న్యూఢిల్లీ: వచ్చే నెల 24న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాల్సిందిగా కేంద్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కోరింది. సిలబస్‌పై స్పష్టత వచ్చేవరకూ పరీక్ష నిర్వహించరాదని కోరినట్టు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. సివిల్స్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీశాట్)ను రద్దు చేయాలంటూ సివిల్స్ ఆశావహులు సోమవారం యూపీఎస్‌సీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుత సిలబస్ హిందీ భాష ఆశావహులకు అనుకూలంగా లేదన్నారు. వీరిలో కొందరు మంగళవారం జితేంద్రను కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. సిలబస్‌పై సత్వరం నిర్ణయం తీసుకోవాలని యూపీఎస్‌సీతోపాటు సంబంధిత కమిటీని కూడా కోరామన్నారు.
‘సివిల్స్ ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలి’
Published Wed, Jul 16 2014 1:38 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement
Advertisement