ఎడ్యుకేషన్ & జాబ్స్ | Education & Jobs | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్ & జాబ్స్

Published Sun, Sep 27 2015 12:38 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఎడ్యుకేషన్ & జాబ్స్ - Sakshi

ఎడ్యుకేషన్ & జాబ్స్

నేటి యూపీఎస్‌సీ పరీక్షలకు సర్వం సన్నద్ధం
 14 కేంద్రాలు.. 5,756 మంది అభ్యర్థులు
 సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం జరగనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావెల్ అకాడమీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం కూడా ఆదివారమే ఉండటంతో.. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా.. పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంది. యూపీఎస్‌సీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరవుతున్న 5,756 మంది అభ్యర్థుల కోసం నగరంలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణకు కో-ఆర్డినేటర్‌గా హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, అసిస్టెంట్ కో-ఆర్డినేటర్‌గా డీఆర్‌ఓ అశోక్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఢిల్లీ నుంచి ఐదుగురు పరిశీలకులు రానున్నారు. 24 మంది అభ్యర్థులకు ఒకర్ని చొప్పున ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేశారు.
 
ఎస్‌టీపీఐలో కాంట్రాక్టు ఉద్యోగాలు

 హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్‌‌క్స ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు..  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1),  మెంబర్ టెక్నికల్ సపోర్‌‌ట స్టాఫ్ (ఖాళీలు-4),  అసిస్టెంట్ (ఖాళీలు-8). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ రి తేదీ నవంబర్ 23. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.జిడఛీ.ట్టఞజీ.జీ చూడొచ్చు.
 
ఎన్‌ఎస్‌ీసీఎల్‌లో ట్రెయినీలు
 నేషనల్ సీడ్‌‌స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీఎల్)...  డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్‌‌స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11.  సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి.  వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in.
 
హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు
 హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు.
 
జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్
 గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15.  వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు htpp://gdch.goa.gov.in చూడొచ్చు.
 
 ఎన్‌ఎండీసీలో మేనేజర్లు
 హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్‌డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్  మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు.
 
 ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్‌‌ప్స
 ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్‌‌ప్స భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 9, 2016.  మరిన్ని వివరాలకు htpp//join indianarmy.nic.in చూడొచ్చు.

-    టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 201 ఏఈ పోస్టులు
 నోటిఫికేషన్ జారీ.. 8వ తేదీ నుంచి దరఖాస్తులు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. శనివారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 201 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. బీఈ, బీటెక్ (ఈఈఈ) విద్యార్హత కలిగినవారు వచ్చే నెల 8వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 22న పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ సదవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులంతా వినియోగించుకోవాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి కోరారు. రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించారు.
 
 -    రాజస్థాన్ సెంట్రల్ వర్సిటీ వీసీగా పూజారి
 సాక్షి, హైదరాబాద్ : రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ చాన్స్‌లర్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ కె.పూజారి నియమితులయ్యారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ నుంచి శనివారం ఆయన ఈ మేరకు ఉత్తర్వులు అందుకున్నారు. గతంలో ఒడిశాలోని సంబల్‌పూర్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిన అనుభవం పూజారికి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, డీఆర్‌డీఓ, ఇస్రో, ఏఐసీటీఈ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సభ్యునిగా కూడా పనిచేశారు. 1985లో హెచ్‌సీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన ఆయన ప్రస్తుతం అదే వర్సిటీలోని స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్ విభాగం డీన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 -     ‘ప్రైవేటు’ ప్రవేశాలు నమ్మొద్దు
 సాక్షి, హైదరాబాద్: బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామంటూ ఈ మధ్య కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయని... వాటిని చూసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటితో తమ విశ్వవిద్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని  స్పష్టంచేశారు.
 
 -    ఓపెన్ వర్సిటీ అడ్మిషన్లకు 17 గడువు
 సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 17వ తేదీ చివరి గడువని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ గడువులోగా జరిమానా లేకుండా 2015-16 విద్యాసంవత్సరానికిగాను డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
 
 -    4న ఏఈ ఉద్యోగ నియామకాలపై సదస్సు
 సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలోని ఏఈ పోస్టుల భర్తీపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెల 4వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎలైట్స్ ఫోరం నాయకులు, వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ కె.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సును ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హాజరవుతున్నారని పేర్కొన్నారు. పరీక్షా విధానంపై విశ్లేషించడానికి ఏసీఈ ఇంజనీరింగ్ అకాడమీ డెరైక్టర్ గోపాలకృష్ణమూర్తి, జేఎన్‌టీయూ, ఉస్మానియా ప్రొఫెసర్లు హాజరవుతున్నారని చెప్పారు. వివరాలకు 7032924410, 8886612415 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
 
 -    బీఈడీ ప్రవేశాల గడువు పొడిగింపు
 హైదరాబాద్: బీఈడీ కళాశాలలో సీటు లభించిన అభ్యర్థుల ప్రవేశాల గడువును ఈ నెల 26 నుంచి 29 వరకు పొడిగించారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనం పురస్కరించుకుని గడువు పొడిగించినట్లు ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రొ.ప్రసాద్ తెలిపారు. తేదీల్లో మార్పును గమనించి ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రవేశ కార్డులు
 తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement