నేషనల్ డిఫెన్స్ అకాడమీ
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య: 375
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు.ఎయిర్ ఫోర్స్, నావల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:161/2-191/2ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 21
వెబ్‌సైట్: www.upsconline.nic.in
ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ - ఏప్రిల్ 2015 బ్యాచ్‌కు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల సంఖ్య: 54
అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ సీనియర్ డివిజన్/వింగ్‌లో కనీసం రెండేళ్ల సర్వీస్‌తో పాటు ‘సి’ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 31
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
సిండికేట్ బ్యాంక్
సిండికేట్ బ్యాంక్ లేటరల్ వేకెన్సీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డిప్యూటీ జనరల్ మేనేజర్
(రిస్క్ మేనేజ్‌మెంట్)
2. డిప్యూటీ జనరల్ మేనేజర్
(చీఫ్ ఎకనామిస్ట్)
3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్)
4. చీఫ్ జనరల్ మేనేజర్
(కార్పొరేట్ కమ్యూనికేషన్)
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 5
వెబ్‌సైట్: www.syndicatebank.in/
భారత్ డైనమిక్స్ లిమిటెడ్
న్యూఢిల్లీలోని లైజన్ కార్యాలయంలో కింది పోస్టుల భర్తీకి(తాత్కాలిక పద్ధతిన) భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జూనియర్ అసిస్టెంట్-గ్రేడ్ 2
ఖాళీలు: 3
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు. ఆఫీస్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు నెలల కోర్సు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 4
వెబ్‌సైట్: http://bdl.ap.nic.in
జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూ నివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మంథని), మంథని, జగిత్యాల, సుల్తాన్‌పూర్ క్యాంపస్‌లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: లెక్చరర్(అడ్‌హక్)/అకడమిక్ అసిస్టెంట్స్
విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 27
వెబ్‌సైట్: http://jntuhcem.org
పవేశాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్)
సీట్ల సంఖ్య: 16
వ్యవధి: రెండేళ్లు
అర్హతలు: ఎంబీబీఎస్ లేదా న్యూట్రిషన్/హోమ్‌సైన్స్/నర్సింగ్‌లో బీఎస్సీ/బీఎస్సీ(బయో కెమిస్ట్రీ/న్యూట్రిషన్) ఉండాలి.
దరఖాస్తులు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 13
వెబ్‌సైట్: http://ninindia.org
అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్
డాక్టర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హో టల్ మేనేజ్‌మెంట్, చండీగఢ్ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
అర్హతలు: ఇంగ్లిష్ సబ్జెక్టుతో ఇంటర్
ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
జూన్ 30, 2014
వెబ్‌సైట్: www.ihmchandigarh.org
నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: బీఈ ప్రోగ్రామ్
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మ్యా నుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బయోటెక్నాలజీ.
అర్హతలు: ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై జేఈఈ(మెయిన్)-2014లో అర్హత సాధించాలి
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 23 నుంచి
వెబ్‌సైట్: www.nsit.nic.in
నేషనల్ బుక్ ట్రస్ట్
నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బుక్ పబ్లిషింగ్
వ్యవధి: నాలుగు వారాలు
దరఖాస్తులు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 10
వెబ్‌సైట్: www.nbtindia.gov.in
ఉద్యోగాలు
Published Sat, Jun 21 2014 10:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement