మెడికల్ గ్రాడ్యుయేట్లకు మంచి అవకాశం.. సీఎంఎస్‌ఈ
కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో వైద్యుల నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), ప్రతి ఏటా కంబైన్‌డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ)ను నిర్వహిస్తుంది. కాస్త భిన్నంగా ఆలోచించే వారికి.. అంకిత భావం, సేవా తత్పరత, ప్రభుత్వ సర్వీసుల్లో పని చేయాలనుకునే ఉత్సాహంతో ఉన్న మెడికల్ గ్రాడ్యుయేట్లకు చక్కని అవకాశం సీఎంఎస్‌ఈ.. 2014 సంవత్సరానికి కంబైన్‌డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వ కొలువును దక్కించుకునే మార్గాన్ని సుగమం చేస్తోంది..సీఎంఎస్‌ఈ తాజాగా భర్తీ చేస్తున్న పోస్టులు..
విభాగం పోస్టుల సంఖ్య
అసిస్టెంట్ డివిజనల్ మెడికల్
ఆఫీసర్-రైల్వేస్ 650
సెంట్రల్ హెల్త్ సర్వీసెస్
జూనియర్ స్కేల్ కేటగిరీ పోస్టులు 150
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
(గ్రేడ్-2) ఇన్ ఈస్ట్-సౌత్-నార్త్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 53
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ 22
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ హెల్త్ సర్వీసెస్ (పోస్టుల సంఖ్యను ప్రకటించలేదు). బేసిక్ పే: రూ.15,600-రూ.39,100+గ్రేడ్‌పే రూ. 5400
ఎంపిక ఇలా:
ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్). ఈ రెండు దశలకు కలిపి మొత్తం 600 మార్కులు కేటాయించారు. ఇందులో రాత పరీక్షకు 500మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కు లు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష:
రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, 2.. రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధానానికి ఇచ్చే మార్కుల్లోంచి 0.33 మార్కుల కోత విధిస్తారు.
పేపర్-1: ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి..
విభాగం ప్రశ్నలు
జనరల్ ఎబిలిటీ 30
జనరల్ మెడిసిన్ 70
పిడియాట్రిక్స్ 20
మొత్తం: 120
సమయం: రెండు గంటలు
పేపర్-2:
ఇందులో కూడా మూడు విభాగాలు ఉంటాయి.
అవి.. విభాగం {పశ్నలు
సర్జరీ 40
గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్ 40
ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ 40
మొత్తం: 120
సమయం: రెండు గంటలు
పేపర్-1
జనరల్ ఎబిలిటీ: ఇందులో సిలబస్‌ను పరిశీలిస్తే..దాదాపు అన్ని రంగాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను పరీక్షించేలా ఉంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి విస్తృత స్థాయి ప్రిపరేషన్ తప్పనిసరి. ఈ విభాగంలో భారతీయ సమాజం, సంస్కృతి, వారసత్వం, పాలిటీ, ఎకనామీ, మానవాభివృద్ధి సూచీ, అభివృద్ధి కార్యక్రమాలు, సహజ వనరులు-పంపిణీ, లభ్యత, పరిరక్షణ, జీవావరణ శాస్త్రం-ప్రాథమిక భావనలు, ఆరోగ్య-ఆర్థిక రంగాలపై పర్యావరణ ప్రభావం, సామాజిక, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో కాలక్రమేణా చోటు చేసుకుంటున్న మార్పులు, భారత వ్యవసాయ రంగం, పరిశ్రమలు-వాణిజ్యం, రవాణ రంగం, సేవా రంగం, ప్రకృతి వైపరీత్యాలు-నిర్వహణ, ఆహారం-పంపిణీ-నిల్వ, ప్రజారోగ్య సంరక్షణలో ఆహారం పాత్ర వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ మెడిసిన్‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇం దులో భాగంగా కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, మెటబాలిక్ డిజా ర్డర్స్, ఇన్ఫెక్షన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, న్యూట్రిషన్ గ్రోత్, డిసీజెస్ ఆఫ్ స్కిన్ (డెర్మటాలజీ), మస్‌స్కోలోస్కెల్‌టల్ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పిడియాట్రిక్స్‌లో చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు, నివారణ, వైద్య విధానానికి చెందిన ప్రశ్నలుంటాయి.
పేపర్-2:
సర్జరీ విభాగంలో.. జనరల్ సర్జరీ (గాయాలు, ట్యూమర్లు, ఇన్ఫెక్షన్స్, ఎలిమెంటరీ ట్రాక్, అబ్డామినల్ ఇన్‌జ్యూరీస్, న్యూరో సర్జరీ తదితర)పై ప్రశ్నలుంటాయి. గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్ నుంచి ఇంట్రా -నాటల్, పోస్ట్-నాటల్; అప్లైడ్ అనాటమీ, అప్లైడ్ సైకాలజీ, జెనిటల్ ట్రాక్; నియోప్లాస్మా; గర్భ నిరోధక విధానాలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. చివరి విభాగ మైన ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో.. సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఉద్దేశం- విధానం; హెల్త్ అడ్మినిస్ట్రేషన్; భారతదేశంలోని విభిన్న జాతులు-వాటికి సంబంధించిన ఆరోగ్య గణాంకాలు, న్యూట్రిషన్ అండ్ హెల్త్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సోషియాలజీ సంబంధ ప్రశ్నలడుగుతారు.
ఇంటర్వ్యూ ఇలా:
రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు అభ్యర్థులను పిలుస్తారు. ఇంటర్వ్యూ ప్రధానంగా అభ్యర్థికి వివిధ అంశాల పట్ల ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించింది. చేపట్టే వృత్తికి ఎంత వరకు న్యాయం చేయగలడు అనే కోణంలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్ అంశాలు, మేథో సామర్థ్యం, నిర్ణాయక శక్తి, సామాజిక దృక్ఫథం, నాయకత్వ లక్షణాలు, సేవాతత్పరత, కమ్యూనికేషన్ స్కిల్స్, చురుగ్గా స్పందించే గుణం వంటి అంశాలను అంచనా వేస్తారు. అదేవిధంగా వ్యక్తిగత ఆసక్తులాధారంగా కూడా ప్రశ్నలు సంధించవచ్చు.
కెరీర్:
పరీక్ష, ఇంటర్వ్యూలో విజయం సాధించినవారిని ప్రతిభ, ఖాళీల ఆధారంగా వివిధ విభాగాల్లో నియమిస్తారు. సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జూనియర్ స్కేల్ పోస్ట్ నియామకం ద్వారా.. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం, ఇతర కేంద్ర ప్రభుత్వ వైద్య పథకాల పరిధిలోని వైద్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ హోదాలో అడుగు పెట్టవచ్చు. రైల్వే విభాగానికి ఎంపికైన వారు రైల్వే హాస్పిటల్స్‌లో సేవ లందించాలి. ఇలా నోటిఫికేషన్లో పేర్కొన్న శాఖల పరిధిలో జూనియర్ స్కేల్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఎంపికైన విభాగాన్ని బట్టి ఏడాది నుంచి రెండేళ్లవరకు ప్రొబేషన్ శిక్షణ ఉంటుంది. అవసరమనుకుంటే ప్రొబేషన్‌ను పొడిగిస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని విభాగాన్ని బట్టి జూనియర్ స్కేల్ హోదాలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా నియమిస్తారు.
చేరిన అభ్యర్థులు పనితీరు, అనుభవం ఆధారంగా అత్యున్నత హోదాలకు చేరుకుంటారు. రైల్వేల్లో వైద్యాధికారిగా చేరినవారికి ఉచిత రైల్వే పాస్‌లతోపాటు ఇతర సదుపాయాలుంటాయి. ఎంపికైనవారికి విభాగమేదైనా నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కింద బేసిక్ పేకు సమానంగా 25 శాతం నగదు చెల్లిస్తారు.
ప్రాక్టికల్‌గా అన్వయించి
ఎంబీబీఎస్ కోర్సుపై ఆమూలాగ్రం అవగాహన ఉంటే సీఎంఎస్‌ఈలోని మెడికల్ పేపర్లను సులభంగానే ఆన్సర్ చేయొచ్చు. ఆయా సబ్జెక్టుల ఫండమెంటల్స్‌పై దృష్టిపెట్టి చదువుతూ.. సీఎంఎస్ సరళిని తెలుసుకోవడానికి గత ప్రశ్నపత్రాలను కూడా ప్రాక్టీస్ చేశాను. ఓ వైపు ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో ప్రాక్టికల్ అప్రోచ్ ఏర్పడింది. ప్రిపరేషన్ పరంగా ఈ అంశం బాగా కలిసొచ్చింది. సీఎంఎస్‌ఈ కోసం ఎంబీబీఎస్ పుస్తకాలు, ఆయా పీజీ ఎంట్రెన్‌స పుస్తకాలు చదవాలి. మొత్తం పరీక్షలో జనరల్ ఎబిలిటీ కొంత కష్టంగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఎకాలజీ, జాగ్రఫీ విభాగాల్లో ప్రోటోటైప్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎదుర్కోవాలంటే.. గత ప్రశ్న పత్రాలు, జనరల్ నాలెడ్జ్ రివ్యూ బుక్స్ చదవడం అలవర్చుకోవాలి. సబ్జెక్టులను బట్టీపట్టకుండా.. ఐదేళ్లపాటు అకడెమిక్‌గా చదివిన అంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించి సమాధానం ఇచ్చేలా సిద్ధం కావాలి.
-జ్యోత్స్న కె. మీనన్
సీఎంఎస్‌ఈ-2012 ఆల్ ఇండియా టాపర్
గతేడాది
కంబైన్‌డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2013 ఫలితాలను పరిశీలిస్తే.. మొత్తం 1,492 పోస్టులకు గాను 1,310 మంది ఎంపికయ్యారు. కేటగిరీల వారీగా చూస్తే.. జనరల్: 558, ఓబీసీ-398, ఎస్సీ-210, ఎస్టీ-114. ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులకు సమాన మార్కులు రావడం విశేషం. అమర్ బహదూర్ సింగ్: 436 మార్కులు (పేపర్-1: 179.26, పేపర్-2: 189.08, పర్సనాలిటీ టెస్ట్: 68). లవ్ బన్సల్: 436 మార్కులు (పేపర్-1: 178.57, పేపర్-2: 182.77, పర్సనాలిటీ టెస్ట్: 75).
సీఎంఎస్‌ఈ నోటిఫికేషన్ సమాచారం
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతూ ‘కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్’ లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సీఎంఎస్‌ఈ తుది జాబితా ఎంపిక సమయానికి ఆ ఇంటర్న్ షిప్‌ను పూర్తి చేసుకుంటేనే అపాయింట్‌మెంట్ లభిస్తుంది.
వయసు: 32 ఏళ్లు (జనవరి 1, 2014 నాటికి). ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్‌సీ కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు; ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు.
దర ఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014.
పరీక్ష తేదీ: జూన్ 22, 2014
వెబ్‌సైట్: www.upsc.gov.in,
www.upsconline.nic.in