భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.
వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్‌లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఎంసీఎల్ఆర్ అంటే?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment