కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాత్కాలిక చైర్మన్‌గా విద్యావేత్త డేవిడ్ ఆర్ సిమ్లిహ్ నియామకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డేవిడ్ 2012 జూన్ నుంచి యూపీఎస్సీ సభ్యునిగా ఉన్నారు.
షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన డేవిడ్.. అదే వర్సిటీలో పలు హోదాల్లో పనిచేశారు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రపై ఆయన అనేక పుస్తకాలు రాశారు. మరోవైపు కస్టమ్స్ అంశాలకు సంబంధించి భారత్ – ఉరుగ్వే మధ్య ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ ఒప్పందం జరిగితే ఇరు దేశాల కస్టమ్స్ అధికారులు సమాచార మార్పిడి.. నిఘా విషయాలను బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
యూపీఎస్సీ తాత్కాలిక చైర్మన్‌గా డేవిడ్
Published Thu, Jan 5 2017 2:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
Advertisement
Advertisement