ఉద్యోగ సమాచారం | Employment Information | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సమాచారం

Published Sun, Oct 25 2015 4:36 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

Employment Information

యూపీఎస్సీలో 169 పోస్టులు
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ ఆపరేషన్‌‌స (ఖాళీలు-11), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-4), అసిస్టెంట్ ప్రొఫెసర్ - కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ అండ్ థొరాసిక్ సర్జరీ (ఖాళీలు-8), అసిస్టెంట్ కెమిస్ట్ (ఖాళీలు-4), అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఖాళీలు-139), డిప్యూటీ డెరైక్టర్ (ఖాళీలు-2), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఖాళీలు-1). ఆన్‌లైన్ దరఖాస్తుకి చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.upsconline.nic.in చూడొచ్చు.
 
ఢిల్లీ మెట్రోలో 1,509 పోస్టులు
 ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-2), నాన్ ఎగ్జిక్యూటివ్ (ఖాళీలు-1,507) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.delhimetrorail.com చూడొచ్చు.
 
ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో వివిధ పోస్టులు
 ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్).. రె గ్యులర్, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. మైనింగ్ సిర్దార్ (ఖాళీలు-631), డిప్యూటీ సర్వేయర్ (ఖాళీలు-43), ఓవర్‌సీర్ (ఖాళీలు-48). వయసు 30 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 12. వివరాలకు www.easterncoal.gov.in చూడొచ్చు.
         
యూకో బ్యాంక్‌లో 100 చార్టర్‌‌డ అకౌంటెంట్ పోస్టులు
 యూకో బ్యాంక్.. వివిధ విభాగాల్లో చార్టర్‌‌డ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దర ఖాస్తుకు చివరి తేది  నవంబర్ 20. వివరాలకు www.ucobank.com చూడొచ్చు.
         
ఎన్‌ఎఫ్‌సీలో సైంటిఫిక్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్లు
 హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్..వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. సైంటిఫిక్ ఆఫీసర్ (ఖాళీలు-2), సైంటిఫిక్ అసిస్టెంట్ (ఖాళీలు-4), స్టెనోగ్రాఫర్ (ఖాళీలు-12). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 14.  వివరాలకు www.nfcrecruitment.in చూడొచ్చు.
 
 సీఆర్‌పీఎఫ్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు
 సెంట్రల్ రిజర్‌‌వ పోలీస్ ఫోర్‌‌స.. కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో స్పెషలిస్టు డాక్టర్లు (ఖాళీలు-2), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (ఖాళీలు-10) పోస్టుల భర్తీకి  నవంబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.crpf.nic.in చూడొచ్చు.
 
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో స్పెషల్ రిక్రూట్‌మెంట్
 స్టాఫ్ సెలెక్షన్ కమిషన్.. వికలాంగుల కోటాలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు  122. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. వివరాలకు www.ssc.nic.in చూడొచ్చు.
 
 సీసీఐలో మేనేజర్, డిప్యూటీ మేనేజర్లు
 ఢిల్లీలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ).. వివిధ విభాగాల్లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్/జోనల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, కెమికల్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఎగ్జ్జిక్యూటివ్ సెక్రటరీ, జూనియర్ స్టాఫ్ ఆఫీసర్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 31. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 19. వివరాలకు www.cementcorporation.co.in చూడొచ్చు.
 
భోపాల్ ఎయిమ్స్‌లో వివిధ పోస్టులు
 భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. మూడేళ్ల వ్యవధికి వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 81. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది నవంబర్ 25. వివరాలకు www.aiimsbhopal.edu.in చూడొచ్చు.
         
కిరోరి మాల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
 యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కిరోరి మాల్ కాలేజ్.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 43. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 13. వివరాలకు www.kmcollege.ac.in చూడొచ్చు.
 
చాచా నెహ్రూ బాల చికిత్సాలయలో సీనియర్,జూనియర్ రెసిడెంట్స్

 ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయ.. అడ్‌హాక్ పద్ధతిలో వివిధ విభాగాల్లో  సీనియర్ రెసిడెంట్ (ఖాళీలు- 12), జూనియర్ రెసిడెంట్ (ఖాళీలు-10) పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేది అక్టోబర్ 30.  వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు.
 
 హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో పోస్టులు
 హైకోర్‌‌ట ఆఫ్ హిమాచల్‌ప్రదేశ్.. క్లర్‌‌క/ప్రూఫ్ రీడర్ (ఖాళీలు-9), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ (ఖాళీలు-16) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 17. వివరాలకు  www.hphighcourt.nic.in చూడొచ్చు.
         
నాల్కోలో డిప్యూటీ మేనేజర్లు/మేనేజర్లు
 నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో).. డిప్యూటీ మేనేజర్/ మేనేజర్ (ఖాళీలు-9), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఖాళీలు-2), అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఖాళీలు-1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 31. వివరాలకు www.nalcoindia.com చూడొచ్చు.
 
డా. హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ పొజిషన్లు

 మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో నాన్ టీచింగ్, అకడమిక్ పొజిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 21. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 9. వివరాలకు www.dhsgsu.ac.in చూడొచ్చు.
 
పుదుచ్చేరి నిట్‌లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు
 పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్).. వివిధ విభాగాల్లో టీచింగ్ (ఖాళీలు-3), నాన్ టీచింగ్ (ఖాళీలు-11) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 10.  వివరాలకు www.nitpy.ac.in చూడొచ్చు.
 
ఎన్‌ఐఐఎస్‌టీలో వివిధ పోస్టులు
 తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టీ).. తాత్కాలిక ప్రాతిపదికన ఎస్‌పీఎఫ్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్  అసిస్టెంట్ (ఖాళీలు- 16 ), రీసెర్‌‌చ అసోసియేట్ (ఖాళీలు-4), ప్రాజెక్ట్ అసోసియేట్ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ ఫెలో (ఖాళీలు -1) పోస్టుల భర్తీకి అక్టోబర్ 27 నుంచి నవంబర్  5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలకు www.niist.res.in చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement