాస్తుకు చివరి తేది నవంబర్ 20. వివరాలకు www.ucobank.com చూడొచ్చు. ఎన్ఎఫ్సీలో సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్లు హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-2), సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు-4), స్టెనోగ్రాఫర్ (ఖాళీలు-12). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 14. వివరాలకు www.nfcrecruitment.in చూడొచ్చు. సీఆర్పీఎఫ్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్టు డాక్టర్లు (ఖాళీలు-2), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి నవంబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crpf.nic.in చూడొచ్చు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో స్పెషల్ రిక్రూట్మెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్.. వికలాంగుల కోటాలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 122. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.ssc.nic.in చూడొచ్చు. సీసీఐలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్లు ఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ).. వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్/జోనల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కెమికల్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఎగ్జ్జిక్యూటివ్ సెక్రటరీ, జూనియర్ స్టాఫ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 31. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 19. వివరాలకు www.cementcorporation.co.in చూడొచ్చు. భోపాల్ ఎయిమ్స్‌లో వివిధ పోస్టులు భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. మూడేళ్ల వ్యవధికి వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.aiimsbhopal.edu.in చూడొచ్చు. కిరోరి మాల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజ్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 43. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.kmcollege.ac.in చూడొచ్చు. చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో సీనియర్,జూనియర్ రెసిడెంట్స్ ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. అడ్హాక్ పద్ధతిలో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ (ఖాళీలు- 12), జూనియర్ రెసిడెంట్ (ఖాళీలు-10) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 30. వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో పోస్టులు హైకోర్ట ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్.. క్లర్క/ప్రూఫ్ రీడర్ (ఖాళీలు-9), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ (ఖాళీలు-16) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 17. వివరాలకు www.hphighcourt.nic.in చూడొచ్చు. నాల్కోలో డిప్యూటీ మేనేజర్లు/మేనేజర్లు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో).. డిప్యూటీ మేనేజర్/ మేనేజర్ (ఖాళీలు-9), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.nalcoindia.com చూడొచ్చు. డా. హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ పొజిషన్లు మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్, అకడమిక్ పొజిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 21. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.dhsgsu.ac.in చూడొచ్చు. పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో టీచింగ్ (ఖాళీలు-3), నాన్ టీచింగ్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10. వివరాలకు www.nitpy.ac.in చూడొచ్చు. ఎన్ఐఐఎస్టీలో వివిధ పోస్టులు తిరువనంతపురంలోని సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ఎస్పీఎఫ్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఖాళీలు- 16 ), రీసెర్చ అసోసియేట్ (ఖాళీలు-4), ప్రాజెక్ట్ అసోసియేట్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ ఫెలో (ఖాళీలు -1) పోస్టుల భర్తీకి అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.niist.res.in చూడొచ్చు. -
ఎడ్యుకేషన్ & జాబ్స్
నేటి యూపీఎస్సీ పరీక్షలకు సర్వం సన్నద్ధం 14 కేంద్రాలు.. 5,756 మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా ఆదివారమే ఉండటంతో.. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరవుతున్న 5,756 మంది అభ్యర్థుల కోసం నగరంలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణకు కో-ఆర్డినేటర్‌గా హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్‌గా డీఆర్ఓ అశోక్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఢిల్లీ నుంచి ఐదుగురు పరిశీలకులు రానున్నారు. 24 మంది అభ్యర్థులకు ఒకర్ని చొప్పున ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు. ఎస్టీపీఐలో కాంట్రాక్టు ఉద్యోగాలు హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1), మెంబర్ టెక్నికల్ సపోర్ట స్టాఫ్ (ఖాళీలు-4), అసిస్టెంట్ (ఖాళీలు-8). ఆన్లైన్ దరఖాస్తుకు చివ రి తేదీ నవంబర్ 23. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.జిడఛీ.ట్టఞజీ.జీ చూడొచ్చు. ఎన్ఎస్ీసీఎల్లో ట్రెయినీలు నేషనల్ సీడ్స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్సీఎల్)... డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in. హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు. జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్ గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15. వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు htpp://gdch.goa.gov.in చూడొచ్చు. ఎన్ఎండీసీలో మేనేజర్లు హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు. ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్ప్స భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 9, 2016. మరిన్ని వివరాలకు htpp//join indianarmy.nic.in చూడొచ్చు. - టీఎస్ఎస్పీడీసీఎల్లో 201 ఏఈ పోస్టులు నోటిఫికేషన్ జారీ.. 8వ తేదీ నుంచి దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. శనివారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 201 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. బీఈ, బీటెక్ (ఈఈఈ) విద్యార్హత కలిగినవారు వచ్చే నెల 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 22న పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ సదవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులంతా వినియోగించుకోవాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి కోరారు. రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు. - రాజస్థాన్ సెంట్రల్ వర్సిటీ వీసీగా పూజారి సాక్షి, హైదరాబాద్ : రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్‌లర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ కె.పూజారి నియమితులయ్యారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నుంచి శనివారం ఆయన ఈ మేరకు ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో ఒడిశాలోని సంబల్పూర్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన అనుభవం పూజారికి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, డీఆర్డీఓ, ఇస్రో, ఏఐసీటీఈ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యునిగా కూడా పనిచేశారు. 1985లో హెచ్‌సీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయన ప్రస్తుతం అదే వర్సిటీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్ విభాగం డీన్‌గా వ్యవహరిస్తున్నారు. - ‘ప్రైవేటు’ ప్రవేశాలు నమ్మొద్దు సాక్షి, హైదరాబాద్: బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామంటూ ఈ మధ్య కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయని... వాటిని చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటితో తమ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. - ఓపెన్ వర్సిటీ అడ్మిషన్లకు 17 గడువు సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 17వ తేదీ చివరి గడువని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ గడువులోగా జరిమానా లేకుండా 2015-16 విద్యాసంవత్సరానికిగాను డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. - 4న ఏఈ ఉద్యోగ నియామకాలపై సదస్సు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలోని ఏఈ పోస్టుల భర్తీపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 4వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎలైట్స్ ఫోరం నాయకులు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సును ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్షా విధానంపై విశ్లేషించడానికి ఏసీఈ ఇంజనీరింగ్ అకాడమీ డెరైక్టర్ గోపాలకృష్ణమూర్తి, జేఎన్టీయూ, ఉస్మానియా ప్రొఫెసర్లు హాజరవుతున్నారని చెప్పారు. వివరాలకు 7032924410, 8886612415 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. - బీఈడీ ప్రవేశాల గడువు పొడిగింపు హైదరాబాద్: బీఈడీ కళాశాలలో సీటు లభించిన అభ్యర్థుల ప్రవేశాల గడువును ఈ నెల 26 నుంచి 29 వరకు పొడిగించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం పురస్కరించుకుని గడువు పొడిగించినట్లు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రొ.ప్రసాద్ తెలిపారు. తేదీల్లో మార్పును గమనించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రవేశ కార్డులు తీసుకోవాలని సూచించారు. -
నేడే సివిల్స్ ప్రిలిమ్స్
రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 48,834 మంది అభ్యర్థులు హైదరాబాద్: ఈ నెల 23న సివిల్స్ ప్రిలిమినరీ-2015 పరీక్షను నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9.5లక్షల మంది ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 48,834 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్‌లోనే 102 కేంతద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గంటలకు జనరల్‌స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటలకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టు పరీక్ష ప్రారంభం కానుంది. పరీక్ష ప్రారంభం అయిన 10 నిమిషాల వరకు కూడా అభ్యర్థులను అనుమతిస్తారు. బధిరులకు అదనంగా ఒక్కో పేపరుకు 20 నిమిషాల సమయం ఇస్తారు. తెలంగాణలో ఈ పరీక్షలకు పరిశీలకులుగా ఐదుగురు ఐఏఎస్ అధికారులు శర్మన్, గౌరవ్ ఉప్పల్, పాండదాస్, డి.వెంకటేశ్వరరావు, ప్రశాంతిలను నియమించారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులు(సూపర్వైజర్లు)గా 60 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కో ఆర్డినేటర్‌గా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, అసిస్టెంట్ కోఆర్డినేటర్‌గా డీఆర్వో అశోక్‌కుమార్ వ్యవహారిస్తున్నారు. -
యూపీఎస్సీ పరీక్షలకు 32 కేంద్రాలు
23న పరీక్ష హాజరు కానున్న అభ్యర్థులు 15,589 10 నిమిషాలు ఆలస్యమైనా ప్రవేశం అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల ఏర్పాటు అధికారులతో సమావేశంలో కలెక్టర్ విజయవాడ : నగరంలో ఈ నెల 23న నిర్వహించనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షలకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ కసరత్తు చేస్తున్నారు. స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయంలో గురువారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలో 32 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 15 వేల 589 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, పరికరాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావటాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలన్నారు. పరీక్షలను పూర్తి భద్రత తో, స్నేహభావంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రం నుంచి ఏ అభ్యర్థీ ఓఎంఆర్ షీట్, క్వశ్చన్ పేపర్ బయటకు తీసుకువెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అభ్యర్థి బయటకు తీసుకువెళితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ విధింపు... పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలకు చెందిన పేపరు-1 ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, పేపరు-2 మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులను 10 నిమిషాల వరకు ఆలస్యమైనా అనుమతిస్తామని చెప్పారు. నగరంలో నిర్వహించే పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసేందుకు నగరంలో ఫెలిసిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 0886 248155 లేదా 2778090 నంబర్లకు ఫోన్ చేసి ఈ కేంద్రాల నుంచి సమాచారం తెలుసుకోవాలని కోరారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు బస్టాండు, రైల్వేస్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదే శించారు. అంధులు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్ పరీక్షలు రాస్తున్న 43 మంది అంధులు, వికలాంగ అభ్యర్థుల కోసం నగరంలో విశాలాంధ్ర కార్యాలయం పక్కనే శాతవాహన కాలేజీలో ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్-2 శేషయ్య, డీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. హాల్‌టిక్కెట్ రాని అభ్యర్థులకు సూచనలు హాల్‌టిక్కెట్ రాని అభ్యర్థులు ఒక ఫొటో ఐడీ, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో పరీక్ష కేంద్రం సూపర్వైజర్ వద్ద అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి హాజరుకావచ్చు. హాల్‌టిక్కెట్‌లో పేరు లేకపోయినా, నంబ రు లేకపోయినా న్యూఢిల్లీలోని కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి. -
ఐఈఎస్ / ఐఎస్ఎస్
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్.. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌లో పీజీ, డిగ్రీ పూర్తి చేసి సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి సరైన మార్గం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షల్లో విజయం సాధిస్తే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పలు విభాగాలు, గణాంక శాఖ, ప్రణాళిక విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగం తదితర విభాగాల్లో జూనియర్ టైం స్కేల్‌తో అసిస్టెంట్ డెరైక్టర్‌గా కెరీర్ ప్రారంభించి సెక్రటరీ స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. యూపీఎస్సీ.. ఐఈఎస్/ఐఎస్ఎస్-2015 ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఎంపిక విధానం, విజయ వ్యూహాలు.. అర్థశాస్త్రం, స్టాటిస్టిక్స్ విద్యార్థులకు అద్భుత అవకాశం ఐఈఎస్/ఐఎస్ఎస్.. సివిల్ సర్వీసుల మాదిరిగానే జాతీయస్థాయిలో ప్రాముఖ్యమున్న కేంద్ర సర్వీసులు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక విభాగం తదితర విభాగాల్లో అకడమిక్‌గా సొంతం చేసుకున్న కోర్ నైపుణ్యాలను నేరుగా అన్వయించే అవకాశమున్న సర్వీసులు. అందుకే వీటికి ఎంపిక పరీక్ష కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఐఈఎస్/ఐఎస్ఎస్ ప్రకటన విడుదల చేసి, పరీక్ష నిర్వహిస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపిక ఇలా ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎంపిక ప్రక్రియ రెండు దశలుగా ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ. రాత పరీక్షకు 1000 మార్కులు, ఇంటర్వ్యూకు 200 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష ఐఈఎస్, ఐఎస్ఎస్ అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది. రాత పరీక్ష వివరాలు ఐఈఎస్/ఐఎస్ఎస్ ఔత్సాహికులు రాత పరీక్షలో భాగంగా ఆరు పేపర్లు రాయాలి. ఇందులో మొదటి రెండు పేపర్లు జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ పేపర్లు రెండు సర్వీసులకు ఉమ్మడిగా ఉంటాయి. మిగతా నాలుగు పేపర్లు ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్లు. ఐఈఎస్ అభ్యర్థులు ఎకనామిక్స్ పేపర్లు (పేపర్-1 నుంచి పేపర్-4), ఐఎస్ఎస్ అభ్యర్థులు స్టాటిస్టిక్స్ పేపర్లు (పేపర్-1 నుంచి పేపర్-4) రాయాలి. పీజీ స్థాయిలో సిలబస్ పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే ఐఈఎస్/ఐఎస్ఎస్ సబ్జెక్ట్ పేపర్ల సిలబస్ పీజీ స్థాయిలో ఉంటుంది. స్టాటిస్టిక్స్‌కు కనీస అర్హతగా బ్యాచిలర్స్ డిగ్రీనే పేర్కొన్నప్పటికీ ఆ సబ్జెక్ట్ పేపర్ల సిలబస్ కూడా పీజీ స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా గణాంకాలను విశ్లేషించాల్సిన విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రిపరేషన్ నుంచే విభిన్న దృక్పథంతో వ్యూహాలు అమలు చేయాలి. పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలు ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పేపర్లలో ముందంజలో నిలవాలంటే.. అభ్యర్థులు ప్రిపరేషన్ దశలోనే సిలబస్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని పరిశీలనాత్మక దృక్పథంతో అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ఒక నిర్దిష్ట అంశాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించే నైపుణ్యాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే దాదాపు అన్ని ప్రశ్నలు కూడా ప్రాథమిక భావనల ఆధారంగా వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం అవసరమైనవిగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. ఐఈఎస్ ప్రిపరేషన్ ఇలా.. ఎకనామిక్స్ పేపర్-1 (జనరల్ ఎకనామిక్స్) పార్ట్-ఎ, పార్ట్-బిగా ఎకనామిక్స్ బేసిక్స్‌తో కూడిన ఈ పేపర్లో రాణించాలంటే సూక్ష్మ అర్థ శాస్త్రం, ఉత్పత్తి-పంపిణీ వంటి అంశాలపై దృష్టి సారించాలి. అదే విధంగా శ్యాంప్లింగ్ టెక్నిక్స్, కొరలేషన్, లీనియర్ ప్రోగ్రామింగ్లపై అవగాహన కూడా ఎంతో అవసరం. ఎకనామిక్స్ పేపర్-2 (జనరల్ ఎకనామిక్స్-2) ఈ పేపర్లో అధిక శాతం ప్రశ్నలు స్థూల అర్థ శాస్త్రం నుంచి అడుగుతారు. అంతర్జాతీయ అర్థ శాస్త్రం, వృద్ధి సిద్ధాంతాలు వంటి స్థూల అర్థ శాస్త్రంలోని మూల భావనలతోపాటు, వ్యాపార-వాణిజ్య రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు (ఉదా: ఐఎంఎఫ్, డబ్ల్యుటీఓ తదితర) గురించిన అవగాహన లాభిస్తుంది. ఎకనామిక్స్ పేపర్-3 (జనరల్ ఎకనామిక్స్-3) ఈ పేపర్‌కు నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలిస్తే వాస్తవ సమాజంలో సమ్మిళితమైన అర్థ శాస్త్ర అంశాలకు ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. అభ్యర్థులు పన్నుల సంస్కరణలు, పర్యావరణ అర్థ శాస్త్రం, క్రెడిట్ మేనేజ్మెంట్, వివిధ రకాల పెట్టుబడులు-విధానాలు, ధరల సిద్ధాంతాలపై దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించాలి. వీటికి సంబంధించి సమకాలీనంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పరిశీలన కూడా ఎంతో ముఖ్యం. ఎకనామిక్స్ పేపర్-4 (ఇండియన్ ఎకనామిక్స్-4) మొత్తం పేపర్లలో అభ్యర్థులకు కొంత సులువుగా పేర్కొనే పేపర్ ఇండియన్ ఎకనామిక్స్. ఇప్పటికే ఆయా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ స్థాయిలో అకడమిక్‌గా పట్టున్న అభ్యర్థులు సులువుగా ఆకళింపు చేసుకోగలిగే పేపర్ ఇండియన్ ఎకనామిక్స్. ఆర్థిక రంగంలో సంస్కరణలు, ద్రవ్య విధానాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, రిజర్వ్ బ్యాంక్ విధి విధానాలు, కోశ విధానాలపై అవగాహనతో ఈ పేపర్లో సులువుగా రాణించొచ్చు. ఐఎస్ఎస్ ప్రిపరేషన్ ఇలా.. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీసెస్ ఔత్సాహికులు నాలుగు సబ్జెక్ట్ పేపర్లు రాయాల్సి ఉంటుంది. స్టాటిస్టిక్స్ పేపర్-1: ఈ పేపర్ సిలబస్‌ను పరిశీలిస్తే సంభావ్యత(ప్రాబబిలిటీ)కి ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. ప్రాబబిలిటీలోని బేసిక్ కాన్సెప్ట్స్ /సిద్ధాంతాలపై దృష్టి సారించాలి. అదే విధంగా ఒక డేటాకు సంబంధించిన విశ్లేషణ నైపుణ్యాలను పరిశీలించే స్టాటిస్టికల్ మెథడ్స్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా చార్ట్స్ రూపకల్పన వంటి అంశాలపై పట్టు సాధించాలి. స్టాటిస్టిక్స్ పేపర్-2: స్టాటిస్టిక్స్‌కు సంబంధించి సిద్ధాంతాలతో కూడిన అంశాలను సిలబస్‌గా పేర్కొన్న ఈ పేపర్లో రాణించాలంటే అభ్యర్థులు మల్టీ వెరయిటీ అనాలిసిస్, హైపోథీసిస్ టెస్టింగ్, లీనియర్ మోడల్స్, ఎస్టిమేషన్ టెక్నిక్స్‌పై దృష్టి సారించాలి. స్టాటిస్టిక్స్ పేపర్-3: ఆయా డేటాల సేకరణ, సర్వేలు-గణాంకాలతో కూడిన అంశాలు సిలబస్‌గా పేర్కొన్న ఈ పేపర్లో మంచి మార్కులు పొందాలంటే ముందుగా స్టాటిస్టిక్స్‌లో ముఖ్యమైందిగా భావించే శ్యాంప్లింగ్ టెక్నిక్స్‌లో చక్కటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అదేవిధంగా అర్థశాస్త్రంతో సమ్మిళితంగా ఉండే గణాంకాలు (ఉదా: ప్రైస్ ఇండెక్స్) గురించిన నైపుణ్యం కూడా ఎంతో అవసరం. స్టాటిస్టిక్స్ పేపర్-4: స్టాటిస్టిక్స్‌లో రీసెర్చ్ అంశాలు, డేటాకు సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్స్ సంబంధిత అంశాలు సిలబస్‌గా ఉన్న ఈ పేపర్లో విజయానికి స్టాటిస్టిక్స్‌లో కీలకంగా భావించే పలు చార్ట్‌లు, కర్వ్‌లు, టేబుల్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా నిర్దిష్ట డేటాను సాఫ్ట్‌వేర్‌తో అన్వయించగలిగే నైపుణ్యాలు అందుకు అవసరమైన నిర్వహణ సిద్ధాంతాలపై అవగాహన కూడా ఎంతో ముఖ్యం. ఉమ్మడి సబ్జెక్ట్‌లకు ఇలా ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్‌లో ఉమ్మడి సబ్జెక్ట్‌లు/పేపర్లు.. జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్. జనరల్ ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే ఇంగ్లిష్ పేపర్లో మంచి మార్కుల కోసం వొకాబ్యులరీని పెంచుకోవాలి. అదేవిధంగా ప్రెసిస్ రైటింగ్ అంశం కూడా ఉన్న నేపథ్యంలో రీడింగ్ కాంప్రహెన్షన్ మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలి. జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు ఎక్కువ వెయిటేజీ ఉండే ఈ పేపర్లో రాణించాలంటే.. ఇటీవల కాలంలో ప్రముఖ సంఘటనలు, పరిణామాలు - వాటి నేపథ్యాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీలోనూ కోర్ అంశాలతోపాటు వాటికి సంబంధించి తాజాగా చోటు చేసుకున్న అంశాలపై పట్టు సాధించాలి. రిఫరెన్స్ బుక్స్ ఐఈఎస్ ఇండియన్ ఎకానమీ - మిశ్రా అండ్ పూరీ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ - యూఎన్డీపీ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ - ఐబీఆర్డీ ఇండియన్ ఎకానమీ - ఉమా కపిల పబ్లిక్ ఫైనాన్స్ - భాటియా ఎకనమిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ బిజినెస్ - ఎం.ఎల్. జింగాన్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ - చేరునిలమ్ గ్రోత్, సస్టెయినబిలిటీ అండ్ ఇండియాస్ ఎకనమిక్ రిఫామ్స్ - టి.ఎన్.శ్రీనివాసన్ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఫర్ ఎకనామిక్స్ - ఆర్.జి.డి. అలెన్, మ్యాక్మిలాన్ స్టాటిస్టిక్స్ ఫర్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ - అండర్సన్ అండ్ షెన్నీ స్టాటిస్టిక్స్ ఫర్ మ్యాథమెటిక్స్ - డి.ఆర్. అగర్వాల్ ఐఎస్ఎస్ యాన్ ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ థియరీ అండ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ - వి.కె.రోహ్తగి ఫండమెంటల్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ - ఎస్సి గుప్తా ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (వాల్యూమ్-2) - ఎఎం గూన్, ఎంకె గుప్తా, బి దాస్ గుప్తా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టికల్ అప్లికేషన్స్ - పాల్ మేయర్ శాంప్లింగ్ టెక్నిక్స్ - విలియమ్ జి.కొచ్రాన్ శాంప్లింగ్ థియరీ ఆఫ్ సర్వేస్ విత్ అప్లికేషన్స్ - బి.వి.సుఖత్మే ఫండమెంటల్స్ ఆఫ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ - ఎస్.సి. గుప్తా ఐఈఎస్/ఐఎస్ఎస్ పరీక్ష వివరాలు ఐఈఎస్ సబ్జెక్ట్ మార్కులు సమయం పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 మూడు గంటలు పేపర్-2 జనరల్ స్టడీస్ 100 మూడు గంటలు పేపర్-3 జనరల్ ఎకనామిక్స్-1 200 మూడు గంటలు పేపర్-4 జనరల్ ఎకనామిక్స్-2 200 మూడు గంటలు పేపర్-5 జనరల్ ఎకనామిక్స్-3 200 మూడు గంటలు పేపర్-6 ఇండియన్ ఎకనామిక్స్ 200 మూడు గంటలు ఐఎస్ఎస్ సబ్జెక్ట్ మార్కులు సమయం పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 మూడు గంటలు పేపర్-2 జనరల్ స్టడీస్ 100 మూడు గంటలు పేపర్-3 స్టాటిస్టిక్స్-1 200 మూడు గంటలు పేపర్-4 స్టాటిస్టిక్స్-2 200 మూడు గంటలు పేపర్-5 స్టాటిస్టిక్స్-3 200 మూడు గంటలు పేపర్-6 స్టాటిస్టిక్స్-4 200 మూడు గంటలు ఐఈఎస్ / ఐఎస్ఎస్-2015 సమాచారం అర్హత: ఐఈఎస్- ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్లో పీజీ ఐఎస్ఎస్- స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో ఏదో ఒకటి ప్రధాన సబ్జెక్ట్‌గా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత (లేదా) స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ / అప్లైడ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో పీజీ ఉత్తీర్ణత. వయోపరిమితి: ఆగస్ట్ 1, 2015 నాటికి 21 నుంచి 30 ఏళ్లు ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20, 2015 పరీక్ష తేదీలు: మే 23, 2015 నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్ వెబ్సైట్: www.upsconline.nic.in ఐఈఎస్/ఐఎస్ఎస్-2014 కటాఫ్ మార్కులు ఐఈఎస్/ఐఎస్ఎస్ 2014, 2013 రిక్రూట్మెంట్లలో సర్వీస్‌ల వారీగా 1000 మార్కులకు జరిగిన రాత పరీక్ష, 200 మార్కులకు నిర్వహించిన ఇంటర్వ్యూ ఆధారంగా రూపొందించిన తుది జాబితాలో జనరల్ కేటగిరీలో కటాఫ్ మార్కుల వివరాలు.. 2014 కటాఫ్స్ సర్వీస్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఫైనల్ కటాఫ్ ఐఈఎస్ 389 144 533 ఐఎస్ఎస్ 296 166 462 2013 కటాఫ్స్ సర్వీస్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఫైనల్ కటాఫ్ ఐఈఎస్ 370 157 527 ఐఎస్ఎస్ 283 152 435 సిలబస్ పరిశీలన ముఖ్యం ఐఎస్ఎస్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఆయా సబ్జెక్ట్ పేపర్ల సిలబస్‌ను పూర్తిగా పరిశీలించాలి. ప్రిపరేషన్ పరంగా ఇది ఎంతో ముఖ్యమైన అంశం. అదే విధంగా కచ్చితంగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిచ్చే విధంగా ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించుకోవాలి. గణాంకాలు, డేటాలలో ఉండే సమాచారాన్ని డిస్క్రిప్టివ్ విధానంలో పొందుపరిచే విశ్లేషణ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గంటల ప్రిపరేషన్‌తో సులువుగా విజయం సాధించొచ్చు. పంతంపల్లి అనిత ఐఎస్ఎస్ ట్రైనీ (17వ ర్యాంకు ఐఈఎస్/ఐఎస్ఎస్-2013) టార్గెట్ 60 పర్సెంట్ ఐఈఎస్‌లో ఇంటర్వ్యూ కాల్ ఆశించాలంటే రాత పరీక్షలో 60 శాతం మార్కులు పొందే సంసిద్ధత సొంతం చేసుకోవాలి. ఎకనామిక్స్‌లోని బేసిక్ థీరమ్స్‌ను ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో చదివితే ‘బోర్’ అనే భావన కూడా వీడిపోతుంది. గత ప్రశ్నపత్రాల పరిశీలన, మాక్ టెస్ట్‌లు కూడా అనుకూలించే సాధనాలు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో వివరణకు, అంచెలవారీ సాధనకు ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్లో రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తోట సతీశ్ కుమార్ అసిస్టెంట్ డెరైక్టర్ (17వ ర్యాంకు ఐఈఎస్-2012) -
గ్రూప్స్ నోటిఫికేషన్లు మార్చి తర్వాతే..
‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానం రూపొందించిన తరవాతే గ్రూప్స్ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. పరీక్షా విధానం రూపకల్పన, సిలబస్‌ను నిర్ణయించేందుకు నిపుణుల కమిటీలతో ప్రత్యేకంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు. కమిషన్‌లో త్వరలో చేపట్టనున్న మార్పులపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. గ్రూప్-1, 2 పరీక్షల నిర్వహణపై రెండు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేస్తాం. ఒక కమిటీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో అధ్యయనం చేస్తుంది. మరో కమిటీ పరీక్షల విధానం, షెడ్యూల్‌పై అధ్యయనం చేసి కమిషన్‌కు నివేదిక ఇస్తుంది. ఫిబ్రవరి నెలాఖరులోగా సిలబస్‌ను ప్రకటిస్తాం. మార్చి తరవాతే గ్రూప్-1, 2 నోటిఫికేషన్లను విడుదల చేస్తాం. జనవరిలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండదు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీని సర్వీస్ కమిషన్ చేపట్టే అంశంపై విద్యాశాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నాం. యూపీఎస్సీ తరహా పరీక్షా విధానం దేశంలో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును పరిశీలించిన తరవాతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అత్యుత్తమ పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏటా పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. అందులో ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫలితాల ప్రకటన తేదీలను పరీక్షకు ముందుగానే ప్రకటిస్తాం. అభ్యర్థుల వ్యక్తిత్వం తెలుసుకునేందుకు సివిల్స్ తరహాలో అదనంగా మరో పేపర్‌ను గ్రూప్-1 పరీక్షలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. గ్రూప్1, గ్రూప్-2 (ఎగ్జిక్యూటివ్) పరీక్షలకు ఇంటర్వ్యూలుంటాయి. నిష్పాక్షికంగా, పారదర్శక విధానంలో పరీక్షలు నిర్వహిస్తాం. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడే ఇంటర్వ్యూకు మార్కులుంటాయి. కేరళ తరహాలో... కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా... డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, డిప్లమో వంటి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల వివరాలు కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగుల డేటా బేస్ మా వద్ద సిద్ధంగా ఉంటుంది. ప్రతి పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధానం ప్రవేశపెడతాం. ఇక ఆయా శాఖలో ఏటా ఎన్ని పదవీ విరమణలు (రిటైర్మంట్స్) ఉంటాయో ముందే జాబితా సిద్ధం చేసుకొని వారు రిటైరయ్యే సమయానికి కొత్త అభ్యర్థులు ఆ పోస్టుల్లో చేరే విధంగా పరీక్షలు ముందుగానే నిర్వహించి అభ్యర్థుల మెరిట్ లిస్టు సిద్ధంగా ఉంచుతాం. ఆ శాఖ కోరగానే జాబితాను వారికి అందజేస్తాం. దీంతో తక్షణం ఖాళీల భర్తీ చేయడానికి వీలవుతుంది. మెరుగైన పాలన, సుపరిపాలన అందిస్తాం. జనవరిలో ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించేందుకు అన్ని విభాగాల అధిపతులతో చీఫ్‌సెక్రటరీ సమక్షంలో జనవరిలో కమిషన్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. అప్పుడే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి. ఏ క్యాడర్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఇక ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఖాళీలను గుర్తించి, వాటికి ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత కమిషన్‌కు అందజేస్తేనే మేం పరీక్షలు నిర్వహిస్తాం. లక్ష ఉద్యోగాలా అంతకంటే ఎక్కువా తక్కువా అన్న అంశం ప్రభుత్వం పరిశీలిస్తుంది. స్థానికత నిర్థారించేది ప్రభుత్వమే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో కమిషన్ ఎలాంటి జోక్యం చేసుకోదు. ప్రభుత్వం 1956నే ప్రామాణికంగా తీసుకుంటే దాన్నే కమిషన్ అమలుచేస్తుంది. -
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాల్లో ఉన్నతమైన హోదాతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో అర్హత, పరీక్షా విధానం, సంబంధిత వివరాలు.. ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) 200 ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా) 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు) 12 ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్ష: రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు 100 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ: సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఈ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. అర్హత: అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హు లు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడమీకి బీటెక్/బీఈ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు. వయోపరిమితి: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1992- జనవరి 1, 1997 మధ్య, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1991- జనవరి 1, 1997 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.upsc.gov.in -
ఉద్యోగాలు
యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ►అసిస్టెంట్ ఇంజనీర్ ►డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్ ►స్పెషలిస్ట్ (గ్రేడ్-3) ►జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ►అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్ ►డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్ ► అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ ►సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ ► మెడికల్ ఆఫీసర్ అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబర్ 2 వెబ్సైట్: http://upsconline.nic.in/ విజయా బ్యాంక్‌లో సెక్యూరిటీ ఆఫీసర్లు బెంగళూర్‌లోని విజయా బ్యాంక్ సెక్యూ రిటీ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోబేషనరీ సెక్యూరిటీ ఆఫీసర్ (స్కేల్ - 2) పోస్టుల సంఖ్య: 15 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ సర్వీస్/ పోలీస్ ఆఫీసర్ (ఏఎస్పీ/ డీఎస్పీ)గా ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 3 వెబ్సైట్:http://ibpsregistration. nic. in/ibps_vijaya/ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డీలర్ (గ్రేడ్-4 ) అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటి స్టిక్స్/కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనా న్స్) ఉండాలి. నాలుగేళ్ల అనుభవం అవసరం. డీలర్(గ్రేడ్ - 3) అర్హతలు: ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఈక్విటీ రీసెర్చ్ ఎనలిస్ట్ అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉండాలి. సంబంధిత విభాగం లో మూడేళ్ల అనుభవం అవసరం. వయసు: 25 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23 వెబ్సైట్: www.unionbankofindia. co.in -
ఉద్యోగంలో ఎదుగుదలకు ’కెరీర్ ప్లాన్’
కొందరు ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తుంటారు. అయినా, కెరీర్లో ఆశించినంతగా ఎదగలేకపోతుంటారు. చేరినప్పుడు ఏ దశలో ఉన్నారో తర్వాత కూడా అదే దశలో కొనసాగుతుంటారు. తమ స్థానాన్ని మెరుగుపర్చుకోలేక నిరాశ నిస్పృహ లకు లోనవుతుంటారు. చాలా సంస్థలు తమ ఉద్యోగుల కోసం కెరీర్ ప్లాన్‌ను రూపొంది స్తాయి. ఆ ప్రణాళికను సక్రమంగా అనుసరిం చే వారు ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుం టారు. అయితే, ఇలాంటి ప్లాన్ కంపెనీలో లేకపోతే ఉద్యోగులు తామే సొంతంగా తయారు చేసుకొని, నిజాయతీగా అమలు చేయాలి. కెరీర్ లక్ష్యాలు మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలు, మీకు ఆసక్తి ఉన్న అంశాలను గుర్తించండి. వాటితో ఒక జాబితాను తయారు చేసుకోండి. మీ రంగంలో, మీ విభాగంలో విజయవంతమైన వ్యక్తులు తమ కెరీర్‌ను మలచుకున్న విధానాన్ని అధ్యయనం చేయండి. సక్సెస్ సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, అర్హతలు, అనుభవాలను గుర్తించి, అర్థం చేసుకోండి. ఉద్యోగంలో మరో స్థాయికి చేరడానికి తక్కువ సమయంలో నేర్చుకోవాల్సిన అంశాలేమిటో తెలుసుకోండి. మేనేజర్‌తో చర్చించాలి మీరు తయారు చేసుకున్న భవిష్యత్తు ప్రణాళికపై కంపెనీ మేనేజర్‌తో చర్చించండి. ప్రస్తుతం మీరు నిర్వర్తిస్తున్న బాధ్యతలు, మీ పనితీరుపై వారి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. పనితీరును మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలో అడగండి. సంస్థలో పైకి ఎదగడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అందుకోసం ఏం చేయాలి? అనేదానిపై మేనేజర్‌తో సంప్రదింపులు జరపాలి. అర్హతలు పెంచుకోవాలి సంస్థలో ఉద్యోగులు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలంటే.. అర్హతలు, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. ఇందుకోసం అవసరమైతే ఏదైనా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ లో సంబంధిత కోర్సులో చేరాలి. తగిన శిక్షణ పొందాలి. పనితీరు మెరుగైతే గుర్తింపు తప్పనిసరిగా లభిస్తుంది. కెరీర్ గ్రోత్ విధానం లేకపోతే కంపెనీలో కెరీర్ గ్రోత్ కల్పించేందుకు ఒక విధానమం టూ లేకపోతే.. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవా ల్సిన పనిలేదు. ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వారి నుంచి స్పందన లేకపోతే మానవ వనరుల విభాగం మేనేజర్ తో మాట్లాడాలి. అవసరమైతే యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాలి. ఉద్యోగంలో ఎదుగుదలకు వీలు కల్పించాలని అభ్యర్థించాలి. సమీక్షించుకోండి మీ పనితీరు, వ్యవహారశైలి సక్రమంగా ఉన్నప్పటికీ అవకాశాలు లభించకపోతే పరిస్థితిని సమీక్షించుకోండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని పై అధికారులకు తెలియజేయండి. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కింది పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. పోస్టుల వివరాలు అసిస్టెంట్ ఇంజనీర్ అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. డిప్యూటీ సూపరింటెండింగ్ ఎపిగ్రఫిస్ట్ అర్హతలు: తెలుగు/కన్నడం/తమిళం/మలయాళంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. స్పెషలిస్ట్(గ్రేడ్-3) అర్హతలు: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్బీ డిగ్రీ ఉండాలి. మూడేళ్ల క్లినికల్ అనుభవం అవసరం. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ అర్హతలు: ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. అడిషనల్ గవర్నమెంట్ అడ్వొకేట్ అర్హతలు: బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదమూడేళ్ల అనుభవం ఉండాలి. డిప్యూటీ గవర్నమెంట్ అడ్వొకేట్ అర్హతలు: బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో పదేళ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా బీఎల్/ఎల్ఎల్బీ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ అర్హతలు: వెటర్నరీ సైన్స్ డిగ్రీ ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. మెడికల్ ఆఫీసర్ అర్హతలు: ఆయుర్వేద మెడిసిన్‌లో డిగ్రీ ఉండాలి. పై అన్ని పోస్టులకు నిర్దేశిత వయోపరిమితి తప్పనిసరిగా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 2 వెబ్సైట్: http://upsconline.nic.in/ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంసీహెచ్ (కార్డియోథోరాసిక్ సర్జరీ) సీట్ల సంఖ్య: 4, వ్యవధి: మూడేళ్లు. అర్హత: జనరల్ సర్జరీలో ఎమ్మెస్/ ఎండీ డిగ్రీ ఉండాలి. డీఎం (క్లినికల్ ఫార్మకాలజీ) సీట్ల సంఖ్య: 1. వ్యవధి: మూడేళ్లు. అర్హత: ఫార్మకాలజీలో ఎండీ/ డీఎన్బీ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబరు 20 వెబ్సైట్: http://nims.edu.in ఐఐటీ-హైదరాబాద్‌లో బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రాం ఐఐటీ-హైదరాబాద్ అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనుంది. సీఎస్ఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిసెంబ రు 24 నుంచి 28వ వరకు ఈ శిక్షణ కార్య క్రమం నిర్వహించనున్నారు. అనలిటిక్స్‌పై అప్‌గ్రేడ్ నాలెడ్జ్‌ను కోర్సులో బోధిస్తారు. బిజినెస్ అనలిటిక్స్‌కు ప్రస్తుతం ఇన్సూరెన్స్, మెడికల్, క్రెడిట్ ఇండస్ట్రీస్, ఆన్లైన్ షాపింగ్, రిటైల్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది. కోర్సులో భాగంగా ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్, గ్రాఫిక్స్ వంటి అంశాలపై శిక్షణనిస్తామని నిర్వాహకులు తెలిపారు. వెబ్సైట్: www.iith.ac.in/BA2014Dec/ పోటీ పరీక్షల్లో పాలిటీలో అత్యధిక స్కోర్ సాధించడం ఎలా? - ఎస్.సుధీర్‌కుమార్, తార్నాక ప్రతి పోటీ పరీక్షలో పాలిటీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అభ్యర్థి విజయాన్ని నిర్దేశించడం లో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఇండియన్ పాలిటీపై అవగాహన పెంచుకోవాలంటే సబ్జెక్ట్‌ను విశ్లేషణాత్మకంగా, లోతుగా అధ్యయనం చేయాలి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రపై అవగాహన పెంచుకోవాలి. ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని చదువుతున్నప్పుడు వర్తమాన అంశాలకు అన్వయిస్తూ, తులనాత్మకంగా చదవాలి. ఉదాహరణకు పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు మంత్రి మండలి సలహా మేరకు అధికరణం 123 ప్రకారం రాష్ర్టపతి ఆర్డినెన్స జారీ చేస్తారు. ఇటీవల ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఈ నేపథ్యంలో రాష్ర్టపతి ఆర్డినెన్స ఏవిధంగా జారీచేశారు? దీంట్లో మంత్రి మండలి పాత్ర ఏమిటి? అది తర్వాత చట్టంగా ఎలా మారింది? పార్లమెంట్ పాత్ర ఏమిటి? ఆర్డినెన్స గరిష్ఠ కాలపరిమితి ఎంత? తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ రూపకల్పన, లక్షణాలు; ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు; కేంద్ర కార్యనిర్వాహక, శాసన నిర్మాణ, న్యాయ వ్యవస్థలు; రాష్ర్ట ప్ర భుత్వం; కేంద్ర, రాష్ర్ట సంబంధాలు; స్థానిక ప్రభుత్వాలు; రాజకీయ పార్టీలు; ఎన్నికల సంస్కరణలు; వివిధ సంస్థలు మొదలైన అంశాలపై అవగాహన ఉండటం తప్పనిసరి. సబ్జెక్ట్‌ను క్రమ పద్ధతిలో, లోతుగా అధ్యయనం చేస్తే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇన్పుట్స్: కె. కాంతారెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
అసమానతలకు ‘సీశాట్’ ఆజ్యం
సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) గురించి పెద్ద రగడే జరుగు తోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న సీశాట్‌ను తొలగించవలసిందని ఢిల్లీలో నిరస నలు జరుగుతున్నాయి. నిరసనకారులను ప్రతిభాస్వామ్యానికి వ్యతిరేకు లుగా చిత్రిస్తున్నారు. ప్రాంతీయ భాషలలో చదువుకున్న వారికి కూడా ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులతో సమంగా ప్రాధాన్యం ఇవ్వా లంటూ రాజ్యాంగం కల్పించిన హక్కును అమలు చేయమని కోరుతున్నం దుకే ఇలా విమర్శలు కురిపిస్తున్నారన్న మాట వాస్తవం. సీశాట్‌ను తొలగించ మని కోరే వారంతా ఆంగ్ల భాషకు శత్రువులైనట్టు, సొంత భాష మీద విపరీత ప్రేమను చూపిస్తున్న చాందసులన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తు న్నారు. ప్రాంతీయ భాషలలో కూడా ప్రశ్న పత్రం అందించాలని కోరడమే నేరంగా పేర్కొంటున్నారు. మౌఖిక పరీక్షలో ప్రాంతీయ మాధ్య మాల నుంచి వచ్చిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్న సంగతి చెబితే, ఇంగ్లిష్ మాట్లాడేవారే సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తా రని వింత వాదన వినిపిస్తున్నారు. సేవాగుణానికీ, పాలనా సామర్థ్యానికి భాషతో సంబంధం లేదన్న వాదనలను పెడచెవిన పెడుతున్నారు. నిజంగానే సీశాట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా ప్రతిభాస్వామ్యానికి బద్ధ శత్రువులేనా? యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక మాత్రమే ప్రతిభాస్వామ్యానికి కొలమానమా? ఇప్పుడు నిర్వహిస్తున్నది నిజంగానే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్టేనా? సీశాట్ పరీక్ష అనంతరం తలెత్తిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. సీశాట్ ఎందుకు వచ్చింది? యూపీఎస్సీ దృష్టిలో సివిల్ సర్వీసెస్ పట్ల అభ్యర్థి అభిరుచికి కొలమానం ఏమిటి? లాజికల్ రీజనింగ్, సమస్య పరిష్కారంలో నైపుణ్యం, విశ్లేషణా సామర్థ్యం, మౌఖిక భావ ప్రకటనా నైపుణ్యం, ప్రాథమిక స్థాయి గణితం, జనరల్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - అని యూపీఎస్సీ సిలబస్‌ను బట్టి తెలు స్తుంది. ఈ అంశాలలో వెనుకబడిన వారు సివిల్ సర్వీసెస్‌కు అనర్హులని యూపీఎస్సీ నిర్ధారిస్తున్నది. యూపీఎస్సీ 2011లో సీశాట్‌ను ప్రవేశపెట్టిన పుడు అంతా పురోగమన చర్యగా భావించారు. 2010 సంవత్సరం వరకు అభ్యర్థులు అనేక ఐచ్ఛికాంశాల నుంచి ఒకదానిని ఎంచుకునేవారు. అయితే అన్ని ఐచ్ఛికాంశాల ప్రశ్నపత్రాలను ఒకే స్థాయిలో రూపొందించడం అసాధ్యం కావడం, ఐచ్ఛికాంశాల నుంచి ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉండడం, ఆ జాబితాలో రెండు మూడు ఐచ్ఛికాంశాలను ఎంచుకున్న వారే అధికంగా కృతార్థులు కావడం వంటి సమస్యలను తరు వాత గమనించారు. సమాచార హక్కు చట్టం పుణ్యమా అని స్కేలింగ్ విధా నం మీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఐచ్ఛికాంశం స్థానంలో అభ్యర్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే ఉమ్మడి పరీక్షను ప్రవేశపెట్టింది. అదే సీశాట్. ఐచ్ఛికాంశాలను తొలగించడం వల్ల సమతౌల్యం సాధించే అవకాశం ఉందని అప్పుడు అభ్యర్థులంతా భావించారు. శాపంగా మారిన పరీక్ష అయితే సీశాట్‌తో అనుభవాలు వేరుగా ఉన్నాయి. భాషాపరంగా వివిధ రకాల చదువుల నేపథ్యాల నడుమ 1979 నుంచి కాపాడుకుంటూ వచ్చిన తటస్థ వైఖరిని నాశనం చేసే విధంగా సీశాట్ రూపు దాల్చింది. యూపీఎస్ సీయే సీశాట్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను ప్రవేశపె ట్టడం వెనుక ఉన్న హేతువును బలహీనపరిచింది. సివిల్ సర్వీసెస్ పట్ల అభి రుచితో పాటు, సరైన దృక్పథం ఉన్నవారు కూడా వైదొలగే రీతిలో ప్రశ్నలను రూపొందించడం శోచనీయం. సీశాట్ వ్యతిరేక ఆందోళన ల నేపథ్యంలోనే ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కావడంతో ఇప్పుడు కలుగచేసుకోలేమని అత్యున్నత న్యాయ స్థానం ప్రకటించినా, సమస్యలో ఉన్న ప్రతికూలాంశాలు విస్మరించలేనివి. ప్రాంతీయ భాషల మీద వేటు ఆంగ్ల ప్రసార మాధ్యమాలు కోడై కూస్తున్నట్టు సీశాట్ మీద నిరసన అంటే సాధారణ ఇంగ్లిష్ మీద పోరాటం కాదని అంతా అర్థం చేసుకోవాలి. సీశాట్ ను వ్యతిరేకిస్తున్నవారంతా ఇంగ్లిష్‌లో రాయగల కనీస పరిజ్ఞానం ఉన్నవారే. మెయిన్స్‌లో ఉండే తప్పనిసరి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్ని సమర్థంగా ఎదుర్కొనగ లిగినవారే కూడా. అసలు ఈ కారణంతోనే ఇలాంటి వారిని ప్రాథమిక పరీ క్షలో గట్టెక్కనీయకుండా తప్పిస్తున్నారు. ఇతర విభాగాలలో మంచి పట్టు ఉన్న అభ్యర్థులు కూడా కాంప్రహెన్షన్‌లో తక్కువ మార్కులు సాధించడం వల్ల అపజయం పాలవుతున్నారు. సీశాట్‌లో ఇచ్చే ప్రశ్నలు, అభ్యర్థికి సివిల్ సర్వీసెస్ పట్ల ఉన్న అభిరుచి ఏపాటిదో వెల్లడించేందుకు ఉపకరించేవి కా కుండా, ఇంగ్లిష్ పరిజ్ఞానం ఎంత అన్నది తేల్చడానికే సరిపోతాయన్న రీతిలో ఉంటున్నాయి. జనరల్ స్టడీస్ తక్కువ మార్కులు తెచ్చుకునేలా రూపొం దిస్తూ ఉంటే, సీశాట్ ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనువుగా రూపొం దుతోంది. సీశాట్‌లో అర్హత సాధించిన వారి మార్కులను పరిశీలిస్తే, మూడింట రెండువంతులు ఇందులోనే సాధిస్తున్నారు. జనరల్ స్టడీస్‌లో తెచ్చుకుంటున్న మార్కులు కేవలం మూడింట ఒక వంతు. 2010లో హిందీతో పాటు, ఇతర ప్రాంతీయ భాషలను మెయిన్స్‌లో రాత పరీక్ష మాధ్యమంగా ఎంచుకుని రాసిన అభ్యర్థులు 4,156 మంది. సీశాట్ ప్రవేశ పెట్టిన 2011లో ఆంగ్లేతర భాషలలో పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 1,682. కటాఫ్‌ను తగ్గించిన ఆప్టిట్యూడ్ ఇంతకీ ఇంత ‘ఆప్టిట్యూడ్’ ఉన్న అభ్యర్థులు మెయిన్స్‌లో చూపించిన ప్రతిభ ఎంతటిది? సీశాట్‌ను ప్రవేశ పెట్టాక మెయిన్స్‌లో కటాఫ్ మార్కును దారు ణంగా దించవలసి వచ్చింది. ఉదాహరణకు 2014లో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1750 మార్కులకు గాను, కనిష్టంగా 564 (32 శాతం) మార్కులు మాత్రమే సాధించారు. 2014 ‘టాపర్’ జనరల్ స్టడీస్‌లో సాధించిన మార్కులు కేవలం 33.8 శాతం. సీశాట్ ప్రవేశపెట్టక ముందు టాపర్లుగా నిలిచిన నాగరాజన్, అద్దంకి శ్రీధర్‌బాబు వంటి వారు జనరల్ స్టడీస్‌లో 70 శాతం మార్కులు సాధించారు. సివిల్ సర్వీసెస్‌కు కీలక మైన జనరల్ స్టడీస్‌లో ప్రతిభ లేని వారు ఇప్పుడు టాపర్లుగా నిలుస్తున్నా రంటే అందుకు కారణం, ఇంగ్లిష్, గణితాలేనని చెప్పకతప్పదు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఎక్కువ శాతానికి దేశ సమస్యలపై అవగాహన లేదని యూపీఎస్సీ చైర్మన్ డీపీ అగర్వాల్ కొంత కాలం క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశ, సామాజిక సమస్యల కంటె, ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సీశాట్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఆయనే. సీశాట్ అమలులోకి వచ్చిన తరు వాత వచ్చిన గణనీయమైన మార్పు - విజేతలలో ఇంజనీరింగ్, మెడిసిన్ నేపథ్యం ఉన్న వారి సంఖ్య విశేషంగా పెరిగింది. 2004 సంవత్సరంతో పోల్చి చూస్తే, 2011 సంవత్సరానికి వీరి సంఖ్య రెట్టింపు కనిపిస్తుంది. ఆ చదువుల నేపథ్యంతో ఐఏఎస్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య మూడింట రెండు వంతుల వరకు ఉంది. సీశాట్‌తో మారిన యూపీఎస్సీ ఎంపిక తీరు 2004 2011 ఇంజనీరింగ్ 23.40 41.76 మెడిసిన్ 8.39 13.11 సైన్స్ 5.30 4.90 హ్యుమానిటీస్ 16.56 9.21 సీశాట్‌ను ప్రవేశపెట్టడం వెనుక రహస్య ప్రణాళిక ఉంది. డీపీ అగర్వాల్ 2008లో యూపీఎస్సీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటీలో బోధిస్తూ ఈ పద విని చేపట్టిన అగర్వాల్ అన్ని అంశాలను ఇంజనీరింగ్ నేపథ్యంతో ఆలోచిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్, ఐఐఎంల నుంచి సివిల్స్ వైపు అభ్యర్థులను ఆకర్షించే విధంగా పరీక్ష విధానాన్ని మార్చుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఖన్నా కమిటీ సిఫారసుల మేరకే జరిగాయని ఆయన అంటున్నారు. ఆ కమిటీ అగర్వాల్ సూచనల మేరకే పని చేసింది. ఏ విధంగా చూసినా సీశాట్ గురించి పునరాలోచించవలసిన సమయం వచ్చింది. ప్రేమ విఘ్నేశ్వరరావు. కె. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్
దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది హాజరు న్యూఢిల్లీ/సాక్షి,విజయవాడ/తిరుపతి: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. 59 నగరాల్లోని 2,137 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించగా 4.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్స్ పరీక్షా విధానంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేయాలంటూ డిమాండ్ రాగా.. సుప్రీంకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఎక్కడా ఎలాంటి ఆటంకాలు, నిరసనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. రెండు పేపర్ల(పేపర్-1, పేపర్-2)తో కూడిన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. మొదటి పరీక్ష ఉదయం తొమిదిన్నర గంటలకు ఆరంభమవగా.. రెండో పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమైంది. ఒక్కో పరీక్షకు రెండు గంటలు కేటాయించారు. కాగా పేపర్-1లోని ప్రశ్నలకు సంబంధించి హిందీ అనువాదంలో తప్పులు దొర్లినట్టు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ప్రిలిమ్స్కోసం మొత్తం 9,44,926 మంది దరఖాస్తు చేయగా.. పరీక్షకు 4,51,602 మంది హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.27 లక్షల మంది అధికంగా హాజరవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతిల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 31 పరీక్ష కేంద్రాల్లో 32 శాతానికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 14,640 మందికిగాను ఉదయం జరిగిన పరీక్షకు 4,805 మంది(32.82 శాతం), మధ్యాహ్నం పరీక్షకు 4,755 మంది(32.48 శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతిలో నిర్వహించిన పరీక్షకు 38 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 13 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 7,796 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం జరిగిన పరీక్షకు మూడువేల మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,984 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో...సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు హైదరాబాద్లోప్రశాంతంగా కొనసాగాయి. నగరంలోని 83 కేంద్రాల్లో మొత్తం 47శాతం మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 38,798 మంది అభ్యర్థులకుగాను పేపర్-1 పరీక్షకు 18,377 మంది, పేపర్-2కు 18,161 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
యూపీఎస్సీపై పిల్కూ తిరస్కృతి
రేపే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రెండో పేపర్లో ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగం ప్రశ్నలను అభ్యర్థులు వదిలివేయవచ్చన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్ణయంపై దాఖలైన పిల్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సివిల్స్ పరీక్షకు హాజరవుతున్న నగ్వాన్ అనే న్యాయవాది ఈ పిల్‌ను దాఖలు చే శారు. అయితే వ్యక్తిగత కారణంపై కోర్టుకు వచ్చారని, ఇది ప్రజాప్రయోజనవ్యాజ్యం ఎలా అవుతుందం టూ కోర్టు ప్రశ్నించింది. ఇంతకుముందు ఇలాంటి పిటిషన్నే వేరే ధర్మాసనం ముందు దాఖలు చేశారని పేర్కొంటూ అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ వ్యతిరేకించటంతో ఈ అంశంపై క్యాట్‌ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. కొత్త విధానం ప్రకారం ప్రిలిమ్స్ రెండో పేపర్(సీశాట్-2)లో ఆంగ్ల భాషా పరిజ్ఞానానికి సంబంధించిన మార్కులను మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరని కేంద్రం తెలిపింది. దృష్టిలోపం ఉన్నవారికి అదనపు సమయం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న దృష్టిలోపం గల అభ్యర్థులకు ప్రతి పేపర్‌కు 40 నిమిషాల చొప్పున అదనపు సమయం ఇవ్వనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. దృష్టి లోపం ఉన్న అభ్యర్థులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సివిల్స్-2011 అభ్యర్థులకు మరో చాన్స్... 2011లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అదనపు అవకాశం ఇవ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. -
యూపీఎస్సీ పరీక్ష వివాదంపై దద్దరిల్లిన పార్లమెంట్
నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని విపక్షం డిమాండ్ లోక్‌సభలో దినపత్రికను చించి స్పీకర్ వైపు విసిరిన ఆర్జేడీ ఎంపీ న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్ష వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయసభలను అట్టుడికించింది. లోక్‌సభలో ఓ ఎంపీ దినపత్రికను చించి స్పీకర్పైపు విసరగా, వివాదాన్ని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడానికి ప్రభుత్వం నిరాకరించడంతో రాజ్యసభలో మొత్తం విపక్షం వాకౌట్ చేసింది. రగడ మధ్య ఉభయ సభలు పలుసార్లు వాయిదాపడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్న భోజనానికి ముందు మూడుసార్లు వాయిదాపడింది. ‘ఇలాగైతే కొత్త స్పీకర్‌ను ఎన్నుకోండి..’ పరీక్ష అంశంపై ఆర్జేడీ సభ్యుడు రాజేశ్ రంజన్ లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి హల్చల్ సృష్టించారు. ఓ దినపత్రికను చేత్తో ఊపుతూ వివాదంపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత దాన్ని ముక్కలుగా చించి స్పీకర్ సుమిత్రా మహాజన్ దిశగా విసిరారు. వాటిలో కొన్ని ఆమె టేబుల్‌పై పడ్డాయి. జీరో అవర్‌లో స్పీకర్.. రంజన్ ప్రవర్తన సరిగ్గా లేదని మందలించారు. దీంతో ఆయన రెండుసార్లు క్షమాపణ చెప్పారు. అంతకుముందు.. పుణే జిల్లాలో కొండచరియల ప్రమాదంపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. జ్యోతిరాదిత్య సింధియా(కాంగ్రెస్), పప్పూ యాదవ్(ఆర్జేడీ) కూడా దీనిపై పట్టుపట్టడంతో స్పీకర్ ఆగ్రహించారు. నోటీసు ఇస్తే చర్చకు సిద్దమని, 372 రూల్ కింద మంత్రి ప్రకటనపై వివరణ సాధ్యం కాదన్నారు. ‘మీరిలాగే సలహాలిస్తూ మొండిగా ప్రవర్తిస్తే కొత్త స్పీకర్‌ను ఎన్నుకోండి’ అని విసుక్కున్నారు. దీంతో పప్పూ క్షమాపణ చెప్పారు. రాజ్యసభలో..: సివిల్స్ అభ్యర్థుల ఆందోళన ను పరిష్కరించడానికి సమస్యను అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నామని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో చెప్పారు. సంబంధిత కమిటీ గురువారమే నివేదిక ఇచ్చిందని, అధ్యయనం చేస్తున్నామని అన్నారు. సెలవులు రావడంతో పరిష్కారంలో జాప్యమైందని మంత్రి జితేందర్‌సింగ్ వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని విపక్షాలు నిర్దిష్ట గడువు కావాలని పట్టుపట్టాయి. ఇప్పటికే ఇచ్చిన వారం రోజుల గడువు దాటిపోయిందన్నాయి. సివిల్స్ అభ్యర్థుల పట్ల ఢిల్లీ పోలీసుల తీరు బాగాలేదని, అభ్యర్థులపై కేసుల వాపసు తీసుకోవాలని సీపీఎం ఎంపీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. సభాపతి దీనిపై ఒక ప్రతిపాదన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని విపక్షాలు కోరాయి. అయితే తానలా ఆదేశించనని డిప్యూటీ చైర్మన్ పీజే కురియెన్ అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం రేగింది. అధికారపక్ష ఎంపీలు లేచి నిలబడి విపక్ష విమర్శలను తిప్పికొట్టాలని మంత్రి ప్రకాశ్ జవదేకర్ సైగ చేశారు. దీనిపై విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. జవదేకర్ క్షమాపణ చెప్పాలని, లేకపోతే సభాపతి ఆయనను బయటకు పంపాలని ఎస్పీఎంపీ నరేశ్ అగర్వాల్ డిమాండ్ చేశారు. వివాద పరిష్కారంపై గడువు ప్రకటనకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, యూపీఎస్సీ అంశంపై పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్న ఎంపీల ప్రవర్తన హుందాగా లేదని, వారు మారాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. -
తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్ఈ’..
నేటి యువత ఉద్యోగం ఎంపికలో బరువైన వేతన ప్యాకేజీల కంటే ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. పింక్ స్లిప్పుల ఊసే లేకుండా, పే స్లిప్పులకే నెలవైన కొలువునే కోరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం, ఉద్యోగ భద్రత.. అన్నింటికీ మించి ధైర్యసాహసాలను ప్రదర్శించి, దేశానికి సేవ చేసే అవకాశం అందుకోవాలన్న యువతకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలకు బాటలు వేసే యూపీఎస్సీ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ)కు నోటిఫికేషన్ విడుదలైంది.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. సీడీఎస్ఈ ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ, హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో ప్రవేశాలు కల్పిస్తారు. అకాడమీలలోని కోర్సుల్లో ప్రవేశం లభించిన వారికి, శిక్షణ అనంతరం ఉన్నత హోదాతో ఉద్యోగం లభిస్తుంది. ఖాళీల వివరాలు: అకాడమీ ఖాళీలు ఇండియన్ మిలిటరీ అకాడమీ 200 ఇండియన్ నావల్ అకాడమీ 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు) 12 మొత్తం 464 విద్యార్హతలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలకు డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఇండియన్ నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ధ్రువీకరణపత్రాలను తర్వాత సమర్పించాల్సి ఉంటుంది. వయసు: ఇండియన్ మిలిటరీ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1992, జూలై 2-1996, జూలై1 మధ్య జన్మించి ఉండాలి.ఇండియన్ నావల్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు)కి వివాహ/ అవివాహ అభ్యర్థులు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు)కి అవివాహ మహిళలు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు, బరువు తదితరాలకు సంబంధించి నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలెడ్జ్ 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 100 మొత్తం 300 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలెడ్జ్ 100 మొత్తం 200 శిక్షణ తీరుతెన్నులు: రాత పరీక్ష; ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్ 1, స్టేజ్ 2); దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత అభ్యర్థుల ప్రాధమ్యాలు, చూపిన ప్రతిభను బట్టి సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో శిక్షణ ఇస్తారు. శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టడం, లక్ష్యసాధన, ఆత్మ విశ్వాసం పెరిగేలా చేయడం శిక్షణ లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు. మొత్తంమీద దేశ రక్షణకు అవసరమైన అంశాల్లో రాణించేలా తర్ఫీదునిస్తారు. శిక్షణలో నివాస సౌకర్యం, పుస్తకాలు, యూనిఫామ్, వైద్య సౌకర్యాలు అందిస్తారు. అంతేకాకుండా నెలకు దాదాపు రూ.21 వేలు స్టైఫండ్‌గా లభిస్తుంది. కెరీర్: శిక్షణ పూర్తయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్, నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా ఉద్యోగాలే. ఏ సర్వీసులో చేరినప్పటికీ కెరీర్ ప్రారంభంలో అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ.45 వేల వరకు వేతనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలు: ఉన్నత స్థాయి వసతులు, అన్నిటిలోనూ రాయితీలు, సివిల్స్ లాంటి పరీక్షలకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల వరకు సడలింపు, జీవితాంతం కుటుంబమంతటికీ ఉచితంగా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు, బీమా రక్షణ, సబ్సిడీ ధరలకు ఆహార సామగ్రి, విమాన, రైలు ప్రయాణాల్లో తగ్గింపులు, బంజరు భూముల కేటాయింపు, తక్కువ వడ్డీకి రుణాలు, ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన సెలవు వంటి సదుపాయాలుంటాయి. పిల్లలకు ఉచిత చదువులు, ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది. పదోన్నతులు: స్వల్ప వ్యవధిలోనే పదోన్నతులు లభిస్తాయి. ఆర్మీలో రెండేళ్ల సర్వీసు తర్వాత కెప్టెన్, తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ ఇలా పదోన్నతులు లభిస్తాయి. ఎయిర్ ఫోర్స్‌లో అయితే ఫ్లెయిట్ లెఫ్టినెంట్, స్క్యాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్ వరుసలో పదోన్నతులు ఉంటాయి. ప్రతికూలతలు: ఇతర ఉద్యోగాల్లా నచ్చిన చోట పనిచేసే అవకాశం అన్ని వేళలా లభించదు. దేశంలో ఏ మూలనైనా పనిచేయాల్సి రావడం... కొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించాలి. అనుకున్న వెంటనే సెలవు దొరకకపోవడం, కొన్నిచోట్ల క్వార్టర్స్ సదుపాయం లేకపోవడంతో కుటుంబానికి దూరంగా గడపడం లాంటివి ఉద్యోగంలో ఎదురవుతాయి. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2014. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18, 2014. పరీక్ష తేదీ: అక్టోబర్ 26, 2014. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. లేదంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. వెబ్సైట్: www.upsconline.nic.in ఇంగ్లిష్ అభ్యర్థులు ఇంగ్లిష్ భాషను ఏమాత్రం అర్థం చేసుకుంటున్నారో పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. ఇందులో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, సరైన వాక్యాలను గుర్తించడం, యాంటోనిమ్స్, సినోనిమ్స్పై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ పత్రికలను చదువుతూ వొకాబ్యులరీపై పట్టు సాధించవచ్చు. కొత్త పదాలను నేర్చుకోవడం, వాటిని వాక్యాల్లో ప్రయోగిస్తున్న సందర్భాలను గుర్తించడం చేయాలి. ఒక కొత్త పదాన్ని తెలుసుకుంటే వాటి యాంటోనిమ్స్, సినోనిమ్స్ను గుర్తించాలి. ప్రిపరేషన్‌కు రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి. The dacoit /many heinous crimes(P)/ had committed(Q)/who carried a reward of fifty thousand rupees (R)/ on his head(S) The correct sequence should be.. a) PQRS b) QPSR c) RQPS d) RSQP జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదవాలి. న్యూస్ బులెటెన్లను చూడాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా ప్రామాణిక జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం మనోరమ ఇయర్‌బుక్‌ను ఉపయోగించుకోవాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇందులో పదో తరగతి లేదా తత్సమాన స్థాయిలోని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు నంబర్ సిస్టమ్; ఫండమెంటల్ ఆపరేషన్స్; టైమ్ అండ్ వర్క్; సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో అండ్ ప్రొపోర్షన్, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం వంటి అంశాలపై పట్టుసాధించాలి. వీటికి ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ పుస్తకం ఉపయోగపడుతుంది. ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్లకు సంబంధించిన అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. సీబీఎస్ఈ లేదా స్టేట్ సిలబస్‌లోని 9, 10 తరగతుల పుస్తకాల్లోని వివిధ అంశాల సమస్యలను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి. An aeroplane covers a certain distance at a speed of 240km-ph in 5 hours. To cover the same distance in 12/3hours, it must travel at a speed of: a) 300 km-ph b) 360 km-ph c) 600 km-ph d) 720 km-ph -
తప్పుల కుప్ప యూపీఎస్సీ!
అఖిల భారత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆ లక్ష్యాన్ని వదిలిపెట్టి అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానానికి పెడుతున్న పరీ క్షలపై ఇప్పుడు దేశవ్యాప్త నిరసన రాజుకుంది. హేతుబద్ధతకు వీడ్కో లు పలికి, సమన్యాయాన్ని అటకెక్కించి తరచు చేస్తున్న ఈ ‘సంస్క రణ’లన్నీ సివిల్ సర్వీసుల జోలికి ఎవరూ రాకుండా బెదరగొట్టేందుకే ఉపయోగపడుతున్నాయి. నిరుడు మెయిన్స్ పరీక్షా విధానంలో తీసు కొచ్చిన మార్పులన్నీ ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి అనుకూ లంగా ఉన్నాయని అభ్యర్థులంతా గగ్గోలుపెట్టారు. ఇప్పుడు ప్రిలిమ్స్ లోని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్) పోతున్న పోకడలపై నిరసనలు ఊపందుకున్నాయి. భిన్నరంగాల్లో దేశాన్ని ముందుకు నడ పాల్సిన కీలక బాధ్యతలను చేపట్టగల సమర్థులెవరని చేయవలసిన అన్వేషణ కాస్తా... యూపీఎస్సీ అనుసరిస్తున్న ధోరణులవల్ల ఎవరికి ఇంగ్లిష్ బాగావచ్చునో, ఆ భాషను ముచ్చటగా మాట్లాడగలవారెవరో తెలుసుకునే పరీక్షగా మారిపోతున్నది. నిరుడు సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షా విధానంలో సంస్కరణల పేరిట తీసుకొచ్చిన మార్పులపై నిరు ద్యోగ లోకం భగ్గుమంది. ప్రాంతీయ భాషలను చిన్నచూపు చూసే ఈ సంస్కరణలు కేవలం ఇంగ్లిష్ లేదా హిందీలో రాసేవారికి మాత్రమే అనుకూలంగా ఉన్నాయని ఎందరెందరో నిరసించారు. డిగ్రీ వరకూ ప్రాంతీయ మాధ్యమంలో చదువుకున్నవారు మాత్రమే పరీక్షను ఆ భాషలో రాయవచ్చని కొత్త నిబంధన విధించింది. అంతేకాదు...ఆ భాషలో రాసే అభ్యర్థులు కనీసం పాతికమంది ఉంటేనే అలా రాయడా నికి అనుమతిస్తామని మెలికపెట్టింది. తగిన సంఖ్యలో అభ్యర్థులు లేని పక్షంలో పరీక్షను హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయాలన్నది. పైగా డిగ్రీలో తమ ప్రాంతీయ భాషను ఆప్షనల్‌గా తీసుకున్నవారు మాత్రమే మెయి న్స్లోనూ దాన్ని ఆప్షనల్‌గా తీసుకోవడానికి అర్హులని మరో నిబంధన పెట్టింది. తీవ్ర నిరసనల తర్వాత ఈ విషయంలో వెనక్కి తగ్గినా అభ్య ర్థులు పడుతున్న అసలు బాధలు వేరే ఉన్నాయి. పరీక్షను ప్రాంతీయ భాషలో రాయొచ్చంటున్నారుగానీ ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీలో ఇస్తున్నారు. ఇక ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానంపై పెడుతున్న పరీక్ష అత్యంత కఠినంగా ఉంటున్నదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష స్థితి ఇలావుంటే ఇక ప్రిలిమ్స్ స్థాయిలోని సీశాట్ తోనూ, అందులోని పేపర్-2తోనూ అభ్యర్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఇంగ్లిష్, గణిత శాస్త్రాల పరిజ్ఞానాన్ని మా త్రమే పరీక్షించడంద్వారా గ్రామీణ నేపథ్యంగలవారికీ, తెలుగు మాధ్య మంగా ఉన్నవారికీ తీరని అన్యాయం చేస్తున్నారు. సీశాట్ ప్రవేశ పెట్టాక తెలుగు మాధ్యమంగా ఉన్నవారిలో ఉత్తీర్ణతా శాతం క్రమేపీ తగ్గడమే ఇందుకు సాక్ష్యం. అయితే, ఇదే పరీక్ష హిందీ మాధ్యమంగా గలవారికి కూడా తలనొప్పిగా మారడంతో ఇప్పుడు దీనిపై ఉద్యమం దేశవ్యాప్తమయింది. వాస్తవానికి రెండేళ్లక్రితం సీశాట్‌పై గొడవ రాజు కున్నప్పుడు అప్పటి యూపీఏ సర్కారు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక మరికొన్నిరోజుల్లో రాబోతున్నది. ఈలోగానే యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు తయారైంది. అది స్వ యంప్రతిపత్తిగల సంస్థే కావొచ్చుగానీ చుట్టూ జరుగుతున్నదేమిటన్న స్పృహ ఉండాలి. మన దేశం భిన్న భాషలు, సంస్కృతులు గల దేశం. దేశ పాలనా నిర్వహణలో ఈ వైవిధ్యత ప్రతిఫలించాలంటే అన్ని ప్రాం తాలకూ, భాషలకూ, సంస్కృతీ నేపథ్యంగలవారికీ ఆ నిర్వహణలో చోటివ్వాలి. అప్పుడు మాత్రమే ఈ దేశ ప్రగతిలో తమకు కూడా భాగ స్వామ్యం ఉన్నదన్న సంతృప్తి అందరిలోనూ కలుగుతుంది. దేశ సమై క్యతకూ, సమగ్రతకూ అలాంటి భావన దోహదపడుతుంది. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి అన్యాయం కలిగే రీతిలో, కేవలం నగరాల్లోని ఖరీదైన కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుకున్నవారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా మొత్తం ప్రక్రియ సాగితే అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో యూపీఎస్సీకి అర్ధంకావడంలేదు. సివిల్ సర్వీసులకు ఎంపికయ్యేవారిలో రాను రాను ఇంగ్లిష్ ప్రావీ ణ్యం అడుగంటుతున్నదని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ‘కాలం చెల్లిన విధానాలకు’ స్వస్తిపలకాలని నిర్ణయించామని యూపీఎస్సీ చెబుతున్నది సబబు కానేకాదు. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం తగినంతగా ఉండాలని ఆశించడంలో తప్పులేదుగానీ అది మాత్రమే అభ్యర్థి జయా పజయాలను నిర్ణయించే స్థితి కల్పించడం అన్యాయం. వాస్తవానికి అలాంటివారంతా మౌలికంగా పనిచేయాల్సింది ఈ దేశంలోనే, వ్యవ హరించాల్సిందీ ఈ దేశ ప్రజలతోనే. అలాంటపుడు వారి ఇంగ్లిష్ పరి జ్ఞానంకన్నా... సమస్యలను గుర్తించడంలో, వాటికి పరిష్కారాలను వెదకడంలో, విస్తృత ప్రజానీకానికి మేలు చేకూర్చే అంశాలను సృజనా త్మకంగా ఆవిష్కరించడంలో వారికి ఉండే సమర్ధతను పరీక్షించాలి. వారిలో సమయస్ఫూర్తి, చొరవ, హేతుబద్ధత, అంకితభావం, దృఢ సంకల్పం, నైతికవర్తన వంటివి ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయ గలగాలి. కానీ, యూపీఎస్సీ పెడుతున్న పరీక్షలన్నీ వేరే రకంగా ఉంటున్నాయి. అయితే హిందీకి లేదా ఇంగ్లిష్‌కు పెద్దపీట వేయడం, గణితాన్ని నెత్తికెత్తుకోవడంవంటివి చేస్తూ తరచు అభ్యర్థులకు తల నొప్పి కలిగిస్తున్నది. పరీక్షకొచ్చినవారిని గందరగోళపరచడమే లక్ష్యమ న్నట్టు వ్యవహరిస్తున్నది. ఇన్ని దశాబ్దాల అనుభవంతో సివిల్ సర్వీసు లకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత సమర్ధవంతంగా నిర్వ హించడానికి బదులు దాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నది. యూపీఎస్సీకి తగిన సలహాలిచ్చి దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఉన్నదని పాలకులు ఇప్పటికైనా గుర్తించడం అవసరం. -
‘సివిల్స్ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలి’
న్యూఢిల్లీ: వచ్చే నెల 24న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా కేంద్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కోరింది. సిలబస్‌పై స్పష్టత వచ్చేవరకూ పరీక్ష నిర్వహించరాదని కోరినట్టు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. సివిల్స్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్)ను రద్దు చేయాలంటూ సివిల్స్ ఆశావహులు సోమవారం యూపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుత సిలబస్ హిందీ భాష ఆశావహులకు అనుకూలంగా లేదన్నారు. వీరిలో కొందరు మంగళవారం జితేంద్రను కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. సిలబస్‌పై సత్వరం నిర్ణయం తీసుకోవాలని యూపీఎస్సీతోపాటు సంబంధిత కమిటీని కూడా కోరామన్నారు. -
యూపీఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శన
- మెట్రో స్టేషన్లు బంద్ - పలు రోడ్ల మూసివేత - ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సాక్షి, న్యూఢిల్లీ: హిందీలో పరీక్ష రాసే అభ్యర్థులపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పక్షపాతం చూపుతోందని ఆరోపిస్తూ ఈ సంస్థ సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే అభ్యర్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్‌లో వీళ్లు శుక్రవారం నిరసనకు దిగడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్ఏటీ) రద్దు చేయాలని కోరుతూ సివిల్‌లైన్స్‌లో వందలాది మంది గుమిగూడడంతో నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు. నిరసనకారులు రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధానమంత్రి నివాసం వద్దకు వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, ఉద్యోగ్‌భవన్, రేస్‌కోర్సు మెట్రో స్టేషన్లలోని ప్రవేశనిష్ర్కమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో అధికారులను ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు నాలుగు మెట్రో స్టేషన్లను కొంతసేపు మూసివేసి తిరిగి తెరిచారు. సాయంత్రం మరోమారు నిరసనకారులు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ముందు గుమిగూడారు. దీంతో రేస్‌కోర్సు స్టేషన్‌ను సాయంత్రం ఐదు గంటలకు మరోమారు మూసివేశారు. రేస్‌కోర్సు రోడ్డుకు దారితీసే రోడ్లు కూడా మూసివేశారు. అభ్యర్థులు ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించాలని భావించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు మెట్రో స్టేషన్ల గేట్ల అధికారులు నోటీసులు అంటించారు. మెట్రో స్టేష న్లకు వచ్చిన ప్రయాణికులు వీటిని చూసి నిరాశతో వెనుదిరిగారు. -
సివిల్ సాధ్యమే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ ప్రకటన విడుదలైంది. మీరూ ఐఏఎస్, ఐపీఎస్ కావొచ్చు. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటమికి బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం ఉంటే లక్ష్య సాధన పెద్ద సమస్యే కాదంటున్నారు సివిల్స్‌లో విజయం సాధించిన పలువురు. మరి ఎందుకాలస్యం.. దరఖాస్తు నింపేయండి.. పరీక్షకు సిద్ధం కండి.. కొలువు కొట్టేయండి.. యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహణ జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి లేదా ఎస్బీh/ఎస్బీఐ గ్రూప్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం పోస్టుల సంఖ్య 1291. అర్హతలివీ.. ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే. అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు. ఎన్నిసార్లు రాయొచ్చు.. గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది. దరఖాస్తు చేయండిలా.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఠీఠీఠీ.ఠఞటఛిౌజ్ఛీ.జీఛి.జీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ ్ట-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టిన తేదీ పదోతరగతి సర్టిఫికెట్లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టిన తేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా భర్తీ చేసే పోస్టులివీ.. 1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2. ఇండియన్ ఫారెన్ సర్వీస్ 3. ఇండియన్ పోలీస్ సర్వీస్ 4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్- గ్రూప్-ఏ 5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ 6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్)- గ్రూప్-ఏ 7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ 9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్) 10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ 1 1. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 12. ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ 13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ 15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ 16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ 18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3) 19. ఇండియన్ కా్ఘూరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ, 20. ఆర్మ్డ్ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్) 21. ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి 22. ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి 23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి పరీక్షలు ఇలా... సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష ఇలా.. మెయిన్సలో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పరీక్ష వ్యవధి మూడు గంటలు. అభ్యర్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకం.మన రాష్ట్రంలో హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. పలువురు అభ్యర్థులు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో సైతం శిక్షణ తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వ రకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. సివిల్స్‌లో ఇంటర్వ్యూ కీలకమైన ఘట్టం. ఇందులో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలపై అడుగుతారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మెయిన్స్ : అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి. ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్-బి : ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి. మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపిక అవుతామనే నమ్మకం ఉండాలి.. డాక్టర్ గజరావు భూపాల్, జిల్లా ఎస్పీ ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యేవారు ఒక ప్రణాళిక రూపొందించుకొని చదవాలని సూచిస్తున్నారు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్. సివిల్స్‌కు ప్రిపేర్‌పై ఆయన ఏమంటున్నారంటే.. నేను వారం రోజుల ప్రణాళికను ముందే తయారు చేసుకుని చదివాను. ఇతరులకు ఏదో సబ్జెక్టులో ఎక్కువ మార్కులువచ్చాయని ఆ సబ్జెక్టును చదవకుండా.. మనము దేనినైతే ఎక్కువగా ఇష్టాపడుతామో అదే సబ్జెక్టు చదవాలి. ముఖ్యంగా ఐపీఎస్‌కు ఎంపిక అవుతాననే నమ్మకం అందరిలోనూ ఉండాలి. చదివే సమయంలో అలసటగా ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో మంచి వాతావరణంలో గడుపుతూ స్నేహితులతో ఉండేలా ప్రయత్నించాలి. నేను ఏ వృత్తిలో ఉన్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా చదువుకున్నాను. మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అమ్మానాన్నలు అనురాధ, సీతారామస్వామి ఇద్దరూ వైద్యులే. డిగ్రీ వరకు కాకినాడలోనే చదువుకున్నాను. మెడికల్ విద్య అభ్యసించాను. 2006లో ఐపీఎస్ కోసం ఢిల్లీలోని వాజిరాం ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. శిక్షణ సమయంలో ఒకసారి ఐపీఎస్ రాసినా ఎంపిక కాలేదు. శిక్షణ ముగిసిన అనంతరం 2007లో కాకినాడలోని శంకవరం పీహెచ్సీలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశాను. అక్కడ విధులు నిర్వర్తిస్తూనే మళ్లీ ఐపీఎస్‌కు సిద్ధమయ్యాను. 2008లో ఎంపికయ్యాను. వైద్యుడిగా కాకుండా ఏ వృత్తిలోనైనా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించాను. శిక్షణ అనంతరం 2010-13 వరకు భద్రచలం ఏఎస్పీగా, 2013-అక్టోబర్ వరకు మెదక్ అడిషనల్ ఎస్పీగా, ఆ తర్వాత ఆదిలాబాద్ ఎస్పీగా పదోన్నతిపై వచ్చాను. మొదటి నుంచీ నేను ఐపీఎస్ కావాలనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సంతోష పడ్డాను. వైద్యునిగా రోగులకు, ఎస్పీగా ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం వారి ప్రోత్సాహం మరువలేనిది.. జోయేల్ డేవిస్, ఆదిలాబాద్ ఏఎస్పీ ఎలాగైనా ఐపీఎస్‌కు ఎంపికవుతాననే లక్ష్యంతో చదవాలి. అప్పుడే మన ఆశయం నెరవేరుతుంది. నేను ఐపీఎస్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాను. మాది తమిళనాడు రాష్ట్రం, జిల్లా కన్యాకుమారి గ్రామం కొట్టికోడు. వ్యవసాయ కుంటుంబం. మా అమ్మానాన్నలు డేవిడ్సన్, రీబీలు నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. అప్పులు చేసి మరీ నన్ను ఐపీఎస్ చదివించారు. డిగ్రీ వరకు మా ఊళ్లోనే చదువుకున్నాను. డిగ్రీ చదివే సమయంలో ఉదయం, మధ్యాహ్నం మాకున్న అరటితోటలో నావంతుగా పనిచేసేవాన్ని. డిగ్రీ తర్వాత 8 నెలలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అసలు నేను ఐపీఎస్ చదువుతానని అనుకోలేదు. అప్పటి వరకు మా గ్రామానికే పరిమితమైన నన్ను మా బావ డిస్పన్రాయ్ (ప్రధానోపాధ్యాయుడు) ఐపీఎస్ చదివేంచేందుకు సహాయపడ్డారు. ఆ తర్వాత చెన్నైలో మా అక్కాబావ ఇంట్లో ఉండి ఐపీఎస్‌కు ప్రిపేర్ అయ్యాను. చెన్నైలోని అకాడమిక్ ప్రభా ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. 8 గంటలు నిర్విరామంగా చదివేవాన్ని. ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా నా చదువుకు ఆటంకం రావొద్దని మా కుటుంబ సభ్యులు ఆ విషయం నాకు తెలియనీయకుండా దాచేవారు. అప్పు చేస్తూ చదివిస్తున్నారనే విషయం కూడా నాకు తెలీదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఐపీఎస్ అవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాను. 2010లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. ఐపీఎస్‌కు ఎంపిక కావడంపై మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వలేదనే సంతోషం కూడా నాలో కలిగింది. ఒక అర్థవంతమైన జీవితం లభించిందనుకున్నాను. నన్ను ప్రోత్సహించిన మా నాన్న, బావ, మా కోచింగ్ సెంటర్ డెరైక్టర్ ప్రభాకర్‌లో ప్రోత్సాహం చాలా వరకు ఉంది. మొదటగా వరంగల్‌లోని జనగంలో ఏఎస్పీగా, ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాను. - ఆదిలాబాద్ క్రైం సివిల్ సర్వీసెస్ స్పెషల్ వెబ్ పోర్టల్ కోసం.. www.sakshieducation.com లాగిన్ అవ్వండి.. -
త్వరలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. ఈ ఫైలుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమ్మతి తెలిపిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభ జన తర్వాత అప్పటివరకు ఉన్న ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పని చేస్తుందని, తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేస్తారని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం పేర్కొంది. అప్పటి వరకు.. ఏమైనా ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చూస్తుందని స్పష్టం చేసింది. సీఎం నేతృత్వంలోని బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నందున.. ఆయనే స్వయంగా టీఎస్పీఎస్సీ ఆమోదానికి, ఉత్తర్వుల జారీకి కేంద్రంతో చర్చించనున్నారు -
ఉద్యోగాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య: 375 అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు.ఎయిర్ ఫోర్స్, నావల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు:161/2-191/2ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.upsconline.nic.in ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ - ఏప్రిల్ 2015 బ్యాచ్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 54 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ సీనియర్ డివిజన్/వింగ్‌లో కనీసం రెండేళ్ల సర్వీస్‌తో పాటు ‘సి’ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 31 వెబ్సైట్: www.joinindianarmy.nic.in సిండికేట్ బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ లేటరల్ వేకెన్సీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్) 2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (చీఫ్ ఎకనామిస్ట్) 3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్) 4. చీఫ్ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 5 వెబ్సైట్: www.syndicatebank.in/ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ న్యూఢిల్లీలోని లైజన్ కార్యాలయంలో కింది పోస్టుల భర్తీకి(తాత్కాలిక పద్ధతిన) భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: జూనియర్ అసిస్టెంట్-గ్రేడ్ 2 ఖాళీలు: 3 అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు. ఆఫీస్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు నెలల కోర్సు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 4 వెబ్సైట్: http://bdl.ap.nic.in జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూ నివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మంథని), మంథని, జగిత్యాల, సుల్తాన్పూర్ క్యాంపస్‌లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: లెక్చరర్(అడ్‌హక్)/అకడమిక్ అసిస్టెంట్స్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 27 వెబ్సైట్: http://jntuhcem.org పవేశాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్) సీట్ల సంఖ్య: 16 వ్యవధి: రెండేళ్లు అర్హతలు: ఎంబీబీఎస్ లేదా న్యూట్రిషన్/హోమ్‌సైన్స్/నర్సింగ్‌లో బీఎస్సీ/బీఎస్సీ(బయో కెమిస్ట్రీ/న్యూట్రిషన్) ఉండాలి. దరఖాస్తులు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 13 వెబ్సైట్: http://ninindia.org అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హో టల్ మేనేజ్మెంట్, చండీగఢ్ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అర్హతలు: ఇంగ్లిష్ సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30, 2014 వెబ్సైట్: www.ihmchandigarh.org నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: బీఈ ప్రోగ్రామ్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మ్యా నుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బయోటెక్నాలజీ. అర్హతలు: ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై జేఈఈ(మెయిన్)-2014లో అర్హత సాధించాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 23 నుంచి వెబ్సైట్: www.nsit.nic.in నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బుక్ పబ్లిషింగ్ వ్యవధి: నాలుగు వారాలు దరఖాస్తులు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 10 వెబ్సైట్: www.nbtindia.gov.in -
సివిల్ సర్వీసెస్ ఆశావహులకు శుభవార్త
ఇక నుంచి మరో రెండు ప్రయత్నాలకు అవకాశం గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంపు 1,291 పోస్టులతో నోటిఫికేషన్ న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక అఖిలభారత సర్వీసు ఉద్యోగాలను సాధించాలనుకునే ఆశావహ విద్యార్థులకు శుభవార్త. భారీ మార్పులతో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిద్ధమైంది. అంగ వైకల్య అభ్యర్థులకు ప్రత్యేకించిన 26 సహా దాదాపు 1,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి నుంచి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో రెండేళ్ల సడలింపుతో పాటు పరీక్షలకు అదనంగా రెండు ప్రయత్నాలు (అటెమ్ట్స్) చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఈ లెక్కన నిర్దేశిత వయోపరిమితికి లోబడి జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు (గతంలో నాలుగు సార్లు) పరీక్షలకు హాజరుకావచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు ఏడు ప్రయత్నాల వరకు అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ప్రయత్నాలపై పరిమితి లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 21-32 ఏళ్ల మధ్య వయసు (1982 ఆగస్టు 2 కంటే ముందు, 1993 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు) ఉన్న అర్హులెవరైనా యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈసారి పరీక్షల నిర్వహణ విధానంలో కానీ, సిలబస్‌లో కానీ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ ఏడాది ఆగస్టు 24న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ), తర్వాత ప్రధాన పరీక్షలు (మెయిన్స్), మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది -
సివిల్స్ అభ్యర్థులకు మరో రెండు అవకాశాలు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు గతేడాదితోనే అవకాశాలు (అటెంప్ట్స్) పూర్తయిన అభ్యర్థులకు ఈ ఏడాది నుంచి మరో రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశం లభించనుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిని బట్టి ఈ ఏడాది నుంచి రెండు అదనపు అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెల్లడించింది. పరీక్షల విధానం, సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. సివిల్స్ పరీక్షలు రాసేందుకు జనరల్ అభ్యర్థులకు నాలుగు సార్లు, ఓబీసీలకు ఏడు సార్లు, ఎస్సీ, ఎస్టీలకు ఎన్నిసార్లు అయినా అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు వయసు పరిమితి 21 నుంచి 30 ఏళ్ల వరకూ కాగా, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 24న జరగనుంది. సివిల్స్ పరీక్షల పూర్తి వివరాలను మే 31నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా రోజ్‌గార్ సమాచార్ పత్రికల సంచికలలో ప్రచురించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. -
ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 24న జరగనుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రతిష్టాత్మక పరీక్షకు పర్యవేక్షకులుగా ఆయా రాష్ట్రాల్లోని కొందరు అధికారులను కేటాయించాలని యూపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నట్టు పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహార మంత్రిత్వ శాఖకు మంగళవారం యూపీఎస్సీ లేఖ రాసింది. -
ఆగస్టు 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 24న జరగనుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రతిష్టాత్మక పరీక్ష కు పర్యవేక్షకులుగా ఆయా రాష్ట్రాల్లోని కొందరు అధికారులను కేటాయించాలని యూపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నట్టు పేర్కొంది. ఒక్క ఢిల్లీలోనే దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహార మంత్రిత్వ శాఖకు మంగళవారం యూపీఎస్సీ లేఖ రాసింది. -
మెడికల్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం.. సీఎంఎస్ఈ
కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో వైద్యుల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ప్రతి ఏటా కంబైన్డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్ఈ)ను నిర్వహిస్తుంది. కాస్త భిన్నంగా ఆలోచించే వారికి.. అంకిత భావం, సేవా తత్పరత, ప్రభుత్వ సర్వీసుల్లో పని చేయాలనుకునే ఉత్సాహంతో ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్లకు చక్కని అవకాశం సీఎంఎస్ఈ.. 2014 సంవత్సరానికి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వ కొలువును దక్కించుకునే మార్గాన్ని సుగమం చేస్తోంది..సీఎంఎస్ఈ తాజాగా భర్తీ చేస్తున్న పోస్టులు.. విభాగం పోస్టుల సంఖ్య అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్-రైల్వేస్ 650 సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ జూనియర్ స్కేల్ కేటగిరీ పోస్టులు 150 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) ఇన్ ఈస్ట్-సౌత్-నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 53 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ 22 అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ హెల్త్ సర్వీసెస్ (పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు). బేసిక్ పే: రూ.15,600-రూ.39,100+గ్రేడ్‌పే రూ. 5400 ఎంపిక ఇలా: ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్). ఈ రెండు దశలకు కలిపి మొత్తం 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కు లు. నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష: రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, 2.. రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధానానికి ఇచ్చే మార్కుల్లోంచి 0.33 మార్కుల కోత విధిస్తారు. పేపర్-1: ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. విభాగం ప్రశ్నలు జనరల్ ఎబిలిటీ 30 జనరల్ మెడిసిన్ 70 పిడియాట్రిక్స్ 20 మొత్తం: 120 సమయం: రెండు గంటలు పేపర్-2: ఇందులో కూడా మూడు విభాగాలు ఉంటాయి. అవి.. విభాగం {పశ్నలు సర్జరీ 40 గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ 40 ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ 40 మొత్తం: 120 సమయం: రెండు గంటలు పేపర్-1 జనరల్ ఎబిలిటీ: ఇందులో సిలబస్‌ను పరిశీలిస్తే..దాదాపు అన్ని రంగాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ఉంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి విస్తృత స్థాయి ప్రిపరేషన్ తప్పనిసరి. ఈ విభాగంలో భారతీయ సమాజం, సంస్కృతి, వారసత్వం, పాలిటీ, ఎకనామీ, మానవాభివృద్ధి సూచీ, అభివృద్ధి కార్యక్రమాలు, సహజ వనరులు-పంపిణీ, లభ్యత, పరిరక్షణ, జీవావరణ శాస్త్రం-ప్రాథమిక భావనలు, ఆరోగ్య-ఆర్థిక రంగాలపై పర్యావరణ ప్రభావం, సామాజిక, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో కాలక్రమేణా చోటు చేసుకుంటున్న మార్పులు, భారత వ్యవసాయ రంగం, పరిశ్రమలు-వాణిజ్యం, రవాణ రంగం, సేవా రంగం, ప్రకృతి వైపరీత్యాలు-నిర్వహణ, ఆహారం-పంపిణీ-నిల్వ, ప్రజారోగ్య సంరక్షణలో ఆహారం పాత్ర వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ మెడిసిన్‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇం దులో భాగంగా కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటబాలిక్ డిజా ర్డర్స్, ఇన్ఫెక్షన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, న్యూట్రిషన్ గ్రోత్, డిసీజెస్ ఆఫ్ స్కిన్ (డెర్మటాలజీ), మస్స్కోలోస్కెల్టల్ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పిడియాట్రిక్స్‌లో చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు, నివారణ, వైద్య విధానానికి చెందిన ప్రశ్నలుంటాయి. పేపర్-2: సర్జరీ విభాగంలో.. జనరల్ సర్జరీ (గాయాలు, ట్యూమర్లు, ఇన్ఫెక్షన్స్, ఎలిమెంటరీ ట్రాక్, అబ్డామినల్ ఇన్జ్యూరీస్, న్యూరో సర్జరీ తదితర)పై ప్రశ్నలుంటాయి. గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ నుంచి ఇంట్రా -నాటల్, పోస్ట్-నాటల్; అప్లైడ్ అనాటమీ, అప్లైడ్ సైకాలజీ, జెనిటల్ ట్రాక్; నియోప్లాస్మా; గర్భ నిరోధక విధానాలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. చివరి విభాగ మైన ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో.. సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఉద్దేశం- విధానం; హెల్త్ అడ్మినిస్ట్రేషన్; భారతదేశంలోని విభిన్న జాతులు-వాటికి సంబంధించిన ఆరోగ్య గణాంకాలు, న్యూట్రిషన్ అండ్ హెల్త్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సోషియాలజీ సంబంధ ప్రశ్నలడుగుతారు. ఇంటర్వ్యూ ఇలా: రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అభ్యర్థులను పిలుస్తారు. ఇంటర్వ్యూ ప్రధానంగా అభ్యర్థికి వివిధ అంశాల పట్ల ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించింది. చేపట్టే వృత్తికి ఎంత వరకు న్యాయం చేయగలడు అనే కోణంలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్ అంశాలు, మేథో సామర్థ్యం, నిర్ణాయక శక్తి, సామాజిక దృక్ఫథం, నాయకత్వ లక్షణాలు, సేవాతత్పరత, కమ్యూనికేషన్ స్కిల్స్, చురుగ్గా స్పందించే గుణం వంటి అంశాలను అంచనా వేస్తారు. అదేవిధంగా వ్యక్తిగత ఆసక్తులాధారంగా కూడా ప్రశ్నలు సంధించవచ్చు. కెరీర్: పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని ప్రతిభ, ఖాళీల ఆధారంగా వివిధ విభాగాల్లో నియమిస్తారు. సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జూనియర్ స్కేల్ పోస్ట్ నియామకం ద్వారా.. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం, ఇతర కేంద్ర ప్రభుత్వ వైద్య పథకాల పరిధిలోని వైద్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ హోదాలో అడుగు పెట్టవచ్చు. రైల్వే విభాగానికి ఎంపికైన వారు రైల్వే హాస్పిటల్స్‌లో సేవ లందించాలి. ఇలా నోటిఫికేషన్లో పేర్కొన్న శాఖల పరిధిలో జూనియర్ స్కేల్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి రెండేళ్లవరకు ప్రొబేషన్ శిక్షణ ఉంటుంది. అవసరమనుకుంటే ప్రొబేషన్‌ను పొడిగిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని విభాగాన్ని బట్టి జూనియర్ స్కేల్ హోదాలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా నియమిస్తారు. చేరిన అభ్యర్థులు పనితీరు, అనుభవం ఆధారంగా అత్యున్నత హోదాలకు చేరుకుంటారు. రైల్వేల్లో వైద్యాధికారిగా చేరినవారికి ఉచిత రైల్వే పాస్‌లతోపాటు ఇతర సదుపాయాలుంటాయి. ఎంపికైనవారికి విభాగమేదైనా నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కింద బేసిక్ పేకు సమానంగా 25 శాతం నగదు చెల్లిస్తారు. ప్రాక్టికల్‌గా అన్వయించి ఎంబీబీఎస్ కోర్సుపై ఆమూలాగ్రం అవగాహన ఉంటే సీఎంఎస్ఈలోని మెడికల్ పేపర్లను సులభంగానే ఆన్సర్ చేయొచ్చు. ఆయా సబ్జెక్టుల ఫండమెంటల్స్‌పై దృష్టిపెట్టి చదువుతూ.. సీఎంఎస్ సరళిని తెలుసుకోవడానికి గత ప్రశ్నపత్రాలను కూడా ప్రాక్టీస్ చేశాను. ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో ప్రాక్టికల్ అప్రోచ్ ఏర్పడింది. ప్రిపరేషన్ పరంగా ఈ అంశం బాగా కలిసొచ్చింది. సీఎంఎస్ఈ కోసం ఎంబీబీఎస్ పుస్తకాలు, ఆయా పీజీ ఎంట్రెన్స పుస్తకాలు చదవాలి. మొత్తం పరీక్షలో జనరల్ ఎబిలిటీ కొంత కష్టంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎకాలజీ, జాగ్రఫీ విభాగాల్లో ప్రోటోటైప్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎదుర్కోవాలంటే.. గత ప్రశ్న పత్రాలు, జనరల్ నాలెడ్జ్ రివ్యూ బుక్స్ చదవడం అలవర్చుకోవాలి. సబ్జెక్టులను బట్టీపట్టకుండా.. ఐదేళ్లపాటు అకడెమిక్‌గా చదివిన అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించి సమాధానం ఇచ్చేలా సిద్ధం కావాలి. -జ్యోత్స్న కె. మీనన్ సీఎంఎస్ఈ-2012 ఆల్ ఇండియా టాపర్ గతేడాది కంబైన్డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2013 ఫలితాలను పరిశీలిస్తే.. మొత్తం 1,492 పోస్టులకు గాను 1,310 మంది ఎంపికయ్యారు. కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్: 558, ఓబీసీ-398, ఎస్సీ-210, ఎస్టీ-114. ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు సమాన మార్కులు రావడం విశేషం. అమర్ బహదూర్ సింగ్: 436 మార్కులు (పేపర్-1: 179.26, పేపర్-2: 189.08, పర్సనాలిటీ టెస్ట్: 68). లవ్ బన్సల్: 436 మార్కులు (పేపర్-1: 178.57, పేపర్-2: 182.77, పర్సనాలిటీ టెస్ట్: 75). సీఎంఎస్ఈ నోటిఫికేషన్ సమాచారం అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతూ ‘కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్’ లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సీఎంఎస్ఈ తుది జాబితా ఎంపిక సమయానికి ఆ ఇంటర్న్ షిప్‌ను పూర్తి చేసుకుంటేనే అపాయింట్మెంట్ లభిస్తుంది. వయసు: 32 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి). ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్సీ కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు; ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు. దర ఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014. పరీక్ష తేదీ: జూన్ 22, 2014 వెబ్సైట్: www.upsc.gov.in, www.upsconline.nic.in -
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మెరుున్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. విజేతలైన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లతో పాటు గ్రూప్ ఏ, బీ కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసేందుకు గాను ఇంటర్వ్యూలకు (పర్సనాలిటీ టెస్ట్) పిలువనుంది. విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ.ఠఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యే అవకాశం ఉందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఢి ల్లీలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, తేదీ, సమయం విజేతలైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తామని పేర్కొంది. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, కులం, వైకల్యానికి (ఉంటే) సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను క్వశ్చనీర్, అటెస్టేషన్ ఫామ్, టీఏ వంటి ఇతర పత్రాలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందని ప్రకటన వివరించింది. ఈ పత్రాలన్నిటికీ సంబంధించిన ఫార్మాట్లను యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూ తేదీ, సమయం మార్పుకు సంబంధించిన ఎలాంటి వినతులనూ పరిశీలించడం జరగదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల జాబితాలను ఇంటర్వ్యూలు ముగిసిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్ పెట్టనున్నట్టు వివరించింది. గత ఏడాది డిసెంబర్లో యూపీఎస్సీ మెరుున్స్ రాతపరీక్షను నిర్వహించింది. -
సివిల్స్‌కు మరో రెండు చాన్స్‌లు
అవకాశాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం 2014 ప్రిలిమ్స్ నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులందరికీ శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్ఈ)ను వారు మరో రెండు సార్లు అదనంగా రాయవచ్చు. అవసరమైతే, గరిష్ట వయోపరిమితి సడలింపులోనూ రెండేళ్లు అదనంగా లభిస్తాయి. 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తనను కలిసిన సివిల్స్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. - డిగ్రీ ఉత్తీర్ణులైన 21 నుంచి 30 ఏళ్ల వయసున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటివరకు 4 సార్లు మాత్రమే సీఎస్ఈ రాసే అవకాశముండేది. తాజా నిర్ణయం ప్రకారం.. వారు 32 ఏళ్ల వయసులోపు 6 సార్లు ఆ పరీక్ష రాయవచ్చు. - మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపుతో ఇతర వెనకబడినవర్గాల వారు ఇప్పటివరకు 7 సార్లు సీఎస్ఈ రాసే వీలుంది. ఇకపై వారికి 9 సార్లు ప్రయత్నించే అవకాశం లభించింది. గరిష్ట వయోపరిమితిలోనూ వారికి రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. - షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు ఎన్నిసార్లైనా సీఎస్ఈ రాసే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు వారి గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఇకపై వారికీ గరిష్ట వయోపరిమితిలో మరో రెండేళ్ల సడలింపు లభిస్తుంది. - ఇప్పటికే గరిష్ట వయోపరిమితి ముగిసిన లేదా అటెంప్ట్స్ అన్నీ పూర్తయినవారికి తాజా ప్రభుత్వ నిర్ణయం బాగా ఉపయోగకరం. - గరిష్ట వయోపరిమితి సడలింపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో స్పష్టతనిస్తూ నిబంధనలను నోటిఫై చేయనుంది. - ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్.. తదితర ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి ఈ పరీక్ష ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు. - ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. - అంధ, బధిర, మూగ, వికలాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపు ఉంది. -
ఐఏఎస్‌ల హోదాపై క్యాట్ అసంతృప్తి
* ఆ ఆరుగురి పేర్లనూ యూపీఎస్సీకి పంపండి * కిరణ్ సర్కార్‌కు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐఏఎస్ హోదా (కన్ఫర్డ్) ఇచ్చేందుకు అధికారుల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా లేదని అభిప్రాయపడింది. ఐఏఎస్ హోదా పొందేందుకు అర్హులైన మరో ఆరుగురు అధికారుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కు పంపాలని క్యాట్ ఆదేశించింది. వారి పేర్లు అందాకే అర్హుల జాబితా రూపొందించాలని జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐఏఎస్ హోదా పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నా తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపలేదంటూ ఐ.శ్రీనగేష్ (డీసీ, కమర్షియల్ ట్యాక్స్), ఎల్.శ్రీధర్‌రెడ్డి (డీపీవో), ఆర్.అమరేందర్‌కుమార్ (ఈడీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్), పి.కృష్ణవేణి (రవాణాశాఖ), డి.శ్రీనివాస్ నాయక్, రాజ్‌కుమార్ (జీఎం, పరిశ్రమల విభాగం) దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ ధర్మాసనం విచారించింది. ఆరుగురికి ఐఏఎస్ హోదా కల్పించేందుకు ప్రభుత్వం 30 మంది అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపిందని, అయితే ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదించారు. 18 విభాగాల నుంచి అర్హులైన అధికారుల పేర్లు సాధారణ పరిపాలనా విభాగానికి (జీఏడీ) అందనే లేదని పేర్కొన్నారు. కొందరు అధికారుల వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)ల్లో వారి విభాగాల ఉన్నతాధికారులు సంతకాలు చేయలేదని...అందుకే వారి పేర్లను పంపలేదన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనను సుధీర్ కొట్టిపడేశారు. ఎవరో చేసిన తప్పులకు పిటిషనర్లను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం...పిటిషనర్ల పేర్లను యూపీఎస్సీకి పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
దుర్గాశక్తి... బహువచనం!
సంపాదకీయం : చదువులో చురుగ్గా ఉన్నారని, నాయకత్వ లక్షణాలు దండిగా ఉన్నాయని, సమకాలీన సమస్యలపై అవగాహన ఉన్నదని, అవి అపరిష్కృతంగా మిగిలిపోతున్న వైనంపై ఆగ్రహం ఉన్నదని, అందుకోసం ఏదో చేయాలన్న తపన వారి అంతరాంతరాల్లో జ్వలిస్తున్నదని అనుకునే యువతీయువకులు సివిల్ సర్వీస్‌కు వెళ్లాలని చాలా మంది సలహాలిస్తుంటారు. సవాళ్లను స్వీకరించే తత్వమూ, సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను వెదకగల సామర్ధ్యమూ, అంకితభావంతో పనిచేసే సంసిద్ధతా ఉండేవారివల్ల ఈ సమాజం మెరుగుపడుతుందని అందరూ నమ్ముతారు. సివిల్ సర్వీస్ అధికారుల ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జటిలమైన పరీక్షలకెళ్లేవారంతా ఈ లక్షణాలన్నీ తమకున్నాయని, ఇందులో కృతార్థులమై తమ సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతుంటారు. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి వచ్చే దురహంకారంతో తమ మాటే శాసనంగా చలామణీ కావాలని ఆశించే పాలకులున్నప్పుడు ఇలాంటి యువతరం కలలన్నీ కల్లలుగా మిగిలిపోతాయి. వివిధ రాష్ట్రాల్లో ఇటీవలికాలంలో కొందరు ఐఏఎస్ అధికారులపై అధికారంలో ఉన్నవారు సాగిస్తున్న ధాష్టీకం చూస్తే కలిగే అభిప్రాయం ఇదే. ఇలాంటివారి ఏలుబడిలో ఐఏఎస్ అధికారులుగా నియమితులయ్యేవారికి రెండే ప్రత్యామ్నాయాలుం టున్నాయి-అలాంటి పాలకుల అభీష్టానికి తలవంచడం లేదా వారి ఆగ్రహానికి గురై ఎలాంటి ప్రాధాన్యతా లేని పోస్టుల్లో వృధాగా పొద్దుపుచ్చడం. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా జిల్లా గౌతంబుద్ధ నగర్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగపాల్ని సస్పెండ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌ల పరిస్థితిని మరోసారి కళ్లకు కడుతోంది. యమునా నదిలో అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్న మాఫియా ముఠాలపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ ప్రాంతం నుంచి నెలకు కనిష్టంగా చూస్తే రూ.200 కోట్ల విలువైన ఇసుక తరలి పోతోందని ఒక అంచనా. ఇసుక తవ్వకాలవల్ల యమునా నది కోతకు గురై పర్యావరణం ప్రమాదంలో పడుతున్నదని ఎందరో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్యవసానంగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పరిచింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీరా దుర్గాశక్తి చర్యకు ఉపక్రమించేసరికి ఆమెను సస్పెండ్ చేసింది. గౌతంబుద్ధ నగర్లో ఒక మసీదు కోసం నిర్మించిన గోడను కూల్చేయడంవల్లా, ఆ చర్య మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందువల్లా ఆమెను సస్పెండ్ చేయాల్సివచ్చిందని అఖిలేష్ ఇస్తున్న సంజాయిషీ వాస్తవాలను ప్రతిబింబించదు. ఆ ఉదంతంతో సంబంధమున్న అధికారి పేరు జేవర్ అని తాజా సమాచారం వెల్లడిస్తున్నది. అఖిలేష్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ఐఏఎస్‌లను 800 సార్లు బదిలీ చేశారు. అంటే, సగటున నెలకు 50 బదిలీలన్నమాట. యూపీలో ఇది అఖిలేష్ పాలనతోనే ప్రారంభమైన ధోరణికాదు. అంతక్రితం పాలించినవారూ ఈ తరహాలోనే ప్రవర్తించారు. నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్‌లపై కొంచెం హెచ్చుతగ్గుల్లో దాదాపు అన్ని రాష్ట్రాల పాలకుల్లోనూ అసహనం వ్యక్తమవుతున్నది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాధ్రాకూ, రియల్ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కూ మధ్య సాగిన లావాదేవీలపై కూపీ లాగిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్, ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాను ఆ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో బదిలీలతో ఎలా వేధించిందో ఈ దేశం చూసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రిపై పాత కేసును తిరగదోడారన్న నెపంతో రాజస్థాన్ ప్రభుత్వం జైసల్మేర్ జిల్లా ఎస్పీని రెండురోజులక్రితం బదిలీచేసింది. ఆ బదిలీపై ఆ జిల్లా భగ్గుమంటోంది. జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్‌ది మరో కథ. ఢిల్లీలో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆమెను రెండు నెలలు తిరక్కుండానే ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. ఇందుకు కారణం చాలా చిన్నది. ప్రణాళికా సంఘంతో చర్చలకోసం ఢిల్లీ వచ్చిన ఆ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆమె ఖరీదైన భోజనం పెట్టించలేదని, ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేయలేదని ఆరోపణలు. మన రాష్ట్రం విషయానికే వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనాకాలంలో కీలకపదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులను ఇప్పుడు ఎలా వేధిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. తగిన ఆధారాలున్న అధికారులపై చర్య తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే దర్యాప్తు పేరిట సీబీఐ తమను అవినీతిపరులుగా, ప్రజాధనాన్ని అపహరించినవారిగా మీడియాకు లీకులు ఇస్తున్న తీరు సమంజసంగా లేదని ఐఏఎస్ అధికారుల సంఘం కార్యవర్గం అభ్యంతరం వ్యక్తంచేసింది. అక్రమ నిర్ణయాలనుకున్న ప్రాజెక్టులను కొనసాగిస్తూ, అందులో భాగస్వాములమైన తమను మాత్రం అక్రమాలకు పాల్పడ్డవారిగా చిత్రించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు, తమ భాగస్వామ్యపక్షాల ప్రభుత్వాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇంతగా వేధిస్తుంటే ఏనాడూ నోరెత్తని సోనియాగాంధీ దుర్గాశక్తి విషయంలో ఎక్కడలేని ఆసక్తినీ ప్రదర్శించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరడం మన నేతల ద్వంద్వ నీతికి నిదర్శనం. ఖేమ్కా విషయంలోనూ ఆమె ఇలాగే స్పందించివుంటే అందరూ హర్షించేవారు. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఈ సర్వీసులకు ఎంపికైన అధికారులు స్వతంత్రంగా, నిర్భయంగా వ్యవహరించ గలిగితేనే పటిష్టమైన దేశం నిర్మాణమవుతుందని అభిలషించారు. కానీ, అలాంటి అధికారులను పాలకులు వేధించే సంస్కృతి రాను రాను పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే, నిజాయితీగా వ్యవహరించే అధికారులను ఆదరించకపోతే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని మన నేతలు గ్రహించడం అవసరం. -
సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్లైన్లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది. అదనంగా 100 ఐఆర్ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్సీ నోటిఫికేషన్లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు.